వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్/పాత చర్చ ౧

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

100 మార్పుల స్థాయి

మీరు ఫిభ్రవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:52, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:09, 18 ఆగష్టు 2012 (UTC)

రాగాలు

సంగీత రాగాలు గురించిన వ్యాసాల్ని తయారుచేస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:22, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ-పుస్తకం

మంచి విషయం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. అది తొలగింపునకు గురి అయ్యే సందర్భం వచ్చినందున దానిని విస్తరింప దలచితిని. కె.వి.రమణ- చర్చ 01:47, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర విఙాన సర్వస్వము

ఆంధ్ర విఙాన సర్వస్వము నుండి వికీసోర్సులో ప్రూఫ్ రీడింగ్ చేసి వాటికి సంబంధించిన రెండు చిన్న వ్యాసాల్ని తెవికీలో చేర్చాను. అవి అనుసాల్వుడు మరియు అనూపగడము. ఇలాంటి పేజీలకు ఒక మూస చేర్చి ఫ్రీ లైసెన్స్ కలిగిన దానినుండి చేర్చినట్లుగా వ్రాయండి. వ్యాసం విస్తరించిన తర్వాత ఆ మూసను తొలగించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 13:59, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస తయారుచేసినందుకు ధన్యవాదాలు. ఈ మూస వలన ఒక ప్రత్యేకమైన వర్గములో ఈ వ్యాసాలు చేరుతున్నాయి. అదే కాకుండా వ్యాసం క్రింద భాగంలో ఒక సూచన మాదిరిగా "ఇవి వికీసోర్సులోని ఆంధ్ర విజ్నాన సర్వస్వము (1934) నుండి తీసుకోబడినది. సభ్యులు వ్యాసాన్ని వికీకరించి విస్తరించవలసినదిగా కోరుతున్నాము" అనేది వస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:55, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాని పేజీ తరలింపు పై అభ్యంతరం

రహ్మానుద్దీన్ గారూ, నాని వ్యాసాన్ని ఎటువంటి చర్చ లేకుండానే నానీ (నటుడు) కు తరలించారు. కనీసం విలీన ప్రతిపాదన చేసిఉంటే బాగుండేది. ఆ వ్యాసాన్ని విస్తరించాలనుకునే సమయానికి అందులోని సమాచారమంతా మాయమైంది. ఎటువంటి చర్చ లేకుండానే మీలాంటి అనుభవగ్నులు ఇలా చేయడం బాధాకరం. కనీసం అందులోని సమాచారాన్ని నానీ (నటుడు) లో విలీనం చేసి ఉన్నా బాగుండేది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:28, 6 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏదయినా వ్యాసాన్ని సృష్టించే ముందు, ఏదో ఒక రూపంలో వేరే పేరుతోనో మనం రాయాలనుకునే వ్యాసం ఉందా లేదా అన్నది సరి చూసుకుని ఒకవేళ ఉంటే ఆ ఉన్న వ్యాసాన్ని రాయాలే తప్ప. కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. ఉన్న వ్యాసాలనన్నిటినీ ముందు విస్తరించి, ఆ పైన కొత్త వాటిని సృష్టించండి. కనీసం ఒక 5 kb సమాచారం చేర్చగలను అనుకున్నపుడే కొత్త వ్యాసానికి పూనుకోండి. రహ్మానుద్దీన్ (చర్చ) 08:38, 6 మార్చి 2013 (UTC)
మీతో ఏకీభవిస్తున్నాను. కానీ సభ్యులు తెలియక కొత్త వ్యాసాన్ని సృష్టించినపుడు , అదే పేరుతో వేరే వ్యాసం ఉంటే ఎటువంటి చర్చా లేదా విలీన ప్రతిపాదన లేకుండా దారి మళ్ళించడం సబబు కాదేమో? ఒక వేళ అలా చేసినా, పాత వ్యాసంలోని సమాచారాన్ని కొత్త వ్యాసంలో విలీనం చేస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు. సభ్యుడు తాను చేర్చదదిచిన సమాచారాన్ని కొత్త వ్యాసంలో చేర్చవచ్చు. నాని వ్యాసాన్ని విస్తరించడానికి అవసరమైన సమాచార సేకరణ జరిపే లోపే దారిమళ్ళింపు జరిగి పోయింది.5Kb సమాచారంతోనే వ్యాసాన్ని ప్రారంభించాలనుకుంటే అన్నివేళలా సాధ్యం కాదు. ఉన్న సమాచారంతో మొదట వ్యాసాన్ని సృష్టిస్తే , విస్తరింరుకొంటూ పోవచ్చు. ఉదాహరణకు కొత్త సినిమా వ్యాసాలు. మొదట ప్రారంభిస్తే , చిత్ర విడుదల తర్వాత కథ మరియు ఇతర వివరాలు చేర్చవచ్చు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:04, 6 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

username change

వాడుకరి పేరును మార్చుకోడానికి వీలవుతుందా?

హైదరాబాదులో తెవికీ సమావేశం

రహ్మానుద్దీన్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.------t.sujatha (చర్చ) 05:15, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు హోదా

నమస్కారం రహ్మానుద్దీన్ గారూ. మీకు RahmanuddinBot గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 05:12, 24 మార్చి 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

మీ బాటు ప్రతిపాదన గురించి స్పందన వైజాసత్య (చర్చ) 05:12, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ బాటుకు బాటు హోదా కల్పించాను. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 05:08, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రహ్మానుద్దీన్ (చర్చ) 06:24, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరదోషాలు

మీ బాటుకు ఈ జాబితా బాగా ఉపయోగపడవచ్చు వికీపీడియా:భాషాదోషాల పట్టిక. ఇందులో అన్నీ బాటుతో చేయించే వీలుపడకపోవచ్చు. ఆచితూచి ఎంచుకోండి --వైజాసత్య (చర్చ) 06:03, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:23, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ నడుపుతున్నందులకు ధన్యవాదాలు

మీరు చొరవ తీసుకొని బాట్ నడుపుతున్నందులకు ధన్యవాదాలు. తెవికీ కి సాంకేతిక నిపుణుల కొరత కొంత వరకు తగ్గించగలుగుతారు. అన్నట్లు మహోత్సవంలో సభ్యులకు బాట్ పై ఒక ప్రదర్శన ఇస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 23:18, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పక ప్రయత్నిస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 12:16, 29 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
బాటును విజయవంతంగా నడుపుతున్నందుకు నా ధన్యవాదాలు. ఇదొక వ్యాసం వికీలో ఉన్నది. సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక మీకు ఉపయోగ పడుతుంది.Rajasekhar1961 (చర్చ) 08:50, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం రహ్మానుద్దీన్ గారూ. మీకు Kvr.lohith గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

విన్నపము

రహ్మానుద్దీన్ గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:52, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, ఈ విషయమై నేనేం సహాయం చేయగలనో తెలిపితే, తప్పక చేస్తాను. సమిష్టిగా చేయవలసినవి విక్షనరీ లో చాలానే కలవు. మహోత్సవం వలన సాధ్యమయినంత ఎక్కువ వాడుకరులను విక్షనరీ వైపుకు మరల్చాలి. అలానే ఇంతకు మునుపు ఒకసారి ఆంధ్రభారతి వారి సంప్రదింపులలో వారి పనిని విక్షనరీకి అనుసంధానం చేయాలనే ప్రతిపాదన వచ్చినా, అది ముందుకు సాగలేదు, ఇంకా ఈ మధ్య వచ్చిన డిక్షనరీలను విక్షనరీలో జత చేసేలా ప్రతిపాదించి, ఆ నిర్వహణను మీరు నెరవేర్చగలరు. ప్రతీ పదానికి ఆడియో ఇంకా బొమ్మ జతచేయవచ్చు(వనరులు కామన్స్ నుండీ తీసుకోవచ్చు.). రహ్మానుద్దీన్ (చర్చ) 06:45, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ, తప్పకుండా మీరు సూచించినవి చేయాలనే ఉంది. చేస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:27, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K వారి ధన్యవాదాలు

రహ్మానుద్దీన్ గారు 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు.--విష్ణు (చర్చ)18:48, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వంటల వ్యాసాల గురించి

నమస్కారం రహ్మానుద్దీన్ గారూ. మీకు Kvr.lohith గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
వంటల వ్యాసాల గూర్చి తెవికీ శైలి నాకు తెలియదు. నేను ఆ వ్యాసాల జోలికి పోను.-- కె.వెంకటరమణ చర్చ 07:27, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాగార్జున గారి వీడియా సందేహాలు

చర్చాపేజీలోస్పందించండి.--అర్జున (చర్చ) 05:11, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సైట్ నోటీసు

తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు గురించి వికీపీడియా సభ్యుల మరియు అంతర్జాల సౌకర్యం కలిగిన అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ మొదటి పేజీలో సైట్ నోటీసు ఉంచగలరని కోరుతున్నాను. మన వికీ మహోత్సవానికి మంచి దీని వలన మంచి గుర్తింపు వచ్చింది.Rajasekhar1961 (చర్చ)

గ్రామాల గణాంకాలు

రహ్మానుద్దీన్ గారూ, మీరు గ్రామాల గణాంకాలు చేర్చుతున్నట్టూ చూశాను. మీకు 2011 జనగణన వివరాలు ఎక్కడ లభించాయి? --వైజాసత్య (చర్చ) 08:07, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx వద్ద మనకు గణాంకాలు లభిస్తున్నాయి. నేరుగా గ్రామం పేరు ద్వారా వెతకవచ్చు లేదా రాష్ట్రం->జిల్లా->మండలం, ఈ విధంగా మనకు కావాల్సిన మండలంలోని గ్రామాల గణాంకాలు తెలుసుకోవచ్చు. మొదట వాడుకరి:Rajasekhar1961 గారు ఇంకా ఇతరులు సమీకరించిన గణాంకాలు అందిస్తామని చెప్పారు, వారు ఆ గణాంకాలు తెచ్చే లోపు ఇలా కృష్ణా జిల్లాలోని మండలాలతో మొదలుపెట్టాను. ప్రస్తుతం ప్రత్యేక గ్రామంలోని స్త్రీ-పురుష జనాభాతో పాటుగా గడపల సంఖ్య మనకు తెలుస్తోంది. అదే రాజశేఖర్ గారి జాబితా వస్తే, అక్షరాస్యత, సాగుకి సంబంధించిన అంశాలు కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం నేను మండల స్థాయిలో జాబితాలు చేర్చుతున్నాను, ఆపై గ్రామాల స్థాయికి వెళదామని నా ఆలోచన, కానీ మధ్యమధ్యలో యాదృచ్ఛిక పేజీల ద్వారా దయినా గ్రామం కనిపిస్తే అందులో జనాభా లెక్కలు చేరవేస్తున్నాను. నా బద్దకం వలన వనయోరులు రాయటం వదిలివేస్తున్నాను. క్షమించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 08:47, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాధ్యతల వినియోగం పత్రం

రహ్మానుద్దీన్ గారూ, మీరు తెవికీ మహోత్సవం, హైదరాబాదు 10, 11.4.2013 జరిగిన రోజులలో అనేక ధన వస్తు రూపములలో కొన్ని, నాకుగా నేను బాధ్యత తీసుకున్న వాటి అన్నింటికీ కలిపి బాధ్యతల వినియోగం పత్రం ఒకటి సమర్పించ వలసి ఉన్నదేమో మరి నాకు తెలియదు. నా బాధ్యతలను ఎటువంటి దుర్వినియోగము నాకు తెలిసి కానీ తెలియక కానీ చేయలేదని, ఏ విధమయినటువంటి స్వార్థము చూపించలేదని, తెలిసిన, తెలియక పోయినా ఎటువంటి వారిమీద ప్రత్యేక శ్రద్ధతో అధికార దుర్వినియోగము చేయలేదని, మీరు నాకు అప్పచెప్పిన బాధ్యతలలో ఎటువంటి అవకతవకల పాల్పడలేదని, అందరి లాగానే నేను కూడా ఒకడినేనని, ఈ తెవికీ మహోత్సవం, హైదరాబాదు కోసం ముందుగా చర్చలకు వచ్చినా, కార్యక్రమాల తదుపరి కూడా ధన,వస్తు,తదితర ఎటువంటి సదుపాయ, సౌకర్యములు పొందలేదని, అందరిలో (స్థానిక ప్రజలు, సభ్యులు) ఒకడినని, మీకు అన్ని ధన రూపేణ సంబంధించిన వస్తువులను అన్నీ మీకు భద్రంగా అందించానని, నేను అధికారులు, నిర్వాహకులు, సభ్యులు, ఇతరులకు తెలియజెప్ప వలసినది ఉందని అనుకుంటున్నాను. ఇటువంటి పత్రాన్ని ఎవరికి పంప మంటే వారికి పంపుతాను. దయచేసి తెలియజేయగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:46, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో మనం చేసే పనులన్నీ కొంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యంతో కూడుకుని ఉంటాయి. అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా పని చేసుకుంటూ వెళతారు. ఎవరూ ఇక్కడ ధనం/ప్రజలలో పేరు/గౌరవం/ఇతర స్వలాభాల కోసం పని చేయటం లేదు. కానీ బయట సమాజం అలా లేదు. అన్నిటిలోనూ ఒక స్వార్ధపు వర్ణాన్ని ఊహించి, ప్రతీదీ దుర్వినియోగం అవుతుందని నమ్మడం సర్వ సాధారణం. ఈ పత్రాలూ అవీ వారిని సంతృప్తి పరచటం కోసమే. కానీ అవి ఉన్నా, ఇంకా ఎక్కువగా అనుమానం చూపే వ్యక్తులు ఉన్నారు. అందుకోసమని కనీసం రాబోయే వారికి ఒక నిర్డేశంలా ఉండటం కోసమని ఇలాంటి పత్రాలు రూపొందించాలి-వారు అనుకోని పరిణామాల్లోకి వెళ్ళిపోకుండా. మీ సలహా చాలా బాగుంది. తదుపరి నెలవారీ సమావేశ గోష్టికి మీరు వస్తే, అక్కడ ఇవి చర్చించి, అందరం కొన్ని పత్రాలు(పేపర్ వాడుక లేకుండా యాంత్రికంగా) బట్వాడా చేసుకోవాలి. అందులో ముఖ్యంగా కార్యక్రమానికి సంబంధించిన సూచనలూ, సలహాలూ, బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎదుర్కొన్న సమస్యలు, మిగులు ఖర్చులు, వగైరా సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కార్యవర్గంలో లేని వారు కార్యవర్గంలో ఉన్న ఎవరో ఒకరికి. కార్యవర్గంలో ఉన్నవారు, అధ్యక్షుడినయిన నాకు అందించవచ్చు. అలానే ఈ నెల సమావేశానికి తేదీ ఇంకా సమయం సూచించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:14, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హోదాకు మద్దతుకు కృతజ్ఞతలు

రహ్మానుద్దీన్ గారూ, వైజాసత్యగారు నాకు అధికారిహోదాకై ప్రతిపాదించిన ఓటింగులో నాకు మద్దతు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. కాని నాకు ఈ హోదా స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:23, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికార హోదాకు మద్దతు

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:54, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం

నమస్కారం రహ్మానుద్దీన్ గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 09:29, 14 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

బాట్ ద్వారా చేయదగినవి - సమాధానం వైజాసత్య (చర్చ) 09:29, 14 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ మహోత్సవం చర్చలు

రచ్చబండలో తెలుగు వికీమహోత్సవ చర్చలు చేర్చినందులకు ధన్యవాదాలు. విషయాలను పేర్కొన్న వరుస ప్రకారం కాకుండా దగ్గర సంబంధమైన విషయాలను ఒక విభాగంలో చేర్చితే చర్చలు చక్కగా చేయటానికి వీలుంటుంది. ఉదాహరణకు. వికీవ్యాసాల నాణ్యత పెంచడం, వికీ ప్రచారం. వికీప్రాజెక్టులు, సంస్థలతో ఒప్పందాలు లాంటివి. పరిశీలించండి--అర్జున (చర్చ) 04:37, 20 మే 2013 (UTC) ..--అర్జున (చర్చ) 04:38, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, కొన్ని కలిపి చర్చించవలసినవి ఉన్నవి. కొన్ని చిన్న సమాధానం ఇవ్వటం కంటే ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేనివి ఉన్నవి --వైజాసత్య (చర్చ) 05:03, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా వరకూ చర్చలకు ముగింపు ఇచ్చి ఉన్నాను. కొన్ని self explanatory వి వదిలివేసాను. రహ్మానుద్దీన్ (చర్చ)

నిర్వాహకత్వ ప్రతిపాదన

మిమ్ములను నిర్వాహకత్వానికి అభ్యర్థిగా ప్రతిపాదించాను. వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/రహ్మానుద్దీన్ దగ్గర స్పందించండి--అర్జున (చర్చ) 16:45, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్, మీకు నిర్వాహక హోదా ఇవ్వబడినది. అభినందనలు.Rajasekhar1961 (చర్చ) 09:09, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదాకు మద్దతు

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:45, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా మహోత్సవం చర్చల కు సరియైన ముగింపు

వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా) లో మీ వ్యాఖ్య చూశాను. సమీక్షని బట్టి ఒక్కొక్క చర్చకు పర్యవసానం ఏమిటనే వివరాలు తెలిపితే, అవి అర్థవంతంగా ముగించినట్లు వుంటుంది. --అర్జున (చర్చ) 13:21, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

తెలుగు మెడల్

వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:53, 16 ఆగష్టు 2013 (UTC)

లోగో మార్పు

రచ్చబండ చర్చలో ఏకాభిప్రాయం కుదిరిన కొత్త లోగో అమర్చటానికి సహాయం చేయండి. --అర్జున (చర్చ) 03:56, 17 ఆగష్టు 2013 (UTC)

స్కేల వ్యాసం గురించి అభినందనలు

స్కేల పై వ్యాసం సృష్తించినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారం చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 15:43, 3 అక్టోబర్ 2013 (UTC)

సందేశమునకు ధన్యవాదములు. స్కేల గురించి నాకు అంత ఎక్కువ అవగాహన లేకపోవడం వలన ఎక్కువ సమాచారం చేర్చలేకపోతున్నానని చెప్పుటకు చింతిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:39, 7 అక్టోబర్ 2013 (UTC)

{{subst:idw|1=మన పాత్రికేయ వెలుగులు.pdf}}

ఎకో అనువాదం మెడల్

చురుకైన అనువాదకులు
రహ్మానుద్దీన్ మీరు ఎకో వ్యవస్థను తెలుగు వికీపీడియాలోకి తేవడానికి సిస్టం మెసేజులను చాలా చురుకుగా అనువాదం చేసినందులకు, మీ కృషిని గుర్తిస్తూ ఈ చురుకైన అనువాదకుల మెడల్ అందుకోండి. మీ విష్ణు (చర్చ) 13:12, 21 అక్టోబర్ 2013 (UTC)

ధన్యవాదాలు విష్ణు గారు! రహ్మానుద్దీన్ (చర్చ) 05:05, 22 అక్టోబర్ 2013 (UTC)

మీ బొమ్మలు

విశ్వనాథ సత్యనారాయణ పేజీలో కామన్స్ లో అనుమానాస్పదమైన లైసెన్స్ గా గుర్తించాను. ఒకటి నివేదించాను. మీరే వాటిని సరిదిద్ది అవసరమైతే ఒక్కొక్క వికీప్రాజెక్టులో విడిగా సరియైన లైసెన్స్ చేర్చితే మంచిది. --అర్జున (చర్చ) 04:00, 25 అక్టోబర్ 2013 (UTC)

పబ్లిక్ డొమెయిన్ లైసెన్స్ కు మార్చాను. మీరు డిలీషన్ ఫ్లాగ్ తీసివేయవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:02, 25 అక్టోబర్ 2013 (UTC)
కామన్స్ లో చర్చలో పేర్కొనండి. ఆ సన్నివేశ ఫోటోకి తగిన సంవత్సరం పేర్కొంటే మరీమంచిది. --అర్జున (చర్చ) 06:37, 25 అక్టోబర్ 2013 (UTC)
దస్త్రం:Gurram_Jashua.jpg ని కూడా పరిశీలించండి. --అర్జున (చర్చ) 08
07, 25 అక్టోబర్ 2013 (UTC)
  • ఇది ఫుటో కాదు, పెయింటింగ్ కు తీసిన ఫుటో, మీరు కామన్స్ నియమాలను సరిగ్గా పరికించినట్టు లేరు. ఏదయినా మరొకసారి చూసి ఆ పైన నిర్ధారించుకోండి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 26 అక్టోబర్ 2013 (UTC)

శీర్షిక మార్పు

"సుశ్రుతుడు" సరైన పదమే కదా! సరైన ఆధారాలతోనే వ్రాసాను. వ్యాస శీర్షికను ఎందుకు మార్చారు? --కె.వెంకటరమణ (చర్చ) 05:09, 26 నవంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర2013

రహ్మానుద్దీన్ గారు,

పురష్కారానికి మీ పేరు ప్రతిపాదించడమైనది,మీ ఆంగీకారాన్ని దయచేసి తెలపండిPalagiri (చర్చ) 10:09, 2 డిసెంబర్ 2013 (UTC)

నా పేరును ప్రతిపాదించినందుకు పాలగిరి గారికి ధన్యవాదాలు. నేను దశాబ్ది ఉత్సవాల కార్యవర్గంలో సభ్యుణ్ణి కనుక, ఈ పురస్కారానికి అనర్హుడ్ని. గమనించగలరు. దశాబ్దీ ఉత్సవాల కార్యవర్గ సభ్యుడు, రహ్మానుద్దీన్ (చర్చ) 10:15, 2 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన పై సంతకం

మీరు చావాకిరణ్ ను పురస్కారం కొరకు చేసిన ప్రతిపాదనపై సంతకం చేయండి--కె.వెంకటరమణ (చర్చ)

కె.వెంకటరమణ అలానే! చేసాను. రహ్మానుద్దీన్ (చర్చ) 16:46, 4 డిసెంబర్ 2013 (UTC)


ధన్యవాదములు

మీ సహాయం --PRADEEP DEEKONDA (చర్చ) 10:46, 5 డిసెంబర్ 2013 (UTC)

గంటిజోగి సోమయాజి

గంటి జోగి సోమయాజి పేరుతో ఇదివరకే ఒక వ్యాసం ఉన్నది. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:39, 12 డిసెంబర్ 2013 (UTC)

  • ఆ మధ్యలో న్న స్పేస్ ను గమనించలేదు, ముందు వెతికి ధృవీకరించాకనే మొదలుపెట్టాను. ఇప్పుడు విలీనం కై ప్రతిపాదన ఉంచాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:50, 12 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:44, 14 డిసెంబర్ 2013 (UTC))

ధన్యవాదాలు

రహ్మానుద్దీన్ ధన్యవాదాలు--Ajayram1509 (చర్చ) 07:34, 16 డిసెంబర్ 2013 (UTC)

గుంబద్

రహ్మానుద్దీన్ గారూ, గుంబద్ వ్యాసాన్ని, గుమ్మటం వ్యాసంలో విలీనం చేసాను. గమనించి తెలిపినందుకు ధన్యవాదాలు. అలాగే, గుంబద్ వ్యాసంలోని "చరిత్రను చూడండి" లోని విషయాన్ని, గుమ్మటం వ్యాసం చర్చాపేజీలో కాని, చరిత్రను చూడండి లో గాని తరలించాలంటే ఏమి చేయాలి. తెలుపగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 08:36, 28 డిసెంబర్ 2013 (UTC)

మీరు చేసిన మార్పులు https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D&action=history వద్ద చూడవచ్చు. గుమ్మటం చర్చా పేజీలో ఇక్కడిచ్చిన లింకు రాసి మీరుదారి మార్పు చేసినట్టు తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:58, 28 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు

మీ అభినందనలకు ధన్యవాదాలు. తెవేకీ ప్రస్థాన వేగాన్ని అందరమూ కలసి పెంచుదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 21:17, 28 డిసెంబర్ 2013 (UTC)

పుస్తకం సమాచార పెట్టెలో చేర్పుల కోసం

పుస్తకం సమాచార పెట్టే నాకెంతో ఉపయోగపడుతోంది. ఐతే అందులో కొన్ని చేర్పులు కావాలి నాకు.

'
కృతికర్త:
ముద్రణల సంఖ్య: 2
అంకితం: Pavan santhosh.s
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

ఇందులో అంకితం అన్నది కావాలి. ముఖ్యంగా ఏభై ఏళ్లనాటి గ్రంథాలు దాదాపు అన్నీ మనుషులకో, దేవీదేవతా మూర్తులకో ఇచ్చినవే. ఆ వివరాలు చేర్చాలంటే ఇబ్బందిగా ఉంది. కనుక కొంత శ్రమ తీసుకుని ఈ పని చేసిపెట్టండి. ఎన్ని ముద్రణలు పొందిందో కూడా ఓ ఆప్షన్ ఉంటే వీలున్నవాటికి చేర్చుకుంటాను. --Pavan santhosh.s (చర్చ) 13:41, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా సిస్టం లో సాంకేతిక సమస్య... పరిష్కారానికి మార్గం చూపగలరా???

(ఈ విషయం రచ్చ బండలో కూడ వ్రాశాను.... మీరు ఈ విషయంలో మంచి సలహా ఇవ్వగలరని మనవి) 2/1/2014 సాయంకాలము కొన్ని పుస్తకాల అట్టమీది బొమ్మలను ఫోటో తీసి కామన్స్ లో ఎక్కిస్తున్నాను. ఆయా పుస్తకాల వివరాలు తెవికిలో వ్రాయుచున్నాను. అలా ఎక్కించిన పోటోలు కొన్ని నేను తీసిన అడ్డంగా తీసిన కొన్ని ఆలాగే ఎక్కించేశాను. ఆ పుస్తకాల వివరాలు రాయడానికి ప్రయత్నించగా ఆ పుస్తకానికి సంబందించిన (తెవికిలోని కుడివైపు) బాక్సులో ఫోటొ కూడ అడ్డంగా పడింది. పొరబాటున నేను తీసిన బొమ్మను ఏడిట్ చేయకుండా అనగా దానిని నిలువుగా మార్చకుండా ఎక్కించాను. తిరిగి దానిని సరి చేద్దామని కామన్సు లో ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఏఏ బటన్లను నొక్కానో నాకు గుర్తు లేదు. దాని పర్యవ సానంగా..... నా సిష్టం లో బొమ్మలన్నీ మాయమై పోయినవి. ఇదివరకు కామన్స్ లో ఎక్కించిన బొమ్మలను చూసి మనకు కావలసిన బొమ్మలను తీసి తెవికీలో కావలసిన చోట పెట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఆ బొమ్మల స్థానంలో కేవలం ఖాళీ బాక్సు మాత్రమే కనబడుతున్నది. (ఇది గ్యాలరీ గురించి) uploads క్లిక్ చేస్తే అన్ని బొమ్మలు వారుసగా పేర్లతో సహా కనబడేవి. ఇప్పుడు కేవలము వాటి పేర్లు మాత్రమే కనబడు తున్నవి. కామన్సు లో picture of the day / media of the day మొదలగు బొమ్మలు కూడా కనబడడం లేదు.

అన్ని వికీ ప్రాజెక్ట్లల మొదటి పేజీలలోని వాటి లోగోలు కూడ మాయమైనవి. వికీపీడియా, విక్షనరి, వికీ సోర్సు మొదలగు వాటికున్న లోగోలు కూడ మాయమైనవి. వికి పీడియాలో ఈ వారం బొమ్మ కూడ రావడం లోదు. వాడుకరి పుటలోని ఎవరి బొమ్మలు కూడా రావడంలేదు. ప్రతి పుటలో ఈ మద్యన పెడుతున్న పురస్కార గ్రహీతలకు అభినందనలు. దానిలో కూడ అందరి బొమ్మలు రావడంలేదు. పరిశీలనగా వికీ సోర్సును కూడ చూచాను. (అవి కూడ పోటోలే కదా యని అవి కనిపిస్తున్నాయో లేదో నని పరిశీలన కొరకు చూసాను) లోని అన్ని పుస్థకాల పుటలు కూడా కనబడలేదు. తెలుగీకరించిన భాగాలు కనబడుతున్నాయి కాని వ్రాయ వలసిన భాగాలు కనబడడము లేదు. అన్ని ప్రాజెక్టులలో నా వాడుకరి పేజీలను నామార్పులు, బొమ్మలు పరిశీలించండి. అవి మీకు కబడతాయి. మరి నాకెందుకు కనబడలేదు?

ఇంత వివరంగా ఎందుకు వ్రాస్తున్నానంటే సాంకేతిక నిపుణులైన వికీపీడియన్లు జరిగిన తప్పిదాన్ని గ్రహించి తగు సూచనలు చేయగలరేమోనని. సత్వర పరిష్కారం తెలుప గలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 08:06, 3 జనవరి 2014 (UTC) వాడుకరి ఎల్లంకి భాస్కరనాయుడు. నా పోన్. నెం. 9493565833[ప్రత్యుత్తరం]

  • బొమ్మలు వెబ్ పేజెస్ లో కనపడకపోవడానికి పలు సమస్యలు కారణమవచ్చు. ఒకటి- ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉండటం, రెండు - ఏదయినా స్క్రిప్టు విహారిణి (బ్రౌజర్) లో బొమ్మల లోడింగును నిరోధించడం. మొదలగునవి. ఇక కామన్స్ లో అస్తవ్యస్తంగా అప్లోడ్ అయిన బొమ్మలను రోటేట్ రిక్వెస్ట్ పెట్టి తిప్పేలా అహ్యర్థన చేయవచ్చును! --రహ్మానుద్దీన్ (చర్చ) 08:31, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ క్రోం లో బాగానె వున్నది. ప్రస్తుతానికి అందులోనే పని చేస్తాను.... ఆ తర్వాత ఫైర్ పాక్స్ గురించి ఆలోచిద్దాం. మీ సలహాకు నెనరులు. Bhaskaranaidu (చర్చ) 08:53, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశంసలు

తెవికీలో అత్యంత చురుకుగా పనిచేస్తున్నారు. అందుకు అభినందనలు. మీకు అర్జున గారితో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నట్లున్నాయి. వాటిని పరిషరించుకుని మరింత సంయమనంతో తెవికీ ని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ... మీ శ్రేయోభిలాషి.

అజ్ఞాత వాడుకరి గారూ, నాకు మీరనుకుంటున్నట్టుగా అర్జున గారితో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవూ. వికీ వ్విధి-విధానాలలో మీరు ఏ వికీపీడియాకు వెళ్ళిన కొత్త సాంకేతికజ్ఞులకూ, పాత సీనియర్ సభ్యులకీ మధ్య సూత్రప్రాయంగా ఆలోచనా విధానాలలో-ఆచరణలో భేదాలుంటాయి - అదే ఇదీనూ. తెలుగు వికీపీడియా వరకూ, అత్యంత సన్నిహితంగా, కనీసం రోజుకి ఒకసారయినా మాట్లాడుతూ, నెలకు రెండు సార్లయినా కలుస్తూ ఉంటాము. అంతకన్నా సఖ్యత ఏం కావాలి? నాకు తెలీని చాలా విషయాలు ఆయన వద్దే తెలుసుకుంటాను కూడా. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:00, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మానుద్దీన్ చక్కగా చెప్పారు. వికీలో భేదాభిప్రాయాలు సహజం అయితే అవి వికీ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శకమైన చర్చలు, వీలైతే వ్యక్తిగత సంభాషణలు చేయడం మంచిదని నేను నమ్ముతాను.వికీలో పనిచేసేవారు చర్చలు లేక చర్యలు వ్యక్తిగతంగా తీసుకొనకుండా మరియు వృధా అని భావించక పాల్గొన్నప్పుడే వికీ సముదాయం బలపడడం మరియు వికీపీడియా అభివృద్ధి సులభమవడం జరుగుతుంది.--అర్జున (చర్చ) 01:00, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక

రహ్మాన్ భాయ్! చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:39, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

వికీ పుస్తకం తయారీలో నా ప్రయత్నాల క్రోడీకరణ

--పవన్ సంతోష్ (చర్చ) 17:17, 11 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసము రాయటం ఎలా??

నమస్కారము, నేను కూడా ఈ తెలుగు వికీపీడియా లో వ్యాసం రాయాలి అనుకుంటున్నాను. నేను ఏ విధంగా మరియు ఎలా రాయాలో చెప్పగలరు. - jyothi divi

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
రహ్మానుద్దీన్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో మీడియావికీ స్థానికీకరణ, బాటుతో కృషి, సాంకేతికాంశాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస

సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:16, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]



ఖురాన్ తెలుగు అనువాదాలు

రహ్మానుద్దీన్ గారూ అబుల్ ఇర్ఫాన్ గారి కురాన్ భావామృతం ను వికీసోర్స్ లో ఉంచినందుకు సంతోషం.16.2.2014 న విజయవాడ సమావేశంలో మీ కోరిక మేరకు ఇతర అనువాదకులను సంప్రదించాను. ఈ క్రింది అనువాదకులు తమ అనువాదాల టెక్స్ట్ సాఫ్ట్ కాపీని ఇవ్వడానికి అంగీకరించారు. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్(ఫోన్ః 9000227264 ,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు 2010-అబ్దుల్ జలీల్(ఫోన్ః 9948151159),పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ. 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్ ముందుగా ఫోన్ లో సంప్రదించి డి.టి.పి. టెక్స్ట్ ను అనుమతి పత్రాలను వారినుండి తీసుకోవలసినదిగా మనవి--Nrahamthulla (చర్చ) 10:10, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి కబురు అందించారు. షుక్‍రన్!--రహ్మానుద్దీన్ (చర్చ) 10:14, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]