ఇండియా కూటమి
ఇండియా కూటమి | |
---|---|
స్థాపన తేదీ | 18 జూలై 2023 |
రాజకీయ వర్ణపటం | |
రంగు(లు) | (Official) (Alternative) |
కూటమి | 27 రాజకీయ పార్టీలు |
లోక్సభ స్థానాలు | 142 / 543 |
రాజ్యసభ స్థానాలు | 98 / 245 |
శాసన సభలో స్థానాలు | 1,708 / 4,036 |
ఇండియా కూటమి (ఆంగ్లం: Indian National Developmental Inclusive Alliance) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలోని 26 రాజకీయ పార్టీల కూటమి.[1]
ఇండియా(ఐఎన్డిఐఎ) అంటే ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్ కాగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడం దీని ప్రాథమిక లక్ష్యం.[2]
ఉద్భవం
[మార్చు]ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్, దీనిని సాధారణంగా I.N.D.I.A. అని సంక్షిప్తంగా పిలుస్తారు. ఇది 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి 26 పార్టీల నాయకులు ప్రకటించిన ప్రతిపక్ష ఫ్రంట్. బెంగళూరులో జరిగిన సమావేశంలో ఈ పేరు ప్రతిపాదించబడింది. ఇందులో పాల్గొన్న 26 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కొన్ని వర్గాలు ఈ పేరును భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆపాదించగా,[3] మరికొందరు దీనిని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారని పేర్కొన్నారు.[4]
చరిత్ర
[మార్చు]పాట్నాలో మొదటి సమావేశం - ఐక్యత కోసం సమన్వయం
[మార్చు]బీహార్లోని పాట్నాలో జరిగిన మొదటి ప్రతిపక్ష పార్టీల సమావేశం 2023 జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఇందులో కొత్త కూటమికి సంబంధించిన ప్రతిపాదనను వివిధ రాజకీయ పార్టీల సభ్యులు తీసుకొచ్చారు. ఈ సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి.[5]
బెంగళూరులో రెండవ సమావేశం - అధికారిక ప్రకటన
[మార్చు]కర్ణాటకలోని బెంగళూరులో జూలై 17, 18వ తేదీలలో జరిగిన రెండవ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించింది. ఇందులో పొత్తు ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు ఈ జాబితాలో మరో పది పార్టీలు చేర్చబడ్డాయి. కూటమి పేరు ఖరారు చేసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు.[6] ఈ సమావేశంలో మూడో సభను ముంబై నగరంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.[7]
ముంబైలో మూడవ సమావేశం - ముందస్తు ప్రణాళికలు
[మార్చు]మూడవ ప్రతిపక్ష పార్టీల సమావేశం 2023 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు ముంబై నగరంలో జరిగింది. ఈ సమావేశానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆతిథ్యం ఇవ్వగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రెండు రోజుల చర్చల్లో, కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల అంశాలపై చర్చించింది, సమన్వయ కమిటీని రూపొందించింది. 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోరాడాలని మూడు పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించారు.[8][9][10]
భావజాలం, లక్ష్యాలు
[మార్చు]కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకారం, కూటమి సిద్ధాంతం అభివృద్ధివాదం, సమగ్రత, సామాజిక న్యాయం సూత్రాల చుట్టూ తిరుగుతుంది. వారి ప్రయత్నాలను కలపడం ద్వారా, సభ్య పార్టీలు ప్రజాస్వామ్య విలువలను రక్షించడం, సంక్షేమం, పురోగతిని సాధించడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)ని ఓడించే లక్ష్యంతో ఇది ఏర్పడింది.[11]
సభ్యత్వం ఉన్న పార్టీలు
[మార్చు]ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ భారతదేశంలోని వివిధ రకాల రాజకీయ పార్టీలను కలిగి ఉంది. కూటమిలోని 26 సభ్య పార్టీలు:[12]
మూలాలు
[మార్చు]- ↑ "Opposition names alliance INDIA in run-up to 2024 elections". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
- ↑ Hrishikesh, Cherylann Mollan & Sharanya (18 July 2023). "Opposition meeting: 26 Indian parties form alliance to take on PM Modi". BBC News. Archived from the original on 20 July 2023. Retrieved 18 July 2023.
- ↑ Nair, Sobhana K. (18 July 2023). "Picking the name INDIA for alliance, Opposition parties frame 2024 battle as BJP vs the country". The Hindu. Retrieved 21 July 2023.
- ↑ Ghosh, Poulomi (19 July 2023). "'Who gave INDIA name? Who can't arrive at consensus…': BJP's dig 10 points". Hindustan Times. Retrieved 21 July 2023.
- ↑ "Tenets of unity: On the Opposition meet in Patna". The Hindu. 25 June 2023.
- ↑ "విపక్ష కూటమి ఇండియా |". web.archive.org. 2023-09-05. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Opposition alliance named 'INDIA', 11-member coordination committee to decide on all important issues". The Times of India. 2023-07-19. ISSN 0971-8257. Archived from the original on 19 July 2023. Retrieved 2023-07-19.
- ↑ "Opposition Meeting: లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. 'ఇండియా' కూటమి తీర్మానం | opposition alliance finalises coordination committee". web.archive.org. 2023-09-05. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Live Updates: INDIA bloc forms 14-member coordination panel, says seat-sharing formula for 2024 Lok Sabha polls soon". The Indian Express (in ఇంగ్లీష్). 1 September 2023.
- ↑ "I.N.D.I.A Opposition bloc 2-day meet ends, resolution adopted, coordination committee formed". IndiaTV (in ఇంగ్లీష్). 1 September 2023.
- ↑ "Opposition Alliance Unveils Name "INDIA" – Indian National Developmental Inclusive Alliance". Akhil Bharat Times News. 18 July 2023. Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.
- ↑ https://www.ndtv.com/india-news/the-26-opposition-parties-that-have-formed-mega-alliance-for-2024-lok-sabha-election-4217778