ఋగ్వేదకాలం స్త్రీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఋగ్వేదకాలం స్త్రీలు

[మార్చు]
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

ఋగ్వేదం కాలమున గృహమున సర్వాంగశోభితమై ఉండెడిదట. జనకుడు గృహ యజమాని. వైవాహిక పద్ధతులన్నియు క్రమముగా జరపబడుచుండెడివి.ఆర్యులెన్నడూ స్త్రీని మానవజాతిపతనమునకు హేతువని నుడువలేదు. భూలోకమున స్వర్గసమానముచేసి మానవజాతి అభివృద్ధికిని, సౌఖ్యమునకు స్త్రీ వ్యక్తియే ఆధారభూతమని ఆర్యులు నమ్మెడివారు. ఋగ్వేదమున గృహిణి గృహదీపికాని వర్ణింపబడెను. సూర్యోదయమునకుమునుపే లేచి తక్కినవారిని మేల్కొలిపి గృహసమ్మార్జనము, భాజనపారిశుద్యము మున్నగు గృహకృత్యములందు ప్రవేశించు చుండెను. స్నానమొనర్చి సభర్తృకయై పతిని పూజుంచుచుండెను. ఇట్లు మధ్యాహ్నసాయంకాలముయందు నగ్నిదేవుని పూజించుచుండెను.ఈపవిత్రాగ్ని నిత్యము వెలుగునట్లు చూచుట యామెకు ప్రథమ కృత్యము. పాలు పితుకుట, మజ్జిగ తరుచుట మున్నగు పనులు తీరిన తరువాత వంట ప్రారంభించును.ఈతరుణమున తన కుమార్తెలు శిశువులను తగు జాగ్రత్తతో చూచుచుండిరి.మధ్యాహ్నభోజనమయిన పిదప శిరోలంకారము, ధౌతవస్త్రాధారణ మొనరించి పిల్లలందరిని అట్లె అలంకరించి సాయంకాలము వంట జేసి పిల్లలకు భొజనమిడి వారిని నిద్రపుచ్చును. ఆమె సేవకులచె గృహకృత్యములను కొన్ని నెరవేర్పించి గోవులని, తదితరవస్తువులను సరియైనస్థితిలో నున్నదియు లేనిదియు పరికించిచుండెను. ఆమె యత్తమామలయెడ భర్తృసోదరులయందు ఉచితభక్తివిశ్వాసములతో మెలగుచుండును.

ఆకాలమున సుతులు కలుగుటుకై క్షీరమిశ్రితమగు సోమరసముతో దేవతలనూఅరాధిముచుచుండిరి. బుద్ధిబలముచేతను దేహబలముచేతను, ప్రవర్తనచేతను మిన్నయగు సుతులను అనుగ్రహింప దేవతలను ప్రార్థించుచుండిరి. జ్యేష్ఠ పుత్రుని వివాహామతరము ఆతని భార్యయే గృహాధికారమును స్వీకరించి సర్వకృత్యములను స్వీకరించుచుండిరి. సుతులు లేనపుడు పుత్రులను పెంచుకొనెడివారు. కాని ఈ పుత్రుడు పెద్దవాడయిన తరువాత కన్న తల్లితండ్రుల చిత్తవృత్తి ననుసరించుచు దత్తజనకుల దు:ఖమునకు హేతువగుంచుండును.

పుత్రికాజనన మంతగా హర్షింపబడుటలేదు. పుత్రిక దుహితృనామమున నొప్పుచుండెను. ఈ పదము దుహ్ = పాలు పితుకుట అనుధాతువునుండి కలిగినది. ఆకాలమున వివాహము కాని పెద్ద కుమార్తెలు పాలు తీయు కృత్యమునందు నియోగింపబడుచుండిరి. స్త్రీలకు తల్లిదండ్రుల ఆస్తిలో భాగమొందుచుండెను.ఈవిషయము సోదరులకు, సోదరభార్యలకు ఈర్ష్య గలిగించుచుండెను. తల్లిదండ్రులు పోవునపుడు సరియగు కట్టుబాటు లేకపోవుచుటచే నామె దుష్ప్రవర్తనకు లోనగుచుండెను.ఇది ఆకుతుంబమునకు కళంకము. అవివాహితయు, విభర్త్రకయు నగు స్త్రీ ఇట్టికష్టములు పుట్టుంటికి కలుగజేయుచుండుట తరుచు. పుత్రిక తనకన్నివిధముల బాసటయై యుండుటచేతను, తనగృహము వీడి అన్యగృహమునందుండబోవునని తల్లి యామె నెక్కువుగా ప్రేమించు చుండెను. కుమారుడు పెద్దవాడగుచున్నకొలది తండ్రిననుసరించుటచే తల్లికుమార్తెలకు యెక్కువ సంబంధముండెడిది.

ఆకాలమందు బాలికల విద్యవిషయమై శ్రద్ధ వహించుచుండెడివారు. విద్యాధికురాండ్రగు తపస్వినులు యజ్ఞములు చేయుచు వారు రచించ్హిన శ్లోకములచే దైవప్రార్థన చేయుచుండెడివారు. ఋగ్వేదమునందు విద్యాధికురాండ్రగు అనేకస్త్రీల ప్రస్తావన పేర్కొనిరి.ఘోషాదేవి ప్రసిద్ధికెక్కిన తపస్విని. అట్లే లోపాముద్ర, మమత, అపాల, సూర్య, ఇంద్రాణి, శచి, సర్పరాజ్ఞి, విశ్వవర, మున్నగువారు ప్రణుతికెక్కిరి. అందు విశ్వవర అగ్నిదేవుని శ్లోకరూపమున ఆరాధించుచుండెను. ఒక యజ్ఞమున ఆమె ఋత్విక్థ్సాన మలంకరించెను. ఈర్ష్యాలువులగు మతగురువులు ఈస్థానమునకు స్త్రీలనర్హమని తలంచి తరువాత శాసించిరి. అపాల ఇంద్రుని గూర్చి సోమయజ్ఞముచేసి తన తల్లిదండ్రుల కష్టమును తొలగించెను. ఇంతియు గాక స్త్రీలొక్కొక్కప్పుడు తమభర్తలననుగమించి యుద్ధములకెగుచుంటిరి. విశ్వశాలాదేవి యుద్ధమందు ఒక కాలు పోగొట్టుకొని యశ్వనీదేవతల ప్రసాదమున నాయాసచరణము కల్పించుకొనెను. ముద్గలఋషి భార్య ఇంద్రసేన తమగోవులనపహరించిన చోరులను వెంబడించునపుడు భర్త రథచోదకురాలై, భర్త అలసియున్నప్పుడు ధనుర్బాణములుగైకొని యుద్ధముచే దొంగలను బారద్రోలి గోవుల మరలించెను. విశ్వవర అగ్నిని ఆరాధించి గర్భాదాన వయోనిర్ణయము గావించెను. దీనినిబట్టి ఋగ్వేదకాలమున స్త్రీలు గృహ సాంఘిక వ్యాపారములయందు గౌరవోన్నత పదవులను లలంకరించెడివారని స్పష్టపడుచున్నది.పుత్రహీనయగు వితంతువు తన భర్త చరస్థిరాస్తులకు హక్కుదారురాలు. స్త్రీ పిత్రార్జితమును కొంతభాగము పొందుచుండెను. ఆమె అవివాహితగా నుండకుండనట్లు ఆమె తల్లిదండ్రులు సోదరులు ప్రయత్నము చేయుచుండినను వరించుట ఆమె హక్కూయియుండుటచే నామె కిష్టపడిన వరొడొకప్పుడు లభింపక యామె యవివివాహితయై యుండవలసి వచ్చుచుండెను. ఇట్టిచో నామెను భరించుబాధ్యతయే కాక యామె క్రమక్రమముగా దుష్ప్రవర్తనకు లోనయి కళంకముకూడ పుట్టింటికి గలిగించునని తల్లిదండ్రులు ఆతరువాతి కాలమున భర్తను వరించు నధికారమును ఆమెకు తీసివేసి యుండవచ్చును. ఇదియే బాల్య వివాహమునకు పునాది కావొచ్చును.ఋగ్వేదకాలమున సంపూర్ణ యౌవ్వొనవతి అయినతరువాతనే స్త్రీకి వివాహము జరుగుచుండెను. యౌవ్వొనము నిండినతరువాత సూర్యుడు /ని కూతురు సూర్యసోమునికిచ్చి వివాహమాడబడెను. ఘోషా వివాహమట్లె చేయబడెను. గర్భాదాన మహోత్సవము వివాహమయిన తరువాత నాల్గవరాత్రియే జరపబడుటచే రజస్వాలానంతరమే వివాహము జరుపుచుండిరని స్పష్టమగుచున్నది.

ఆకాలమున వివాహము నాల్గు విధములుగా నుండెను. స్త్రీ పురుషులకు పరస్పరము అంగీకారముండి వివాహము జరుపుట. బలవంతముగా నెత్తుకుపోయి వివాహమాడుట. ఇది రాక్షసము. విముదుడనువాడు పురుమిత్ర దుహితనిట్లు వివాహమాడెను. కుమార్తెను ఋషికిచ్చి వివాహముచేయుట. ఇది ఆర్షము. ఋగ్వేదకాలమున యౌవ్వొనవతియగు కన్య భర్తను వరించు అధికారము కలిగియుండెను. వధూవరులు సమాన గోత్రమువారు కాకూడదు. వివాహమంతయు నాల్గుదినములు వేదమంత్రములతో జేయుచుండెను. కంకన బంధన సమయమున వరుడు వధువుతో బలికిన మంత్రము లిచిట విడువదగినవి కావు. నాతో మద్గృహమునకు రాము. గృహాధికారము వహించుము. మొదట సోముడు నిన్ను జేపట్టెను. తరువాత గంధర్వుడును, పిదప నగ్నియు హ్జేపట్టిరి. మానవుడగు నేను నాల్గవవడను. బాలయమున కన్యల అభివృద్ధి సోమదేవున అనుగ్రహము కలుగునట్లు నమ్మకము. గంధర్వుడు సర్వాంగసౌష్ఠముకు కారకుడు. తేజోవంతుడగు అగ్ని దేవుడు కన్యల రజోదర్సమునకు కారకుడు. ఇట్టియువతి ఈమూడవస్థలు దాటిన తరువాత బురుషుని జేపట్టు నాచార ముండెను. వివాహమయిన ప్రథమ దినానంతరము రథారూఢురాలై వధూవరులు వారి గృహమునకు బోయి కన్యపుట్టినింటినుండి తెచ్చిన యగ్నిహోత్రమున ప్రధానహొమము చేసి మరల వివాహకర్మ నడపించుచుండిరి. తరువాత మూడుదినములు వరుడు బ్రహ్మ చర్యవ్రత మవలంబించి నాల్గవదినము శోషహోమము చేయుచుండెను. నాటిరాత్రి గర్భాదానమహోత్సవముతో వివాహకర్మ పూర్తియయ్యెను.

నాటికాలమున ఏకపత్నీత్వమే అధికారప్రచారములో నుండిన అనేకపత్నీత్వముకూడా నచ్చటనచ్చట జూపబడెను.పురుషులు యుద్ధములో దొరికిన కన్యలను స్వీకరించి తమ సౌఖ్యముకొరకు చూచినను గృహకలహము లెక్కువగుచుండెను. ఈ అనేకపత్నీత్వము దేవతలకుగొడా ననుసంధింపబడుచుండెను. అనేక భర్తృత్వ మాకాలమందు ఆర్యజాతులలో లేదు. కొన్ని అనాగరిక జాతులలో ఉన్నట్లు రూపించబడెను.దితికుమారులు దైత్యులు. వైనతేయ, కాద్రవేయ, ఆంజనేయ, జరత్కార, మున్నగు నామములు తల్లివలన గలుగుటబట్టి సరియగు జనకత్వము లేనట్లు కనిపించుచున్నది. కాని ఆర్యజాతులలో ఇట్టి ఆచారము ప్రబలియుండలేదు. ఋగ్వేదకాలమున వితంతు వివాహములేదని చెప్పవచ్చును.కాని వితంతువు తన భర్తృవంశము నిలుపుటకు భర్త కనిష్ఠసోదరనింట వసించి యతనివలన కుమారుని కను నాచారము ఉంది.కాని ఇట్టి వివాహము విద్యుక్తము కాదు. వితంతు వివాహమని వేరుగా నెచ్చటను చెప్పబడలేదు. వేనుడను రాజు బాల వితంతూద్వాహముల ప్రోత్సహించెను. కాని అవియు అగ్రవర్ణములందు జరుగలేదు.

స్త్రీలు తమ మానసమ్రక్షణయందు అతిజాగ్రత్తతోనుండెడివారు. యద్ధమందు గెలిచిన గెలిచిన స్త్రీలతో బురుషులు కాలయాపన చేయుచుండుటచే స్త్రీలలో దుష్ప్రవర్తన ప్రవేశమునకు సందు దొరుకుచుండెను. స్త్రీలు రజస్వలానతరముకూడ చాల కాలమువరకు అవివివాహితులై యుండుటయు స్వేచ్ఛాప్రభావము కలిగి యుండుటచేతను వివాహానంతరము పరపురుషుని సాంగత్యమునకు మూలమగుచుండెను. కాని ఆర్యులలో ఉత్తమవంశములందు ఉత్తమకన్యలు అనేకులుండిరి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఋగ్వేదం

మూలాలు

[మార్చు]

మూస:1931 Bharati Monthly magazine

బయటి లింకులు

[మార్చు]