Jump to content

కొండాపూర్ (శేరిలింగంపల్లి)

అక్షాంశ రేఖాంశాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
వికీపీడియా నుండి
కొండాపూర్
సమీపప్రాంతం
కొండాపూర్ సమీపంలోని శిల్పారామం
కొండాపూర్ సమీపంలోని శిల్పారామం
కొండాపూర్ is located in Telangana
కొండాపూర్
కొండాపూర్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
కొండాపూర్ is located in India
కొండాపూర్
కొండాపూర్
కొండాపూర్ (India)
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
నగరంరంగారెడ్డి జిల్లా
మెట్రోహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500084[1]
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి
పట్టణ అభివృద్ధి సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

కొండాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు పశ్చిమ భాగంలోని ఒక శివారు ప్రాంతం.[2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.[3] హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[4]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

పద వివరణ

[మార్చు]

కొండాపూర్ అనేది కొండ (గుట్ట), పూర్ (పురము) రెండు తెలుగు పదాల కలయిక. కొండ మీద ఉన్న ప్రాంతం అని అర్థం.

ఉపప్రాంతాలు

[మార్చు]

ప్రశాంత్ నగర్ కాలనీ, పోలీస్ కాలనీ రోడ్, రాజరాజేశ్వర నగర్, జెవి హిల్స్, పోలీస్ కాలనీ, బిక్షపతి నగర్, రాఘవేంద్ర కాలనీ, అటవీ శాఖ కాలనీ, జయభేరి ఎన్‌క్లేవ్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

సైబరాబాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోన్‌లో ఈ కొండాపూర్ ప్రాంతం ఉంది. గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతం వేగంగా ఆధునిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. గూగుల్ సంస్థకు చెందిన హైదరాబాద్ విభాగం ఈ కొండాపూర్‌లోనే ఉంది.[6] గత రెండు దశాబ్దాలలో (1996 - 2010) ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాణిజ్య జోన్ విస్తరణ అధికంగా ఉంది.

ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కిమ్స్, అపోలో వంటి ఆసుపత్రులు, రత్నదీప్, హెరిటేజ్ ఫ్రెష్ మొదలైన అనేక సూపర్‌మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి.[7] ఇక్కడికి సమీపంలోని గచ్చిబౌలి స్పోర్ట్ అరేనాలో క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో వివాహాలు, సెమినార్‌ల కోసం మంచి వేదికలు ఉన్నాయి.

రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, అన్ని ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టొయోటా, మహీంద్రా, హ్యుందాయ్, హోండా, మారుతి సుజీకి వంటి ఆటోమొబైల్స్‌ ప్రధాన షోరూమ్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడినుండి వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం (127కె - కొండాపూర్ నుండి కోఠివరకు, 10హెచ్ - కొండాపూర్ నుండి సికింద్రాబాద్ వరకు, 47కె - సికింద్రాబాద్ నుండి కొండాపూర్ వరకు, 222 - పటాన్ చెరు నుండి కొండాపూర్ మీదుగా కోటి వరకు) ఉంది. ఇక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా బస్సు (ఎయిర్‌పోర్ట్ సర్వీస్), టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను నుండి హైదరాబాద్ ఎంఎంటిఎస్ సేవలు, హైటెక్ సిటీ మెట్రో స్టేషను నుండి హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • నరసింహ స్వామి దేవాలయం
  • అయ్యప్ప స్వామి దేవాలయం
  • భ్రమరాంభ మల్లికార్జున సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • దుర్గా దేవాలయం
  • మసీదు-ఇ-జానీ
  • దోస్తీయా
  • కొండాపూర్ మసీదు

విద్యాసంస్థలు

[మార్చు]
  • శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
  • విజ్ఞాన్ జూనియర్ కళాశాల
  • మహర్షి విద్యా మందిర్ స్కూల్
  • లిటిల్ ఐన్‌స్టీన్స్

ఇతర వివరాలు

[మార్చు]

సాంస్కృతిక కేంద్రం శిల్పారామం 2 కి.మీ.ల దూరంలో, కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్/రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Pin code of Kondapur". 10 July 2020. Archived from the original on 2021-09-06. Retrieved 2021-09-06.
  2. "Kondapur Locality". www.onefivenine.com. Retrieved 2021-09-06.
  3. Raj, AuthorY V. Phani. "Hyderabad realty racing ahead". Telangana Today. Archived from the original on 2020-07-05. Retrieved 2021-09-06.
  4. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-09-06.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  6. "Google locations."
  7. "Apollo Cradle Kondapur Maternity Hospital". Retrieved 2021-09-06.
  8. "Botanical Garden set for re-launch today". Retrieved 2021-09-06.

ఇతర లింకులు

[మార్చు]