పోడూరు
పోడూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°35′N 81°44′E / 16.583°N 81.733°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పోడూరు |
విస్తీర్ణం | 12.05 కి.మీ2 (4.65 చ. మై) |
జనాభా (2011)[1] | 9,578 |
• జనసాంద్రత | 790/కి.మీ2 (2,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,861 |
• స్త్రీలు | 4,717 |
• లింగ నిష్పత్తి | 970 |
• నివాసాలు | 2,686 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534327 |
2011 జనగణన కోడ్ | 588702 |
పోడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, గ్రామం.పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ధి గలిగిన పంట పొలాలతోనూ అభివృద్ధిలో ఉన్న గ్రామం. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు. దర్శకులలో ప్రసిద్ధులైన కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నవి. షూటింగ్ చేసుకొనేందుకు అన్ని సౌకర్యాలు,వసతి అందుబాటులో ఉండుటవలన నిరంతరం ఏదో ఒక షూటింగ్‌తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ధి గలిగిన పంట పొలాలతోనూ అభివృద్ధిలో ఉన్న గ్రామం. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు. దర్శకులలో ప్రసిద్ధులైన కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నవి. షూటింగ్ చేసుకొనేందుకు అన్ని సౌకర్యాలు,వసతి అందుబాటులో ఉండుటవలన నిరంతరం ఏదో ఒక షూటింగ్‌తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది
గ్రామ చరిత్ర
[మార్చు]ఈ ప్రదేశాన మొదట అడవి ఉండేదని, అడవిని చదును చేసి పోడు వ్యవసాయ చేయుచూ ఈ ప్రాంతమును పోడు అని పిలిచేవారు. కొంతకాలమునకు మెల్లగా మరికొంత భాగము చదును చేసి నివాసయోగ్యముగా మార్చుకొని మరికొంత ఊరు పెరిగిన తరువాత 'పోడు'కు ఊరు చేర్చి పోడు ఊరుగా పిలువుట మొదలు పెట్టారని పెద్దలు చెపుతారు. అదే కాలానుగుణంగా పోడూరుగా మార్పుచెంది స్థిరపడినది. మొదట ఇక్కడి వారు బుడమ, ప్రత్తి, కంది పంటలు, వరి ప్రధానంగా పండిస్తూ వచ్చెడివారు. ఇప్పటికీ మొదటగా వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలవారి యొక్క ఇంటి పేరు పోడూరు గానే ఉంది. వీరి తధనంతరం కోసూరి, రుద్రరాజు ఇంటిపేరు కలరాజుల కుటుంబాలవారు ఇక్కడికొచ్చి స్దిరపడటంతో ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదల మొదలయ్యింది. ధవళేశ్వరం వద్ద 1860లో ఆనకట్ట కట్టబడి పోడూరుకు కాలువ సౌకర్య ఏర్పడటంతో వ్యవసాయం పుంజుకొన్నది. అప్పటికి పోడూరు జనసంఖ్య సుమారుగా 3.357 ఉండేది. ఊరు సౌకర్యాల పరంగా చాలా వెనుకబడి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో గ్రామ అభివృద్ధి కోసం 1901వ సంవత్సరంలో గ్రామ అభివృద్ధి సేవా కేంద్రం ఏర్పడింది. దీని ద్వారా కొన్ని నిధులను సేకరించి ఊరి రహదారులను, ఇతర సౌకర్యాలను అభివృద్ధి పరుచుట మొదలు పెట్టారు. 1929 వ సంవత్సరం బ్రిటిష్ పాలకుల ద్వారా పోడూరు గ్రామపంచాయితీ ఏర్పడింది. తదుపరి అది మరింత అభివృద్ధి చెందినది. ప్రస్తుతము రెండు అంతస్తుల భవనము, పదిహేనుమంది సిబ్బందితో గ్రామానికి సేవలందించుచున్నది. ఈ ఊరికి చెందిన మరొక పురాతన కథనం ప్రకారం ఊరిలో దైవగానం చేయుచూ కిన్నెర బ్రహ్మయ్య అని ఒక భక్తుడు తిరుగుతుండేవాడు, అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడే వచ్చి అతనికి వరమిచ్చాడని దాని ప్రకారము అప్పటిరోజులలో అతనికి రోజూ మూడు రూపాయల ముప్పావలా జోలెలో ప్రత్యక్షమయ్యేవని వాటితో అతడు తన అవసరాలకు కాక ఆర్తుల అవసరాలకు వినియోగించేవాడని అలా చేస్తూ కొంతకాలానికి అతడు మరణించడం జరిగాక అతడుండే చోట శివలింగం లభించిందని దానినే ఊరికి మూల దైవంగా ప్రతిష్ఠించి అక్కడ దేవాలయ నిర్మాణం జరిపించారని పెద్దలద్వారా, రామచంద్ర గ్రంథాలయం పోడూరి నాగరాజారావు అనబడే బ్రాహ్మణ కరణం ద్వారా రచింపబడిన గ్రంథాలయ సర్వస్వం పుస్తకంలో రచింపబడి ఉంది. రామచంద్ర గ్రంథాలయాన్ని పోడూరి వెంకయ్య గారు తన స్వంత పంటభూమిలో రెండు ఎకరాలు దానం చేసి అభివృద్ధి చేశారు. ఈ ఊరి పురాతన చరిత్రను తెలిపేందుకు ఊరిలో లభ్యమైన కొన్ని జైన విగ్రహములు ఉన్నాయి. వీటిలో పెద్దదైన దానిని ఊరి కచేరీ చావడి వద్ద ప్రతిష్ఠించి పూజలందించుచున్నారు.
గ్రామ పూర్వులు విశేషాలు
[మార్చు]- పోడూరును పండిత పోడూరుగా పిలిచేవారు ఎందరో పండితులు ఇక్కడ జన్మించి ఊరికి ధన్యతనొందించారు. వారిలో ఒకరు మూతకవి వీరిచే రచింపబడిన వినాయక చరిత్ర, ఆంజనేయ చరిత్రలు ముద్రణ పొందబడలేదు కాని వీరి శిష్యుల ద్వారా బహుళప్రసిద్ధం పొందినవి.
- పోడూరి పెదరామకవిగారు శివరామాభ్యుదయం అనే ద్వర్ధి కావ్యం రచించారు. దీనిని గూర్చి కందుకూరి వీరేశలింగము గారు ఆంధ్రకవుల చరిత్రలో ప్రస్తావించి కొన్ని పధ్యాలను ఉధహరించారు.
- వేదం వెంకటరాయశాస్త్రి ఊరిలో మరొక పేరొందిన విద్యాధికుడు కవి.
- గ్రామ పూర్వులలో మరొక గొప్ప వ్యక్తి సూరప్పగారు. ఈయన గ్రామంన నీటి ఎద్దడి మాపుటకు వారి భూములలో పెద్ద చెరువు తవ్వించి గ్రామానికి అంకితమిచ్చారు ఇప్పటికీ ఆచెరువు సూరప్ప చెరువుగానే పిలవబడుతున్నది. ఈయన వారసులలో తదనంతరం పేరొందినవారు పోడూరి రామమూర్తి గారు, పోడూరి రామారావుగారు.
- రుద్ర రాజు నరసింహ రాజు ( 1895 - 1973) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.వీరు 1895 వ సంవత్సరంలో జన్మించాడు.
ఊరి ముఖ్య దేవాలయాల చరిత్ర
[మార్చు]పెద్దగుడి
[మార్చు]ఊరి మధ్యస్థంగా ఒకే చోట ఐదు దేవస్థానాలు కలిగిన పెద్ద ప్రాంగణాన్ని పెద్దగుడి అని పిలుస్తారు. ఈ ప్రాంగణాన
- శ్రీ మూలేశ్వరస్వామి దేవాలయం (శివాలయం),
- శ్రీ రాజేశ్వరస్వామి దేవాలయం (పురాతన శివాలయం),
- శ్రీ కేశవస్వామి దేవాలయం (విష్ణాలయం),
- శ్రీ రామచంద్రస్వామి దేవాలయం,
- శ్రీ వెంకటేశ్వరస్వామి అలమేము మంగ వార్ల దేవాలయం.
- శ్రీ రామాలయాలు ఉన్నాయి.
ఈ దేవాలయం అతిపెద్ద కైవారం కలిగి ముందుభాగాన సాంస్కృతిక కార్యక్రమాల కొరకు విశాలమైన చావడి కలిగి ఉంది. దేవాలయాలకు ఉత్తరాన స్వామివార్ల రోజువారీ పూజాదులకు కావలసిన పుష్పాలు, పత్రి కొరకు పెద్ద ఉద్యాన వనం ఉంది. ఈ వనాన మారేడు, బిల్వ, జమ్మి, మామిడి, అరటితోడి అన్ని రకాల వృక్ష సముదాయం ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆరు రోజుల పాటు విశేషమైన ఉత్స్వాలు నిర్వహిస్తారు.
వేరువేరుగా ఉన్న వాటిలో ప్రసిద్ధి చెందిన దేవస్థానాలు.
[మార్చు]- శ్రీ కనకదుర్గ దేవాలయం. (కవిటం మార్గంలో)
- శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం (తిరుమలతిరుపతి కళ్యాణమండపం వద్ద)
- శ్రీ వీరభద్రస్వామి దేవాలయం (సరలదొడ్డి)
- శ్రీ అయ్యప్ప దేవాలయం (బోర్డుపాఠశాలవద్ద)
- గీతా భవనం.
ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక దేవాలయం. గీతోపదేశం చేయు శ్రీకృష్ణుని, అర్జునుని రథం, అశ్వాల మొత్తం చిత్రాన్ని పాలరాతితో అత్యద్భుతముగా మలచిన విధానం ఇక్కడ చూడచ్చు. మెట్ల మాదిరి కట్టడంపై అన్ని దేవతాప్రతిమలు ఉన్నాయి.
- శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాలు
- 1.కాపులరామాలయం (సరలదొడ్డి), 2.పల్లపువీది రామాలయం, 3.కొత్తపేట రామాలయం, 4.సంతబజారు రామాలయం, 5.ఇటికలదిబ్బ రామాలయం, 6.గరగలమ్మగుడివద్ద కాపులరామాలయం, 7.చాకలి పేట రామాలయం, 8.చింతలతోట రామాలయం.
- శ్రీ విఘ్నేశ్వర దేవస్థానాలు
- 1.వేమవరం రోడ్డులో, 2.ఛింతలతోట, 3.పల్లపువీది, 4.వెలగలమ్మ చెరువు, 5.ఇటికలదిబ్బ, 6.గరగలమ్మగుడి, 7.చాకలిపేట.
- ఆంజనేయ స్వామివారి ఆలయాలు
- 1.వెలగలమ్మ చెర్వువద్ద , 2.సినిమాహాలుసెంటరు, 3.చాకలిపేట.
- గ్రామ దేవతల దేవాలయాలు
- 1.గరగలమ్మ గుడి (గ్రామ మధ్యలో ఉండి ఊరి వ్యాపారుల అధీనంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన దేవాలయం), 2.వెలగలమ్మ దేవాలయం, 3.మహలక్షమ్మ దేవాలయం (చింతలతోట), 4. పుంతల ముసలమ్మ దేవాలయం
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, మేనేజిమెంటు కళాశాల పెనుగొండలోనూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల నరసాపురం లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉల్లంపర్రు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.
పాలిటెక్ణిక్ కళాశాల
[మార్చు]ఈ కాలేజీ వలన ఎందరో విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్యను గడించే అవకాశం కలుగుతుంది. కళాశాల గ్రామంనందు ఉండుట వలన ఇళ్ళ అద్దె తక్కువగా సరుకుల సౌకర్యాల ఖర్చులు తక్కువగా అయ్యే వీలుకలుగును. కాలేజీ విశాల ప్రాంగణం కలిగి ఉంది. విద్యార్థులు ఆడుకొనేందుకు పెద్ద క్రీడాస్థలం ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, వస్తు సముదాయము కలిగిన ప్రయోగశాల కాలేజీలో ఉంది.
- కల్నల్.డి.యస్.రాజు.పరిషత్ ఉన్నత పాఠశాల.
- జిల్లాలోని మంచి వసతులు, అందమైన భవనాలు కలిగిన పాఠశాలల్లో పోడూరు ప్రథమస్థానములో "L" షేపులో పొడవుగా ఉండేది... ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉండటంతో ప్రస్తుతం దీనిని తొలగించారు. రోడ్డు వైపుగా మరోక బిల్డింగ్ కట్టడం జరిగింది.
- విద్యార్థులు ఆడుకొనేందుకు దాదాపు రెండు ఎకరాల మేర క్రీడా స్థలము ఉంది. రెండు దీనిలో టెన్నిస్ కోర్టులు, రెండు బాస్కెట్ బాల్ కోర్టులు, రెండు వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్,హైజంప్ కొరకు ఒక ఇసుక కోర్టులు ఉన్నాయి.
- పాఠశాల వెనుక వృత్తి విద్యాశిక్షణ కొరకు పెంచబడిన పొడవైన ఉద్యానవనం.
- కంప్యూటరు తరగతుల కోసం పది కంప్యూటర్లు కలిగిన విశాలమైన మరొక హాలు.
గ్రంథాలయాలు
[మార్చు]- శ్రీ రామచంద్ర గ్రంథాలయం.
1870లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంథాలయం. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంథాలయం 1914లో పండిత రుద్రరాజు నరసింహరాజుగారి ప్రోత్సాహముతో భవనముగా రూపుదిద్దుకొని 1962కు రెండు అంతస్తులుగా ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన అతి పెద్ద గ్రంథాలయంగా మార్పు చెందినది. ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు పోడూరి వెంకయ్య పంతులు తన స్వంత పంటభూమి నుంచి రెండు ఎకరాలు దానం చేశారు. ఆ రెండు ఎకరాల భూమి నుంచి లైబ్రరీ అభివృద్ధికి ఆదాయం సమకూరుతోంది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు భాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ధ గ్రంథాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి.
- ప్రభుత్వ గ్రంథాలయం.
- బాలసంఘ గ్రంథాలయం.
విద్యార్థుల,చిన్న పిల్లల కొరకు స్థాపించిన బాలసంఘములో కల చిన్న గ్రంథాలయం. ఇక్కడ బాల సాహిత్యము అనదగిన అన్ని పుస్తాకాలు లభ్యమగును. బాలలు ఆడుకొనుచూ చదువుకొనే ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.
- గీతాభవనం
ఇది దేవస్థానంగానూ గ్రంథాలయంగానూ ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక రచనలు అన్నీ లభ్యమగును.
జల వనరులు
[మార్చు]కాలువలు.
[మార్చు]ఊరికి ముఖ్యముగా మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి. ఊరికి మధ్యగా ప్రవహించే మంచినీటి కాలువ. ఊరి ప్రక్కగా ప్రవహిస్తూ మురుగుకాల్వలో కలిసే పంటకాలువ.ఊరికి చివరగా ప్రవహిస్తూ చివరికి నక్కల కాలువలో కలిసే మురుగు కాలువ.
చెరువులు
[మార్చు]ఊరిలో ప్రధాన చెరువులు
- భాల సంఘం చెరువు. పైపుల చెరువు (పాఠశాల దగ్గర కలది). రాయిగొప్పు చెరువు.
ఇతర సౌకర్యాలు
[మార్చు]- పోలీస్ స్టేషను - మండల కార్యాలయమునకు సమీపాన ఉంది. ఇరవై మంది జవాన్లు, ఒక సర్కిలు ఈ స్టేషనులో పనిచేస్తున్నారు.
- ప్రయాణీకుల విశ్రాంతి మందిరాలు (బస్టాండ్స్) - పంచాయితీ కార్యాలయపు రోడ్డులో ఒకటి కొత్తది, మరొకటి పాతది ఉన్నాయి. ఇవే కాక సినిమా హాలు సెంటర్ లో ఒకటి, గవర్నమెంట్ ఆరోగ్యకేంద్రము వద్ద ఒకటి ఉన్నాయి.
- ఈ సేవాకేంద్రము - మండల కేంద్ర భవనమునకు దగ్గరగా ఈ కేంద్రము నలుగురు ఉధ్యోగులతో ప్రారంభించబడింది.
- కళ్యాణ మండపాలు - 1.తిరుమల తిరుపతి కళ్యాణ మండపము. 2.ఆర్యవైశ్య కళ్యాణ మండపము. 3.ప్రభుత్వ వసతి గృహములు ఉన్నాయి.
- బ్యాంకులు - 1 ఇండియన్ బ్యాంకు. 2.సహకార పరపతి భ్యాంకులు ఉన్నాయి.
- ప్రభుత్వ ఆసుపత్రి
- గ్రామ కచేరీ - బస్టాండ్ సెంటరు నుండి మండల కార్యాలయము పక్కకు బదిలీ చేయడం జరిగింది.
- పోడూరుకున్న మరో ప్రత్యేకత అభివృద్ధి . ఊరి ప్రముఖుల వలన ఊరిలో అన్ని వసతులు ఏర్పడ్డాయి. 2006 సంవత్సరంలో పది లక్షలతో ఏర్పాటయిన వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వలన ఊరి ప్రజలు కలుషితం లేని మంచి నీళ్ళు తాగగలుగుతున్నారు. అన్ని కాలాలలోనూ నీరుండే రెండు పెద్ద మంచినీటి చెరువులు, రెండు బోర్డు పాఠశాలలు, అన్ని వసతులు కలిగి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద ఉన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల, రెండు బస్టాండ్లు, పోలీస్ స్టేషను,ఈ సేవా కేంద్రము తదితరములతో అభివృద్ధి పధములో ప్రయాణించుచున్నది.
ప్రముఖులు
[మార్చు]- పోడూరి వెంకయ్య పంతులు - ఈయన పొడూరు పంచాయితీ ఏర్పడిన తరువాత ఎన్నిక కాబడిన మొట్టమొదటి సర్పంఛ్. ఈయన సర్పంఛిగా ఉన్నపుడు ఈ గ్రామానికి అనేక విదాలుగా సేవలు అందించి గ్రామ పురోభివృద్దికి పాటుపడినారు. గ్రామం అభివృద్ధి చెందు సమయంలో రహదారుల నిర్మాణానికి మంచి కృషిచేయడం నుండి అనేకానేక పనులతో గ్రామ ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తి. పోడు.రులో విఖ్యాతి చెందిన రామచంద్ర గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన తన స్వంత ఆస్తి నుంచి రెండు ఎకరాల పంటపొలాన్ని దానం చేశారు. ప్రస్తుతం ఈ లైబ్రెరీ రాష్ట్రంలోకెల్లా పుస్తకాల విషయంలోనూ, ప్రాచీనతలోనూ ప్రాముఖ్యం వహించిన గ్రంథాలయాల్లో ఒకటిగా ఉంది
- డాక్టర్ కల్నల్.డి.యస్.రాజు గారు. - (ప్రముఖ స్వాతంత్ర్యోధ్యమకారులు) (పూర్తి వ్యాసము కొరకు చూడండి. దాట్ల సత్యనారాయణ రాజు
- రుద్రరాజు సూర్యనారాయణరాజు {తాతరాజు} - తర్వాతికాలంలో పోడూరు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తాతరాజుగా ప్రసిద్ధి చెందినవ్యక్తి. పాఠశాలలకు, వైద్యశాలలకు,సామాజిక సేవా కేంద్రాలకు, విరాళములిచ్చి ఎన్నో నిర్మాణాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వాటిని నడిపించారు. ఊరి ప్రజలు ఈయన సంస్మరణార్ధం వారి యొక్క కాంశ్యవిగ్రహమును పోడూరు మండల కార్యాలయ ఆవరణయందు ఏర్పాటు చేసిరి.
- డాక్టర్ కోసూరి సత్య సీతారామరాజు - ప్రముఖ హోమియోపతి వైద్యులు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు. 1942 క్యిట్ ఇండియా ఉద్యమంలో పికెటింగ్ చేస్తుండగా పోలీసులచే అరెస్టు కాబడి రాజమండ్రి జైలుకు తదనంతరం బళ్ళారి ఆలీపూర్ జైళ్ళలో శిక్ష అనుభవించారు. ఈయన గాంధేయవాది మాత్రమే కాదు సీతారామరాజుకు వీరాభిమాని.
- డాక్టర్ పోడూరి రామారావు - పోడూరులో డాక్టర్ పోడూరి రామారావు, డాక్టర్ రుద్రరాజు నరసింహరాజు కలిసి 'ఓస్లర్ హాస్పిటల్' ప్రారంభించాడు. వారిద్దరూ చిన్ననాటి నుంచీ స్నేహితులే కాక తమ ఆశయాలను కూడా పంచుకుని పేదవారికి ఉచిత వైద్య సహాయం చేసేవారు. అనంతరం డాక్టర్ పోడూరి కృష్ణమూర్తి అధ్వర్యంలో ఇది నడుస్తున్నది.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,954. ఇందులో పురుషుల సంఖ్య 4997, మహిళల సంఖ్య 4957, గ్రామంలో నివాస గృహాలు 2615 ఉన్నాయి.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2686 ఇళ్లతో, 9578 జనాభాతో 1205 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4861, ఆడవారి సంఖ్య 4717. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1864 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 78. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588702.[2]
వైద్య సౌకర్యం
[మార్చు]- ప్రభుత్వ వైద్య సౌకర్యం
పోడూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
- ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]పోడూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]పోడూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 231 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 973 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 973 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]పోడూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 973 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]పోడూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]ఇటుకలు, సిమెంటు ఇటుకలు
చేతివృత్తులవారి ఉత్పత్తులు
[మార్చు]లేసులు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
బయటి లింకులు
[మార్చు]- పోడూరి నాగరాజారావు గ్రంథాలయ సర్వస్వం రచన ఆధారంగా
- https://web.archive.org/web/20081219233956/http://www.poduru.com/
- https://web.archive.org/web/20110115160701/http://www.638387.org/p/poduru.htm