Coordinates: 16°50′00″N 81°30′00″E / 16.8333°N 81.5000°E / 16.8333; 81.5000

తాడేపల్లిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Tadepalligudem
పంక్తి 100: పంక్తి 100:
[[bpy:তাদেপাল্লিগুদেম]]
[[bpy:তাদেপাল্লিগুদেম]]
[[it:Tadepalligudem]]
[[it:Tadepalligudem]]
[[ms:Tadepalligudem]]
[[vi:Tadepalligudem]]
[[vi:Tadepalligudem]]
[[zh:塔德帕尔利古德姆]]
[[zh:塔德帕尔利古德姆]]

04:41, 9 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

  ?తాడేపల్లిగూడెం మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటంలో తాడేపల్లిగూడెం మండల స్థానం
పశ్చిమ గోదావరి జిల్లా పటంలో తాడేపల్లిగూడెం మండల స్థానం
పశ్చిమ గోదావరి జిల్లా పటంలో తాడేపల్లిగూడెం మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°50′00″N 81°30′00″E / 16.8333°N 81.5000°E / 16.8333; 81.5000
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం తాడేపల్లిగూడెం
జిల్లా (లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 17
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,83,401 (2001 నాటికి)
• 91896
• 91505
• 70.34
• 74.12
• 66.54


తాడేపల్లిగూడెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రము.

తాడేపల్లిగూడెం పట్టణం

ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం(Tadepalligudem) ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. 2011 లో సెలెక్షన్ గ్రేడ్ మునిసిపాలిటి గా అవతరించింది.వ్యాపార, విద్యా రంగాల్లొ వేగంగా అభివ్రుద్ది చెందుతుంది. జిల్లా ముఖ్య పట్టణం అయిన ఏలూరుకి 50 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని ఆనుకుని అనేక పల్లెటూళ్ళు ఉన్నాయి మరియు ఇతర ముఖ్యపట్టణములకు దగ్గరగా జిల్లాకు నడిబొడ్డున వున్నది. కోస్తాలో ముఖ్యపట్టణమైన విజయవాడకు 100 కి.మీల దూరంలో వున్నది. రాజమండ్రికి 45 కి.మీల దూరంలో వున్నది.

2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వివరాలు

  • మొత్తం జనాభా 103,303
    • మగవారు 49%
    • ఆడవారు 51%
  • సగటు అక్షరాస్యత శాతం 61%.

శాసనసభ నియోజకవర్గం

వ్యాపారం

తాడేపల్లిగూడెం వ్యవసాయోత్పత్తుల అమ్మకాలు నిర్వహించే కేంద్రంగా కోస్తా జిల్లాలలో పేరుగాంచింది. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ ఉత్పత్తులు నిలవ ఉంచే గిడ్డంగులకు కూడా ఈ పట్టణం గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే అతి పెద్ద ధాన్యం నిలువ చేసే ఎఫ్.సీ.ఐ. గిడ్డంగులు ఈ పట్టణంలో ఉన్నాయి. ఇక్కడి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు ఉల్లిపాయలు ఏగుమతి చేయబడుచున్నవి.

మామిడి మార్కెట్

వేసవి సీజన్ వచ్చిందంటే తాడేపల్లిగూడేం కళకళలాడుతుంటుంది. జిల్లాలోనే అతిపెద్ద మామిడి కాయల మార్కెట్ పిప్పర వెళ్ళే మార్గంలో కలదు. రిటైలర్స్,హోల్ సేలర్స్, మరియు సామాన్య ప్రజల కొనుగోళ్ళతోనూ అతిరద్దీగా ఉండే మార్కెట్.

పరిశ్రమలు

పట్టణంలో గొయంకా వారి ఫుడ్ ఫ్యట్స్ ‍‍‍‍ఫెర్టిలైజర్స్(3 ఏఫ్) కర్మాగారము మరియ చాక్ పీసుల తయారీ, కొవ్వత్తుల తయారీ పరిశ్రమలు ఉన్నవి. పట్టణానికి దగ్గరగా బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నవి. పట్టణములో 6000 పైగా రవాణా వాహనములు వున్నవి. జిల్లాలో ఉన్న బియ్యపు మిల్లులలో తాడేపల్లిగూడెంలోనే అత్యధిక బియ్యపు మిల్లులు కలవు.ఈ పరిశ్రమల కార్మికులకు ఈ యస్ ఐ ఆసుపత్రి ఉన్నది.

విశేషాలు

రెండవ ప్రపంచయుద్ధ కాలములో బ్రిటీషువారు నిర్మించిన తాడేపల్లిగూడెం విమానాశ్రయం రన్వే
రన్వేపై సూచించిన నిర్మాణ తేదీ

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలను నిలిపేందుకు అణువుగా తాడేపల్లిగూడెంలో 2 కి.మీ పొడవున్న రన్ వేను నిర్మించారు. దీన్ని ప్రస్తుతం ఎవరూ వాడనప్పటికీ ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ మార్గం గుండా ప్రసిద్దిపొందిన మిలటరీ మాధవవరం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రన్వే వలన చుట్టు ప్రక్కల భూములు ఒకప్పుడు అభివృద్ది చెందకున్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలోనే ప్రఖ్యాతినోందిన నాలుగయిదు {ఈస్ట్ కోస్ట్ హైబ్రీడ్స్, ఎస్.ఆర్.కె.నర్సరీ లాంటి} పెద్ద నర్సరీలు కలవు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం

విద్య

ఇక్కడ 6 ఇంజనీరింగ్ కాలేజిలు, 4 ఎం.బి.ఎ కాలేజిలు, 4 ఎం.సి.ఎ కాలేజిలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ క్యాంపస్, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. ఉద్యానవన (హార్టీకల్చర్) విశ్వవిద్యాలయము ముఖ్య కార్యాలయం వున్నది.

ప్రముఖ వ్యక్తులు

  • ఈ పట్టణ రూపశిల్పి శ్రీ యీలి ఆంజనేయులు గారు "అపర భగీరధుడు" బిరిదాంకితులు.
  • కారుమూరి పవన్,
  • ఈ పట్టణం నుండి అనేక ప్రసిద్ద కళాకారులు జన్మించి ఖ్యాతి నొందారు. సుప్రసిద్ద తెలుగు సినీ హాస్యనటుడు రేలంగి వెంకటేశ్వరరావు అత్తవారి ఊరు. ఇప్పటికీ ఆయన పేరు మీద "రేలంగి" అని ఒక సినిమా థియేటర్ ఈ పట్టణంలో ఉన్నది. ఈ థియేటర్ ఆయన నిర్మించిందే.
  • పద్మశ్రీ గ్రహీత అయిన చిత్ర కారుడు, శిల్పి, తాడేపల్లి వెంకన్న ఇక్కడి వారే.
  • 48 గంటలు నిర్విరామంగా కూచిపూడి నాట్యం చేసి గిన్నీస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న కిళ్ళాడి సత్యం ఇక్కడి వారే.
  • ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ తన బాల్యం తాడేపల్లిగూడెంలోనే గడిపాడు.
  • ఆంధ్ర్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన పసల సూర్యచంద్రరావు
  • న్యాయవాద వృత్తిలో పేరొందిన స్వర్గీయ ప్లీడరు బాబ్జీ(చామర్తి సుందరకామేశ్వర రావు)
  • సత్యసాయిబాబాకు సన్నిహితులు, బహుగ్రంధకర్త స్వర్గీయ జంధ్యాల శాంతిశ్రీ పట్టణానికి చెందినవారు. సత్యసాయి భక్తులు పూజమందిరంలో దేవునితో

సమానంగా పూజించుకునే శాంతివనం గ్రంధం వీరు రాసినదే.

ఇలా ఎందరెందరో మహానుభావులను అందించిన పట్టణం ఇది.

రవాణా

దస్త్రం:APtown TadepalliGudem RlyStn views.JPG
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్

పట్టణం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు మరియు రోడ్డు మార్గాలతో కలుపబడినది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చెన్నై-కోల్కత్తా రైలు మార్గములో ఉంది. జాతీయ రహదారి "ఎన్.హెచ్-5(ప్రస్తుతం 16)" ఈ పట్టణం నడిబొడ్డు గుండా వెళుతుంది.

ముఖ్యమైన పండుగలు

తాడేపల్లిగూడెంలో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • . సంక్రాంతి : సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ ను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
  • . ఉగాది : తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి / ఏప్రిల్ నెలల లో వస్తుంది.
  • . వినాయక చవితి : భాద్రపద శుద్ధ చవితి. ఆగష్టు / సెప్టెంబర్ నెలలలో వస్తుంది.
  • . దసరా : ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబర్ నెలలో వస్తుంది.
  • . దీపావళి : ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబర్ నెలలో వస్తుంది .
  • . శ్రీరామనవమి : చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
  • . సుబ్రమణ్య షష్టి

గ్రామాలు


ఇతర సమాచారం

  • . తాడేపల్లిగూడెం గ్రామ దేవత : బలుసులుమ్మ
  • . తాడేపల్లిగూడెం పిన్ కోడ్ : 534101, 534102
  • . తాడేపల్లిగూడెం టెలిపోన్ యస్.టి.డి కోడ్: 08818
  • . తాడేపల్లిగూడెం ఆర్టీసీ మరియు షాట్ కట్కోడ్ : TPG
  • . తాడేపల్లిగూడెం రైల్వే కోడ్ : TDD