అచ్చులు
Jump to navigation
Jump to search
తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. అవి
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
అచ్చులకు ప్రాణములు, జీవాక్షరములు, స్వరములు అనే పేర్లు కూడా ఉన్నాయి. స్వయం రాజంతే ఇతి స్వరా అని వ్యుత్పత్తి. అనగా ఇతర అక్షరాల సహాయం లేకుండానే అచ్చులను పలుకవచ్చును. ఆంగ్లంలో vowels అనే పదాన్ని అచ్చులకు వాడుతారు. అయితే తెలుగులో 16 అచ్చులు ఉండగా ఆంగ్లంలో a, e, i, o, u అనే ఐదు అచ్చులు మాత్రమే ఉండడం గమనార్హం.
|
అచ్చులలో భేదాలు
[మార్చు]- హ్రస్వములు: అ, ఇ, ఉ, ఎ, ఋ, ఌ, ఒ - ఉచ్ఛారణలో ఒకేమాత్రకు సరిపడా పొడవుండేవి (ఏకమాత్రతా కాలికములు). ఒక మాత్ర అంటే ఒక చిటిక వేయడానికి పట్టేంత సమయం.
- దీర్ఘములు: రెండుమాత్రల (చిటికెల) సమయం పట్టేవి - ఆ, ఈ, ఊ వంటివి
- ప్లుతములు: మూడుమాత్రల కాలంలో పలికే అక్షరాలు - ఉదా: ఓ శంభూ
- వక్రములు: వంకరగా ఉండేవి - హ్రస్వ వక్రమములు: ఎ, ఒ - దీర్ఘ వక్రమములు: ఏ, ఓ
- వక్రతమములు: ఇంకా వంకరగా ఉండేవి - ఐ, ఔ
మూలాలు, వనరులు
[మార్చు]- విక్టరీ తెలుగు వ్యాకరణము -మల్లాది కృష్ణప్రసాద్ - విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ (2008)