దశమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదవ తిథి దశమి. అధి దేవత - యముడు. సంస్కృత భాషలో "దశమి" అనే పదానికి అర్థం "పది". చాంద్రమానంలోని ఒక మాసంలో రెండు దశమి తిథులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, రెండవది శుక్ల పక్షంలో వస్తుంది. అనగా ఒక చాంద్ర మాసంలో దశమి పదవ రోజు, ఇరవై ఐదవ రోజు వస్తుంది. హిందూ మతంలో అనేక ప్రధానమైన పండుగలకు ఈ రోజు ముఖ్యమైనది. విజయదశమి పండుగ హిందువులకు ముఖ్యమైనది.

పండుగలు

[మార్చు]
  1. దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.[1]
  2. విజయదశమి. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు. ఇది ఆశ్వయుజ మాసములో వచ్చిన దశమి రోజు. విజయమలు లభి౦చే దశమి, విజయ దశమి అని ప్రజల విశ్వాసం.[2]
  3. వైశాఖం మాసం బహుళ దశమి రోజున హనుమజ్జయంతిగా జరుపుతారు.
  4. హనుమాన్ దీక్ష: తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.[3]
  5. ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడిన రోజు. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు.[4]
  6. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "శ్రేష్ఠమైనది జేష్ఠ౦ – Telugu patrika" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-31. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "శుభ తిథులు - శుభ కార్యాలు". Silicon Andhra SujanaRanjani (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-01. Retrieved 2021-05-31.
  3. Telugu, TV9 (2021-04-27). "Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం... ప్రాముఖ్యత.. పూజా విధానం.. - Hanuman Jayanti 2021 date, timings and significance and pooja vidhi details here". TV9 Telugu. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Charya, M. N. (2020-04-02). "ధర్మరాజ దశమి అంటే ఏమిటి..? యమధర్మ రాజుకు ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలి..?". telugu.oneindia.com. Retrieved 2021-05-31.
  5. Telugu, TV9. "Annavaram Satyanarayana Swamy Brahmotsavams Start from 14 May Latest News in Telugu, Annavaram Satyanarayana Swamy Brahmotsavams Start from 14 May Top Headline, Photos, Videos Online". TV9 Telugu. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దశమి&oldid=4218460" నుండి వెలికితీశారు