హమ్రో పార్టీ
హమ్రో పార్టీ | |
---|---|
స్థాపకులు | అజోయ్ ఎడ్వర్డ్స్ |
స్థాపన తేదీ | 25 నవంబరు 2021 |
కూటమి | ఇండియా కూటమి |
శాసనసభలో సీట్లు | 6 / 45 |
హమ్రో పార్టీ అనేది భారతదేశంలోని డార్జిలింగ్ జిల్లా, కాలింపాంగ్ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ. హమ్రో పార్టీ 2021, నవంబరు 25న స్థాపించబడింది. పార్టీ అధ్యక్షుడు అజోయ్ ఎడ్వర్డ్స్, గతంలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు.[1]
ఎన్నికల చరిత్ర
[మార్చు]2022 ఫిబ్రవరిలో జరిగిన డార్జిలింగ్ మునిసిపాలిటీ ఎన్నికల్లో హమ్రో పార్టీ పోటీచేసింది. మొత్తం 32 సీట్లలో 18 సీట్లు గెలుచుకుని బోర్డును ఏర్పాటు చేసింది.[2] 2022, జూన్ 26న జరిగిన గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల్లో హమ్రో పార్టీ మొత్తం 45 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను గెలుచుకుంది.[3][4] జిటిఏకి చెందిన ఇద్దరు హమ్రో పార్టీ కౌన్సిలర్లు 2022, నవంబరు 5న భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాలో చేరారు.[5] డార్జిలింగ్ మునిసిపాలిటీకి చెందిన ఆరుగురు హమ్రో పార్టీ వార్డు కమీషనర్లు 2022, నవంబరు 24న భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాలో చేరారు.[6][7] డార్జిలింగ్ మునిసిపాలిటీకి చెందిన మరో హమ్రో పార్టీ వార్డ్ కమీషనర్ 2023, మార్చి 21న బిజిపిఏంలో చేరారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "New Hill party christened 'Hamro Party'". Millennium Post. 26 November 2021. Retrieved 11 June 2022.
- ↑ "West Bengal: Formed 3 months ago, Hamro Party beats major players in Darjeeling polls". The Times of India. 3 March 2022. Retrieved 11 June 2022.
- ↑ "GTA polls: Hamro Party to contest in all 45 seats". Millennium Post. 3 June 2022. Retrieved 11 June 2022.
- ↑ "North Bengal GTA Election Results 2022". Financial Express. 29 June 2022. Retrieved 30 June 2022.
- ↑ "Two Hamro Party GTA Sabhasads cross over to BGPM". Millennium Post. 6 November 2022. Retrieved 28 November 2022.
- ↑ "With BGPM set to wrest Darjeeling Municipality, Anit Thapa takes centre stage in hills politics". The Indian Express. 26 November 2022. Retrieved 28 November 2022.
- ↑ "Darjeeling municipality: Binay Tamang, Bimal Gurung add to chaos". The Telegraph. Retrieved 28 November 2022.
- ↑ "Hamro Party councillor switch relief for BGPM". The Telegraph. Retrieved 1 June 2023.