Jump to content

సంబా జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 32°33′N 75°07′E / 32.550°N 75.117°E / 32.550; 75.117
వికీపీడియా నుండి
(సంబ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
సంభా
సాంబా జిల్లాలోని గ్రామం
సాంబా జిల్లాలోని గ్రామం
జమ్మూ కాశ్మీర్‌లోని సంబా జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్‌లోని సంబా జిల్లా స్థానం
Coordinates: 32°33′N 75°07′E / 32.550°N 75.117°E / 32.550; 75.117
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
విభాగంజమ్మూ విభాగం
ప్రధాన కార్యాలయంసంభా
తహసీల్సుసంభా
విస్తీర్ణం
 • మొత్తం914 కి.మీ2 (353 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం3,18,898
 • జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
 • Urban
16.8%
జనాభా
 • అక్షరాస్యత81.41%
 • లింగ నిష్పత్తి886
Time zoneUTC+05:30
Vehicle registrationJK-21
Websitehttp://samba.nic.in/

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో సంబా జిల్లా ఒకటి. ఈ జిల్లా కొత్తగా రూపొందించబడింది. ఈ ప్రాతం ముందు జమ్మూ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. ప్రస్తుతం ఈ జిల్లాలో సంబా, విజయ్పుర్, సర్వాల్ గ్రామం, గహ్వాల్ అతర్భాగంగా ఉన్నాయి. చారిత్రకంగా సంబా 22 పట్టణాలను కలిగిన ప్రాంతం. ఒక్కొక్కటి ఊక్కో ప్రత్యేక కుటుంబానికి చెందింది. సంబాలో అత్యధికులు రాజపుత్రులు. ప్రధానంగా సంబియన్లు. అందువలన సంబా ప్రజలలో అత్యధికులు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. వీరు భారతీయ కాల్బలం, భారతీయ వాయుసేన, భారతీయ నౌకాదళం, సరిహద్దు రక్షణ శాఖ, ఐ.టి.బి.పి, సి.ఆర్.పి, ఎఫ్, ఐ, ఆర్. ఎఫ్, ఇతర పలు శాఖలలో పనిచేస్తున్నారు. సంబా బసంతర్ సెలఏరు పక్కన ఉపద్థితమై ఉంది. జమ్ము కాశ్మిర్ జిల్లా నుండి ఈ జిల్లాను పురమండలం వంతెన వేరు చేస్తుంది. జిల్లాలో 6% మాత్రమే ముస్లిములు ఉన్నారు.

పాలన విభాగాలు

[మార్చు]

సంబా జిల్లాలో 4 బ్లాకులు ఉన్నాయి : సంబా ( జమ్మూ కాశ్మీరు) విజయ్పూర్, పుర్మండలం, ఘగ్వాల్.[2] ఒక్కొక్క బ్లాకులో పలు గ్రామాలు ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

సంబా అనే పేరు సాంబా అనే పదం వలన వచ్చింది. సాంబుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు, జాంబవతి కుమారుడు. సాంబుడు అందగాడు అందరికీ అభిమానపాత్రుడు. సాంబుడు సహించరాని పనులు అనేకం చేసాడు. సాంబుడు చేసిన క్రియల ఫలితంగా యాదవవంశం అంతా నిర్మూలం అయింది. శ్రీకృషుడు పుత్రులను కోరుకుని మునుల సలహా మీద ఏకాంతజీవనం స్వీకరించి శరీరమంతా భస్మధారణ చేసి చెట్లబెరడును వస్త్రాలుగా చేసుకుని సంవత్సరాల తరబడి పరమశివుని కొరకు తపసుచేసి శివుని మెప్పించి శివపార్వతులను ప్రత్యక్షం చేసుకున్నాడు. తరువాత శ్రీకృష్ణుడు శివపార్వతులను తనకు శివుని వంటి కుమారుడు కావాలని కోరాడు. శివుడు శ్రీకృష్ణుని కోరికను నెరవేర్చి శ్రీకృష్ణ జంబతులకు పుత్రుని ప్రసాదించాడు. వారా పుత్రునికి సాంబుడు అని నామకరణం చేసారు. శివుని వంటి కుమారుని కోరుకున్నాడు కనుక సాంబుడు శివుడు లయకారకుడు కనుక శివునిలా యదువంశం సమూలంగా నాశనం కావడానికి సాంబుడు కారణం అయ్యాడు. శ్రీకృషుడు జన్మించిన యదువంశాన్ని వేరెవరు వధించలేరు కనుక మానవులకు మరణం తథ్యం కనుక యుగానంతంలో ఇలా సంభవించాలని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. లయకారకుడైన శివునివంటి స్వభావంతో జన్మించాడు కనుక యదువంశం యుగాంతంలో లయం కావడానికి సాంబుడు కారణం అయ్యాడు. యాదవులు వారిలో వారు కలహించుకుని ఒకరిని ఒకరు వధించుకుని దాదాపు అందరూ నాశనం అయ్యారు. ఈ సంఘటనలో సాంబుడు నిమిత్తమాత్రుడు మాత్రం అయ్యాడు. దుర్యోదనుని కుమార్తె లక్ష్మణ స్వయంవరం ప్రకటిచిన సమయంలో సాంబుడు ఆమెను వివాహమాడాలని అనుకున్నాడు. కాని ఆమె అందుకు అంగీకరించలేదు. సాంబుడు స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఆసమయంలో తనను ఎదిరించిన కురుసైన్యాలను ఓడించినా చివరకు సాంబుడు కౌరవులకు బంధీ అయ్యాడు. ఈ వార్తవిన్న బలరాముడు కృద్ధుడై హస్థిపురానికి వెళ్ళి సాంబుని విడిపినమని అడిగాడు. అందుకు నిరాకరించిన దుర్యోధనుని మీద కోపించిన బలరాముడు హస్థినాపురాన్ని ధ్వంసం చేయడానికి ఆయత్తమై తన నాగలితో హస్థినను ఒకవైపు పైకి లేపాడు. దుర్యోధనుడు కురుపెద్దల హెచ్చరికకు విని యాదవుల బలపరాక్రాలను గ్రహించి బలరాముని క్షమను వేడుకున్నాడు. బలరాముడు శాంతించాడు. దుర్యోధనుడు తరువాత శాంతించి తనకుమార్తె లక్ష్మణను సాంబుడికి ఇచ్చి వివాహం చేసాడు. సాంబుని వివాహవృత్తాతంతం వ్యాసభారతంలో కనిపించదు. అయినా ఇది ప్రచారంలో ఉంది.

రాజకీయాలు

[మార్చు]

సంబా జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సంబా, విజయ్పుర్.[3]జమ్మూ కాశ్మీరు పార్లమెంటు నియోజకవర్గంలో 2 రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్నాయి.[4]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 318,611, [5]
ఇది దాదాపు. బహ్మా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 568వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 318 .[5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.9%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.48%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-01. Retrieved 2020-11-30.
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  3. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  4. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-10-30.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bahamas, The 313,312

వెలుపలి లంకెలు

[మార్చు]