Coordinates: 16°00′N 79°30′E / 16°N 79.5°E / 16; 79.5

త్రిపురాంతకం

From వికీపీడియా
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
Map
Coordinates: 16°00′N 79°30′E / 16°N 79.5°E / 16; 79.5
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంత్రిపురాంతకం మండలం
Area
 • మొత్తం16.37 km2 (6.32 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం10,392
 • Density630/km2 (1,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979
Area code+91 ( 08403 Edit this on Wikidata )
పిన్‌కోడ్523326 Edit this on Wikidata


త్రిపురాంతకం ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం లోని గ్రామం. Mapసమీప పట్టణమైన మార్కాపురం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.ఇక్కడి త్రిపురాంతకేశ్వరాలయం ఒక పర్యాటక ఆకర్షణ

గ్రామం పేరు వెనుక చరిత్ర[edit]

ఈ వూరిలో త్రిపురాంతకేశ్వరాలయం ప్రసిద్ధిచెందినది. పురాణాల ప్రకారం పూర్వం శివుడు త్రిపురాలని ఏలే త్రిపురాసురలను ఇక్కడే అంతం చేసాడని అందుకే ఈ వూరికి త్రిపురాంతకం అని పేరు వచ్చిందని నమ్మిక.

సమీప గ్రామాలు[edit]

రామసముద్రం 2.2 కి.మీ, కంకణాలపల్లి 3.9 కి.మీ, మిట్టపాలెం 4.5 కి.మీ, మేడపి 4.5 కి.మీ, గణపవరం 4.5 కి.మీ.

జనగణన వివరాలు[edit]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2398 ఇళ్లతో, 10392 జనాభాతో 1637 హెక్టార్లలో విస్తరించి ఉంది.[2]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7.738, గ్రామంలో నివాస గృహాలు 1,676 ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[edit]

త్రిపురాంతకేశ్వరాలయం[edit]

త్రిపురాంతకేశ్వరాలయం

ఇక్కడ కొండ పై కొలువున్న శివుణ్ణి త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే కొండ దిగువున వెలసిన అమ్మవారిని త్రిపుర సుందరీ దేవి అని పిలుస్తారు. కొండ పైన వున్న గుడి పక్కనే శ్రీశైలం వెళ్ళే సొరంగ మార్గం ఉంది. శ్రీశైలం నాలుగు మహద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులకు ఈ దేవుడు ఇలవేల్పు.

స్థల పురాణం[edit]

పూర్వం తారకాసురడనె రాక్షసుణ్ని కుమార స్వామి సంహ రించాడు. తారకాసురుని ముగ్గురు కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చు కోవాలని బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.... "మాకు మరణం వుండకూడదని" వరమివ్వాలని కోరు కుంటారు. అది అసాద్యమని బ్రహ్మ చెప్పగా.... వారు "గగన మార్గాన ప్రయాణించే.... అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని" కోరు కుంటారు. దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ " ఆ మూడు నగరాలు విడి విడిగా వున్నంత కాలం మీకు తిరుగు లేదు .... అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులౌతారు" అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చి పోయి ముల్లోకాలను గడ గడ లాడించారు. దాంతో దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకోగా.... బ్రహ్మ వారిని వెంట పెట్టుకొని శివుని వద్దకు వెళ్లి శరణు వేడు తారు. అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్కదగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమ శివుడు త్రిపురాతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈక్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం.

చారిత్రికం[edit]

ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి.16 వ శతాబ్దం వరకు పాలించిన రాజులందరు ఈ ఆలయాభివృద్ధికి పాటు పడ్డారు. కాన గమనంలో జీర్ణమైన ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్దరించ డానికి పూనుకొన్నారు.

నేటి ఆలయం[edit]

త్రిపురాంతకంలో ఈ ఆలయం ఒక చిన్న కొండ పై ఉంది. ఆలయం తూర్పు ముఖంగావుంది. నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంది. లోపల స్వామికిరువైపులా ద్వారపాలకులైన భద్రుడు, వీర భదృడు ఉన్నారు. గర్బగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉన్నారు. స్వామి వారి ఆలయానికి ఎడమవైపున అమ్మవారికి ప్రత్యేకమైన గుడి ఉంది. అందులో అమ్మవారు త్రిశూలం, డమరుకం ధరించి చతుర్భుజాలతో అమ్మ వారు దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుండి శ్రీ శైలానికి సొరంగ మార్గమున్నదని, పూర్వం రుషులు ఈ మార్గం గుండా శ్రీ శైలం వెళ్లే వారని చెబుతారు. ప్రక్కనే ఒక చెరువు ఉంది. అందులో బాల త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ అలయ మార్గంలోనే వృచ్చికాల మల్లేశ్వర స్వామి, కాలభైరవ ఆలయాలున్నాయి.

ప్రత్యేకత[edit]

శ్రీ చక్ర ఆకారంలో ఈ ఆలయం నిర్మితమై వుండటం విశేషం. కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడున్నాయి. ఇక్కడ వున్న శివ లింగం ఊర్థ్వభాగాన ఒక అంగులం లోతు గల గుంట వుంటుంది. ఆ గుంటలో గంగ (నీరు) ఎల్లవేలలా వూరుచూ వుండుట విశేషం.

విద్యా సౌకర్యాలు[edit]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[edit]

త్రిపురాంటకంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రైవేట్ వైద్యకేంద్రాలున్నాయి.

తాగు నీరు[edit]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

సమాచార, రవాణా సౌకర్యాలు[edit]

త్రిపురాంతకం ఆర్.టి.సి.బస్టాండు

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[edit]

గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి.

భూమి వినియోగం[edit]

భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 157 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 250 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 97 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 131 హెక్టార్లు
  • బంజరు భూమి: 300 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 659 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 639 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 451 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[edit]

వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 449 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 2 హెక్టార్లు

ప్రధాన పంటలు[edit]

పెసర, మినుం, వరి, మిరప, కాయగూరలు

మూలాలు[edit]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".