Jump to content

రావి కొండలరావు

వికీపీడియా నుండి
రావి కొండలరావు
సినివారంలో రావి కొండరావు
జననం(1932-02-11)1932 ఫిబ్రవరి 11
మరణం2020 జూలై 28(2020-07-28) (వయసు 88)
బేగంపేట
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తిపాత్రికేయుడు, నటుడు, దర్శకుడు, రచయిత
సుకుమార్ ఆర్కెస్ట్రా
గుర్తించదగిన సేవలు
నాగవల్లి నుండి మంజీరా వరకు
జీవిత భాగస్వామి
(1960⁠–⁠2012)
[1]
పిల్లలురావి వెంకట శశికుమార్[2]
తల్లిదండ్రులు
  • రావి చిదంబరం (తండ్రి)

రావి కొండలరావు (ఫిబ్రవరి 11, 1932 - జూలై 28, 2020) నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి.[3] దాదాపు 600 చిత్రాలలో నటించాడు.[4] ఈయన భార్య రాధాకుమారి[5] కూడా సినీ నటి.[6]

జననం

[మార్చు]

1932, ఫిబ్రవరి 11న[7] సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు.

ఇతర వివరాలు

[మార్చు]

ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో ‘శోభ’ చిత్రంతో అతని సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు.

చిత్ర సమాహారం

[మార్చు]

నటుడిగా

[మార్చు]

రచయితగా

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

సాహిత్యరంగం

[మార్చు]

ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు. హాస్యరచయితగా గుర్తింపు పొందాడు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు. ఇతడు వ్రాసిన కొన్ని కథలు:[8]

  1. అనురాగం
  2. అభిప్రాయం
  3. అభిమాన పుస్తకం
  4. అసంభవామి యుగేయుగే
  5. ఆడదిక్కు
  6. ఆత్మహత్య
  7. ఆవు పులి
  8. ఇదీ ఓ కథే
  9. ఎదురుచూడని వరుడు
  10. ఏడో చేప
  11. కంగారూ కనకంగారూ
  12. కంపార్టుమెంటాలజి
  13. కనబడుట లేదు
  14. కబుర్లూ...
  15. కలం స్నేహం
  16. కలలో వినాయకుడు
  17. కోతితోక
  18. గయ్యాళి
  19. చంద్రశేఖరుని కథ
  20. చావుల కొండ
  21. చిక్కుడుకాయలూ...
  22. చిత్రఖేదం
  23. చిత్రమోదం
  24. చిత్రలాభం
  25. తప్పిపోయినాడు
  26. తెలుగుమాస్టారి స్వగతం
  27. తొందరపాటు
  28. తోడేలు-గొర్రెపిల్ల
  29. దాహంగల కాకి
  30. దిదృక్ష
  31. దొంగ
  32. నాణెం
  33. నిరుద్యోగ పర్వం
  34. నీతి
  35. నేరపరిశోధన
  36. పండితుడు-రాజు
  37. పాము-సన్యాసి
  38. పాలు-నీళ్లూ
  39. పిరికిపందలు
  40. భయంలేని వాడు
  41. భూత "గోస్ట్" కథ నేను సుబ్బారావుని
  42. మర్కటాలూ మిణుగురులూ
  43. మళ్లీ చెప్పిన కథ
  44. మాయమైన మనీపర్సు
  45. ముకుంద...
  46. ముక్తిమార్గం
  47. ముమూర్ష
  48. మూడు చేపలు
  49. రట్టూ గుట్టూ
  50. రామూర్తి పెళ్లయింది
  51. రెండు శవాలు
  52. రైలు పట్టాలు
  53. లంచగొండి-యమలోకం
  54. వాళ్లూ, నేనూ
  55. వ్యర్థపుటాశలు
  56. సంతుష్టి
  57. సన్మాన సభ
  58. సింహం-కుందేలు
  59. సుబ్బారావు సూర్యకాంతి
  60. స్థిరపడిన సంబంధం

పుస్తకాలు

[మార్చు]
  1. (సి)నీతిచంద్రిక
  2. హ్యూమరథం (రెండు భాగాలు)
  3. మల్లీశ్వరి (సినిమా నవల)
  4. బ్లాక్ అండ్ వైట్
  5. రావి కొండలరావు నాటికలు
  6. రావి కొండలరావు కథలు
  7. నాగావళి నుంచి మంజీర వరకు

పురస్కారాలు

[మార్చు]
  • బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం - 2004 సంవత్సరానికి[9]
  • అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం[10]

మరణం

[మార్చు]

హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించాడు.[11][12][13][14]

మూలాలు

[మార్చు]
  1. "Veteran actress Radha Kumari passes away". timesofindia.indiatimes.com. Retrieved 2020-07-28.
  2. "Actress Radha Kumari dies of heart attack". www.filmibeat.com. Retrieved 2015-02-05.
  3. ప్రజాశక్తి, ఫీచర్స్ (23 November 2019). "సృజ‌న దాగ‌దు - న‌ట‌న ఆగ‌దు". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 20 June 2020. Retrieved 20 June 2020.
  4. "Raavi Kondala Rao regrets not completing Anjali Devi's biography". www.bollywoodlife.com. Retrieved 2020-07-28.
  5. "Radha Kumari Passed away!". www.chitramala.in. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 28 జూలై 2020.
  6. Eenadu (29 July 2020). "డాక్టర్‌గా యాక్టరై... 'మిస్సమ్మ'ను తిరగరాసి". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  7. రెంటాల, జయదేవ (2015-01-04). "జీవితమే సఫలము". సాక్షి దినపత్ర్రిక. Retrieved 4 January 2015.
  8. రావి, కొండలరావు. "రావి కొండలరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 4 January 2015.
  9. వెబ్‌మాస్టర్. "Nandi Awards 2004". idle brain. idle brain. Retrieved 4 January 2015.
  10. ఎడిటర్ (2014-11-05). "అజో, విభొ - కందాళం ఫౌండేషన్ పురస్కారానికి రావి ఎంపిక". ఆంధ్రభూమి. Retrieved 4 January 2015.[permanent dead link]
  11. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (28 July 2020). "సీనియర్ నటుడు రావి కొండలరావు తుదిశ్వాస". www.andhrajyothy.com. Archived from the original on 28 July 2020. Retrieved 28 July 2020.
  12. ఈనాడు, తాజా వార్తలు (28 July 2020). "సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 28 July 2020. Retrieved 28 July 2020.
  13. ఆంధ్రజ్యోతి (29 July 2020). "గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌ అని ఆయన గట్టిగా అనడంతో అదిరిపోయాను." Archived from the original on 25 March 2021. Retrieved 10 April 2021.
  14. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.

బయటి లింకులు

[మార్చు]