పంజాబ్ (పాకిస్తాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్
پنجاب
ప్రావిన్సు
Flag of పంజాబ్
Official seal of పంజాబ్
Nickname(s): 
ఐదు నదుల ప్రాంతం
(పర్షియన్: పంజ్- ఐదు, ఆబ్- నీరు/నదులు)
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతం
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతం
పంజాబ్ మ్యాప్
పంజాబ్ మ్యాప్
దేశంపాకిస్తాన్
స్థాపితం1 జూలై 1970
రాజధానిదస్త్రం:Lahore Emblem.png లాహోర్
అతిపెద్ద నగరందస్త్రం:Lahore Emblem.png లాహోర్
Government
 • Typeప్రావిన్సు
 • Bodyప్రావిన్షియల్ ప్రభుత్వం
 • గవర్నర్మాలిక్ మహమ్మద్ రఫీక్ రజ్వానా[1] (పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్))
 • ముఖ్యమంత్రిషాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)
 • హైకోర్టులాహోర్ హైకోర్టు
విస్తీర్ణం
 • Total2,05,344 కి.మీ2 (79,284 చ. మై)
జనాభా
 (2015)[2]
 • Total10,13,91,000
 • జనసాంద్రత490/కి.మీ2 (1,300/చ. మై.)
Time zoneUTC+5 (పికెటి)
ISO 3166 codePK-PB
ప్రధాన భాషలు
Other languages: పష్తూ, బెలోచీ భాష, సింధీ భాష
అసెంబ్లీ సీట్లు371[3]
జిల్లాలు36
తహశీళ్ళు లేదా పట్టణాలు127
Provincial symbols of the Punjab
Animal [4][5]
Bird [4][5]
Tree [4][5]
Flower
Sport

పంజాబ్ (ఉర్దూ, పంజాబీ: پنجاب, పంజ్-ఆబ్, "ఐదు జలాలు": audio speaker iconlisten ), పాకిస్తాన్ యొక్క 4 ప్రావిన్సుల్లో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్సు. 205344 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 91,379,615 (2011 నాటికి) మంది జనాభాతో,[6] దేశ జనాభాలో దాదాపు 56 శాతం కలిగివుంది. దీని ప్రావిన్షియల్ రాజధాని లాహోర్. పంజాబ్ రాష్ట్రం భారతీయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీరును ఈశాన్యంలో, రాజస్థాన్, భారత దేశపు పంజాబ్ లను తూర్పున సరిహద్దుగా కలిగివుంది. పాకిస్తాన్ లో దక్షిణాన సింధ్, పశ్చిమాన బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వా, ఉత్తరాన ఇస్లామాబాద్, P.O.K ప్రాంతాలను సరిహద్దులుగా కలిగుంది.[7][8]

భారతీయ రాష్ట్రాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లతో కలిపి ప్రావిన్సు అత్యంత సారవంతమైన పంజాబ్ ప్రాంతంలోని భాగం. ఈ ప్రాచీనమైన ప్రాంతాన్ని భారతదేశ విభజన సమయంలో విభజించారు, ముస్లిం మతస్థుల సంఖ్యాధిక్యత కలిగిన ప్రాంతాలు పాకీస్తానీ ప్రావిన్సులోకి చేరగా, ముస్లిమేతరుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలో భాగంగా ఉండిపోయాయి.

పంజాబ్ భౌగోళికంగా సింధు నది, పాకిస్తాన్ లోని దాని 4 ముఖ్య ఉపనదులైన జీలం, చినాబ్, రావి, సట్లెజ్ నదుల వల్ల సారవంతమైన మైదానాలు ప్రధానంగా కలిగివుంది. ప్రావిన్స్ యొక్క నైరుతి భాగంలోని సులేమాన్ పర్వతాలు, తూర్పున ఉన్న మార్గెల్లా కొండలు, సాల్ట్ శ్రేణి, పోతోహార్ పీఠభూమి వంటి కొండ ప్రాంతాలూ ఉన్నాయి. పంజాబ్ లో ఆదాయం, ఉపాధిలకు వ్యవసాయం ప్రధానమైన ఆధారం; గోధుమ, పత్తి ప్రధాన పంటలు. స్వతంత్రం వచ్చిననాటి నుంచి పంజాబ్ పాకిస్తాన్లో అధికారం, ఆర్థిక వ్యవస్థలకు కీలక స్థానంగా ఉంది; పాకిస్తాన్ లో అతిఎక్కువ పారిశ్రామికీకరణ జరిగిన ప్రావిన్సుగా నిలుస్తోంది. దేశంలోని 39.2 శాతం భారీ తరహా, 70 శాతం చిన్నతరహా తయారీ పరిశ్రమలు ప్రావిన్సులో నెలకొన్నాయి.[9] దీని రాజధాని లాహోర్ ప్రధానమైన స్థానిక సంస్కృతీ, చారిత్రక, ఆర్థిక కేంద్రం.[10]

పద వ్యుత్పత్తి

[మార్చు]

పంజాబ్ అన్న పదం ప్రామాణికంగా 17వ శతాబ్దిలో ప్రారంభమైంది. పర్షియన్ పదాలు పంజ్ (ఐదు), ఆబ్ (నీరు) కలయికగా ఏర్పడింది, దీని అర్థం ఐదు జలాలు.[11] చీనాబ్, ఝీలం, రావి, బియాస్, సట్లెజ్ అన్న అయిదు నదులూ పంజ్నాడ్ నది గుండా సింధు నదిలో కలిసి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. గ్రీకులు పంజాబ్ ను ఐదు సజీవ నదుల మధ్య డెల్టా ప్రాంతమనే అర్థం వచ్చే పెంటాపొటామియా అన్న పేరుతో పిలిచేవారు.[12]

భౌగోళికాంశాలు

[మార్చు]

పంజాబ్ విస్తీర్ణం పరంగా 205344 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, బెలూచిస్తాన్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రావిన్సుగా నిలుస్తోంది. దక్షిణాసియాలో భౌగోళికమైన ఇండియన్ ప్లేట్ కి వాయువ్యపు అంచుమీద ఉంది. ప్రావిన్సు ఈశాన్యంగా కాశ్మీర్, తూర్పున పంజాబ్, దక్షిణాన పాకిస్తానీ ప్రావిన్సు - సింధ్, నైరుతిలో బెలూచిస్తాన్, పశ్చిమాన ఖైబర్ పఖ్తున్ఖ్వా, ఉత్తరాన ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం సరిహద్దుగా కలిగివుంది.

లాహోర్ ప్రావిన్సుకు రాజధాని, అతిపెద్ద నగరం. విస్తృతమైన పంజాబ్ ప్రాంతానికి చారిత్రికంగానూ రాజధానిగా ఉంది. ఇతర ముఖ్యనగరాల్లో ఫైసలాబాద్, రావల్పిండి, గుజ్రాన్వాలా, సర్గోడా, ముల్తాన్, సియాల్ కోట్, బహవల్ పూర్, గుజ్రాత్, షేఖుపురా, ఝీలం, సహివాల్ ఉన్నాయి. అవిభాజితమైన పంజాబ్ 6 నదులకు మాతృస్థానం కాగా వాటిలో 5 పాకిస్తానీ పంజాబ్ మీదుగా ప్రవహిస్తాయి. పడమర నుండి తూర్పుకు, ఇవి: సింధు, జీలం, బియాస్, చీనాబ్, రావి, సట్లెజ్. దాదాపు 60శాతం పాకిస్తానీ జనాభా పంజాబ్ లో జీవిస్తుంది. దేశంలోని ప్రతీ ఇతర ప్రావిన్సుతోనూ సరిహద్దు కలిగిన ఏకైక ప్రావిన్సు ఇదే; అంతేకాక దేశ రాజధాని ఇస్లామాబాద్ యొక్క ఫెడరల్ ఎన్‌క్లేవ్ చుట్టూ పంజాబ్ ఉంటుంది.[13][14]

ప్రావిన్సు ప్రధానంగా నదీ లోయలతో సారవంతంగా ఉండగా, రాజస్తాన్ సరిహద్దులోనూ, సులేమాన్ పర్వతశ్రేణి వద్ద కొద్ది ప్రాంతం మాత్రం ఎడారి ప్రదశం. ఆ ప్రాంతం థాల్, చోళిస్తాన్ ఎడారుల కిందకు వస్తుంది. సింధు నది, దాని ఉపనదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తున్నాయి.

భూభాగంలో విస్తారంగా నీటి పారుదల కలిగివుండి, ప్రావిన్సు అంతటా కాలువలు, ఇతర జలవనరులు కనిపిస్తాయి. వాతావరణ స్థితిగతులు బంజరు, వేడి దక్షిణ ప్రాంతం నుంచి మంచు పర్వతాల ఉత్తర ప్రాంతం వరకూ వైరుధ్యం, వైవిధ్యంతో ఉంటాయి. ప్రావిన్సు ఉత్తర కొసన హిమాలయాల పాదభూములు కనిపిస్తాయి.

ప్రభుత్వం

[మార్చు]

పంజాబ్ ప్రభుత్వంలో 48 శాఖలు ఉన్నాయి. ప్రతీ ప్రభుత్వ శాఖకు ప్రొవిన్షియల్ మంత్రి (రాజకీయ నాయకుడు), ప్రొవిన్షియల్ సెక్రటరీ (బిపిఎస్-20 లేదా బిపిఎస్-21లకు చెందిన ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగి) నేతృత్వం వహిస్తారు. మంత్రులందరూ ప్రధాన కార్యనిర్వాహకుడైన ముఖ్యమంత్రికి బాధ్యులై ఉంటారు. అందరు కార్యదర్శులు సాధారణంగా బిపిఎస్-22 స్థాయి సివిల్ సర్వెంట్ అయిన పంజాబ్ ముఖ్యకార్యదర్శికి బాధ్యత వహిస్తారు. ఈ శాఖలకు తోడు నేరుగా కార్యదర్శులకో, ముఖ్య కార్యదర్శికో బాధ్యత వహించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, సంయుక్త శాఖలు ఉంటాయి.

చరిత్ర

[మార్చు]

ప్రాచీన చరిత్ర

[మార్చు]
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతం, దానిలోనూ, చుట్టూ సింధులోయ నాగరికత విస్తరించిన ప్రాంతాలు, ప్రదేశాలు

మహాభారత కాలంలో పంజాబ్ ను పంచనదగా పిలిచేవారు.[15][16] 4000 సంవత్సరాలకు పూర్వమే ఉన్న సింధు లోయ నాగరికతలో పంజాబ్ భాగం.[17] ఆ ప్రాచీన నాగరికతకు పంజాబ్ లో ప్రధానమైన కేంద్రం హరప్పా. సింధులోయ నాగరికత ప్రస్తుత పాకిస్తాన్ లోని చాలావరకూ విస్తరించింది, ఇదే నాగరికత క్రమంగా ఇండో-ఆర్యన్ నాగరికతగా పరిణామం చెందింది. వేద నాగరికత సింధు నది తీరం వెంబడి వికసించింది. ఈ నాగరికతే తర్వాతి కాలపు దక్షిణాసియా, ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతులకు రూపునిచ్చింది. హరప్పాలోని పురాతత్త్వ కేంద్రం 1857లో లాహోర్-ముల్తాన్ రైలురోడ్డు నిర్మించిన ఇంజనీర్లు హరప్పా అవశేషాల నుంచి ఇటుకలు తవ్వుకుని వాడుకోవడంతో పాక్షికంగా దెబ్బతిన్నా మరెన్నో విస్తారమైన చారిత్రక వస్తువులు లభిస్తున్నాయి. పంజాబ్ గాంధార మహా జనపదాలు, అకేమెండిస్, మాసిడోనియా, మౌర్య, కుషాణు, గుప్త, హిందూషాహి వంటి మహా సామ్రాజ్యాల్లో భాగంగా ఉంది. గుజరా-ప్రతీహార సామ్రాజ్యంగా పిలవబడే గుజర్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు ప్రధాన భాగంగా ఉంది.[18][19][20] వ్యవసాయం ఫలవంతమైంది,ముల్తాన్, లాహోర్ వంటి వ్యాపార నగరాలు సంపద్వంతమయ్యాయి.

వేద నాగరికతలో పంజాబ్

అది నెలకొన్న స్థానం వల్ల, పంజాబ్ ప్రాంతం పశ్చిమం నుంచి నిరంతరం దాడులు, ప్రభావాన్ని చవిచూసింది, శతాబ్దాలుగా గ్రీకులు, కుషాణులు, సైథిన్లు, టర్కులు, ఆఫ్ఘాన్ల దండయాత్రలకు సాక్షీభూతమైంది. తక్షశిల నగరం శ్రీరాముని తమ్ముడు భరతుని కుమారుడు తక్షుని కుమారుడి పేరుమీదుగా ఏర్పడింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తక్షశిల విశ్వవిద్యాలయం ఇక్కడే నెలకొంది. వైదిక కాలపు మేధావి, తత్తవేత్త, రాజనీతివేత్త అయిన చాణక్యుడు ఈ విశ్వవిద్యాలయంలో బోధించారు. తక్షశిల మౌర్య సామ్రాజ్యం కాలంలో మేధోపరమైన చర్చలకు, విద్యాభ్యాసానికి గొప్ప కేంద్రంగా నిలిచింది. పురాతత్త్వ, మత చరిత్రకు ప్రఖ్యాతి వహించిన తక్షశిల ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ కేంద్రాల్లో ఒకటి.

మధ్య ఆసియా, గ్రీక్, పర్షియా సామ్రాజ్యాలు

[మార్చు]
మహ్మద్, అయాజ్
సుల్తాన్ కుడివైపున షేఖ్ తో చేయికలుపుతూ ఉన్నాడు, అయాజ్ ఆయన వెనుక నిలిచి ఉన్నాడు. పంజాబ్ యొక్క ఘజ్నవీ యుగంలో ఘజనీ మహమ్మద్ లాహోర్ పాలకునిగా మాలిక్ ఆయాజ్ ను నియమించారు.

పంజాబ్ తో సహా దక్షిణాసియా వాయువ్య ప్రాంతమంతా తామర్లేన్, అలెగ్జాండర్, ఛెంఘిజ్ ఖాన్ వగైరా సామ్రాట్టులు, ఇతర విదేశీ సామ్రాజ్యాల దండయాత్రలకు పలుమార్లు గురైంది. డ్రాంగైనా, ఆరకోసియా, గెడ్రోసియా, సీస్తాన్ వంటి ప్రదేశాలను పదిరోజుల్లో జయించి, భారతదేశపు గొప్పదనం, బంగారం, రత్నాలు, ముత్యాలు వంటి సంపదలతో అలరారడం గురించి పూర్తిగా తెలుసుకునే అలగ్జాండర్ హిందూ కుష్ పర్వతాలను దాటారు. ఏదేమైనా అలెగ్జాండర్ పంజాబ్ లోని విస్తారమైన మైదానాల్లోకి అడుగుపెట్టే ముందే సరిహద్దులో తెగలవారిని ఎదుర్కొని, వారిని జయించారు. ఆపైన తనకు ఈశాన్య దిశగా కదిలి అక్కడి కొండజాతి వారిని ఎదుర్కొని, వారి విపరీతమైన ప్రతిఘటనను ఎదుర్కొని అణచాల్సివచ్చింది.

అలగ్జాండర్ సైన్యం మాగస్సా, ఓరా, బజైరా ప్రాంతాల మీదుగా సాగింది. మరింత ఈశాన్యంగా అలెగ్జాండరు ప్రస్తుతం పఖ్లి జిల్లా ప్రధాన పట్టణమైన పుచేలాపై దండయాత్ర చేశారు. ఆపైన ప్రాచీన నగరం నైశా (ఆధునిక కాలపు మోంగ్ వద్ద ఉండేది) వద్ద పశ్చిమ పంజాబ్ లో ప్రవేశించారు. యుద్ధ నిపుణులైన కేథియన్లు, ముల్తాన్ ప్రాంత యోధులు అలెగ్జాండర్ కి వ్యతిరేకంగా ఏకమయ్యారు. అలెగ్జాండర్ అనేక దళాలను వినియోగించి చివరకు 17 వేలమంది కేథియన్లను యుద్ధంలో హతమార్చి, సగాలా నగర (ప్రస్తుతపు సియాల్ కోట్)ను నేలమట్టం చేశారు. క్రీ.పూ.326లో అలెగ్జాండర్ తన సామ్రాజ్యంలోని మాతృభూమికి పంజాబ్ ను వదిలి సైన్యసహితంగా తిరిగివెళ్ళారు.

ఇస్లాం ఆగమనం

[మార్చు]

రాజా దహీర్ ను ఓడించి 712లో మహమ్మద్ బిన్ ఖాసిం నడిపించిన ముస్లిం ఉమయ్యాద్ సైన్యం సింధ్, దక్షిణ పంజాబ్ లను ఆక్రమించేనాటికి పంజాబీలు హిందూమతానికి చెందిన వివిధ శాఖల విశ్వాసులుగా ఉండేవారు. ఉమ్మయ్యద్ ఖలీఫత్ అన్నది మహమ్మద్‌ మరణానంతరం ఏర్పడ్డ రెండవ మహమ్మదీయ ఖలీఫత్ (మత సామ్రాజ్యం). దాన్ని ఉమ్మయ్యద్ ఇబ్న్ అబ్ద్ షామ్స్ (ఈయన మొదటి ఉమ్మయ్యద్ ఖలీఫాకు ముత్తాత) వంశానికి చెందిన ఉమ్మయ్యద్ వంశం పరిపాలించింది. ఉమయ్యద్ వంశీకులు మౌలికంగా మక్కాకు చెందినవారే అయినా డెమస్కస్ (సిరియాలోని నగరం) రాజధానిగా చేసుకుని పరిపాలించారు. పంజాబ్ కు ఇస్లాం మతాన్ని తీసుకువచ్చినవారిలో మహమ్మద్ బిన్ ఖాసిం మొదటివారు. 11వ శతాబ్దిలో గజనీ మహమ్మద్ పలు దండయాత్రల్లో భాగంగా లాహోర్ సహా ఇతర పంజాబ్ ప్రాంతాల్లో పట్టు సాధించారు. క్రమంగా ముస్లిం పరిపాలనతో పాటుగా సూఫీ సాధువుల మతప్రచారంతో పంజాబ్ ప్రాంతంలో ముస్లిం జనాభా పెరుగుతూ వచ్చింది. ప్రాంతం చివరకు 1526లో ముఘల్ సామ్రాజ్యంలో భాగం అయ్యేంతవరకూ వివిధ ముస్లిం పాలకుల పాలనల్లోకి వెళ్తూవచ్చింది.

మొఘల్ పాలన

[మార్చు]

1524 నుంచి 1739 ప్రాంతం వరకూ ఈ ప్రాంతం మొఘల్ పాలకుల నియంత్రణలో ఉండేది. లాహోర్లో షాలీమార్ గార్డెన్స్, బాద్షాహీ మసీదు వంటి నిర్మాణాలు మొఘల్ పాలనాకాలంలోనే నిర్మితమయ్యాయి.[21][22] దక్షిణాసియాలోని ఇస్లామిక్ సుల్తాన్ పాలనా కాలంలో ఇతర ముస్లిం ప్రపంచం నుంచి ముస్లిం సైనికులు, వ్యాపారులు, నిర్మాణవేత్తలు, తాత్త్వికులు, సూఫీ గురువులు వచ్చి స్థిరపడ్డారు. ఆ క్రమంలోనే పంజాబ్ ప్రాంతంలోనూ పలువురు ఇతర ప్రాంతపు ముస్లిం నిపుణులు, మేధావులు వలసవచ్చారు.

ఆఫ్ఘాన్ దురానీల ఆధిపత్యం

[మార్చు]

మొఘల్ సామ్రాజ్యం బలహీన పడుతున్న సమయంలో ఆఫ్ఘాన్ పరిపాలకుడు అహమ్మద్ షా దురానీ 1747లో పంజాబ్ ను తన దురానీ సామ్రాజ్యంలో కలుపుకున్నారు, ఆ ఆధిపత్యం 1762 వరకూ సాగింది.[23]

మరాఠా సామ్రాజ్యం

[మార్చు]

1758లో, హిందూ మరాఠా సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు రఘునాథరావు లాహోరును, మరింత వాయువ్యంగా అటక్ ను కూడా జయించారు. ఆఫ్ఘాన్ దురానీ సామ్రాజ్య పాలకుడు అహమ్మద్ షా అబ్దాలీ కుమారుడు, అప్పటి పంజాబ్ వైశ్రాయ్ అయిన తిమూర్ షా దురానీని పంజాబ్ నుంచి తరిమివేశారు. లాహోర్, ముల్తాన్, దెరా ఘజీ ఖాన్, కాశ్మీర్తో పాటుగా, పెషావర్కు దక్షిణంగానూ, తూర్పుగానూ ఉన్న ఇతర సుబాలన్నీ మరాఠా పరిపాలనలోకి వచ్చాయి.[24] పంజాబ్, కాశ్మీర్ లలో మరాఠాలు రాజకీయంగా కీలకమైన స్థానంలోకి వచ్చారు.[25][26] మూడవ పానిపట్టు యుద్ధం 1761లో జరిగింది. అబ్దాలీ నేతృత్వంలోని ఆఫ్ఘాన్లకీ, మరాఠాలకీ నడుమ సాగిన ఈ యుద్ధంలో కీలకమైన సమయంలో వ్యూహాత్మక తప్పిదాలు చేయడంతో మరాఠాలు ఘోరంగా ఓడిపోయారు. అబ్దాలీ మరాఠా సామ్రాజ్యంలోని పంజాబ్, కాశ్మీర్ ప్రాంతాలను తిరిగి తన వశం చేసుకుని పట్టు సాధించారు.[27]

సిక్ఖు సామ్రాజ్యం

[మార్చు]
మహారాజా రంజిత్ సింగ్ సిక్ఖు దర్బారు

15వ శతాబ్ది మధ్యకాలంలో పంజాబ్ ప్రాంతంలో సిక్ఖు మతం జన్మించింది. మొఘల్ పీడనకు వ్యతిరేకంగా పలువురు హిందువులు విస్తృతంగా సిక్ఖు మతాన్ని స్వీకరించారు. సిక్ఖులు మొదట మొఘల్ సామ్రాజ్యానికి, ఆపైన ఆఫ్ఘాన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బలీయమైన సైనిక శక్తిగా రూపుదాల్చారు. అహ్మద్ షా దురానీతో పోరాటం తర్వాత సిక్ఖులు పంజాబ్ పై నియంత్రణ సాధించి మహారాజా రంజిత్ సింగ్ నాయకత్వంలో సిక్ఖు సామ్రాజ్యాన్ని స్థాపించి 1799 నుంచి 1849 వరకూ పరిపాలించారు. రంజిత్ సింగ్ లాహోర్ రాజధానిగా సామ్రాజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ప్రాంతాలకు విస్తరించారు. భంగీ మిస్ల్ అన్నది లాహోర్ ను, ఇతర పంజాబ్ పట్టణాలను ఆక్రమించిన మొదటి సిక్ఖు సైన్యం. సయ్యద్ అహ్మద్ బరేల్వీ అనే ముస్లిం జీహాద్ ప్రకటించి, తిరుగుబాటు చేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి, ముస్లిం చట్టాన్ని అత్యంత కఠినంగా అమలుచేయబోయారు.[28] 1821లో సయ్యద్ అహమ్మద్ బరేల్వీ, తన అనుచరులతో తన పంజాబ్ ఆక్రమణ పథకానికి ప్రజాదరణ, సామాగ్రి సేకరణ సంపాదించేందుకు రెండేళ్ళు పనిచేశారు. భారతదేశ వ్యాప్తంగా తన సంబంధాలు జాగ్రత్తగా విస్తృతపరుచుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రయాణించి స్వచ్ఛంద సైనికులను ఉత్సాహపరుస్తూ, నిధులు సేకరిస్తూ ముస్లిం తన పట్ల విశ్వాసం కలిగిన ముస్లింను కలిశారు. 1826 డిసెంబరులో సయ్యద్ అహ్మద్, అతని అనుచరులు అకోరా ఖటక్ వద్ద సిక్ఖు దళాలతో ఘర్షణ పడ్డారు కానీ ఎటువైపూ ఫలితం మొగ్గలేదు. 1831లో బాలకోట్ పట్టణంలో సయ్యద్ అహ్మద్, షా ఇస్మాయిల్ షహీద్, వారి స్వచ్ఛంద సైనికులతో కూడిన ముస్లిం తిరుగుబాటు దళం ఒక ప్రధాన యుద్ధంలో శిక్ఖు సైన్యం చేతిలో పరాజయాన్ని చవిచూసింది.[29]

బ్రిటీష్ సామ్రాజ్యం

[మార్చు]
ఫైసలాబాద్ క్లాక్ టవర్, ఇది బ్రిటీష్ సామ్రాజ్య పాలనా కాలంలో నిర్మితమైంది

1839 వేసవిలో మహారాజా రంజీత్ సింగ్ మరణంతో పాటే రాజకీయ అనిశ్చితి, వారసత్వ పోరు ప్రారంభమైంది. దర్బారులోని వివిధ వర్గాల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన రక్తిసిక్తమైన అంతర్గత కుమ్ములాటలు రాజ్యాన్ని బలహీనపరిచాయి. ఈ అదను, దానితో పాటు చుట్టుపక్కల బ్రిటీష్ పాలిత ప్రాంతాలతో సంబంధాలు పాడుకావడం కారణంతో మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం ప్రారంభమైంది, దీని ఫలితంగా లాహోరులో బ్రిటీష్ అధికారి రెసిడెంటుగా ఉండడం, సట్లెజ్ కు దక్షిణాన ఉన్న సామ్రాజ్య ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో కలిసిపోవడం జరిగాయి. 1849లో రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం తర్వాత, బ్రిటీష్ ఇండియాలో చేరిపోయిన చిట్టచివరి ప్రాంతంగా సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ ఇండియాలో విలీనమైపోయింది. 1857 భారతీయ తిరుగుబాటులో భాగంగా హెచ్.ఎం. 24 రెజిమెంటుకు చెందిన 35మంది బ్రిటీష్ సైనికులను స్థానికులు చంపి ఝీలం నదిలో తోశారు.

అయితే ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో శత్రుపక్షాలు ఒకరి సాహస పరాక్రమాలకు మరొకరు ఆకర్షితులయ్యారు. సిక్ఖు సైనికుల పరాక్రమానికి, పోరాట పటిమకు బ్రిటీష్ అధికారులు ఆశ్చర్యపోతే, బ్రిటీష్ వారి సైనిక పాటవానికి, నాయకత్వ వైదుష్యానికి చాలామంది సిక్ఖు నేతలు ఆకర్షితులయ్యారు. దీనివల్లనైతేనేమి, మరికొన్ని రాజకీయ కారణాల వల్లనైతేనేమి బ్రిటీష్ వారు తమ పరిపాలనలో పంజాబీలకు సైన్యంలో ప్రధాన స్థానాన్ని ఇవ్వడం జరిగింది.

18వ శతాబ్ది చివర్లో బ్రిటీష్ వారు ఐదు నదులు పూర్తి మైదాన ప్రాంతానికి చేరుకుని ప్రవహించే పంజాబ్ పశ్చిమ ప్రాంతంలో కాలువల ద్వారా కొత్తగా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పరిచారు. పంజాబ్ పశ్చిమ ప్రాంతంలో తాము ఏర్పరిచిన నీటిపారుదల సౌకర్యాల వల్ల సాగుబడిలోకి వచ్చే భూమిని సాగుచేయమని తూర్పు ప్రాంతంలోని సిక్ఖు వ్యవసాయదారులను కోరడంతో వారు ఇక్కడికి వలసవచ్చి స్థిరపడి వ్యవసాయం సాగించారు. అలా సిక్ఖులు కెనాల్ కాలనీలుగా పిలిచే సంపద్వంతమైన జనావాసాలను ఏర్పరుచుకుని జీవించసాగారు.[30]

స్వాతంత్ర్యం, విభజన

[మార్చు]

పంజాబ్ ప్రాంతం నుంచి 1946లోని రాజ్యాంగ సభ ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయం సాధించింది. ఆపైన భారత దేశ స్వాతంత్ర్యం గురించి చేసిన ప్రతిపాదనల్లో భాగంగా విస్తృత పాకిస్తాన్, భారత సమితిలో ఉండేలా రూపకల్పన చేసినప్పుడూ మొత్తం పంజాబ్ ప్రావిన్సు పాకిస్తాన్ లో ఉండేలా ప్రతిపాదించారు. 1947లో బ్రిటీష్ రాజ్ మత ప్రాతిపదికన పంజాబ్ ను విభజించి పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్ లను ఏర్పరిచింది. పశ్చిమ పంజాబ్ కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్లో చేరగా, తూర్పు పంజాబ్ భారత దేశంలో భాగమైంది. ఈ విభజన ఇరుపక్కలా విపరీతమైన మత హింస, రక్తపాతం, దోపిడీలు, ఘోరాలకు కారణమైంది, తూర్పు పంజాబ్ నుంచి సిక్ఖు, హిందూ నిర్వాసితులు సారవంతమైన భూములు వదులుకుని పశ్చిమ పంజాబ్ కు చేరుకోవాల్సి వచ్చింది. మరోవైపు తూర్పు పంజాబ్ లో దారుణాలు చవిచూసిన వారితో పాటు, ఇతర ప్రాంతాల భారత ప్రాంతాలలో పాకిస్తాన్ లో జీవిద్దామనుకున్న ముస్లిముల్లో అధిక సంఖ్యాకులు పశ్చిమ పంజాబ్ చేరుకున్నారు.

ఒకనాటి విస్తృతమైన పంజాబ్ ప్రాంతంలో నేటి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు ప్రధానమైన భాగం, ముస్లిం మెజారిటీ మినహాయించి 1947 వరకూ పంజాబీ సిక్ఖు, హిందువులకు మాతృస్థానం.[31] భారత, పాకిస్తాన్ ప్రాంతాల మధ్య వలసలు స్వాతంత్ర్యానికి ముందు నుంచీ సాగాయి. 1900ల నాటికే పశ్చిమ పంజాబ్ ప్రాంతం ముస్లిం సంఖ్యాధిక్యత కలిగి, ముస్లిం లీగ్‌నీ, పాకిస్తాన్ ఉద్యమాన్నీ సమర్థించసాగింది.[32]

పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత

[మార్చు]
వాఘా సరిహద్దు ఉత్సవం

1950ల నుంచి పంజాబ్ వేగవంతంగా పారిశ్రామీకరణ చెందింది. లాహోర్, సర్గోధా, ముల్తాన్, గుజ్రాత్, గుజ్రన్ వాలా, సియాల్ కోట్ వంటి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు స్థాపించారు. 1950ల్లో రావల్పిండికి ఉత్తరాన ఇస్లామాబాద్ నగరం ఏర్పడింది.

పంజాబ్ ఆర్థిక రంగంలో వ్యవసాయం ప్రధాన భాగంగానే ఉంది. ప్రావిన్సు దేశానికి ధాన్యాగారం, అంతేకాక దేశంలో అతిపెద్ద జాతి - పంజాబీలకు మాతృస్థానం. భారతదేశపు పంజాబ్ కు భిన్నంగా వ్యవసాయ భూమి విస్తృత స్థాయిలో పునర్విభజన జరగలేదు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలు చిన్న స్థాయి భూస్వామ్య కుటుంబాల ఆధిపత్యంలో ఉన్నాయి.

1950ల్లో పాకిస్తాన్ లోని తూర్పు, పశ్చిమ భాగాల మధ్య వివాదం చెలరేగింది. ఆ సమస్యను తీర్చడానికి ఒక పథకం ప్రకారం 1955లో పంజాబ్ కు ప్రావిన్షియల్ స్థాయిని రద్దుచేసి పశ్చిమ పాకిస్తాన్ అన్న ప్రావిన్సులో విలీనం చేశారు. 1972లో తూర్పు పాకిస్తాన్ విడిపోయి, బంగ్లాదేశ్ అయ్యాకా మళ్ళీ పంజాబ్ ప్రావిన్సు అయ్యింది.

పంజాబ్ భారత పాకిస్తాన్ ల నడుమ వివిధ పోరాటాలను 1965, 1971 నాటి యుద్ధాల్లో చూసింది. 1990ల నుంచి కహుతా వంటి పలు చోట్ల పాకిస్తానీ అణు కార్యక్రమానికి కేంద్రాలను అందించింది. సర్గోధా, రావల్పిండి ప్రాంతాల్లో ప్రధాన సైనిక క్షేత్రాలు ఉన్నాయి. పాకిస్తానీ పంజాబ్ లో ఈ పరిస్థితిని చల్లబరచడానికి 2004 నుంచి భారత్, పాకిస్తాన్ ల నడుమ సాగుతున్న శాంతి ప్రయత్నాలు ఊతమిస్తున్నాయి. వాఘా సరిహద్దు ద్వారా ప్రజల నడుమ సంబంధాలు, వ్యాపారం వంటివి సాధారణ స్థితికి వస్తున్నాయి. భారతీయ సిక్ఖు భక్తులు నాన్కానా సాహెబ్ వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూంటారు.

1980ల నుంచి ఆర్థిక అవకాశాల కోసం పెద్ద ఎత్తున పంజాబీల మధ్య ప్రాచ్యం, బ్రిటన్, స్పెయిన్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలకు వలసవెళ్ళి విస్తారమైన పంజాబీ డయాస్పోరాను ఏర్పరిచారు. యునైటెడ్ స్టేట్స్, పంజాబ్ ల నడుమ వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయి.

వాతావరణం

[మార్చు]
పంజాబ్ లో వేసవి నాటి సూర్యాస్తమయం

పంజాబ్ లోని ఎక్కువ ప్రదేశాల్లో శీతోష్ణ స్థితిగతులు తీవ్రంగానే ఉంటాయి. చలికాలంలో మంచుతెరలు, తరచుగా వానలు ఉండగా, ఫిబ్రవరి మధ్యకాలం నాటికి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమౌతుంది; ఏప్రిల్ నెల మధ్యలో వేసవి ఎండలు ప్రారంభమౌతాయి.

దెరా ఘజీ ఖాన్ నుంచి ఫోర్ట్ మన్రోకు వెళ్ళే దారి

నైరుతి ఋతుపవనాలు పంజాబ్ ను సాధారణంగా మే మధ్యలో చేరుకుంటాయి, కానీ 1970ల నుంచి రుతుపవనాల స్థితిగతులు అనిర్దిష్టంగా ఉన్నాయి. రుతుపవనాలు, వర్షాలు మొత్తంగా లేకపోవడమో, వాటి కారణంగా వరదలు రావడమో జరుగుతోంది. జూన్, జూలై నెలల్లో వేడి మరీ తీవ్రం. అధికారిక అంచనాలు ఉష్ణోగ్రతలను 46 °C లోపే చూపుతున్నా, వార్తాపత్రికలు 51 °C చేరుకున్నాయని చెప్తున్నాయి, ఎండవేడిమి కారణంగా ప్రజలు చనిపోవడం పత్రికల్లో సాధారణంగా కనిపిస్తూంటుంది. జూన్ 1993లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 54 °C వరకూ నమోదయ్యాయి. ఆగస్టులో వానాకాలం వేడిని చల్లబరుస్తుంది, దీన్ని బర్సాత్ గా అభివర్ణిస్తారు. వేసవి కష్టపుదినాలు అక్కడితో గడచిపోయినా చల్లదనం పూర్తిస్థాయిలో అక్టోబరు నుంచే ప్రారంభం అవుతుంది.

2007లో ప్రావిన్సు 70 సంవత్సరాల్లోనే ఎరగని అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలికాలం చూసింది.[33]

పంజాబ్ ప్రాంతపు ఉష్ణోగ్రతలు −2° నుంచి 45 °C వరకూ నమోదవుతాయి, కానీ 50 °C (122 °F)కు వేసవిలో చేరుకోవచ్చు, కొన్నిసార్లు చలికాలంలో −10 °C పడిపోనూవచ్చు.

వాతావరణం పరంగా పంజాబ్ లో మూడు ప్రధాన రుతువులు ఉన్నాయి:[34]

  • వేసవి (ఏప్రిల్ నుంచి జూన్). ఉష్ణోగ్రత దాదాపు 110 °F వరకూ పెరుగుతూంటుంది.
  • వానాకాలం (జూలై నుంచి సెప్టెంబరు). సాధారణ వర్షపాతం 96 cm పర్వత శ్రేణిలోనూ, 46 cm మైదానాల్లోనూ నమోదు అవుతూంటుంది.
  • చలికాలం (అక్టోబరు నుంచి మార్చి). ఉష్ణోగ్రత 40 °F వరకూ పడిపోతూంటుంది.

జనాభా, సమాజం

[మార్చు]
చారిత్రికంగా జనాభా
జనగణన జనాభా పట్టణ గ్రామీణ

1951 20,540,762 3,568,076 16,972,686
1961 25,463,974 5,475,922 19,988,052
1972 37,607,423 9,182,695 28,424,728
1981 47,292,441 13,051,646 34,240,795
1998 73,621,290[35] 23,019,025 50,602,265
2012 91,379,615[36] 45,978,451 45,401,164

ప్రావిన్సు జనాభా 100,590,000గా[2] 2015లో అంచనా వేశారు, అంతేగాక ఇది పాకిస్తాన్లోని సగానికి పైగా ప్రజల మాతృభూమి.

భాషలు

[మార్చు]
పంజాబ్ ప్రధాన భాషలు
(according to 1998 Census)[37]
పంజాబీ
  
75.2%
పంజాబీ (సరైకీ)
  
17.4%
ఉర్దూ
  
4.5%
పష్తూ
  
1.2%
బెలూచీ భాష
  
0.7%
సింధీ
  
0.1%
ఇతరాలు
  
0.9%

పంజాబ్ లోని ప్రధాన, స్థానిక భాష పంజాబీ (పాకిస్తాన్ లో షాముఖీ లిపిలో రాస్తారు) పంజాబీలు దేశంలోకెల్లా అతిపెద్ద జాతి. పంజాబీ మాతృభాషగా కలవారు 89శాతానికి తక్కువ ఉన్న జిల్లా ప్రావిన్సు మొత్తం మీద ఒకటి కూడా లేదు.[38] పంజాబీకి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఏ అధికారిక గుర్తింపు దేశవ్యాప్త స్థాయిలో దక్కలేదు. పంజాబీలు వివిధ తెగలుగా, వంశాలు (Urdu: برادری), కులాలుగా విభజితమైన సమాజం. పాకిస్తానీ పంజాబ్ లో కమ్మరి, కుమ్మరి వంటి సంప్రదాయిక వృత్తులకూ తెగలకు సంబంధం ఉంది.[39] ప్రావిన్సులో మాట్లాడే పంజాబీ మాండలికాల్లో మాఝీ, సరైకి, హిండ్కో ఉన్నాయి.[40] సరైకీ అన్నది దక్షిణ పంజాబ్ లో అత్యంత వ్యాప్తిలో ఉంది,[41] పష్తూ, వాయువ్య పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి అటక్ జిల్లా, మైన్ వాలీ జిల్లాల్లో మాట్లాడతారు.

పంజాబ్(పాకిస్తాన్)లోని మతాలు
మతం శాతం
ఇస్లాం
  
97.21%
క్రైస్తవం
  
2.31%
ఇతరులు†
  
0.48%
మత విస్తరణ
సిక్ఖులు, పార్శీలు, హిందువులు .

పంజాబ్ (పాకిస్తాన్)లోని జనాభాలో 97.21 శాతం సున్నీ హనాఫీ మెజారిటీ, షియా ఇతానా అశరయ్యా మైనారిటీ ముస్లింలు ఉన్నారు. అతిపెద్ద ముస్లిమేతర మత సమాజం క్రిస్టియన్లు, వారు పంజాబ్ జనాభాలో 2.31 శాతం ఉన్నారు. మిగతా 0.48 శాతంలో అహ్మదియాలు, హిందువులు, సిక్ఖులు, పార్శీలు, బహాయ్ లు ఉన్నారు.

ప్రొవిన్షియల్ ప్రభుత్వం

[మార్చు]

పంజాబ్ ప్రభుత్వం పాకిస్తాన్ సమాఖ్య పద్ధతిలో ప్రావిన్సు రాజధాని లాహోర్ కేంద్రంగా కలిగిన ప్రొవిన్షియల్ ప్రభుత్వం. పంజాబ్ ప్రొవిన్షియల్ ప్రభుత్వ నాయకునిగా నడిపించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రిని పంజాబ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా షాబాజ్ షరీఫ్ వ్యవహరిస్తున్నారు. 2009 ఫిబ్రవరి 25 నుంచి 2009 మార్చి 30 వరకూ సాగిన గవర్నర్ పాలన అంతమయ్యాకా షాబాజ్ ను ముఖ్యమంత్రిగా తిరిగి చేశారు. ఆపైన 2013 మే 11 ఎన్నికల ఫలితంగా తిరిగి ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఒకే శాసన నిర్మాణ శైలి కలిగిన శాసన నిర్మాణ వ్యవస్థ. పంజాబ్ ప్రావిన్సు వ్యాప్తంగా ఎన్నికైన సభ్యులు కలిగిన ఈ అసెంబ్లీ లాహోర్ కేంద్రంగా కలిగివుంది. అసెంబ్లీ పాకిస్తాన్ రాజ్యాంగంలోని 106వ అధికరణం ఆధారంగా 66 సీట్లు మహిళలకు, 8 ముస్లిమేతరులకు రిజర్వు అయిన 371 సీట్లతో ఏర్పాటైంది.

డివిజన్లు

[మార్చు]
పాకిస్తానీ పంజాబ్ డివిజన్ల మ్యాప్
Sr. No. డివిజన్ ప్రధాన కేంద్రాలు ప్రాంతం
(చదరపు కిలోమీటర్లు)
జనాభా
(1998)
1 బహవల్ పూర్ బహవల్ పూర్ 45,588 2,433,091
2 దెరా ఘజీ ఖాన్ దెరా ఘజీ ఖాన్ 38,778 4,635,591
3 ఫైసలాబాద్ ఫైసలాబాద్ 17,917 7,429,547
4 గుజ్రన్ వాలా గుజ్రన్ వాలా 17,206 4,800,940
5 లాహోర్ లాహోర్ 16,104 14,318,745
6 ముల్తాన్ ముల్తాన్ 21,137 5,116,851
7 రావల్పిండి రావల్పిండి 22,255 5,363,911
8 సాహివాల్ సాహివాల్ 10,302 2,643,194
9 సర్గోధా సర్గోధా 26,360 4,557,514

2008లో డివిజన్లను తిరిగి స్థాపించినప్పుడు, లాహోర్ డివిజన్ నుంచి షేఖుపురా డివిజన్ విడదీసి పదవ డివిజన్ గా ఏర్పరిచారు.

జిల్లాలు

[మార్చు]
Sr. No. జిల్లా ముఖ్యపట్టణం వైశాల్యం
(చదరపు కిలోమీటర్లలో)
జనాభా
(14 ఆగస్టు 2014)
జనసాంద్రత
(చదరపు కిలోమీటరుకు జనసంఖ్య)
డివిజన్
1 అటక్ అటక్ 6,858 1,274,935 186 రావల్పిండి
2 బహవాల్ నగర్ బహవాల్ నగర్ 8,878 2,061,447 232 బహవాల్ పూర్
3 బహవాల్ పూర్ బహవాల్ పూర్ 24,830 2,433,091 98 బహవాల్ పూర్
4 భక్కర్ భక్కర్ 8,153 1,051,456 129 సర్గోధా
5 చాక్వాల్ చాక్వాల్ 6,524 1,083,725 166 రావల్పిండి
6 చినియోట్ చినియోట్ 965,124 ఫైసలాబాద్
7 దెరాఘజీ ఖాన్ దెరాఘజీ ఖాన్ 11,922 2,643,118 238 దెరాఘజీ ఖాన్
8 ఫైసలాబాద్ ఫైసలాబాద్ 5,856 5,429,547 927 ఫైసలాబాద్
9 గుజ్రన్ వాలా గుజ్రన్ వాలా 3,622 3,400,940 939 గుజ్రన్ వాలా
10 గుజ్రాత్ గుజ్రాత్ 3,192 2,048,008 642 గుజ్రన్ వాలా
11 హఫీజాబాద్ హఫీజాబాద్ 2,367 832,980 352 గుజ్రన్ వాలా
12 ఝంగ్ ఝంగ్ 8,809 2,834,546 322 ఫైసలాబాద్
13 ఝీలం ఝీలం 3,587 936,957 261 రావల్పిండి
14 కసూర్ కసూర్ 4,796 1,466,000 595 లాహోర్
15 ఖానేవాల్ ఖానేవాల్ 4,349 2,068,490 476 ముల్తాన్
16 ఖుషాబ్ ఖుషాబ్ 6,511 1,205,460 185 సర్గోధా
17 లాహోర్ లాహోర్ 1,772 6,318,745 3,566 లాహోర్
18 లాయ్యా లాయ్యా 6,291 1,120,951 178 దెరాఘజీ ఖాన్
19 లోధ్రాన్ లోధ్రాన్ 2,778 1,171,800 422 ముల్తాన్
20 మండి బహుద్దీన్ మండి బహుద్దీన్ 2,673 1,160,552 434 గుజ్రన్ వాలా
21 మైన్ వాలీ మైన్ వాలీ 5,840 1,056,620 181 సర్గోధా
22 ముల్తాన్ ముల్తాన్ 3,720 3,116,851 838 ముల్తాన్
23 ముజఫర్ ఘర్ ముజఫర్ ఘర్ 8,249 2,635,903 320 దెరాఘజీ ఖాన్
24 నారోవాల్ నారోవాల్ 2,337 1,265,097 541 గుజ్రన్ వాలా
25 నాన్ కానా సాహిబ్[42] నాన్ కానా సాహిబ్ 2,960 1,410,000 476 షేఖుపురా
26 ఓకారా ఓకారా 3,004 2,232,992 510 సాహివాల్
27 పాక్పట్టన్ పాక్పట్టన్ 2,724 1,286,680 472 సాహివాల్
28 రహీం యార్ ఖాన్ రహీం యార్ ఖాన్ 11,880 3,141,053 264 బహవాల్ పూర్
29 రాజన్ పూర్ రాజన్ పూర్ 12,319 1,103,618 90 దెరాఘజీ ఖాన్
30 రావల్పిండి రావల్పిండి 5,286 3,363,911 636 రావల్పిండి
31 సాహివాల్ సాహివాల్ 3,201 1,843,194 576 సాహివాల్
32 సర్గోధా సర్గోధా 5,854 2,665,979 455 సర్గోధా
33 షేఖుపురా షేఖుపురా 15,960 2,321,029 557 షేఖుపురా
34 సియాల్ కోట్ సియాల్ కోట్ 3,016 1,688,823 903 గుజ్రన్ వాలా
35 తోబా టెక్ సింగ్ తోబా టెక్ సింగ్ 3,252 1,621,593 499 ఫైసలాబాద్
36 వేహారీ వేహారీ 4,364 2,090,416 479 ముల్తాన్

ప్రధాన నగరాలు

[మార్చు]
పాకిస్తానీ పంజాబ్ లోని ప్రధాన నగరాల జాబితా
ర్యాంక్ నగరం జిల్లా జనాభా



ఫైసలాబాద్

రావల్పిండి

1 లాహోర్ లాహోర్ 14,500,000
2 ఫైసలాబాద్ ఫైసలాబాద్ 7,380,000
3 రావల్పిండి రావల్పిండి 5,891,656
4 ముల్తాన్ ముల్తాన్ 5,206,481
5 గుజ్రన్ వాలా గుజ్రన్ వాలా 4,769,090
6 సర్గోధా సర్గోధా 4,557,514
7 బహవాల్ పూర్ బహవాల్ పూర్ 2,443,929
8 సియాల్ కోట్ సియాల్ కోట్ 1,910,863
9 షేఖుపురా షేఖుపురా 426,980
10 ఝంగ్ ఝంగ్ 372,645
11 గుజ్రాత్ గుజ్రాత్ 530,645
12 దెరా ఘజీ ఖాన్ దెరా ఘజీ ఖాన్ 630,645
Source: World Gazetteer 2010[43]
ఇది ప్రతి నగరపు జనాభాల జాబితా తప్ప జిల్లా మొత్తపు జాబితా కాదు

ఆర్థిక రంగం

[మార్చు]
ప్రావిన్సుల వారీగా జీడీపీ

పాకిస్తాన్ ఆర్థిక రంగంలో పంజాబ్ ది అతిపెద్ద వాటా, ఇది దేశ స్థూల జాతీయోత్పత్తికి ప్రధానమైన దన్నుగా నిలుస్తోంది. ప్రావిన్సు ఆర్థిక స్థితి 1972 నుంచి నాలుగు రెట్లుగా వృద్ధి చెందడం ప్రారంభమైంది.[44] పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తిలో 2000 నాటికి 54.7 శాతం, 2010 నాటికి 59శాతం వాటా పంజాబ్ దే. పాకిస్తాన్ ఆర్థిక రంగంలో సేవా, వ్యవసాయ రంగాల్లో పంజాబ్ ఆధిక్యత మరింత సుస్పష్టం. సేవారంగంలో 52.1 నుంచి 64.5 శాతం, వ్యవసాయ రంగంలో 56.1 నుంచి 61.5 శాతం పంజాబ్ వాటానే. పాకిస్తాన్ లో కెల్లా సాంకేతికంగా అత్యంత సుశిక్షితులైన నిపుణులతో అది మానవవనరుల విషయంలోనూ ముందంజలో ఉంది. తయారీ రంగంలోనూ పంజాబ్ ఆధిక్యత కలిగివుంది, ఐతే ఈ రంగంలో ఆధిక్యత మరీ అత్యధికం కాదు, చారిత్రికంగా దాని వాటా కనిష్ఠంగా 44 శాతం, గరిష్ఠంగా 52.6 శాతంగా ఉంది.[45] 2007లో పంజాబ్ 7.8% వృద్ధి రేటు సాధించింది.[46] 2002-03 నుంచి 2007-08 వరకూ సాలీనా 7 నుంచి 8 శాతం వృద్ధిరేటు కలిగివుంది. 2009లో విడుదలైన ఒక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా నగరాల స్థూలజాతీయోత్పత్తిని సర్వే చేయగా, ఫైసలాబాద్ జిడిపి $35 బిలియన్లుగా తేలింది. ఈ నగరం కరాచీ ($78 బిలియన్లు), లాహోర్ ($40 బిలియన్లు) తర్వాత పాకిస్తాన్ లో మూడవ స్థానంలో నిలుస్తోంది. ఫైలాబాద్ జిడిపి 5.7 శాతం చొప్పున 2025 నాటికి $37 బిలియన్లు అవుతుందని అంచనా, కరాచీ (5.5 శాతం), లాహోర్ (5.6 శాతం) ల వృద్ధి అంచనా కన్నా ఇది ఎక్కువ.[47][48] 2008-09లో పాకిస్తానీ జీడీపీ వృద్ధిరేటు 4శాతం కాగా, నగరపు వృద్ధి రేటు 6శాతం.

సముద్ర తీరం లేకపోయినా పంజాబ్ పాకిస్తాన్ లోకెల్లా అత్యంత పారిశ్రామికీకరణ పొందిన ప్రాంతం; పంజాబ్ లోని తయారీ పరిశ్రమలు వస్త్రాలు, క్రీడా పరికరాలు, భారీ యంత్రాలు, విద్యుత్ సామాగ్రి, శస్త్రచికిత్స ఉపకరణాలు, వాహనాలు, ఆటో విడిభాగాలు, లోహాలు, పంచదార, విమానయాన సామాగ్రి, సిమెంట్, వ్యవసాయ పరికరాలు, సైకిళ్ళు, రిక్షాలు, ఫ్లోరింగ్ ఇటుకలు, నిల్వ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. 2003లో దేశంలో తయారయ్యే 90శాతం పేపర్, పేపర్ బోర్డులు, 71శాతం ఎరువులు, 69శాతం పంచదార, 40శాతం సిమెంట్ ఉత్పత్తి చేసింది.[49]

దస్త్రం:Industrial Zones Punjab.jpg
పంజాబ్ లోని పారిశ్రామిక ప్రదేశాలు, Source:[50]
దస్త్రం:Punjabadmin.jpg
పంజాబ్ కు చెందిన గత పరిపాలనా విభాగాలు

ఉష్ణమండల తడి పొడి వాతావరణం ఉన్నా, విస్తారంగా నీటివసతి కలిగివుండడం వ్యావసాయికమైన సమృద్ధికి కారణమైంది. పశ్చిమ పంజాబ్ లో బ్రిటీష్ వారు నిర్మించిన కాలవల నీటిపారుదల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి కాలవల వ్యవస్థ. గోధుమ, పత్తి ప్రధాన పంటలు. ఇతర పంటల్లో వరి, చెరుకు, జొన్న, మొక్కజొన్న, నూనె గింజలు, పప్పు దినుసులు, కూరగాయలు, కినూ వంటి పళ్ళు వగైరా ఉన్నాయి. పశువుల పెంపకం, పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా ప్రధానమైనవే. పూర్వ విరోధాలు ఎలావున్నా పాకిస్తానీ పంజాబ్ లోని వ్యవసాయ క్షేత్రాల్లో విత్తడానికి, కోతలకీ హిందూ క్యాలెండర్ నే వాడతారు.

దేశంలోని సాలీనా ఆహారోత్పత్తిలో 76శాతం పంజాబ్ నుంచే వస్తుంది. పత్తి, వరి ప్రధానంగా వాణిజ్య పంటలుగా ఉపకరించి దేశఖజానాకు సంపద చేకూరుస్తూంటాయి. వ్యవసాయంలో స్వయంసమృద్ధి సాధించే ఉండడంతో వ్యూహాన్ని చిన్న తరహా, మధ్యతరహా వ్యవసాయం, పంటపొలాల నుంచి మార్కెట్ కు దృష్టిని, గొట్టపుబావులకు విద్యత్తును అందించడం, నీటి నిలువ, ఉప్పదనం తగ్గించడం వంటివాటిపై పెట్టారు.

పంజాబ్ లో 68 వేల పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. 39,033 చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలు 14,820, జిన్నింగ్ పరిశ్రమలు 6,778, వ్యావసాయిక ముడి పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లు 7,355, వీటిలో ఆహార పరిశ్రమలూ ఉన్నాయి.

లాహోర్, గుజ్రన్ వాలా డివిజన్లలో అత్యంత ఎక్కువ చిన్నస్థాయి మధ్యతరహా ఇంజనీరింగ్ యూనిట్లు ఉన్నాయి. సియాల్ కోట్ జిల్లా ఆట వస్తువులు, శస్త్రచికిత్స పరికరాలు వంటివి తయారీలో పేరుగడించింది.

మూలాలు

[మార్చు]
  1. "Rafique Rajwana takes oath as Punjab governor". Pakistan Express Tribune. Retrieved 10 May 2015.
  2. 2.0 2.1 Bureau of Statistics, Government of the Punjab Archived 2016-06-29 at the Wayback Machine (2015)
  3. "Provincial Assembly – Punjab". Archived from the original on 2009-02-01. Retrieved 2016-07-03.
  4. 4.0 4.1 4.2 "Symbols of Punjab". knowpakistan.gov.in. Retrieved 14 August 2013.[permanent dead link]
  5. 5.0 5.1 5.2 "Punjab Key Indicators" (PDF). Retrieved 14 August 2013.[permanent dead link]
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-01. Retrieved 2016-07-03.
  7. Ian S Livingston; Micheal O'Hanlon (29 November 2011). "Pakistan Index" (PDF). Brookings. Retrieved 8 February 2012.
  8. John Pike. "The Growing Threat in Pakistan's Punjab". Retrieved 22 April 2015.
  9. Punjab’s economic importance
  10. John Pike. "Lahore Cantonment". Retrieved 22 April 2015.
  11. Singh, Pritam (2008). Federalism, Nationalism and Development: India and the Punjab Economy. London; New York: Routledge. p. 3. ISBN 0-415-45666-5.
  12. Manmohan Singh, H. K. "Punjab". Encyclopaedia of Sikhism. Punjabi University Patiala. Retrieved 15 May 2016.
  13. Choudhary Rahmat Ali (28 January 1933). "Now or Never. Are we to live or perish forever?". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  14. S. M. Ikram (1 January 1995). Indian Muslims and partition of India. Atlantic Publishers & Dist. pp. 177–. ISBN 978-81-7156-374-6. Retrieved 23 December 2011.
  15. Gazetteer of the Bombay Presidency ... Retrieved 22 April 2015.
  16. Gazetteer of the Bombay Presidency ..., Volume 1, Part 1-page-11
  17. "Punjab History – history of Punjab". Archived from the original on 2011-08-22. Retrieved 2016-07-05.
  18. McGregor, R. Stuart (1984). A History of Indian Literature: Hindi Literature from its Beginning to the Nineteenth Century. Vol.8, Fasc. 6. p. 03. "Gurjara-Pratihara empire, comprising the territories stretching between Bihar, the Panjab and Kathiawar, was the last great pre-Muslim empire of north India."
  19. Gokhale, B. Govind (1995). Ancient India: History and Culture. p. 84. "The Gurjara-Pratiharas became an imperial power controlling Eastern Punjab, Rajasthan, Uttar Pradesh and parts of Madhya Pradesh and Saurashtra."
  20. "Bhardwaj, A.P. (2010). Study Package for CLAT (Common Law Admission Test) & LL.B. Entrance Examinations (PU, DU, KU, HPU, AIL, Pbi. Univ, GNDU, Symbiosis). p. B19. "1. They are also called Gurjara-Pratihara. 2. They established their sway over Punjab, Malwas and Broach."
  21. Meri, p.91
  22. http://mughalgardens.org/html/shalamar.html
  23. "The History of Afghanistan". Retrieved 20 March 2015.
  24. Advanced Study in the History of Modern India: 1707 – 1813 – Jaswant Lal Mehta – Google Books. Books.google.co.in. Retrieved on 12 July 2013.
  25. Roy, Kaushik. India's Historic Battles: From Alexander the Great to Kargil. Permanent Black, India. pp. 80–1. ISBN 978-81-7824-109-8.
  26. Elphinstone, Mountstuart (1841). History of India. John Murray, Albermarle Street. p. 276.
  27. ఈ యుద్ధం గురించిన విస్తారమైన వివరణ కోసం H. G. Keene రాసిన The Fall of the Moghul Empire of Hindustan Archived 2011-07-10 at the Wayback Machine నాల్గవ ఛాప్టర్ చూడండి.
  28. Mortimer, Edward, Faith and Power, (1982), p.68-70
  29. Grey, C. (1993). European Adventures of Northern India. Asian Educational Services. pp. 343–. ISBN 978-81-206-0853-5.
  30. గుహా, రామచంద్ర. "స్వాతంత్ర్యం - పితృవధ". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు (ఆంగ్లం నుంచి అనువాదం)). ఎమెస్కో ప్రచురణలు. టంకసాల అశోక్ తెలుగు అనువాదం{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  31. The Punjab in 1920s – A Case study of Muslims, Zarina Salamat, Royal Book Company, Karachi, 1997. table 45, pp. 136. ISBN 969-407-230-1
  32. Dube, I. &. S. (2009). From ancient to modern: Religion, power, and community in India hardcover. Oxford University Press.
  33. "Mercury drops to freezing point – Dawn Pakistan".
  34. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-23. Retrieved 2016-07-06.
  35. pop by province – statpak.gov.pk[permanent dead link]
  36. Population shoots up by 47 percent since 1998 Archived 2012-07-01 at the Wayback Machine. Thenews.com.pk. Retrieved on 12 July 2013.
  37. "Percentage Distribution of Households by Language Usually Spoken and Region/Province, 1998 Census" (PDF). Pakistan Statistical Year Book 2008. Federal Bureau of Statistics – Government of Pakistan. Archived from the original (PDF) on 5 ఫిబ్రవరి 2016. Retrieved 2 February 2016.
  38. Pakistan Narcotics Control Board 1986, p. 7.
  39. Muslim peoples: a world ethnographic survey / Richard V. Weekes, editor-in-chief Greenwood Press 1978
  40. Shackle, Christopher (December 2014). "Siraiki language". Encyclopaedia Britannica. Retrieved 12 August 2015.
  41. "Saraiki, a Language of Pakistan". Ethnologue. Retrieved 25 September 2015.
  42. (in English) Internet Edition, Dawn Newspaper. "Nankana becomes district". Retrieved 14 April 2006.
    No data is yet available on the recently created district of Nankana.
  43. "Pakistan: Largest cities and towns and statistics of their population". Archived from the original on 17 అక్టోబరు 2013. Retrieved 10 February 2011.
  44. World Bank Document
  45. "Provincial Accounts of Pakistan: Methodology and Estimates 1973–2000" (PDF).[permanent dead link]
  46. "The News International: Latest, Breaking, Pakistan, Sports and Video News". Archived from the original on 28 జూలై 2020. Retrieved 22 April 2015.
  47. "PricewaterhouseCoopers Media Centre". Ukmediacentre.pwc.com. 1 June 2005
  48. – Last Paragraph[permanent dead link]
  49. "Punjab Gateway" (PDF). Archived from the original (PDF) on 2007-07-05. Retrieved 2016-07-07.
  50. Industrial Zone Punjab, Pakistan