అండాశయము
Appearance
(స్త్రీ బీజకోశాలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అండాశయము | |
---|---|
Internal reproductive organs of human female | |
లాటిన్ | ovarium |
గ్రే'స్ | subject #266 1254 |
ధమని | ovarian artery, uterine artery |
సిర | ovarian vein |
లింఫు | lumbar lymph nodes |
MeSH | Ovary |
Dorlands/Elsevier | o_09/12603251 |
అండాశయము (Ovary) స్త్రీ జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు కటి ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక అండం చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం శుక్రంతో ఫలదీకరణం చెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది. అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి గర్భం దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉంది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.
నిర్మాణము
[మార్చు]లిగమెంట్లు
[మార్చు]మానవులలో రెండు అండాశయాలు కటిభాగంలో గర్భకోశానికి రెండు వైపులా ఒక బలమైన అండాశయపు లింగమెంటు (ovarian ligament) ద్వారా వేలాడినట్లుగా సంధించబడి వుంటుది. ఇవి కొంతభాగం ఉదరకోశ ఉపకళా కణజాలముతో కప్పబడివుంటుంది. అండాశయన్ని చుట్టూ ఉన్న గర్భాశయపు వెడల్పాటి లిగమెంటు (broad ligament of the uterus) ను మీసో ఒవేరియం అంటారు.
సూక్ష్మ నిర్మాణము
[మార్చు]- పుటికా కణాలు అండాశయపు ఉపరితలాన్ని కప్పుతున్న ఉపకళా కణజాలము నుండి ఉద్భవిస్తాయి.
- గ్రాన్యులోజా కణాలు - పుటికా కణాలను ఆవరిస్తూ ఉంటాయి.
- బీజ కణాలు (Gametes)[1]
- ఉపరితలాన్ని కప్పుతున్న పొరను అండాశయపు ఉపరితల ఉపకళా కణజాలము అంటారు.
- అండాశయపు కార్టెక్సు (cortex) లో పుటికలు, వాటిమధ్య సంయోజక కణజాలము ఉంటాయి. Included in the follicles are the cumulus oophorus, membrana granulosa (and the granulosa cells inside it), corona radiata, zona pellucida, and primary oocyte. The zona pellucida, theca of follicle, antrum and liquor folliculi are also contained in the follicle. Also in the cortex is the corpus luteum derived from the follicles.
- లోపలిభాగాన్ని అండాశయపు దవ్వ (medulla) అంటారు. దీనిలో పుటికలు ఉండవు.
విధులు
[మార్చు]- ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేసి పిండోత్పత్తికి కీలకపాత్ర పోషిస్తుంది.
- ఇవి ఈస్ట్రోజెన్ (Estrogen), ప్రొజెస్ట్రోజెన్ (Progesterone) అనే రెండు హార్మోనులను స్రవిస్తుంది. ఈస్ట్రోజెన్ యౌవనంలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రొజెస్ట్రోజెన్ తో కలసి ఋతుక్రమాలు సక్రమంగా జరిపిస్తుంది.
వ్యాధులు
[మార్చు]- అండాశయపు వాపు లేదా ఊఫరైటిస్ (Oophoritis)
- పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి (పీసీఓడీ)(Polycystic Ovary Disease or PCOD)
- అండాశయం మడతపడటం (Ovarian torsion)
- అండాశయపు తిత్తులు (Ovarian cysts)
- అండాశయపు కాన్సర్ (Ovarian cancer)
మందులు
[మార్చు]- సెట్రోరెలిక్స్: మహిళల్లో అండాశయ ఉద్దీపనను పొందే ప్రారంభ అండోత్సర్గాన్ని నిరోధించడానికి సంతానోత్పత్తి చికిత్సలో ఉపయోగించే ఔషధం.
చిత్రమాలిక
[మార్చు]-
అండాశయ తిత్తి.
-
అండాశయ కాన్సర్.
మూలాలు
[మార్చు]- ↑ Langman's Medical Embryology, Lippincott Williams & Wilkins, 10th ed, 2006