తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2022
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2022 | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | విద్యారంగంలో కృషి | |
వ్యవస్థాపిత | 2014 | |
మొదటి బహూకరణ | 2014 | |
క్రితం బహూకరణ | 2021 | |
మొత్తం బహూకరణలు | 50 | |
బహూకరించేవారు | తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ | |
నగదు బహుమతి | ₹ 10,000 |
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, అనేది జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం.[1] రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానిస్తారు.[2]
2022 పురస్కారాలలో భాగంగా సెప్టెంబరు 1న రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల జాబితా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీచేసింది. మొత్తం 50 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రకటించగా, ఇందులో 10 మంది హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, 19 మంది ఎస్ఏ, పీఈటీలు, 10 మంది ఎస్జీటీ, టీజీటీలు, లెక్చరర్ల విభాగంలో ఒకరికి అవార్డులు రాగా, మరో పది మందికి ఫోర్ రన్నర్స్ ప్రత్యేక కేటగిరీలో అవార్డులను ప్రకటించారు.[3]
2022, సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలు కె. జనార్థన్ రెడ్డి, కె. రఘోత్తమరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వివిధ విశ్వవిద్యాయల ఉపకులపతులు, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింభాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ జలీల్, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు పాల్గొని ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.[4][5]
పురస్కార గ్రహీతలు
[మార్చు]2022 తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల జాబితా:[6][7]
ప్రధానోపాధ్యాయులు/గురుకులాల ప్రిన్సిపాల్స్
[మార్చు]క్రమసంఖ్య | పేరు | హోదా | పాఠశాల/కళాశాల | ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
1 | డాక్టర్ చకినాల శ్రీనివాస్ | జీహెచ్ఎం | జీహెచ్ఎస్ | సిరిసిల్ల, | రాజన్న సిరిసిల్ల |
2 | బూస జమునా దేవి | జీహెచ్ఎం | జడ్పీహెచ్ఎస్ | తిర్మలాపురం, గొల్లపల్లి మండలం | జగిత్యాల |
3 | ఓ. చంద్ర శేఖర్ | జీహెచ్ఎం | జడ్పీహెచ్ఎస్ | జూకల్ | జయశంకర్ భూపాలపల్లి. |
4 | గోపాల్ సింగ్ తిలావత్ | జీహెచ్ఎం | జడ్పీఎస్ఎస్ | ఇంద్రవల్లి | ఆదిలాబాద్ |
5 | టి. మురళీ కృష్ణమూర్తి | జీహెచ్ఎం | జడ్పీహెచ్ఎస్ | కౌకూరు | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
6 | ఎస్. సురేశ్ | జీహెచ్ఎం | జీడ్పీహెచ్ఎస్ | పాచాల నడ్కుడ | నిజామాబాద్ |
7 | వి. రాజేందర్ | జీహెచ్ఎం | జీడ్పీఎస్ఎస్ | గనుగుపహాడ్ | జనగామ |
8 | బి. చలపతిరావు | జీహెచ్ఎం | జడ్పీహెచ్ఎస్ | ముష్టికుంట్ల | ఖమ్మం |
9 | వనుపలి నిరంజన్ | జీహెచ్ఎం | జడ్పీహెచ్ఎస్ | మణికొండ | రంగారెడ్డి |
10 | సూర సతీశ్ కుమార్ | ప్రిన్సిపల్ | టీఎస్ఆర్ఎస్ జేసీ | సర్వేల్ | యాదాద్రి భువనగిరి |
ఎస్ఏ, పీజీటీలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | హోదా | పాఠశాల/కళాశాల | ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
1 | డి. సత్య ప్రకాశ్ | ఎస్ఏ ఫిజిక్స్ | జడ్పీహెచ్ఎస్ | స్టేషన్ ఘన్‌పూర్ | జనగామ |
2 | జె. శ్రీనివాస్ | ఎస్ఏ మ్యాథ్స్ | జీడ్పీహెచ్ఎస్ | మస్కాపూర్ | నిర్మల్ |
3 | పి. ప్రవీణ్ కుమార్ | ఎస్ఏ ఫిజిక్స్ | జడ్పీహెచ్ఎస్ | చిన్న మల్లారెడ్డి | కామారెడ్డి |
4 | తేజావత్ మోహన్ బాబు | ఎస్ఏ సోషల్ | జడ్పీఎస్ఎస్ | మొర్రంపల్లి బంజార్ | భద్రాద్రి కొత్తగూడెం |
5 | ఏ. వెంకన్న | ఎస్ఏ ఫిజిక్స్ | గవర్నమెంట్ హైస్కూల్ నంబర్-2 | సూర్యాపేట | సూర్యాపేట |
6 | కన్నం అరుణ | ఎస్ఏ బయోసైన్స్ | జడ్పీహెచ్ఎస్ | నగునూరు | కరీంనగర్ |
7 | సయీద్ షఫీ | ఎస్ఏ తెలుగు | జీహెచ్ఎస్ | రికాబ్ బజార్ | ఖమ్మం |
8 | డాక్టర్ హజారే శ్రీనివాస్ | ఎస్ఏ హిందీ | జడ్పీహెచ్ఎస్ | జక్రాన్‌పల్లి | నిజామాబాద్ |
9 | కె. రామారావు | ఎస్ఏ ఫిజిక్స్ | జడ్పీహెచ్ఎస్ | చిల్కూరు | సూర్యాపేట |
10 | సీహెచ్ కృష్ణ | ఎస్ఏ బయోసైన్స్ | జడ్పీహెచ్ఎస్ | బొల్లికుంట | వరంగల్ |
11 | కె. మధుకర్ | ఎస్ఏ ఫిజిక్స్ | జడ్పీహెచ్ఎస్ | వేంపల్లి | కుమ్రంభీం ఆసిఫాబాద్ |
12 | ఎ. రాజశేఖర శర్మ | ఎస్ఏ తెలుగు | జడ్పీహెచ్ఎస్ | వర్గల్ | సిద్దిపేట |
13 | గొల్ల వెంకటేశ్ | ఎస్ఏ మ్యాథ్స్ | జడ్పీహెచ్ఎస్ | పాల్వాయి | జోగులాంబ గద్వాల |
14 | కె. ధనలక్ష్మీ | ఎస్ఏ బయోసైన్స్ | జడ్పీహెచ్ఎస్ | మోందారి | వరంగల్ |
15 | కంచర్ల రాజవర్ధన్ రెడ్డి | ఎస్ఏ మ్యాథ్స్ | జడ్పీహెచ్ఎస్ | బ్రహ్మణవెల్లెంల | నల్లగొండ |
16 | జి. గిరిజమ్మ | ఎస్ఏ ఇంగ్లీష్ | జీజీహెచ్ఎస్ | నారాయణపేట్ | నారాయణపేట |
17 | జె. ఎల్లస్వామి | ఎస్ఏ బయోసైన్స్ | జడ్పీహెచ్ఎస్ | అనంతపూర్ | జోగులాంబ గద్వాల |
18 | సీహెచ్ భరణికుమార్ | ఎస్ఏ ఫిజిక్స్ | జడ్పీహెచ్ఎస్ | అడ్డగూడూరు | యాదాద్రి భువనగిరి |
19 | అంబటి శంకర్ | ఎస్ఏ మ్యాథ్స్ | జడ్పీహెచ్ఎస్ | రుద్రాంగి | రాజన్న సిరిసిల్ల |
ఎస్జీటీ, టీజీటీలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | హోదా | పాఠశాల/కళాశాల | ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
1 | జి. చంద్రశేఖర్ | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | దిల్వార్‌పూర్ | నిర్మల్ |
2 | ఎం. వెంకట్ రెడ్డి | ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం | జీపీఎస్ | కలడేరా, సైదాబాద్-1 | హైదరాబాద్ |
3 | పసుల ప్రతాప్ | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | గిమ్మ | ఆదిలాబాద్ |
4 | ఉడావత్ లచ్చిరామ్ | ఎస్జీటీ | ఎంపీయూపీఎస్ | తీరత్‌పల్లి | నల్లగొండ |
5 | కె. ప్రవీణ్ | ఎస్జీటీ | ఎంపీయూపీఎస్ | చందపల్లి | పెద్దపల్లి |
6 | అచ్చ సుదర్శనం | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | చర్లపల్లి | హన్మకొండ |
7 | టీ ఓంకార్ రాధాకృష్ణ | ఎస్జీటీ | ఎంపీయూపీఎస్ | అంగడికిష్టాపూర్ | సిద్దిపేట |
8 | కదరి అనిత | ఎస్జీటీ | ఎంపీపీఎస్ (జీ) | చందుపట్ల | నల్లగొండ |
9 | బి. నర్సయ్య | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | బస్సాపూర్ | నిజామాబాద్ |
10 | సీహెచ్ రాజిరెడ్డి | ఎల్ఎఫ్ఎం హెచ్ఎం | ఎంపీపీఎస్ | గుల్లకోట | జగిత్యాల |
లెక్చరర్లు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | హోదా | పాఠశాల/కళాశాల | ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
1 | డాక్టర్ ఎం రమాదేవి | ప్రొఫెసర్ | గవర్నమెంట్ ఐఏఎస్ఈ | మాసబ్‌ట్యాంక్ | హైదరాబాద్ |
ఫోర్ రన్నర్స్
[మార్చు]క్రమసంఖ్య | పేరు | హోదా | పాఠశాల/కళాశాల | ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
1 | బి. శంకర్ బాబు | ఎస్ఏ మ్యాథ్స్ | జడ్పీహెచ్ఎస్ | బిహెచ్ఈఎల్ | సంగారెడ్డి |
2 | జె. శ్రీనివాస్ రెడ్డి | ఎస్ఏ ఇంగ్లీష్ | జడ్పీహెచ్ఎస్ | క్షీరసాగర్ | సిద్దిపేట |
3 | ఎం. రామ్‌ప్రసాద్ | ఎస్ఏ మ్యాథ్స్ | జడ్పీహెచ్ఎస్ | రంగదాంపల్లి | సిద్దిపేట |
4 | టి. మధుసూదన్ రావు | ఎస్జీటీ | శాంతినికేతన్ యూపీఎస్ స్కూల్ (ఎయిడెడ్) | హైదరాబాద్ | హైదరాబాద్ |
5 | వరకాల పరమేశ్వర్ | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | ఆదిభట్ల | రంగారెడ్డి |
6 | వై. లిల్లిమేరి | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | తిమ్మంపేట్ | జనగామ |
7 | టి. సత్యనారాయణరెడ్డి | ఎస్జీటీ | ఎంపీపీఎస్ | నర్సింహపురం | సూర్యాపేట |
8 | ఎం వెంకటయ్య | ఎస్జీటీ | ఎంపీయూపీఎస్ | పొట్లపహాడ్ | సూర్యాపేట |
9 | సత్తులాల్ | జీపీఎస్ | భటన్ననగర్ | భద్రాద్రి కొత్తగూడెం | |
10 | సముద్రాల శ్రీదేవి | స్కూల్ అసిస్టెంట్ తెలుగు | జడ్పీహెచ్ఎస్ బాయ్స్ | పటాన్ చెరు | సంగారెడ్డి |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "రాష్ట్రంలో 40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు". ETV Bharat News. 2022-09-02. Archived from the original on 2022-09-02. Retrieved 2022-09-02.
- ↑ Telugu, TV9 (2020-09-05). "రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక". TV9 Telugu. Archived from the original on 2022-03-06. Retrieved 2022-09-01.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-09-01). "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం". Namasthe Telangana. Archived from the original on 2022-09-01. Retrieved 2022-09-01.
- ↑ telugu, NT News (2022-09-05). "విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణవైపు చూస్తున్నది: మంత్రి సబిత". Namasthe Telangana. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.
- ↑ Velugu, V6 (2022-09-05). "విద్యాశాఖ నిధులు కూడా కేంద్రం విడుదల చేయడం లేదు". V6 Velugu. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల". Sakshi. 2022-09-02. Archived from the original on 2022-09-02. Retrieved 2022-09-02.
- ↑ Velugu, V6 (2022-09-02). "40 మందికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులు". V6 Velugu. Archived from the original on 2022-09-02. Retrieved 2022-09-02.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)