కోరుకొండ సైనిక పాఠశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాఠశాల ప్రధాన ద్వారము

కోరుకొండ ప్యాలెస్ ను 1911 వ సంవత్సరంలో పూసపాటి చిట్టిబాబు విజయరామ గజపతిరాజు నిర్మించాడు. విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి కలిగింది. ఆ బాధ్యతను అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ పైన పెట్టాడు. అవిధంగా దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభమైనాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో సరైన ప్రాంగణం కొరకు అన్వేషణ మొదలైంది. విద్యాధికుడైన డా: పూసపాటి వెంకట గజపతిరాజుకి ఆ సంగతి తెలిసింది. విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో వున్న తమ కోరుకొండ ప్యాలెస్ ను పాఠశాల కొరకు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. 1961 సెప్టెంబరు 19 న ఆ అందమైన భవంతితో పాటు 206 ఎకరాల భూమిని కూడా దానంగా ఇచ్చేశాడు. 1961-62 వ సంవత్సరంలో ఆ పాఠశాల ప్రారంభమైంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక పాఠశాలల సొసైటి పర్వవేక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 సైనిక పాఠశాలలు వున్నాయి.

ప్రవేశ పద్ధతి[మార్చు]

ఇక్కడ చేరడానికి ప్రవేశ పరిక్షలో ఉత్తీర్ణ సాధించాలి. ఇక్కడ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు భోదిస్తారు. బాలురకు మాత్రమే ప్రవేశం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మూడో ఆదివారం 6, 9 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మన రాష్ట్రంలో అనంతపురం, ఏలురు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్, విజయనగరం కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు మూడు పేపర్లుంటాయి. గణిత పరీక్షకు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. భాషాసామర్ధ్య పరీక్షకు 100 మార్కులు 45 నిమిషాల్లో రాయాలి. అలాగే ఇంటలిజెంస్ పరీక్షలో మూడు విభాగాలకు 100 మార్కులుంటాయి. ఇవిగాక మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.

తొమ్మిదవ తరగతి పరీక్షకు నాలుగు పేపర్లు రాయాలి. గణితానికి 200 మార్కులు - 120 నిమిషాల వ్యవధి; సామాన్య జ్నానానికి 75 మార్కులు - 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. మౌఖిక పరీక్షకూడా నిర్వహిస్తారు.

ఆరవ తరగతి పరీక్షను ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చు. కానీ తొమ్మిదవ తరగతి పరీక్షలో ప్రశ్నాపత్రాలు ఇంగ్లీషులోనే వుంటాయి. సమాధానాలు ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చును.

ప్రముఖ పూర్వ విద్యార్థులు[మార్చు]

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  • రేపటి పౌరుల విద్యా వికాసం కోసం శ్రమిస్తున్న కోరుకొండ సైనిక పాఠశాల, అన్నపురెడ్డి రాజేశ్వరరావు, ఈనాడు ఆదివారం, 25 సెప్టెంబరు 1994.

బయటి లింకులు[మార్చు]