మొదటి పేజీ

వికీపీడియా నుండి
(Main Page నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 66,147 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
Clive.jpg

ప్లాసీ యుద్ధం

ప్లాసీ యుద్ధం బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రులపై బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారతదేశం అంతటా విస్తరించింది. ఈ యుద్ధం బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రత్యర్ధులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషువారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. రాబర్టు క్లైవు, నవాబు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపీ, తన పక్షానికి తిప్పుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో క్లైవు, బెంగాలు నవాబును ఓడించి కలకత్తాను స్వాధీనపరచుకున్నాడు. ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. వారు రాబర్టు క్లైవు నాయకత్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవు ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్ కోటను వశపరచుకున్నాడు.

(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

Westernmound.jpg
  • ...సింధు లోయ నాగరికతలో కలిబంగాన్ ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదనీ!
  • ...తన సాధారణ తుపాకీతో మూడు ట్యాంకులను పేల్చి ధైర్యసాహసాలను ప్రదర్శించిన కార్గిల్ వీరుడు అబ్దుల్ హమీద్(PVC) అనీ!
  • ...భారత రష్యాల సంయుక్త ప్రాజెక్టు అయిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి పిళ్ళైను పితగా భావిస్తారనీ!
  • ...అవంతి ప్రాచీన భారతదేశపు మహా జనపదాల్లో ఒకటనీ!
  • ...బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్ ను బంగబంధు అని వ్యవహరిస్తారనీ!


చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 8:
ఈ వారపు బొమ్మ
తమిళనాడులోని రామేశ్వరం వద్ద సూర్యోదయాన పంబన్ వంతెన దృశ్యం.

తమిళనాడులోని రామేశ్వరం వద్ద సూర్యోదయాన పంబన్ వంతెన దృశ్యం.

ఫోటో సౌజన్యం: Picsnapr
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=1410800" నుండి వెలికితీశారు