అల్లాహ్
అల్లాహ్ (అరబ్బీ : الله) అరబ్బీ భాష
పదమైన 'అల్-ఇలాహ్ ' నుండి ఉద్భవించిన పదం అల్లాహ్.
ఏకైక ఆరాధ్యుడు
[మార్చు]ఇలాహ్ అంటే దేవుడు అని అర్ధం. అరబ్ క్రైస్తవులు, అరబ్బీ భాష మాట్లాడే ఇతర మతస్తులూ, యూదుల కూడా దేవున్ని అల్లాహ్ అంటారు. అల్ ఇలాహ్ అంటే "ఆ దేవుడు", "అందరికీ తెలిసిన దేవుడు" .అద్వితీయుడు అంటే అలాంటి వాడింకెవడూ లేడు, ఉండడు. ఇది అరబీ భాషాపదం. హెబ్రూ భాష లోని "ఎలోహిం", దేవుని స్తుతించుడి "హల్లెలూయా", అరమాయిక్ భాషలోని "ఎలాహా" లాంటి పదాలు "ఇలాహ"ను గుర్తుచేస్తాయి. తెలుగులో "ఏకైక ఆరాధ్యుడు" అని అర్థం. ప్రపంచపు సర్వమానవాలి రుజుమర్గం కోసం అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్ఆన్లో ఆ అల్లాహ్ ఎవరు అంటే ఆ ఏకైక ఆరాధ్యుడు ఎవరు అనే ప్రశ్నకు అనేక చోట్ల సమాధానం ఇవ్వబడింది. వాటి ఆధారంగా , ప్రపంచ ప్రజలందరి మార్గదర్శకత్వం కోసం పంపబడిన అంతిమ దైవసందేశహరుడు , ప్రవక్త అయిన మహనీయ ముహమ్మద్ (అల్లాహ్ అతనుపై శాంతిని కరుణించుగాక) బోధించిన పవిత్ర ప్రవచనాల ఆధారంగానే క్రింద తెలిపిన అల్లాహ్ యొక్క 99 విశేష గుణగణాలు ఉనికిలోనికి వచ్చినవి. అంతేగాని ఎవరో ఒక ముస్లిం పండితుడు ఊహించి వ్రాసినవి కావు ఇవి. ఉదారహణకు అల్లాహ్ (ఆరధనలకూ అర్హుడు) అంటే ఎవరు అనే ప్రశ్నకు చాలా క్లుప్తంగా, స్పష్టంగా దివ్యఖుర్ఆన్ లోని 114వ అధ్యాయంలో సమాధానం ఇవ్వబడినది - "ప్రకటించు! అతనే అల్లాహ్ - అద్వితీయుడు, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారమూ,అవసరము ఎవరి అక్కరా లేని వాడు. అందరూ అతనుపై ఆధారపడేవారే. అతనుకు సంతానము లేదు , అతను ఎవరికీ పుట్టలేదు. అతనుకు సరిసమానులు ఎవ్వరూ లేరు" దివ్యఖర్ఆన్ లో మరొకచోట 59వ అధ్యాయం 22 - 24 వచనాలలో అల్లాహ్ అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వబడింది. "అతనే అల్లాహ్: అతను తప్ప ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగిన వాడు. అతనే కరుణామయుడు , కృపాశీలుడు. అతనే అల్లాహ్, అతను తప్ప ఆరాధ్యుడెవ్వరూ లేరు. అతను పరిపాలకుడు, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతిప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరచేవాడు, ఎల్లప్పుడూ ఉన్నతుడిగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడే అల్లాహ్. సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. కేవలం అతనుకే అన్ని ఉత్తమమైన పేర్లు (విశేషగుణగణాలు) చెందును. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాను స్మరిస్తోంది. అతను సర్వాధికుడు, వివేకవంతుడూను". అలాగే దివ్యఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం (ఆవు) లోని 255వ వచనంలో అల్లాహ్ అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వబడినది - "అల్లాహ్ - అతను తప్ప ఆరాధ్యదైవం ఎవ్వరూ లేరు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన అతను సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అల్లాహ్ కు కునుకురాదు నిదుర పోడు, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అతనుదే. అతను దగ్గర అతను అనుమతి లేకుండా సిఫారసు చెయ్యగలవాడెవ్వరు? ప్రజల ముందు ఉన్న దానినీ అతను ఎరుగును. వారికి గుప్తంగా ఉన్నదీ అతను ఎరుగును. అతను స్వయంగా తెలియజెయ్యాలని అభిలషిస్తే తప్ప అతనుకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోనికి రాదు. అతను రాజ్యాధికారం ఆకాశాలనూ, భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ అతనుకు ఎంత మాత్రం అలసట కలిగించదు. అతను మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు"
వ్యాసాల క్రమం |
దేవుడు |
---|
సాధారణ నిర్వచనాలు నిర్దేశిత భావనలు అనుభవాలు, ఆచరణలు సంబంధిత విషయాలు |
ఖురాన్ నిర్వచనాలు
[మార్చు]ఖురాన్ పవిత్రగ్రంథంలో 'అల్లాహ్' యొక్క విశేషణాత్మక నామవాచకాలు 99.
ఉదాహరణకు
"బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం"
పై వాక్యంలో "రహ్మాన్", "రహీం" అను పేర్లు గలవు. రహ్మాన్ అనగా దయాళువు, రహీం అనగా కరుణామయుడు. అల్లాహ్ యొక్క గుణాలు
ఖురాను లోని అల్లాహ్ 99 పేర్లు
[మార్చు]వ్యాసాల పరంపర |
అల్లాహ్ |
---|
# |
అరబ్బీ
పేరు |
తెలుగు
లిప్యాంతరీకరణ |
అంటే అర్ధం |
ఈ పేరున్న
ఖురానువాక్యం కనీసం ఒకటి |
---|---|---|---|---|
1 | الرحمن | అర్-రహ్మాన్ | దయాళువు, అమిత దయాశీలుడు | అల్-ఫాతిహా :2 |
2 | الرحيم | అర్-రహీమ్ | కరుణామయుడు, కృపాశీలి | అల్-ఫాతిహా : 2 |
3 | الملك | అల్-మాలిక్ | ప్రభువు, యజమాని, రాజు | అల్-ఫాతిహా : 3 |
4 | القدوس | అల్-ఖుద్దూస్ | పవిత్రుడు | హషర్ :23 |
5 | السلام | అస్-సలామ్ | శాంతి | హషర్ :23 |
6 | المؤمن | అల్-మూమిన్ | విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు,
సత్యాన్ని ధ్రువీకరించేవాడు, పూచీనిచ్చేవాడు, |
హషర్ :23 |
7 | المهيمن | అల్-ముహైమిన్ | సంరక్షకుడు | హషర్ :23 |
8 | العزيز | అల్-అజీజ్ | సర్వ శక్తుడు, స్వయంసంపన్నుడు,
మహా గౌరవనీయుడు |
హషర్ :23 |
9 | الجبار | అల్-జబ్బార్ | ఎదురులేనివాడు, ఒత్తిడిచేసేవాడు,
బాగుచేసేవాడు, పునరుద్ధారకుడు, నిరంకుశుడు |
హషర్ :23 |
10 | المتكبر | అల్-ముతకబ్బిర్ | గొప్పవాడు, అహంకారి, గర్వించేవాడు,
ఎవ్వరూ తిరుగుచెప్పలేని వాడు |
హషర్ :23 |
11 | الخالق | అల్-ఖాలిఖ్ | సృష్టికర్త | హషర్ :24 |
12 | البارئ | అల్-బారి | చేసేవాడు, తయారీదారుడు | హషర్ :24 |
13 | المصور | అల్-ముసవ్విర్ | రూపశిల్పి, చిత్రకారుడు | హషర్ :24 |
14 | الغفار | అల్-గఫార్ | క్షమాశీలి, సదా మన్నించువాడు | తాహా :82 |
15 | القهار | అల్-ఖహ్హార్ | అన్నిటినీ అణచివేసేవాడు | యూసుఫ్ :39 |
16 | الوهاب | అల్-వహాబ్ | వరాలిచ్చేవాడు | ఇమ్రాన్ :8 |
17 | الرزاق | అల్-రజాక్ | పోషకుడు | జారియత్ :58 |
18 | الفتاح | అల్-ఫత్తాహ్ | ప్రారంభకుడు | సబా :26 |
19 | العليم | అల్-అలీమ్ | సర్వజ్ఞాని | సబా :26 |
20 | القابض | అల్-ఖాబిజ్ | అడ్డగించేవాడు, సరిచేసేవాడు | నిసా :245 |
21 | الباسط | అల్-బాసిత్ | వ్యాప్తినొందించువాడు | నిసా :245 |
22 | الخافض | అల్-కాఫిజ్ | అణగదొక్కేవాడు, హీనపరచేవాడు | అల్ వాఖియా :56 |
23 | الرافع | అర్-రాఫెయ్ | ఘనపరచేవాడు, పైకిలేపేవాడు | గఫీర్ :16 |
24 | المعز | అల్-ముఇజ్జు | గౌరవమిచ్చేవాడు | ఇమ్రాన్ :26 |
25 | المذل | అల్-ముజెల్ | వినాశకుడు,అణగదొక్కేవాడు | తౌబా :2 |
26 | السميع | అల్-సమీయు | ఆలకించువాడు | షూరా :11 |
27 | البصير | అల్-బసీర్ | చూసేవాడు | ఫుర్ఖాన్ :20 |
28 | الحكم | అల్-హకీం | పాలకుడు | నూర్ :18 |
29 | العدل | అల్-అదల్ | న్యాయమూర్తి | నహల్ :90 |
30 | اللطيف | అల్-లతీఫ్ | అతి సున్నితుడు, సూక్ష్మగ్రాహి | షూరా :19 |
31 | الخبير | అల్-ఖబీర్ | సర్వం తెలిసినవాడు | ఫుర్ఖాన్ :58 |
32 | الحليم | అల్-హలీమ్ | ప్రశాంతుడు, ఓర్చుకునేవాడు, సహనశీలి, దీర్ఘశాంతుడు | నిసా :12 |
33 | العظيم | అల్-అజీమ్ | మహోన్నతుడు | నూర్ :14 |
34 | الغفور | అల్-గఫూర్ | మన్నించువాడు | నూర్ :22 |
35 | الشكور | అష్-షకూర్ | మొర ఆలకించేవాడు | ఫుర్ఖాన్ :62 |
36 | العلي | అల్-అలియ్ | ఔన్నత్యాన్నిచ్చేవాడు, గౌరవపరచేవాడు, సన్మానించేవాడు | బఖరా :255 |
37 | الكبير | అల్-కబీర్ | గొప్పవాడు | ఫుర్ఖాన్ :58 |
38 | الحفيظ | అల్-హాఫిజ్ | కాపాడువాడు, రక్షకుడు | హూద్ :57 |
39 | المقيت | అల్-ముఖీత్ | బలపరచువాడు | నిసా :85 |
40 | الحسيب | అల్-హసీబ్ | లెక్కించువాడు | నిసా :6 |
41 | الجليل | అల్-జలీల్ | గౌరవనీయుడు | రహ్మాన్ :78 |
42 | الكريم | అల్-కరీమ్ | అమిత దయాళువు, ధర్మదాత | మూమినూన్ :116 |
43 | الرقيب | అర్-రఖీబ్ | సదా కనిపెట్టి చూసేవాడు, కాపరి | నిసా :1 |
44 | المجيب | అల్-ముజీబ్ | ఆమోదించేవాడు, స్పందించేవాడు,
జవాబిచ్చేవాడు, కోర్కెలుతీర్చేవాడు, ఆపదమొక్కులవాడు |
హూద్ :61 |
45 | الواسع | అల్-వాసియ్ | సర్వ వ్యాపి | జుమర్ :10 |
46 | الحكيم | అల్-హకీమ్ | సర్వజ్ఞుడు,జ్ఞాని | నూర్ :18 |
47 | الودود | అల్-వదూద్ | ప్రేమించువాడు, | బురూజ్ :14 |
48 | المجيد | అల్-మజీద్ | మహిమాన్వితుడు | హూద్ :73 |
49 | الباعث | అల్-బాయిత్ | మృతుల్ని తిరిగి లేపేవాడు | జుమా :2 |
50 | الشهيد | అష్-షహీద్ | సాక్షి | హజ్ :17 |
51 | الحق | అల్-హఖ్హ్ | సత్యం, నిజం | నూర్:25 |
52 | الوكيل | అల్-వకీల్ | ఆదరణకర్త, ఉత్తరవాది | జుమర్ :62 |
53 | القوى | అల్-ఖవియ్యు | బలశాలి | షూరా :19 |
54 | المتين | అల్-మతీన్ | స్థిరంగావుండేవాడు, మాటతప్పనివాడు, సదా నిలిచి ఉండేవాడు | జారియత్ :58 |
55 | الولى | అల్-వలీయ్యు | మిత్రుడు, అభిమాని, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు | షూరా :9 |
56 | الحميد | అల్-హమీద్ | ప్రశంసా పాత్రుడు, స్తోత్తార్హుడు | షూరా :28 |
57 | المحصى | అల్-ముహ్ సి | ఎంతైనా ఇవ్వగలవాడు, సర్వవర ప్రదాత,
సర్వం అనుగ్రహించువాడు |
జుమర్ :35 |
58 | المبدئ | అల్-ముబ్ ది | నిర్మాత, ఆవిష్కర్త, ప్రారంభించువాడు | నమల్:64 |
59 | المعيد | అల్-ముఈద్ | తిరిగి సృష్టించువాడు | సబా:49 |
60 | المحيى | అల్-ముహియ్యు | జీవమిచ్చేవాడు | రూమ్:19 |
61 | المميت | అల్-ముమీత్ | జీవం తీసుకునేవాడు, మరణదాత, నాశనం చేయువాడు | బురూజ్:20 |
62 | الحي | అల్-హయ్యి | సజీవుడు, అంతంలేనివాడు | ఇమ్రాన్:2 |
63 | القيوم | అల్-ఖయ్యూమ్ | అందరినీ కొరతలేకుండా పోషించేవాడు, | బురూజ్:20 |
64 | الواجد | అల్-వాజిద్ | గ్రహించేవాడు, చూచేవాడు, కనుక్కునేవాడు, గురితప్పనివాడు | అద్ దుహా:7 |
65 | الماجد | అల్-మాజిద్ | బ్రహ్మాండమైనవాడు, గొప్పవాడు, మాదిరిచూపేవాడు | హూద్:73 |
66 | الواحد | అల్-వాహిద్ | ఏకేశ్వరుడు, ఒకే ఒక్కడు | మూమినూన్:52 |
67 | الاحد | అల్-అహద్ | ఒకేఒక్కడు, అద్వితీయుడు, ఏకేశ్వరుడు
సర్వాంతర్యామి, అఖండుడు |
ఇక్లాస్:1 |
68 | الصمد | అస్-సమద్ | స్వయం సమృద్ధుడు, నిత్యుడు,
దుర్భేద్యుడు, అజేయుడు, ఈశ్వరుడు, ఎవరి అవసరం లేనివాడు |
ఇక్లాస్:2 |
69 | القادر | అల్-ఖాదిర్ | సర్వశక్తుడు, అన్నీచేయగలవాడు | ఇనామ్:37 |
70 | المقتدر | అల్-ముఖ్తదిర్ | అన్నీ నిర్ణయించేవాడు, అధిపతి | ఖమర్:42 |
71 | المقدم | అల్-ముఖద్దిమ్ | త్వరపరచేవాడు, ముందుకునడిపేవాడు,
పనులు పూర్తిచేసేవాడు |
యూనుస్:11 |
72 | المؤخر | అల్-ముఅఖ్ఖిర్ | శాంతకారకుడు | నూహ్:4 |
73 | الأول | అల్-అవ్వల్ | ఆది | హదీద్:3 |
74 | الأخر | అల్-ఆఖిర్ | అంతం | హదీద్:3 |
75 | الظاهر | అజ్-జాహిర్ | కనిపించేవాడు | హదీద్:3 |
76 | الباطن | అల్-బాతిన్ | అదృశ్యుడు, కానరానివాడు, దాగివున్నవాడు | హదీద్:3 |
77 | الوالي | అల్-వలీ | అధికారి, దాత, ప్రోత్సాహకుడు, అభిమాని | రౌద్:11 |
78 | المتعالي | అల్-ముతాలి | స్వీయాభిమాని, ఘనుడు | రౌద్:9 |
79 | البر | అల్-బర్ర్ | దయగలవాడు, నీతిమంతుడు | తూర్:28 |
80 | التواب | అల్-తవ్వాబ్ | బాకీ ఉంచుకోనివాడు, తిరిగి ఇచ్చేవాడు, | నూర్:10 |
81 | المنتقم | అల్-మున్ తఖిమ్ | పగతీర్చుకొనువాడు | సజ్దా:22 |
82 | العفو | అల్-అఫువ్వు | మన్నించువాడు, పాపహరుడు | నిసా:43 |
83 | الرؤوف | అర్-రవూఫ్ | జాలిపడేవాడు, దయామయుడు | నూర్:20 |
84 | مالك الملك | మాలిక్-అల్-ముల్క్ | సృష్టి యజమాని, స్వయంభువుడు | ఇమ్రాన్:26 |
85 | ذو الجلال| و الإكرام |
జుల్-జలాలి - వ-అల్-ఇక్రామ్ |
ఘనతకు, దాతృత్వానికీ ప్రభువు | ఖమర్:27 |
86 | المقسط | అల్-ముఖ్సిత్ | నిష్పక్షపాతి, న్యాయమూర్తి, పగతీర్చేవాడు | ఇమ్రాన్:18 |
87 | الجامع | అల్-జామియ్ | సమకూర్చువాడు, ఐక్యపరచేవాడు | షూరా:7 |
88 | الغنى | అల్-ఘనీ | మహా సంపన్నుడు, సర్వస్వతంత్రుడు | జమర్:7 |
89 | المغنى | అల్-ముఘ్ ని | అమిత ధనవంతుడు, ఉదారుడు | తౌబా:28 |
90 | المانع | అల్-మాని | హాని తొలగించేవాడు,తిరిగికాపాడేవాడు, ఆదుకునేవాడు | అల్ ఖసస్:35 |
91 | الضار | అద్-దార్ | బాధించేవాడు, కీడుకల్పించేవాడు, కొట్టేవాడు | అర్రాద్:22 |
92 | النافع | అన్-నాఫియ్ | మంచిని పుట్టించేవాడు, పరిహారంచేసేవాడు,
ప్రాయశ్చి త్తం చేసేవాడు, దోషంవదలగొట్టేవాడు |
అర్రూమ్ :37 |
93 | النور | అన్-నూర్ | తేజస్వి, తేజస్సు, వెలుగు, జ్యోతి | నూర్:35 |
94 | الهادي | అల్-హాది | ఉపదేశకుడు, బోధకుడు | ఫుర్ఖాన్:31 |
95 | البديع | అల్-బదీయ్ | పోల్చలేనివాడు, ఆవిర్భావకుడు | ఇనామ్:10 |
96 | الباقي | అల్-బాఖి | అమృతుడు, సజీవి | రహ్మాన్:27 |
97 | الوارث | అల్-వారిస్ | వారసుడు | ఖసాస్:58 |
98 | الرشيد | అర్-రాషిద్ | మార్గదర్శి, గురువు, సర్వజ్ఞాని | హూద్:1 |
99 | الصبور | అస్-సబూర్ | సహనశీలుడు, కాలాతీతుడు. | బకరా:251 |
ఇతర లిపులలో , భాషలలో అల్లాహ్ పేరు
[మార్చు]Allāh in other languages that use Arabic script is spelled in the same way. This includes Urdu, Persian/Dari, Uyghur among others.
- అస్సామీ Bengali: আল্লাহ Allah
- Bosnian: [Allah] Error: {{Lang}}: text has italic markup (help)
- చైనీస్: 阿拉 Ālā, 安拉 Ānlā; 真主 Zhēnzhǔ (semantic translation as "the true master"), 胡大 Huda (Khoda, from Persian language)
- Czech,
- Greek: Αλλάχ Allách
- Hebrew: אללה Allah
- హిందీ: अल्लाह Allāh
- మళయాళం: അള്ളാഹ് Aḷḷāh
- Japanese: アラー Arā, アッラー Arrā, アッラーフ Arrāfu
- Maltese: [Alla] Error: {{Lang}}: text has italic markup (help)
- Korean: 알라 Alla
- Polish: [Allah] Error: {{Lang}}: text has italic markup (help), also archaic Allach or Ałłach
- Russian, Ukrainian, Bulgarian: Алла́х Allakh
- Serbian, Belarusian, Macedonian: Алах Alah
- Spanish, Portuguese: Alá
- Thai: อัลลอฮ์ Anláw
- పంజాబీ (గురుముఖి): ਅੱਲਾਹ Allāh, archaic ਅਲਹੁ Alahu (in సిక్కు గ్రంథాలు)
- Turkish: Allah
అల్లాహ్ పదంపై క్రైస్తవులకూ హక్కు
[మార్చు]దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల శాంతి, సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది.[1]...
ఇవీ చూడండి
[మార్చు]- en:Islamic eschatology
- en:Abdullah (name)
- Ilah
- అల్లాహ్ పేర్లు
- తౌహీద్
- Dhikr
- en:Termagant
- ఇస్లాం ఐదు మూలస్తంభాలు
- కాబా
- ఇస్లామీయ ప్రవక్తలు
- El
నోట్స్
[మార్చు]- ↑ (ఈనాడు2.1.2010)
మూలాలు
[మార్చు]- The Unicode Consortium, Unicode Standard 5.0, Addison-Wesley, 2006, ISBN 978-0-321-48091-0, About the Unicode Standard Version 5.0 Book
బయటి లింకులు
[మార్చు]- Names of Allah with Meaning on Website, Flash, and Mobile Phone Software
- Concept of God (Allah) in Islam
- The Concept of Allāh According to the Qur'an Archived 2019-04-21 at the Wayback Machine by Abdul Mannan Omar
- Allah, the Unique Name of God
- Typography
- ఇస్లాం
- మతము
- మతాలు
- Articles containing Arabic-language text
- Articles containing Bengali-language text
- Articles containing Chinese-language text
- Articles containing Greek-language text
- Articles containing Hebrew-language text
- Articles containing Hindi-language text
- Articles containing Japanese-language text
- Articles containing Korean-language text
- Articles containing Polish-language text
- Articles containing Bulgarian-language text
- Articles containing Macedonian-language text
- Articles containing Portuguese-language text
- Articles containing Thai-language text
- అల్లాహ్
- హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు