పద్మాసనము
(పద్మాసనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
పద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.
పద్ధతి[మార్చు]
- మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
- తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
- రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
- ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
- ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.