సంబల్‌పూర్

వికీపీడియా నుండి
(Sambalpur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సమలేశ్వరీ దేవి అలయం, సంబల్‌పుర్

సంబల్‌పుర్ పట్టణం పశ్చిమ ఒడిషాలో ఉంది. ఈ పట్టణం మహానది తీరాన ఉంది. ఈ పట్టణం ఒరిస్సా రాజధాని భుబనేశ్వర్ నుండి 300 కి.మీ. దూరంలో ఉంది. సంబల్‌పుర్ జంక్షన్ ఒరిస్సా లోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి..ఈ పట్టణం పూర్వపు పేరు శ్యామలపుర. శ్యామలేశ్వరి ఆలయం పేరున ఆ పేరు వచ్చింది. కాలక్రమేణ శ్యామలపుర పేరు సంబల్‌పుర్‌గా మారింది.

సంబల్‌పుర్ ఒరిస్సా పశ్చిమ ప్రాంతపు పాలనా కేంద్రం. ఇదొక విద్యా కేంద్రం కూడా. అనేక చారిత్రిక భవనాలకు, పార్కులకు ఈ పట్టణం నెలవు. సంబల్‌పుర్ విశ్వవిద్యాలయం, వీర సురేంద్ర సాయి మెడికల్ కాలేజి, వీర సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇంన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, ఒడిషా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు ఇది నెలవు. సంబల్‌పుర్ కు దగ్గర లోనే హీరాకుడ్ ఆనకట్ట ఉంది. మహానదిపై ఉన్న ఈ ఆనకట్ట ప్రపంచం లోనే అత్యంత పొడవైన మట్టి కట్ట.[1]

సంబల్‌పుర్ ఒరిస్సా లోని ప్రధానమైన రైల్వేస్టేషను. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను లోని సంబల్‌పుర్ రైల్వే డివిజనుకు కేంద్రం. జాతీయ రహదారులు -53, 55, రాష్ట్ర రహదారులు -10, 15 ఈ పట్టణం గుండా పోతున్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]

సంబల్‌పుర్ నగరం సంబల్‌పుర్ మునిసిపల్ కార్పొరేషను పరిధి లోకి వస్తుంది. 2011 జనగణన ప్రకారం [2] సంబల్‌పుర్ నగర జనాభా 183,383, దాని చుట్టుపట్ల ఉన్న పట్టణ ప్రాంతపు (బుర్లా, హీరాకుడ్ లతో కలిపి) మొత్తం జనాభా 269,575. ఇందులో పురుషులు 138,826 కాగా స్త్రీలు 130,749.[3] సంబల్‌పుర్ అక్షరాస్యత 85.69% పురుషుల్లో ఇది 90.30% కాగా, స్త్రీలలో 80.92% ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.

వెలుపలి లింకులు

[మార్చు]