బి.రమణ (గాయని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.రమణ సినిమా నేపథ్య గాయని. ఈమె యుగళగీతాలు, బృందగీతాలలో ఎక్కువగా పాడినా సోలో పాటలు చాలా తక్కువగా పాడింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ భాషలలో సుమారు వెయ్యి పాటలు పాడింది.

విశేషాలు[మార్చు]

బి.రమణ

ఈమె స్వస్థలం విజయవాడ. బత్తుల రాములు, నారాయణమ్మ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి ఈమెకు సినిమా పాటలంటే అభిమానం. ఈమె రాజాగారి రత్నారావు వద్ద సంగీతం నేర్చుకుంది.పిమ్మట మద్రాసులో కోకా సత్యవతి వద్ద శాస్త్రీయ సంగీతం రెండేళ్లు అభ్యాసం చేసింది.[1] ఈమె విజయవాడ రేడియో స్టేషన్‌లో పిల్లల కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడేది. బాల్యంలో ఈమె పలు పాటల పోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకుంది. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే లలిత గీతాల కచేరీలు ఇవ్వసాగింది. రసన సమాఖ్య, అరుణోదయ నాటక మండలి వారి నాటకాలలో పాటలు పాడేది. 1963లో సంజీవని రహస్యం అనే డబ్బింగ్ సినిమాలో పాడటానికి ఈమెకు తొలి అవకాశం లభించింది. ఈమె ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులతో కలిసి కొన్ని వేల కచేరీలు చేసింది. ఇంకా ఈమె భక్తి గీతాలు, లలితా సహస్రనామాలు, క్రిస్టియన్ గీతాలు కేసెట్లలో పాడింది. ఈమెకు ఒక కూతురు. ఆమె పేరు కుసుమ. కుసుమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలో పనిచేస్తున్నది.[2]

కొన్ని సినిమాలు[మార్చు]

ఈమె పాటలు పాడిన తెలుగు సినిమాలలో కొన్ని:

మూలాలు[మార్చు]

  1. "స్వరధుని రమణ". విజయచిత్ర. 5 (8): 51. 1 February 1971.
  2. కంపల్లె, రవిచంద్రన్ (2013). "పాడినపాటలు తక్కువ గానీ...". జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 184–187.