భారతదేశంలో స్వయంప్రతిపత్త పరిపాలనా విభాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశాన్య భారతదేశంలో స్వయంప్రతిపత్తి మండలి

భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ స్వయంప్రతిపత్త పరిపాలనా విభాగాల ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది, వీటికి ఆయా రాష్ట్రాలలో స్వయంప్రతిపత్తి ఇవ్వబడింది. [1] ఈ స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్ళలో లడఖ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి తప్ప మిగతావన్నీ ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. ప్రస్తుతం, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలలో ఆరవ షెడ్యూల్ [2] ప్రకారం 10 స్వయంప్రతిపత్త మండళ్ళు ఏర్పడగా, మిగిలినవి ఇతర చట్టాల ద్వారా ఏర్పడ్డాయి.

అధికారాలు, సామర్థ్యాలు

[మార్చు]

కార్యనిర్వాహక, శాసన అధికారాలు

[మార్చు]

భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం, స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్ళు కింది అంశాలకు సంబంధించి చట్టాలు, నియమాలు, నిబంధనలను రూపొందించవచ్చు:[1]

  • భూమి నిర్వహణ
  • అటవీ నిర్వహణ
  • నీటి వనరులు
  • వ్యవసాయం, సాగు
  • గ్రామ సభల ఏర్పాటు
  • ప్రజారోగ్యం
  • పారిశుధ్యం
  • గ్రామ, పట్టణ స్థాయి పోలీసింగ్
  • సాంప్రదాయికంగా వచ్చే పెద్దలు, అధిపతుల నియామకం
  • ఆస్తి వారసత్వం
  • వివాహం, విడాకులు
  • సామాజిక ఆచారాలు
  • డబ్బు ఋణాలు, వ్యాపారం
  • మైనింగు, ఖనిజాలు

న్యాయాధికారాలు

[మార్చు]

5 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించే కేసులు, అది కూడా ఇరు పక్షాలూ షెడ్యూల్డ్ తెగల సభ్యులైతే ఆ కేసులను విచారించడానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారాలు స్వయంప్రతిపత్త జిల్లా మండళ్ళకు ఉన్నాయి.[1]

పన్ను, రాబడి

[మార్చు]

పాఠశాలలు, రహదారుల నిర్వహణ వగైరాల కోసం భవనాలు, భూమి, జంతువులు, వాహనాలు, పడవలు, ఆ ప్రాంతంలోకి వస్తువుల ప్రవేశం, రోడ్లు, పడవలు, వంతెనలు, ఉపాధి, ఆదాయంపై పన్ను, సాధారణ పన్నులు, రుసుములు, సుంకాలు విధించే అధికారాలు స్వయం ప్రతిపత్త జిల్లా మండళ్ళకు ఉన్నాయి: [1]

స్వయంప్రతిపత్త పరిపాలనా విభాగాల జాబితా

[మార్చు]

భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్న స్వయంప్రతిపత్త జిల్లా మండళ్ళను బొద్దుగా చూపించాం

క్ర.సం రాష్ట్రం స్వయంప్రతిపత్త మండలి ముఖ్య కార్యాలయం ఏర్పాటు గత ఎన్నికలు ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు ముఖ్య కార్యనిర్వాహక సభ్యుని పార్టీ ప్రస్తుత పార్టీల

స్థితి

1 అస్సాం బోడోలాండ్ ప్రాదేశిక మండలి కోక్రఝార్ 2003 2020 Pramod Boro UPPL(NEDA) Total-40

Govt:- UPPL-15 BJP-12 GSP-1

Opp:- BPF-12

2 నార్త్ కచార్ హిల్స్ స్వయంప్రతిపత్త మండలి హాఫ్లాంగ్ 1951 2019 Debolal Gorlosa BJP

(NEDA)

Total-28

Govt:- BJP-25

Opp:- IND-3 NOM-2[3]

3 కార్బి ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్త మండలి దిఫు 1952 2022 Tuliram Ronghang BJP

(NEDA)

Total-26

Govt:- BJP-26

Opp:- 0

4 తివా స్వయంప్రతిపత్త మండలి మోరిగావ్ 1995 2020 Jiban Chandra Konwar BJP

(NEDA)

Total-36

Govt:- BJP-33 AGP-2

Opp:- INC-1

5 మిసింగ్ స్వయంప్రతిపత్త మండలి ధేమాజి 1995 2019 Ranoj Pegu SGS Total-35

Govt:- SGS-29 BJP-5

Opp:- IND-1

6 రభా హసోంగ్ స్వయంప్రతిపత్త మండలి దుధ్‌నోల్ 1995 2019 Tankeswar Rabha BJP

(NEDA)

Total-36

Govt:- BJP+RHJMC-34

Opp:- INC-1 AGP-1

7 సోనొవాల్ కచారి స్వయంప్రతిపత్త మండలి దిబ్రూగఢ్ 2005 2019 Dipu ranjan Markari BJP

(NEDA)

Total-26

Govt:- BJP-20

Opp:- INC-5 IND-1

8 తెంగల్ కచారి స్వయంప్రతిపత్త మండలి టిటాబర్ 2005 2022 Kumud Ch Kachari BJP

(NEDA)

Total-22

Govt:- BJP-14 AGP-3

Opp:- INC-4 IND-1

9 దేవ్‌రీ స్వయంప్రతిపత్త మండలి నారాయణ్‌పూర్ 2005 2022 Madhav Deori BJP

(NEDA)

Total-22

Govt:- BJP-11 AGP-1

Opp:- IND-8 INC-2

10 మొరాన్ స్వయంప్రతిపత్త మండలి తిన్‌సుకియా 2020 Dipon Moran
11 Matak స్వయంప్రతిపత్త మండలి Chring Gaon 2020
12 బోడో కచారి సంక్షేమ స్వయంప్రతిపత్త మండలి సిమెన్ చపోరి 2020 Mihiniswar Basumatary
13 కమ్‌తాపూర్ స్వయంప్రతిపత్త మండలి అభయపురి 2020 Gokul Barman
14 లడఖ్ లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, కార్గిల్ కార్గిల్ 2003 2023 Mohammad Jaffer Akhone Jammu & Kashmir National Conference Total-30

Govt:- Jammu & Kashmir National Conference-10 Indian National Congress-8

Opp:- IND-5 BJP-3

15 లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్ లేహ్ 1995 2020 Tashi Gyalson Bhartiya Janata Party Total-30

Govt:- Bhartiya Janata Party-16

Opp:- INC-9 IND-1

16 మణిపూర్ చందేల్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి చందేల్ 1971[4] 2015 Ksh. Siddharth, MCS
17 చురచంద్‌పూర్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి చురచంద్‌పూర్ 1971[4] 2015 Lalthazam, MCS
18 సదర్ హిల్స్ కాంగ్‌పోక్‌పి 1971[4] 2015 James Doujapao Haokip, MCS
19 ఉత్తర మణిపూర్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి సేనాపతి 1971[4] 2015 H L Jain, MCS
20 తమెంగ్‌లాంగ్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి తమెంగ్‌లాంగ్ 1971[4] 2015 Ningreingam Leisan[5]
21 ఉఖ్రుల్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి ఉఖ్రుల్ 1971[4] 2015 David Kashungnao, MCS
22 మేఘాలయ గారో హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి తురా 1973 2021 Benedick R Marak NPP

(NEDA)

Total-29

Govt:- National People's Party (India)-11 BJP-2 Garo National Council-1 IND-3

Opp:- AITC-12

23 జైంతియా హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి జోవై 1973 2019 T Shiwat National People's Party (India)

(NEDA)

Total-29

Govt:- NPP-12 UDP-10

Opp:- INC-4 AITC-3

24 ఖాసీ హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి షిల్లాంగ్ 1973 2019 Titosstarwell Chyne National People's Party (India)(NEDA) Total-29

Govt:- NPP-7 UDP-6 HSPDP-2 PDF-1

Opp:- INC-10 Oth:- AITC-3

25 మిజోరం చక్మా స్వయంప్రతిపత్త జిల్లా మండలి కమలానగర్ 1972 2023 Rasik Mohan Chakma MNF Total-20

Govt:- MNF-12

Opp:- INC-6 BJP-1

26 లాయ్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి లాంగ్‌త్లాయ్ 1972 2020 V. Zirsanga MNF Total-25

Govt:- MNF-20

Opp:- IND-3 BJP-1 INC-1

27 మారా స్వయంప్రతిపత్త జిల్లా మండలి సియాహా 1972 2022 M Laikaw BJP Total-25

Govt: BJP -16 Opp:- INC - 4 MNF - 5

28 త్రిపుర త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్త జిల్లా మండలి ఖుముల్‌వింగ్ 1982 2021 Purna Chandra Jamatia TIPRA Total-30

Govt:- TIPRA-18 IND-1

Opp:- BJP-9

29 పశ్చిమ బెంగాల్ గోర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన డార్జిలింగ్ 2012 2022 Anit Thapa BGPM Govt:- BGPM-27 AITC-5 IND-3

Opp:- HP-8 IND-2

స్
పార్టీ ఇసిఐ గుర్తింపు [6]
ఎకెఆర్ఎస్యూ (K) ఆల్ కోచ్-రాజబంశీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్/ఎ
ఏఐటీసీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ
ఏజీపీ అసోమ్ గణ పరిషత్ రాష్ట్ర పార్టీ
బీజేపీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ
బిపిఎఫ్ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర పార్టీ
జీఎన్సీ గారో నేషనల్ కౌన్సిల్ నమోదైన గుర్తింపు లేని పార్టీ
జీఎస్పీ గణ సురక్ష పార్టీ నమోదైన గుర్తింపు లేని పార్టీ
హెచ్ఎస్పీడీపీ హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర పార్టీ
ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ పార్టీ
జేకేఎన్సీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పార్టీ
కేఏడీఎఫ్ కర్బి ఆంగ్లాంగ్ డెమోక్రటిక్ ఫోరం ఎన్/ఎ
ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర పార్టీ
ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ పార్టీ
పిడిఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర పార్టీ
ఆర్హెచ్జెఎంసి రాభా హసోంగ్ జాయింట్ మూవ్మెంట్ కమిటీ ఎన్/ఎ
ఎస్జీఎస్ సమ్మిలితా గణ శక్తి నమోదైన గుర్తింపు లేని పార్టీ
టిప్రి స్వదేశీ ప్రగతిశీల ప్రాంతీయ కూటమి రాష్ట్ర పార్టీ
యుడిపి యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ) రాష్ట్ర పార్టీ
యుపిపిఎల్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ రాష్ట్ర పార్టీ

వాస్తవ స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలు

[మార్చు]

ఉత్తర సెంటినెల్ ద్వీపం

[మార్చు]

నార్త్ సెంటినెల్ ద్వీపం కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవుల ద్వీపాల్లో ఉంది. ఇది సెంటినెలీస్ ప్రజలకు నిలయం. వీరు మిగతా ప్రపంచంతో ఇంకా పరిచయమే కాని ప్రజలు. వారు ఇతర వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. ఆధునిక నాగరికత పొడ తాకని జాతి అది.

సెంటినెలీస్ జీవనశైలి లేదా ఆవాసాలతో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అండమాన్, నికోబార్ ప్రభుత్వం చెప్పింది.[7] 2004 డిసెంబరు సునామీ ప్రభావంతో ద్వీపం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, భారత ప్రభుత్వ హెలికాప్టరు వారిలో చాలా మందిని గమనించి, వారు జీవించే ఉన్నట్లు నిర్ధారించింది. సెంటినెలీస్ ప్రజలు గాలిస్తున్న హెలికాప్టరుపై బాణాలు వేసారు.

అధికారికంగా ఎలాంటి ఒప్పందమూ లేనప్పటికీ, వారి సమాజంతో ఏమాత్రం జోక్యం చేసుకోని అధికారిక విధానం కారణంగా ఈ ద్వీపానికి స్వయంప్రతిపత్తి వచ్చినట్లైంది.[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Sixth Schedule of The Constitution of India" (PDF). Archived (PDF) from the original on 27 October 2019. Retrieved 27 October 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "COIS6" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Union Cabinet approves amendment in Sixth Schedule to strengthen 10 North East autonomous councils". 24 January 2019. Archived from the original on 28 October 2020. Retrieved 3 November 2019.
  3. "BJP sweeps Assam tribal council elections". The Hindu. January 12, 2024. Archived from the original on January 13, 2024. Retrieved January 13, 2024.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Autonomous District Councils Manipur in brief By Haokholal Hangshing". e-pao.net. Archived from the original on 20 September 2022. Retrieved 2022-05-19.
  5. "MCS, MPS officers transferred : 16th jul22 ~ E-Pao! Headlines". e-pao.net. Archived from the original on 7 April 2023. Retrieved 2023-04-07.
  6. "ECI". Archived from the original on 2021-09-27.
  7. The Sentineli Archived మార్చి 2, 2009 at the Wayback Machine.
  8. "Administration in India's Andaman and Nicobar Islands has finally decided upon a policy of minimal interference". Archived from the original on 2012-09-14. Retrieved 2008-08-21.