చలనం
స్వరూపం
(డోలాయమాన చలనం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చలనం లేదా కదలడం అనగా ఒక జీవులు లేదా వస్తువుల స్థానంలో మార్పుచెందడం అనగా స్థానభ్రంశం.
అతి చిన్న సూక్ష్మజీవుల నుండి ఖగోళంలోని అతి పెద్ద గ్రహాల వరకు అన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి.
రకాలు
[మార్చు]- సరళరేఖా చలనం
- సరళ హరాత్మక చలనం : ఒక వస్తువు స్థిర పథంలో ఉంటూ, దాని త్వరణం దాని స్థానబ్రంశానికి అనులోమానుపాతంలోను, విరామ స్థానం వైపుగాను ఉండేటట్లుగా, ముందుకి, వెనుకకి ఉంటే, ఆ వస్తువు "సరళ హరాత్మక చలనం" చేస్తున్నదని అంటాము.
- బ్రౌనియన్ చలనం
- వర్తులాకార చలనం
- ప్రకంపనం
- స్థానాంతర చలనం: ఒక వస్తువు నిర్థిష్ట కాలవ్యవథిలో ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చలనం చేయటాన్ని స్థానాంతర చలనం అంటారు.
- డోలాయమాన చలనం: ఒక వస్తువు ఒక స్థిర బిందువు నుండి ఇరువైపులా డోలనాలు చేసే చలనాన్ని డోలాయమాన చలనం అంటారు. దీనినే కంపన చలనం అని కూడా అంటారు.
చలనచిత్రాలు
[మార్చు]కదిలే చిత్రాలు లేదా చలనచిత్రాలు ఆధునిక కాలంలో సినిమా అంటున్నాము. ప్రాచీన కళల్వాలు పాఠ్యంలోని చిత్రపటాలు కదలకుండా స్థిరంగా ఉంటాయి. వానితో పోలిస్తే వీనిలో చలనం ఉంటుంది.
చలనాంగాలు
[మార్చు]చలనానికి ఉపయోగపడే అవయవాలు చలనాంగాలు.
- మానవులలో, ఇతర జంతువులలో కాళ్ళు చలనాంగాలు.
- అమీబా వంటి కొన్ని ఏకకణ జీవులలో మిధ్యాపాదాలు (Pseudopodia) చలనాంగాలు.
- బాక్టీరియా వంటి సుక్ష్మక్రిములలో కశాభాలు (Flagella) చలనాంగాలు.
- చేపలు మొదలైన జలచరాలలో తోక ముఖ్యమైన చలనాంగం. ఇవి ఈదుకొని ముందుకు కదులుతాయి.
- పక్షులు మొదలైన గాలిలో ఎగిరే జీవులకు రెక్కలు చలనాంగాలు. ఇవి భూమి మీదనుండి గాలిలోకి ఎగరడానికి, ఎగురుతుండగా వాటి దిశను మార్చుకోడానికి దిగడానికి కూడా ఉపయోగపడతాయి.