Jump to content

అవటు గ్రంధి

వికీపీడియా నుండి
(ధైరాయిడ్ నుండి దారిమార్పు చెందింది)
అవటు గ్రంధి
Endocrine system
Thyroid and parathyroid.
లాటిన్ glandula thyroidea
గ్రే'స్ subject #272 1269
అంగ వ్యవస్థ endocinal jubachina system
ధమని superior thyroid artery, inferior thyroid artery,
సిర superior thyroid vein, middle thyroid vein, inferior thyroid vein, thyreoidea ima
నాడి middle cervical ganglion, inferior cervical ganglion
Precursor 4th Branchial pouch
MeSH Thyroid+Gland
Dorlands/Elsevier g_06/12392768

అవటు గ్రంధి లేదా థైరాయిడ్ గ్రంధి (Thyroid gland) మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాళ గ్రంధులన్నింటిలో పెద్దది. ఇది రెండు తమ్మెలు కలిగి మధ్య ఇస్తమస్ అను భాగంతో కలిపి ఉంటుంది.శరీరంలోని ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో పాటు ఆర్థరైటిస్ సమస్యలు వచ్చిపడతాయి

అవటు గ్రంధి అయోడిన్ కలిగిన ధైరాక్సిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది సాధారణ జీవక్రియా వేగాన్ని నియంత్రిస్తుంది.

పియూష గ్రంధి స్రవించే 'అవటుగ్రంధి ఉద్దీపన హార్మోన్' ధైరాక్సిన్ స్రావాన్ని క్రమపరుస్తుంది.

వ్యాధులు

[మార్చు]
థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ప్రతికణం పైనా ప్రభావం చూపిస్తాయి. ఎముకలకు అవసరమయ్యే కాల్షియం సమతుల్యతను కాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే టి3, టి4, కాల్సిటోనిన్ హార్మోన్ల అసమతుల్యతకు కారణాలు శారీరక, మానసికమే కాకుండా జన్యుపరంగా గుర్తించాల్సిన అవసరం సంపూర్ణ ఆరోగ్యం వైపు తొలి మెట్టుగా చె ప్పుకోవచ్చు. అయితే శరీర అవసరాల నిమిత్తం రక్తంలో హార్మోన్ల శాతం తగ్గడం లేదా పెరగడం చాలా సాధారణం. మారిన హార్మోన్ల నిల్వల వల్ల కలిగే అనారోగ్య లక్షణాలకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల పైపర్, హైపో థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ అసమతుల్యత వల్ల కీళ్లలో వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. అంటే కీలు లోపల అంతా వాచిపోయి, కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. వ్యాధికి సరియైన కారణం తెలుసుకోకుండానే చికిత్స అందించడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.
  • హైపో థైరాయిడిజం (Hypothyroidism): థైరాక్సిన్ హార్మోన్ స్రావం తక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
    • క్రెటినిజం (Cretinism): తల్లికి హైపో థైరాయిడిజమ్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలలో వచ్చే మరుగుజ్జు అవలక్షణం. వీరిలో పెరుగుదల తక్కువయి, బుద్ధి మాంద్యం, వంధ్యత్వం ఏర్పడుతుంది. చర్మం మందమై ఎండినట్లు కనిపిస్తుంది. ఎత్తైన పొట్ట, లావైన పెదాలు, పెద్దదైన నాలుక ఈ వ్యాధి లక్షణాలు.
    • మిక్సెడిమ (Myxoedema): ఇది పెద్దవారిలో వచ్చే వ్యాధి. చర్మంలో శ్లేష్మం ఎక్కువై ఉబ్బినట్లు కనిపిస్తుంది.
  • హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism): థైరాక్సిన్ హార్మోన్ స్రావం ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
  • గాయిటర్ (Goitre): థైరాయిడ్ గ్రంధి పరిమాణంలో పెరిగి బయటకు కనిపిస్తున్న వాపు.
  • థైరాయిడ్ కాన్సర్ :

ముఖ్య కారణాలు

[మార్చు]

జన్యువు లోపాలు లేదా పనితీరును మార్చే ప్రేరేపకాలకు మానసిక, శారీరక కారణాలు తోడవటం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా హార్మోన్లు, ప్రొటీన్లు అసమతుల్యతకు గురై ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఆటోఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, అంకిలాజింగ్ స్పాండిలైటిస్ వంటివి ప్రభావితమవుతాయి.

ముఖ్య లక్షణాలు

[మార్చు]

థైరాయిడ్ అసమతుల్యత వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, కళ్ల కింద నల్లని చారలు, గొంతు పైన వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు అతి ముఖ్యమైనవి కీళ్ల నొప్పులు. ఆర్థరైటిస్ వల్ల కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేవగానే కీళ్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరకప్రాయమవుతుంది. థైరాయిడ్ అసమతుల్యతతో ఏర్పడే ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలపై ప్రభావం పడి పరిస్థితి మరింత విషమిస్తుంది. అంతేకాకుండా, థైరాయిడ్ అసమతుల్యతతో కలిగే ఆర్థరైటిస్‌లో కండరాలు పట్టేయడం, నడుంనొప్పి, నరాలు లాగడం, స్థూలకాయం, డయాబెటిస్, స్పాండిలైటిస్ వంటి లక్షణాలకు దారితీయవచ్చు. స్త్రీలలో పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, నెలసరి సమస్యలు తద్వారా సంతానలేమికి కారణంగా మారవచ్చు.

సరైన నిర్ధారణ

[మార్చు]

టి3, టి4, టిఎస్‌హెచ్, కాల్సిటోనిన్ హార్మోన్ల పరీక్షలు ప్రాథమికంగా అవసరం. అలాగే బోన్ డెన్సిటీ పరీక్ష, కాల్షియం పరీక్షలు చేయించడం ద్వారా తీవ్రతను అంచనా వేయవచ్చు. రోగ లక్షణాలను బట్టి అవసరమైన హార్మోనల్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ, ఎమ్ఆర్ఐ, సీబీపీ, ఈఎస్ఆర్, హిమోగ్లోబిన్ శాతం, ఆర్ఏ, థైరాయిడ్ యాంటీ బాడీస్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

తగిన జాగ్రత్తలు

[మార్చు]

సొంత వైద్యాలు, అపోహలు పక్కనపెట్టి సరియైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. తాత్కాలిక ఉపశమనం కోసం మందులు వాడటం, ఒక్కో లక్షణానికి ఒక్కో చికిత్స తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కృత్రిమ సుఖాలకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉదయం వేళ కొంత సమయం సూర్యరశ్మిలో గడపటం, మానసిక, శారీరక ఒత్తిడులను తగ్గించుకోవడం, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు తీసుకోవడం చేయాలి. మద్యం, స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సమయానుసారం భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం తప్పనిసరి.