దామోదర రాజనర్సింహ
దామోదర రాజనర్సింహ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 07 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | తమిళిసై సౌందరరాజన్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 | |||
ముందు | చంటి క్రాంతి కిరణ్ | ||
నియోజకవర్గం | ఆందోల్ | ||
పదవీ కాలం 10 జూన్ 2011[1] – 21 ఫిబ్రవరి 2014[2] | |||
ముందు | కోనేరు రంగారావు | ||
తరువాత | కార్యాలయం రద్దు చేయబడింది (నిమ్మకాయల చినరాజప్ప & కేఈ కృష్ణమూర్తి - ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులుగా) (మహమూద్ అలీ & టి.రాజయ్య - తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా) | ||
నియోజకవర్గం | ఆందోల్ | ||
ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | బాబు మోహన్ | ||
తరువాత | బాబు మోహన్ | ||
నియోజకవర్గం | ఆందోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మెదక్ జిల్లా , తెలంగాణ | 1958 డిసెంబరు 5||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | సిలారపు రాజనర్సింహ | ||
జీవిత భాగస్వామి | పద్మిని రెడ్డి | ||
సంతానం | త్రిష |
దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[3] ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]దామోదర రాజనర్సింహ 1958 డిసెంబరు 5న సిలారపు రాజనర్సింహ, జానాబాయి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్దమయ్యాడు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]దామోదర రాజనర్సింహ 1989లో తన తండ్రి మాజీ మంత్రి సిలారపు రాజనర్సింహ అకాల మరణం చెందడంతో రాజకీయాల్లోకి వచ్చి 1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1994, 1999 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెంది 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. దామోదర రాజనర్సింహ 2009లో మూడవసారి ఆందోల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో, 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు.[6] ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.[7][8][9]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయి, 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు.[10] తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[11]
ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[12], 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13][14]
దామోదర రాజనర్సింహకు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబరు 18న మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా[15], డిసెంబరు 24న మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు.[16] 2024లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనను మార్చి 31న జహీరాబాద్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[17]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1989లో అందోలు ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1991లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
- 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రి
- 2009లో వైఎస్సార్ రెండో మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రి
- 2009లో కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో ఉన్నత విద్య శాఖ మంత్రి
- 2010లో ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్య శాఖ మంత్రి
- 2023లో రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి[18][19]
కుటుంబం
[మార్చు]దామోదర రాజనర్సింహ తండ్రి సి.రాజనర్సింహ ఆందోల్ నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు.
మూలాలు
[మార్చు]- ↑ "Raja Narasimha is deputy CM". The Times of India (in ఇంగ్లీష్). 11 June 2011. Retrieved 2 February 2022.
- ↑ Reddy, B. Muralidhar; Joshua, Anita (28 February 2014). "Andhra Pradesh to be under President's Rule". The Hindu (in Indian English). Retrieved 2 February 2022.
- ↑ Eenadu (14 November 2023). "అత్యధికులు పట్టభద్రులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "ఇద్దరు కేబినెట్‌లోకి." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Traceall (2023). "Andole assembly election results in Andhra Pradesh". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 02-12-2010
- ↑ Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Sakshi (26 May 2014). "'అందోల్'లో దామోదర్ దే రికార్డు". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Eenadu (26 October 2023). "విపక్షమైనా వారే స్వపక్షమైనా వారే". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్ పైలట్, శశిథరూర్, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ The Economic Times (9 September 2023). "Congress sets up several poll committees for assembly elections in Telangana". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "మంత్రిగా ప్రమాణం చేసిన దామోదర రాజనర్సింహ.. ఆయన పూర్తి రాజకీయ చరిత్ర ఇదే!". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్ క్యాబినెట్". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
- CS1 Indian English-language sources (en-in)
- 1958 జననాలు
- సంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2023)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)