ధమని
స్వరూపం
(ధమనులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ధమనులు (Arteries) గుండె నుండి శరీరం అంతటికి మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు.
ధమని నిర్మాణం
[మార్చు]ధమనుల గోడలు మందంగా, కండరయుతంగా ఉంటాయి. వీటి లోపలి కుహరం ఇరుకుగా ఉంటుంది. ధమనులలో సిరలలోవలె కవాటాలు ఉండవు. ఇవి దేహ భాగాలకు లోపలగా అమరి ఉంటాయి. వీటిలో రక్తం అలలుగా ప్రవహిస్తుంది. ధమనులు రక్త కేశనాళికలతో అంతమవుతాయి. ధమనుల గోడలు మూడు పొరలతో ఏర్పడతాయి. అవి: వెలుపలి బాహ్యకంచుకం - స్థితిస్థాపకత కలిగిన కొల్లాజన్ తంతువులతో ఏర్పడుతుంది. మధ్యకంచుకం - నునుపు కండరాలతో ఏర్పడుతుంది. లోపలి అంతరకంచుకం - ఒకే వరుసలో ఉన్న ఉపకళాకణాలతో ఏర్పడుతుంది.
ధమనీ వ్యవస్థ
[మార్చు]- దైహిక చాపం (Arch of Aorta) :
- హార్దిక ధమనులు (Coronary arteries) :
- బాహ్య కరోట ధమని (External carotid artery) :
- అంతర కరోట ధమని (Internal carotid artery) :
- అధో జత్రుకా ధమని (Subclavian artery) :
- కశేరుక ధమని (Vertebral artery) :
- అంతర స్తన ధమని (Internal mammary artery) :
- బాహు ధమని:
- పృష్ఠ ధమని (Dorsal aorta) :
- పర్శుకాంతర ధమనులు (Intercoastal arteries) :
- ఫ్రెనిక్ ధమనులు (Phrenic arteries) :
- ఉదర ధమని (Coeliac artery) :
- పూర్వ ఆంత్ర యోజక ధమని:
- వృక్క ధమనులు (Renal arteries) :
- జీజకోశ ధమనులు:
- పర ఆంత్ర యోజక ధమని:
- లంబార్ ధమనులు (Lumbar arteries) :
- ఐక్య కటి ధమనులు (Common iliac arteries) :
- అంతర కటి ధమని (Internal iliac artery) :
- వెలుపలి కటి ధమని (External iliac artery) :
- పుచ్ఛ ధమని:
- పుపుస చాపం
- పుపుస ధమనులు (Pulmonary arteries) :
వెలుపలి లింకులు
[మార్చు]Look up ధమని in Wiktionary, the free dictionary.