వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ
అధ్యక్షులువై. ఎస్. షర్మిళ
వ్యవస్థాపనవై. ఎస్. షర్మిళ
స్థాపన2021 జూలై 8 (2021-07-08)
(0 సంవత్సరాల క్రితం)
ప్రధాన కార్యాలయంలోటస్ పాండ్, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034
సిద్ధాంతంసంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం
రంగుపాలపిట్ట రంగు, నీలిరంగు

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి కుమార్తె వై. ఎస్. షర్మిళ ఈ పార్టీని 2021 జులై 8 న ఏర్పాటు చేసింది.[1]

పార్టీ నిర్మాణం[మార్చు]

వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు

వైఎస్ షర్మిల 2021 మార్చిలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వైఎఆర్ అభిమానులు, నాయకులతో హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందనీ, రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఆమె నిర్ణయాన్ని తెలిపింది.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేసిన ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2021 మార్చి 3 న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల ను కలిసి మద్దతు తెలిపింది.[2][3] ఆమె ఖమ్మంలో 2021ఏప్రిల్‌ 9 న 'సంకల్ప సభ' పేరున బహిరంగ సభ నిర్వహించి జూలై 8న పార్టీ పెడుతున్నట్టు తెలిపింది.[4]2021 మార్చి 15న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏపూరి సోమన్న వైఎస్ షర్మిల పార్టీలో చేరాడు.

ఆమె హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ దగ్గర ఏప్రిల్ 15 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ నిరుద్యోగుల కోసం ‘ఉద్యోగ దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం కాగా, ఆమె దీక్షకు పోలీసులు ఉదయం 10 గంటల నుంచి, సాయంత్రం ఐదు వరకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్​ ఇచ్చారు. .[5]అయితే సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో ఆమె తన దీక్షను లోటస్‌పాండ్‌లోనైనా కొనసాగిస్తానంటూ, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా పాదయాత్రన బయలుదేరగా పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్‌ పాండ్‌కు తరలించగా ఆమె అక్కడే రెండు రోజులపాటు దీక్ష చేసి విరమించింది.[6][7]

వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్ర‌తినిధులుగా తొమ్మిది మందిని నియమిస్తూ జూన్ 4 న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు.[8]

పార్టీ ఆవిర్భావం[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి జయంతి రోజు 2021జూలై 8న ఆమె ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఇడుపులపాయ లో తండ్రి సమాధిని, తల్లి వై.యస్.విజయలక్ష్మితో కలిసి సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం, ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. ఆమె హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాగుట్ట జంక్షన్‌లో ఉన్న వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. అక్కడి నుండి ఆమె పార్టీ అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా జూబ్లీహిల్స్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌ చేరుకుంది. కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి తల్లితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వై.ఎస్.షర్మిల పార్టీ జెండా ఆవిష్కరణతో తన పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ప్రకటించింది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పార్టీ ప్రధాన అజెండా సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అని తెలిపింది.[9][10][11][12]వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలిరంగు మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం, మధ్యలో రాజశేఖర్​రెడ్డి బొమ్మతో ఉంది.[13]

మూలాలు[మార్చు]

 1. The News Minute (8 July 2021). "YS Sharmila launches YSR Telangana Party: Vijayamma attends event, Jagan gives it a miss" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 2. HMTV (3 March 2021). "లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసిన ఇందిరా శోభన్". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 3. Mana Telangana (4 March 2021). "కాంగ్రెస్‌కు షాక్". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 4. BBC News తెలుగు (10 April 2021). "వైయస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో పాటు, ఖమ్మం సభలో ఇంకా ఏం ప్రకటించారంటే." Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 5. News 18 Telugu. "Ys sharmila deeksha". Archived from the original on 22 June 2021. Retrieved 9 July 2021.
 6. EENADU (2021). "ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 7. The News Minute (4 June 2021). "'YSR Telangana party': YS Sharmila registers her political party" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 8. NTV (4 June 2021). "వైఎస్ఆర్‌టీపీ అధికార ప్ర‌తినిధుల నియామ‌కం.. వీరికి చోటు." Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 9. BBC News తెలుగు (8 July 2021). "వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్‌ షర్మిల". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 10. Sakshi (8 July 2021). "వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 11. TV9 Telugu (8 July 2021). "Sharmila's YSRTP: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల - YS Sharmila launched new political party as YSR telangana Party in Hyderabad". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
 12. The Hindu (8 July 2021). "Sharmila launches YSR Telangana Party, targets KCR". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2021. Retrieved 9 July 2021.
 13. 10TV (4 July 2021). "YSR Telangana Party : షర్మిల కొత్త పార్టీ జెండా వివరాలివే | ys sharmila new party flag details". 10TV (in telugu). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.CS1 maint: unrecognized language (link)