ఛతర్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
(ఛాతర్‌పూర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఛతర్‌పూర్ జిల్లా
छतरपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో ఛతర్‌పూర్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో ఛతర్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుSagar division
ముఖ్య పట్టణంChhatarpur
Government
 • లోకసభ నియోజకవర్గాలుKhajuraho
Area
 • మొత్తం8,687 km2 (3,354 sq mi)
Population
 (2011)
 • మొత్తం17,62,857
 • Density200/km2 (530/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.9%
 • లింగ నిష్పత్తి884
Websiteఅధికారిక జాలస్థలి
ఖజురహో వద్ద ఆలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఛాత్తర్‌పూర్ జిల్లా (హిందీ:छतरपुर जिला) ఒకటి. ఛాత్తర్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

ఛతర్‌పూర్ జిల్లా 24.06° & 25.20° ఉత్తర అక్ష్క్షాంశం 78.59° & 80.26° తూర్పు రేఖాంశంలో ఉంది.

సరిహద్దులు[మార్చు]

ఛతర్‌పూర్ జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో పన్నా జిల్లా, దక్షిణ సరిహద్దులో దమోహ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సాగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో తికమార్గ్ జిల్లా ఉన్నాయి. ఛతర్‌పూర్ జిల్లా సాగర్ డివిజన్‌లో భాగం.[1]

చరిత్ర[మార్చు]

భరత స్వాతంత్ర్యం ముందు ప్రస్తుత ఛతర్‌పూర్ జిల్లా ప్రాంతం బిజవార్, ఛాత్తర్‌పూర్, గౌరిహర్, అలిపురా, లుగాసి రాజాస్థానాలు ఉండేవి.వీటితో చర్కారి, పన్నా, అజైగర్ లలో అధిక భాగం ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజాస్థానాలు భారత ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత ఈ ప్రాంతం విద్యప్రదేశ్‌లో చేర్చబడింది. 1956 నవంబరు 1 న విద్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది. ఛతర్‌పూర్ సమీపంలో ఉన్న నౌగావ్ మధ్యప్రదేశ్ రాజధాని చేయబడింది. 6 మాసాల తరువాత భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని అయింది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఛత్తర్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,762,857,[3]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 271 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 230 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.54%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 884:1000 [3]
అక్షరాస్యత శాతం. 64.9%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాల ప్రకారం జనసంఖ్య 1,474,633. 1991 గణాంకాల ప్రకారం జనసంఖ్య 1,158,853. 2011-1991 మధ్య జనసంఖ్య అభివృద్ధి 27%. [1]

భాషలు[మార్చు]

బుండెలి (దేవనాగరి : बुन्देली or बुंदेली; Urdu: زبان بندیلی), పశ్చిమ హిందీ భాష. దీనిని హిందీ భాషతో చేర్చి ప్రజలలో వాడుకలో ఉంది. జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. 72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[6] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[7] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[6] అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగియా భాష 2,00,000 మంది భగియా, షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి లిపిని వాడుతున్నారు[8]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

జిల్లాలో ఖజూరహో శిల్పాలు ఉన్నాయి. చండేలా వంశరాజపుత్రులు ఈ ప్రముఖ ఆలయ నిర్మాణం చేసారని భావిస్తున్నారు. జఠాశంకర్, భీంకుండ్,,పన్నా నేషనల్ పార్క్, బాంబర్ బైని ఆలయం, లవ్‌కుష్‌నగర్, అర్జున్‌ కుండ్, నాగావ్‌ (నౌగొంగ్).

జిల్లా నుండి ప్రముఖమైన వ్యక్తులు[మార్చు]

  • ఖాజీ అబ్దుల్ మన్నన్ హష్మీ
  • సమీర్ ఖాన
  • ఆనంద్ విజయ్ శర్మ జీ (చుమున్ శర్మ
  • రఘ్వెందర్ సింగ్, సోనూ బిజవర్ మూట
  • శ్రీ సత్యవ్రత్ చతుర్వేది
  • అస్గరి బాయి - ధ్రుపద్ గాయకుడు, గ్రహీత పద్మ శ్రీ
  • బాబు గులబ్రై - హిందీ రచయిత
  • వీరేంద్ర కుమార్
  • జితేంద్రసింగ్ బుందెల
  • పవన్ రాజపుత్ర యు.ఆర్.ఎఫ్ తన్న్య్ రాజా
  • డాక్టర్ ఎల్ ఎల్ కొరి (ప్రిన్సిపాల్ మహారాజా కాలేజ్)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Chhatarpur". Chhatarpur district administration. Retrieved 2010-08-18.
  2. Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  6. 6.0 6.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  7. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు[మార్చు]