అక్షాంశ రేఖాంశాలు: 28°11′N 76°37′E / 28.18°N 76.62°E / 28.18; 76.62

రేవారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేవారీ
పట్టణం
రేవారీ టౌన్ హాల్
రేవారీ టౌన్ హాల్
రేవారీ is located in Haryana
రేవారీ
రేవారీ
హర్యానా పటటంలో రేవారీ స్థానం
Coordinates: 28°11′N 76°37′E / 28.18°N 76.62°E / 28.18; 76.62
దేసం India
రాష్ట్రంహర్యాణా
జిల్లారేవారీ
విస్తీర్ణం
 • Total24.93 కి.మీ2 (9.63 చ. మై)
Elevation
245 మీ (804 అ.)
జనాభా
 (2011)[2]
 • Total1,43,021[1]
 • జనసాంద్రత5,740/కి.మీ2 (14,900/చ. మై.)
భాషలు[3][4]
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
123401
టెలిఫోన్ కోడ్01274

రేవారీ హర్యానా రాష్ట్రం లోని పట్టణం, రేవారీ జిల్లా ముఖ్యపట్టణం. ఇది నైరుతి హర్యానాలో ఉంది. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

శబ్దవ్యుత్పత్తి

[మార్చు]

ప్రాచీన భారతదేశంలో మహాభారత కాలంలో, రేవత్ అనే రాజుకు రేవతి అనే కుమార్తె ఉంది. తండ్రి ఆమెను రేవా అని పిలిచేవాడు. ఆమె పేరు మీద "రేవా వాడి" అనే నగరాన్ని స్థాపించాడు. వాడి / వాడా అంటే హిందీలో నివాస ప్రదేశం అని అర్థం. రేవాను బలరాముడికిచ్చి పెళ్ళి చేసాడు. పెళ్ళిలో కట్నంగా "రేవా-వాడి" నగరాన్ని ఇచ్చాడు. కాలక్రమంలో రేవా-వాడి అనే పేరు రేవారీగా మారింది. [5] 

చరిత్ర

[మార్చు]

మధ్యయుగం

[మార్చు]
సి. 1910 లలో హేమచంద్ర విక్రమాదిత్య

హేమ చంద్ర విక్రమాదిత్య (హేమూ) రేవారీ లోనే పెరిగాడు. ఇక్కడే విద్యాభ్యాసం చేసాడు. రేవారీలో ఫిరంగి కర్మాగారాన్ని నెలకొల్పాడు. ఇత్తడి, రాగి పలకల పరిశ్రమకు పునాది వేశాడు. అతను 1535 నుండి షేర్ షా సూరికి ఫిరంగులు, గన్‌పౌడర్‌ను సరఫరా చేశాడు. 1553 వరకు సుర్ రాజవంశపు చివరి పాలకుడు ఆదిల్ షా సూరికి సలహాదారుగా ఉన్నాడు. అతను ప్రధానమంత్రి, సేనాధిపతి అయ్యాక, 1553–56 మధ్య పంజాబ్ నుండి ఢిల్లీ వరకు జరిగిన 22 యుద్ధాలలో గెలిచాడు. మొఘల్ రాజు అక్బర్ దళాలను ఆగ్రా, ఢిల్లీల వద్ద ఓడించాడు. . హేమ చంద్ర 1556 అక్టోబరు 7 న ఢిల్లీలోని పురానా కిలాలో విక్రమాదిత్య రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒక నెల పాటు ఢిల్లీ రాజుగా పరిపాలించాడు. 1556 నవంబరు 5 న రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయాడు. [6] అతని హవేలీ (ఇల్లు) ఇప్పటికీ నగరంలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఉంది. [7] అతని రెండంతస్థుల హవేలీ, చెక్కిన ఇసుకరాతి తలుపులతో, ఆరావళి శ్రేణి నుండి తెచ్చిన రాతితో, ఇటుకలు, సున్నంతో కట్టారు. గోడలు సున్నంతో ప్లాస్టర్ చేసారు. సున్నంతో వెల్లవేసారు. పైకప్పుగా కలప దూలాలపై లఖౌరి ఇటుకలు, రాతి పలకలు పెట్టారు. తలుపులు, గూళ్లు రాతి లింటెల్స్ లేదా ఇటుక తోరణాలు ఉంటాయి. [8] అక్బర్ రేవారీని ఢిల్లీ సుబా కింద సర్కారుగా చేశాడు. 17 వ శతాబ్దంలో బోల్ని గ్రామానికి చెందిన అహిర్ నాయకుడు నంద్ రామ్‌కు మొఘలులు స్థానిక పాలనను అప్పగించారు. ఇది 19 వ శతాబ్దం వరకు కొనసాగింది. [9] ఒక చిన్న అహిర్ రాజ్యం అక్కడ శతాబ్దం ప్రారంభంలో స్థాపించబడింది. ఇది చుట్టుపక్కల ఉన్న అహిర్వాల్ ప్రాంతాన్ని పాలించింది. [10] [11] [12] [13]

ఆధునిక యుగం

[మార్చు]
ఢిల్లీ గేట్ - రేవారీలోని నాలుగు చారిత్రాత్మక బ్రిటిష్ కాలపు ద్వారాలలో ఒకటి

19 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి, తరువాత బ్రిటిష్ రాజ్యానికీ వశమయ్యే ముందు రేవారీ మరాఠా సామ్రాజ్యం నియంత్రణలోకి వచ్చింది. [8] రేవారీ పాలకుడు రావు తులా రామ్ 1857 లో భారతదేశ మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతని ఎస్టేట్ను బ్రిటిష్ రాజ్ జప్తు చేసి పంజాబ్ ప్రావిన్స్ లోని గుర్గావ్ జిల్లాలో భాగంగా చేసారు.

1972 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో మహేంద్రగఢ్ జిల్లాకు బదిలీ అయ్యే వరకు రేవారీ పట్టణం, గుర్గావ్ జిల్లాలో భాగంగా ఉంది. 1989 లో చేసిన మరిన్ని మార్పుల్లో రేవారీ జిల్లా ఏర్పడింది. [14]

1962 నాటి రెజాంగ్ లా యుద్ధం

[మార్చు]

రేవారీ, భారత సైన్యానికీ, ఇతర సాయుధ దళాలకూ అనేకమంది సైనికులను, అధికారులనూ అందించింది. 1962 నవంబరు 18 న జరిగిన భారత చైనా యుద్ధంలో, 13 కుమావున్ బెటాలియన్‌కు చెందిన సి కంపెనీ చివరి పోరాటం జరిగినది లడఖ్ లోని చుషుల్ సమీపంలో ఉన్న రెజాంగ్ లా వద్ద. [15] సి కంపెనీలోని సైనికులు దాదాపు అందరూ అహిర్‌లే. దీనికి మేజర్ షైతాన్ సింగ్ నేతృత్వం వహించాడు. అతను శౌర్యానికి గాను మరణానంతరం పరమ వీర చక్ర పొందాడు.

ఈ చర్యలో సి కంపెనీకి చెందిన 120 మంది సైనికులలో 114 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు మాత్రమే సజీవంగా ఉన్నారు. వీరిలో ఐదుగురు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఒక్కరు మాత్రమే ఇతరులకు తెలియజేయడానికి వచ్చారు. [16] వారి కోసం రేవారీ నగరంలో ఒక స్మారక చిహ్నం నిర్మించారు.

రెజాంగ్ లా యుద్ధంలో మరణించిన వీర అహిర్ సైనికుల జ్ఞాపకార్థం భారత సైన్యం లడఖ్ ‌లోని చుషుల్ వద్ద స్మారక స్థూపాన్ని నిర్మించింది. దానిపై ఉన్న వాక్యాలివి:

ఏది గొప్ప మరణం..
పితరుల చితాభస్మం కోసం
దేవుడి ఆలయం కోసం
భయంకరమైన కష్టాలను ఎదిరించి మరీ
పొందే మరణానికి మించిన 
గొప్ప మరణం ఏముంది 

భౌగోళికం

[మార్చు]

రేవారీ, రాజస్థాన్ ప్రక్కనే ఉంది, అందువల్ల వేసవిలో దుమ్ము తుఫానులు ఉంటాయి. ఆరావళి శ్రేణుల కఠినమైన కొండ ప్రాంతం. జిల్లాలోని ఇసుక దిబ్బలూ నగరపు శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి. [17] రేవారీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. [18]

రేవారీ 28°11′N 76°37′E / 28.18°N 76.62°E / 28.18; 76.62 వద్ద [19] సముద్ర మట్టానికి 245 మీటర్ల ఎత్తున ఉంది. ఢిల్లీ నుండి 82 కి.మీ., గుర్‌గావ్ నుండి 51 కి.మీ. దూరంలో ఉంది [20]

వాతావరణం

[మార్చు]

జనాభా

[మార్చు]

2011 నాటికి [21] రేవారీ నగర జనాభా 1,43,021 (2001 లో 100,946, 1991 లో 75,342 ) 2001–11 దశాబ్దంలో జనాభాలో 42% వృద్ధి కనబరచింది. 1991-2001 దశాబ్దంలో వృద్ధి 34% ఉంది. పురుషులు 75,764 (జనాభాలో 53%), ఆడవారు 67,257 (47%). జాతీయ సగటు 940 తో పోలిస్తే ఇక్కడి లింగ నిష్పత్తి 886. ఆరేళ్ళ లోపు పిల్లల్లో లింగనిష్పత్తి జాతీయ సగటు 918 తో పోలిస్తే నగరంలో 785 మాత్రమే ఉంది. రేవారీ అక్షరాస్యత 78%. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ..[22] పురుషుల అక్షరాస్యత 83%, స్త్రీల అక్షరాస్యత 73%. రేవారీ జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 11.3%.[23]

రవాణా

[మార్చు]

సమీప విమానాశ్రయం న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.

రైల్వే

[మార్చు]
రేవారీ రైల్వే స్టేషను

1873 లో భారతదేశంలో మొదటి మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ వేసినపుడే రేవారీకి రైలు మార్గం ఏర్పడింది. ఢిల్లీ, అజ్మీర్‌ల మధ్య ఈ మార్గం వేసారు [24] 1995లో ఈ మార్గంలో ఒక ట్రాకును బ్రాడ్ గేజిగా మార్చారు. [25] రెండవ ట్రాకును 2007 లో మార్చారు [26] [27] దీంతో ఢిల్లీ అహ్మదాబాద్ వంటి గేజి-మారే స్టేషన్లలో రైళ్ళు మారాల్సిన అవసరం తొలగిపోయింది. [28]

రోడ్డు మార్గాలు

[మార్చు]

రేవారీ గుండా జాతీయ రహదారి 11 (ఢిల్లీ-నార్నౌల్ - ఝుంఝును - బికనీర్ - జైసల్మేర్), జాతీయ రహదారి 48 (ఢిల్లీ-జైపూర్- బొంబాయి - పూనే - బెంగుళూర్), జాతీయ రహదారి 352 (నర్వానా - జింద్ - రోహ్తక్ - ఝజ్జర్ -రేవారీ), జాతీయ రహదారి 919 (రేవారీ- ధరుహెర - సోహనా - పల్వల్) అనే నాలుగు జాతీయ రహదారులు వెళ్తాయి. జాతీయ రహదారి 48 ఐదు దశాబ్దాలుగా ఉనికిలో ఉండగా, జాతీయ రహదారి 919 ఒక దశాబ్దం క్రితం జాతీయ రహదారిగా ప్రకటించబడిన రాష్ట్ర రహదారి. జాతీయ రహదారి 352 ను 2011–13లో కొత్తగా నిర్మించారు. జాతీయ రహదారి 11 ను మూడేళ్ల క్రితం రేవారీ నుండి ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఇవి కాక, రాష్ట్ర రహదారుల ద్వారా రేవారీని హర్యానాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, రాజస్థాన్ లోని జిల్లాలకు కలుపుతున్నాయి.

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Municipal Council Rewari". Archived from the original on 2020-01-31. Retrieved 2020-11-19.
  2. District Census Handbook 2011 (Part B) (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 85–86. Archived from the original (PDF) on 15 November 2016. Retrieved 24 March 2019.
  4. IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 24 March 2019.
  5. "Location Of Rewari". Archived from the original on 15 సెప్టెంబరు 2015. Retrieved 9 January 2020.
  6. Marshman, John Clark. "The History of India from the Earliest Period to the Present Time", London (1873)
  7. "Rewari district official website". Archived from the original on 2008-12-27. Retrieved 2020-11-19.
  8. 8.0 8.1 "INTACH Haryana newsletter", INTACH,
  9. Phadke, H. A. (1990). Haryana: Ancient and Medieval. Harman Publishing House. p. 173. ISBN 9788185151342.
  10. Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India. C. Hurst & Co. p. 189. ISBN 9781850653981.
  11. Haynes, Edward S. (1978). "Imperial Impact on Rajputana: The Case of Alwar, 1775-1850". Modern Asian Studies. 12 (3). Cambridge University Press: 423–424. doi:10.1017/s0026749x00006223. JSTOR 312228.
  12. Shail Mayaram (2006). Against History, Against State. Permanent Black. pp. 49–. ISBN 978-81-7824-152-4.
  13. http://www.epw.in/system/files/pdf/1964_16/35/caste_and_the_indian_army.pdf
  14. District History Archived 13 అక్టోబరు 2007 at the Wayback Machine
  15. Guruswamy, Mohan (20 November 2012). "Don't forget the heroes of Rezang La". The Hindu. Retrieved 9 January 2020 – via www.thehindu.com.
  16. Shekhar Gupta (30 Oct 2012). "'Nobody believed we had killed so many Chinese at Rezang La. Our commander called me crazy and warned that I could be court-martialed". Indian Express Archive. Retrieved 9 January 2020.
  17. http://cgwb.gov.in/District_Profile/Haryana/Rewari.pdf
  18. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-03-21. Retrieved 2020-11-19.
  19. "Maps, Weather, and Airports for Rewari, India". www.fallingrain.com. Retrieved 9 January 2020.
  20. Rewari.nic.in Archived 21 జూలై 2011 at the Wayback Machine
  21. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  22. "Census of India : Provisional Population Totals : India :Census 2011". censusindia.gov.in. Retrieved 9 January 2020.
  23. View Population
  24. http://www.irfca.org/faq/faq-history2.html%7C[permanent dead link] World's first commercial MG service runs from Delhi to Rewari
  25. "[IRFCA] Indian Railways FAQ: IR History: Part 5". www.irfca.org. Retrieved 9 January 2020.
  26. "Press Information Bureau". pib.gov.in. Retrieved 9 January 2020.
  27. "Delhi-Haryana rail link gets better". The Hindu. Chennai, India. 8 October 2007. Archived from the original on 13 అక్టోబరు 2007. Retrieved 19 నవంబరు 2020.
  28. "World's oldest commercial meter gauge is history". The Times of India. Archived from the original on 2013-11-15. Retrieved 2020-11-19.
"https://te.wikipedia.org/w/index.php?title=రేవారీ&oldid=4318813" నుండి వెలికితీశారు