తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, అనేది జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానిస్తారు.[1]
2021 పురస్కారాలలో భాగంగా సెప్టెంబరు 4న రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల జాబితా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దేవసేన జారీచేసింది.[2][3] ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలకుగాను 48 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికచేశారు. హెచ్‌ఎం క్యాటగిరీలో 10 మంది, స్కూల్ అసిస్టెంట్ క్యాటగిరీలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ క్యాటగిరీలో 11 మంది, డైట్ లెక్చరర్ క్యాటగిరీలో ఒక్కరు, స్పెషల్ క్యాటగిరీలో ఆరుగురు ఎంపికయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల టీచర్లతోపాటు డైట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2021 సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించే గురుపూజోత్సవంలో అవార్డులు ప్రదానం చేశారు.[4]