వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Tamil Wikipedia turns 10. We need your wishes: కొత్త విభాగం
పంక్తి 68: పంక్తి 68:
--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)
--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)
:మంచి ప్రయత్నం. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)
:మంచి ప్రయత్నం. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)

== Tamil Wikipedia turns 10. We need your wishes ==

Andharukku Namaskaram :) This is Ravi from Tamil Wikipedia. We are celebrating our 10 years with an [[:ta:விக்கிப்பீடியா:தமிழ் விக்கிப்பீடியா பத்தாண்டுகள் நிறைவுக் கூடல், சென்னை/en|event in Chennai on 29th September]]. I invite you all to join us as it would be great to share our experiences and learn from each other. If you cannot make it to the event, [https://ta.wikipedia.org/w/index.php?title=%E0%AE%A4%E0%AE%AE%E0%AE%BF%E0%AE%B4%E0%AF%8D_%E0%AE%B5%E0%AE%BF%E0%AE%95%E0%AF%8D%E0%AE%95%E0%AE%BF%E0%AE%AA%E0%AF%8D%E0%AE%AA%E0%AF%80%E0%AE%9F%E0%AE%BF%E0%AE%AF%E0%AE%BE_%E0%AE%AA%E0%AE%A4%E0%AF%8D%E0%AE%A4%E0%AE%BE%E0%AE%A3%E0%AF%8D%E0%AE%9F%E0%AF%81%E0%AE%95%E0%AE%B3%E0%AF%8D/%E0%AE%B5%E0%AE%BE%E0%AE%B4%E0%AF%8D%E0%AE%A4%E0%AF%8D%E0%AE%A4%E0%AF%81%E0%AE%95%E0%AE%B3%E0%AF%8D/Telugu_Wikipedia&action=edit&redlink=1 please leave your best wishes for us here]. --[[వాడుకరి:Ravidreams|Ravidreams]] ([[వాడుకరి చర్చ:Ravidreams|చర్చ]]) 22:51, 19 సెప్టెంబర్ 2013 (UTC)

22:51, 19 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

<br=clear all>

బ్లాగులింకుల మయం

గత వారంరోజులుగా తెవికీ వ్యాసాలలో బ్లాగులింకులివ్వడం అతి అయిపోయింది. (నేను మాత్రం రెండు రోజుల క్రితమే చూశాను) కాపీ చేసిన వ్యాసాలు చేర్చడమే తప్పయితే, పైగా వాటికి బ్లాగులింకులివ్వడం మరోపొరపాటు. ఒకవేళ నిజంగా బ్లాగునిర్వాహకులే రచించిన వ్యాసాలు అనుమతిలో తెవికీలో చేర్చాలన్ననూ ముఖ్యమైన వాక్యాల చివరన మాత్రమే రెఫరెన్స్ పెట్టాలి కాని, మూలం అనే విభాగంలో కాదు. అలా ఇస్తే భవిష్యత్తులో ఇతరవనరుల నుంచి తీసుకున్న సమాచారానికి కూడా ఇదే లింకు ఆధారమని పొరపడే అవకాశముంది. ఇచ్చిన బ్లాగులింకులు కూడా వ్యాసాలలో ఎక్కడెక్కడో ఇష్టమున్నట్లుగా చేర్చారు. కొన్ని వ్యాసాలలో ప్రారంభంలో, (చూడండి:ఓలర్) కొన్నింటిలో మధ్యలో చేర్చడమే కాకుండా చాలా వ్యాసాలలో visit my Website Dr Seshagirirao, MBBS అని చేర్చడం దేనికి? (చూడండి: కాకర, తమలపాకు, బ్లూబెర్రీ, చిట్కాలు, చిక్కుడు, సమతౌల్యపౌష్టికాహారం) మరికొన్ని వ్యాసాలలో వ్యాసంలో మధ్యలోనే Collected /dr.seshagirirao-MBBS (Srikakulam) చేర్చే అవసరం ఏమిటి? (చూడండి: ఆలివ్ నూనె), మరికొన్ని వ్యాసాలలో "వివిధ వార్తా పత్రికల నుండి విషయ సేకరణ్ . (డా. వందన శేషగిరిరావు ...శ్రీకాకుళం)" అని చేర్చారు.(చూడండి: తేనె) అంటే పత్రికలలో వచ్చినదిగా చెబుతూనే పేరు వ్రాయడమెందుకు? మక్కికిమక్కి తీసుకోవడానికి సేకరణ అనరు, కాపీ అంటారు. తెవికీ అనేది బ్లాగులను ప్రచారం చేసే వేదిక కాదుకదా! కొన్ని వ్యాసాలలో ఒక్క వాక్యం కూడా లేదు, అలాంటి వ్యాసాలలో కూడా బ్లాగులింకులివ్వడం దేనికి? (చూడండి: హింషెన్‌వుడ్, వాల్టర్, హీమర్, బాయిల్) మరికొన్ని వ్యాసాలలో ఇదివరకే సమాచారం ఉన్ననూ కేవలం బ్లాగులింకు ఇవ్వడం కొరకే దిద్దుబాట్లు చేసినట్లు తెలిసింది. (చూడండి:వాల్తెర్‌బోథె, స్టీఫెన్‌హాకింగ్, రవీంద్రనాథ్‌ఠాగూర్,) కొన్ని వ్యాసాలలో బ్లాగరు పేరు చేర్చారు (చూడండి: జీడిపప్పు, బీటుదుంప) ఈ అనవసర లింకులన్నీ తొలిగించబడ్డాయి. ఇకముందైనా ఇలాంటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:19, 7 సెప్టెంబర్ 2013 (UTC)

ఆవును.ఈ విషయంలో సభ్యులు,నిర్వాహకులు తగిన విధంగా స్పందించి,అభిప్రాయాలు వెల్లడించిన, తదనుగుణంగా రచనలు చెయ్యటానికి వీలుంటుంది.మనకు రాశికన్న వాసి ముఖ్యం.అవసరమైతే కొన్ని మార్గదర్శకసూత్రాలను రచయితలకు అందుబాటుగా వుంటేటట్లు సభ్యుల చర్చాపేజిలో ఉంచిన మంచిదేమో?పాలగిరి (చర్చ) 01:05, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • పైన తెలిపిన వాటితో నేను ఏకీభవిస్తాను.--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే పుస్తకంలోఅందుబాటులో వున్నవాటిని యథాతథంగా చేర్చటానికి వికీసోర్స్ ఉత్తమం. గమనించండి--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీకి ఆమోదయోగ్యంకాని వ్యాసం పేర్లు

ఇటీవల తెవికీలో వచ్చిన వ్యాసాలను గమనిస్తే వ్యాసం పేర్లు వికీపీడియాలో పెట్టడానికి ఆమోదయోగ్యంగా లేనట్లుగా కనిపిస్తోంది.
1) వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది? అనే పేరుతో వ్యాసం సృష్టించడానికి బదులు అందులో అవసరమైన సమాచారం ఉంటే వంటనూనెలు వ్యాసంలో చేర్చితే సరిపోయేది. ఏ విషయంలోనైనా ఏది మంచిది? అనే విషయాన్ని తెవికీ ఎప్పుడూ చెప్పదు. అన్ని అభిప్రాయాలతో కూడిన సమాచారం, దానికి తగిన మూలాలతో కూడిన వ్యాసం మాత్రమే ఇక్కడ ఉండాలి.
2)ఆరోగ్యానికి టమేటా లాంటి శీర్షికలు పత్రికలు, మేగజైన్ల వారు సృష్టిస్తారు కాని మనకు మాత్రం అలాంటి సమాచారం అందుబాటులో ఉన్నా టమేటా వ్యాసంలో చేరిస్తే సరిపోతుంది. ‎ఆరోగ్యానికి పానీయాలు వ్యాసాలపేర్లు కూడా ఇంతే. గోజి...సూపర్‌ఫ్రూట్‌ వ్యాసం పేరే కాకుండా సమాచారం కూడా తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. "కాబట్టి 'గో గోజి...' అన్న స్లోగన్‌ మెల్లగా మనకీ విస్తరించినా ఆశ్చర్యం లేదు" అని మనం చెప్పడానికి వీలుండదు.
3)ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన పేరుతో పాటు వ్యాస ప్రారంభమూ ప్రమాణంగా లేదు. "మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే..." తో ప్రారంభమైన వ్యాసంలో "అనుకుంటాం", "అనుకోవచ్చు" లాంటి పదాలు వాడినారు (ఉంచారు). వ్యాసంలో మన స్వంత అభిప్రాయాలు ఉండరాదు కదా! ఆ విషయం ఎవరైనా చెబియుంటే ఫలానా వారు ఇలా చెప్పారు అని వ్రాసి రెఫరెన్స్ ఉంచాలి.
4)పైడి జైరాజ్ -హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో పేరు గురించి ఇదివరకే చెప్పాను. పొట్టలో క్రొవ్వు పెరుగుదల, పిల్లలలో చురుకుదనం తగ్గుదల, ఉద్యోగినుల పోషకాహారం, ఆహారము తో పెయిన్ కిల్లర్లు లాంటి వ్యాసాలలో పేరుతో సహా సమాచారం కూడా పత్రికల శైలిలోనే ఉంది.
5) శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌ పేరుతో సహా సమాచారం చూస్తే "శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే..." వాక్యంతో ప్రారంభమౌతుంది. అలా అని మనం ఎలా చెప్పగలం. తెవికీ వ్యాసం అనేది బాడీలోషన్ కంపెనీకి చెందిన ప్రకటన కాదుకదా!
పత్రికలలో వచ్చిన సమాచారం కాపి చేయడం (వయా బ్లాగు) వల్ల ఈ సమస్యలు వచ్చినట్లుగా భావిస్తున్నాను. ఇలాంటి వ్యాసాలలో అవసరమైన కొద్ది సమాచారం మాత్రమే ఉంచి (లేదా సంబంధిత వ్యాసాలకు తరలించి) పూర్తిగా వికీకరణ చేయాల్సి ఉంటుంది. ఇకముందైనా సభ్యులు కాపీ వ్యాసాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:30, 9 సెప్టెంబర్ 2013 (UTC)

వ్యాసాల శీర్షికలు చాలా పెద్దవిగా ఉండటం వాస్తవం. ఆ వ్యాసాలను యింతకు ముందు తెవికీ లో ఉన్న తగిన వ్యాసంలో విలీనం మూస ఉంచినట్లయితే వాటిపై చర్చించి తగు విధంగా విలీనం చేయవచ్చు. కొన్ని వ్యాసాలు యిది వరకు లేనివైతే వాటి పేర్లను తగువిధంగా సంగ్రహంగా అర్థం అయ్యేటట్లు వికీ నియమావళికి అనుగుణంగా తరలించవచ్చు. పైన చేర్చిన వ్యాసాలను తగు విధంగా వికీ నియమాల ప్రకారం వికీకరణను చేపట్టవలసి యున్నది. ఈ వికీకరణ లో నేను తగు విధంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 13:10, 10 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఆయా వ్యాసాములలోని సమాచారమును అనుబంధ వ్యాసాలలో చేరిస్తే సమంజసంగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:00, 10 సెప్టెంబర్ 2013 (UTC)
ఇవన్నీ మేగజిన్ సరుకు. వీటిని శుద్ధి చేయాలంటే చాలా ఓపిక, శ్రమ కావాలి దానికి బదులు నాణ్యమైన సమాచారాన్ని ఆంగ్ల వ్యాసాలనుండి అనువదించవచ్చు --వైజాసత్య (చర్చ) 02:04, 11 సెప్టెంబర్ 2013 (UTC)

ఏమిటీ లింకులు

ఇటీవల జరిగిన వ్యాసపు దిద్దుబాట్లలో కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే చాలా వ్యాసాపు మూలాలలో ఒక లింకు ఉన్నట్లుగా, దాన్ని నొక్కితే మళ్ళీ అదే వ్యాసపు ఎడిట్ పేజీ తెరుచుకుంటున్నట్లుగా గుర్తించాను. వందలాది వ్యాసాలలో ఇలాంటి లింకులున్నట్లు నా దృష్టికి వచ్చింది. అలాంటి లింకులవల్ల ఉపయోగమేమీ లేదు, వ్యాసాన్ని ఎడిట్ చేయాలంటే పైన ట్యాబ్ ఎలాగూ ఉంటుంది, మరి దీని ఉపయోగమేమిటో ఎందుకు చేర్చారో తెలియదు. కొన్ని వ్యాసాలలో ఇలాంటి లింకులు రెండేసి చొప్పున ఉన్నాయి. (చూడండి: అనాస, గ్రీన్‌టీ) కొన్నింటిలో నేను తొలిగించాను. ఇంకనూ తొలిగించాల్సినవి చాలా ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 10 సెప్టెంబర్ 2013 (UTC)

ఏక వాక్య వ్యాసాలు

ఈ మధ్య ఏక వ్యాసాలు అధికంగా చేరుతున్నాయి. ఏక వాక్యాలపై యిదివరలో చర్చ జరిగింది. 2 కె.బి పరిమాణం దాటితే మొలక స్థాయి దాటునట్లు నిర్ణయించారు. కానీ ఒక వాక్యాన్ని కూడా వ్యాసంగా చేర్చుతున్నారు. యిలాంటివి విక్షనరీలో చేర్చవచ్చు. కానీ వికీపీడియాలో విపరీతంగా చేరుతున్నాయి. శాస్త్రవేత్తల వ్యాసాలలో విషయమేమీ లేకుండా సమాచార పెట్టె తో అదీ ఆ సమాచార పెట్టె కూడా అనువాదం కాకుండా గల వాటితో మొలక వ్యాసాలు చేరుతున్నాయి. యిటువంటి వ్యాసాలను చేర్చరాదని మనవి. తెవికీలో రాశి కన్నా వాసి ముఖ్యం అని గమనించాలి. మనం తలచుకుంటే అనేక వాసిగల వ్యాసాలను తయారుచేయగలం. మరి ఎందుకు యిలాంటి లఘువ్యాసాలు? యివి ఎవరికి ఉపయోగపడతాయో వ్యాసకర్తలు ఆలోచించవలసియున్నది.---- కె.వెంకటరమణ చర్చ 04:45, 11 సెప్టెంబర్ 2013 (UTC)

వికీ బడి

మీ చర్చలను చర్చ:వికీ బడి పేజీలో రాయగలరు

నేను వికీ బడి అనే శీర్షికన క్రియాశీలక సభ్యులకు వికీపాఠాలు నిర్వాహించదలచుకున్నాను. ఇవి కొత్తసభ్యులను ఉద్దేశించినవి కావు. ఆసక్తి ఉన్నవారు ఈ దిగువన పేరు జతచేయండి. అందరికీ తగిన సమయం చూసి అంతర్జాల తరగతులను నిర్వహించగలను --వైజాసత్య (చర్చ) 05:00, 12 సెప్టెంబర్ 2013 (UTC)

  • మంచి ఆలోచన. ఉదాహరణగా మొదటి కార్యక్రమానికి పాఠాల శీర్షికలు తెలిపితే ఆసక్తిగలవారు పేరు చేర్చటానికి సులభమవుతుంది.--అర్జున (చర్చ) 05:33, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీలో నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. నన్ను మీ బడిలో విద్యార్థిగా నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 05:38, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నేను కూడా,ఇలాంటివి నాకు తెలియవు.పాలగిరి (చర్చ) 07:18, 12 సెప్టెంబర్ 2013 (UTC)
తొలి పాఠం - మూలాలు, ఉదహరింపులు, మూలలను చేర్చే విధానం, వికీలో మూలాలను ఉదహరించడంపై ఉన్న నియమనిబంధనలు, మార్గదర్శకాలు, మూలాల నాణ్యతను బేరీజు వెయ్యటం, బ్లాగులను ఉదహరించడం, సమాచారపు తనిఖీ మొదలుగు అంశాలని అనుకుంటున్నాను. నేను ఈ పాఠానికి కావలసినవి సమకూర్చుకోవటానికి ఒక రెండు వారాలు పడుతుంది.
రెండవ పాఠం - విజ్ఞానసర్వస్వపు రచనాశైలి - వివిధ రచనాశైలులలో ఉన్న వ్యత్యాసాలు (వార్తలు, మేగజిన్లు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ట్రావెల్‌గైడ్స్, స్వీయ చరిత్రలు) డూస్ అండ్ డోంట్స్ (చేయకూడనివి, చేయవలసినవి)
మూడవ పాఠం - వికీపీడియాలోని వివిధ తత్త్వాలు, అభిమతాలు - వాటి పరిశీలన. దైనందిన దిద్దుబాటు క్రమంలో వీటి influence (అన్వయం?)
నాలుగవ పాఠం - వికీపీడియా ఏమిటి, ఏది కాదు, వికీపీడియా యొక్క పరిధి, ఇతర సోదర వికీమీడియా ప్రాజెక్టులతో గల సంబంధం.
ఐదవ పాఠం - వికీ సభ్యుల ప్త్రవర్తనా నియమావళి, ఎలా నడచుకోవాలి, ఎందుకలా నడచుకోవాలి, సభ్యుల మధ్య సంబంధాలు.
ఆరవ పాఠం - బొమ్మలు చేర్చటం, సేకరించడం, కాపీహక్కులు, సముచిత వినియోగం, క్లుప్తంగా సంబంధింత కాపీహక్కుల లైసెన్సులపై చర్చ, కొన్ని కాపీహక్కుల చట్టాలపై చర్చ.
ఏడవ పాఠం - నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు
ఇవి నాకు ప్రస్తుతానికి తోచిన కొన్ని అంశాలు. ఇంకా ఏవైనా మీకు తోచితే జోడించగలరు. --వైజాసత్య (చర్చ) 06:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నాకూ మీ బడిలో పాథాలు నేర్చుకోవాలనుంది. నన్నూ చేర్చుకోగలరు. దీనికి ఒక పేజీ తయారు చేసి అందులో రాస్తే బావుంటుందిగా. చర్చా పేజీలో వీటికి సంభందించిన చర్చలు రాయొచ్చు..విశ్వనాధ్ (చర్చ) 06:59, 12 సెప్టెంబర్ 2013 (UTC)
"వికీ బడి" అనేది మంచి ఆలోచన. వికీలో రచనలు చేసే విధానం చాలా మందికి తెలియవలసిన అవసరం ఉంది. మూలాలు, లింకులు చేర్చడం, దస్త్రాలను దిగుమతిచేయడం , కాపీహక్కులు , తెవికీ మార్గదర్శకాల గూర్చి తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. నేను తెవికీ లో అనేక రంగాలలో రచనలు చేయగలను. కానీ విధివిధానాలు స్పష్టంగా తెలుసుకోవాలని ఉంది.అందువలన తెవికీ బడిలో నన్ను చేర్చుకోండి.---- కె.వెంకటరమణ చర్చ 10:13, 12 సెప్టెంబర్ 2013 (UTC)
విధివిధాన పరిజ్ఞానము కొరకు నేను కూడ "వికీ బడి" లో చేరాలని వుంది. Bhaskaranaidu (చర్చ) 11:24, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీబడి శిక్షణ అనేది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది సమస్యగా మారింది. "కాసే చెట్లకే దెబ్బలు అన్నట్లు" నిర్వహణ చేసే వారికే చివాట్లు రివార్డులుగా లభిస్తున్నాయి. దాంతో నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు! సభ్యులందరికీ నిబంధనలపై అవగాహన ఉంటే నిర్వహణ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వికీశిక్షణ అనేది అందరూ ఆనందంగా స్వాగతించాల్సిన ఒక శిక్షణా కార్యక్రమం. అయితే ఈ అంతర్జాల తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనేది తెలిస్తే పూర్తిగా విశ్లేషించడానికి వీలవుతుంది. నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే దీన్ని తెవికీలోనే నిర్వహించాలి. ఛాట్ రూపంలో అయితే ఆ సమయంలో మనకు వేరే వ్యాపకాలుండవచ్చు. తెవికీ పేజీలోనే అక్షరరూపంలోనే వారానికి ఒక పాఠం చొప్పున రోజూ వివరించాలి. సభ్యుల అభిప్రాయాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో చేరే సభ్యులకే కాకుండా ఇప్పటి సభ్యులకు ఏమైనా అనుమానాలువచ్చినప్పుడు మరోసారి ఆ పేజీని దర్శించడానికి వీలవుతుంది. దీనికి అదనంగా వీడియో ఉన్నా మంచిదే. కొన్ని సందర్భాలలో యానిమేషన్ చిత్రాలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడతాయి. అలాగే "నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు" అనే విషయాన్ని చివరి పాఠంగా పెట్టారు, అసలు దాన్నే మొదటిపాఠంగా పెడితే బాగుంటుంది. క్రియాశీలకంగా ఉండే సభ్యులు చాలా వరకు నిర్వాహకులై ఉంటారు. కాబట్టి వారి ప్రధాన బాధ్యత అయిన నిర్వహణ ఎలా చేయాలి? నియమాలు ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతమున్న నియమాలు ఏమిటి? ఒక నియమానికి మరో నియమానికి ఘర్షణ వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చూపించాలి? ప్రస్తుతం నిర్వహణ ఎలా ఉంది? దీనిలో లోటుపాట్లేమి? దీన్ని సరిదిద్ది భవిష్యత్తులో నిర్వహణ ఎలా మెరుగుపర్చాలి? నియమాలు స్పష్టంగా లేనప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? తదితర విషయాలు ప్రారంభంలోనే తెలియపర్చి ఆ తర్వాత మీరు పాఠాలు ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మొదటి పాఠానికి ఎలాగూ రెండు వారాల సమయం అవసరమంటున్నారు కాబట్టి అంతకు ముందే నిర్వాహకత్వ బాధ్యతలు పాఠం ప్రారంభిస్తే సరిపోతుంది. ఒక పాఠానికి సంబంధించి వివరించేటప్పుడు ప్రస్తుత నిబంధనలు, ఆ విషయంపై ఇప్పటివరకు జరిగిన చర్చలు (ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ వెదకాల్సిఉంటుంది), చర్చలపై తీసుకున్న నిర్ణయాలు, మారిన పరిస్థితులకనుగుణంగా మళ్ళీ చేయాల్సిన మార్పులు-చేర్పులు, సోదర వికీలలో ఇవే అంశానికి సంబంధించి నియమాలు ఎలా ఉన్నాయి (పరిశీలనకు మాత్రమే), వికీ పురోవృద్ధితో పాటు మారాల్సిన నిబంధలు ఏమిటి? నియమాలు ఏ సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలా అనేక అంశాలు పాఠ్యాంశంలోకి తీసుకోవాలి. అన్నింటికంటే ముందుగా (నిర్వాహక బాధ్యతల తర్వాత) వికీ మూల నియమాలు ఏమిటి? వాటిని ఎలా వర్తింపజేయాలి? వాటికి భిన్నంగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటివి కూడా తొలిదశలోనే శిక్షణ ఇస్తే బాగుంటుంది. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తే సమీక్షించడానికి వీలవుతుంది. ఆ పిదప శిక్షణా కార్యక్రమ ఎజెండాను ఖరారుచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:21, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నిర్వహణ పాఠం నుండి మొదలుపెట్టడానికి అభ్యంతరమేమీ లేదు. నేనింకా ఈ పాఠాలకు పూర్తిగా ప్రణాళిక వేసుకోలేదు. కాకపోతే వీటిలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయంపై స్థూలంగా కొన్ని ఆలోచనలున్నాయి. వీటిని పాఠ్యప్రణాళిక తయారుచేసుకొనే క్రమంలో మరింత పరిపుష్ఠం చేస్తాను. సూత్రప్రాయంగా వికీ గురించిన చర్చలు, సమావేశాలు వీలైనంతగా వికీలోనే జరగాలి, కానీ ఈ పాఠాలు కేవలం పాఠాలు మాత్రమే, వికీ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి ఇది బయట జరిగినా పెద్ద ఇబ్బంది లేదు. అదీగాక వికీలో పొందుపరచి వ్రాయాలంటే ఎంతో కొంత ప్రామాణికత ఉండాలి. నియమనిబంధనలు మొదలైన విషయాలు ఇప్పటికే వికీలో ఏదో ఒక చోట ఉన్నవి (తెలుగులో కాకపోయినా) వీటికి నేను కొత్తగా జోడించే విషయాలేవీ లేవు. కాకపోతే నాకున్న అనుభవాలతో వీటిని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. విష్ణు గారు వీటి ఆధారంగా కొన్ని చిన్న చిన్న వీడియోలు, బోధక వనరులు ప్రొఫెషనల్స్‌తో తయారు చేయించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇవి వికీపీడియన్లకు బోధకాలుగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. యూట్యూబు యుగంలో నిబంధనలు వ్రాతలో తెలుసుకొనే అలవాటు కొరవడినట్టుంది. నా ఆలోచన ప్రకారం ఈ పాఠాలు ప్రధానంగా పవర్‌పాయింట్ స్లైడ్లు, నా వ్యాఖ్యానంతో ఒక అంతర్జాలపు పాఠంగా కొనసాగుతాయి. ఈ క్రమంలో తయారైన విషయాన్నంతా (పాఠ్యం, స్లైడ్ల ఫీడిఎఫ్ ఫైలు, వీలైతే వీడియో కూడా) వికీపీడియాలో ఎక్కించగలను. వీటి ఆధారంగా కొన్ని బైట్ సైజ్ బోధనా వీడియోలు తరువాత తయారుచేయిస్తారు. నేను పాఠ్యపు ప్రణాళిక, సంబంధిత సమాచారం ముందస్తుగానే వికీలో పెట్టగలను కానీ, పైన చెప్పినట్టుగా నియమాల విషయంలో నేను వికీకి కొత్తగా అందించగలిగేది ఏమీ లేదు. ఏదైనా విషయం వివరించేటప్పుడు ఇప్పటిదాకా జరిగిన చర్చలు మొదలైనవి తప్పకుండా ప్రస్తావిస్తాను కానీ నిర్ణయాలు తీసుకోవటం వంటివి ఈ బడి పరిధిలోకి రావు. చర్చలు, పాఠాలు సంబంధించిన విషయాలే కానీ వీలైనంతగా వాటిని వేరుగా ఉంచితేనే మంచింది. వికీ పద్ధతులపై చర్చలు సాధారణ పద్ధతిలో రచ్చబండపై జరిగితేనే మంచిది. --వైజాసత్య (చర్చ) 04:52, 13 సెప్టెంబర్ 2013 (UTC)
మీ ఆలోచన ప్రకారము చేయండి. ఎలా చేసిననూ ఫలితం మాత్రం ప్రస్తుతం ఉన్న దాని కంటె మెరుగుపరితే చాలు. మీ వ్యాఖ్యప్రకారం చూస్తే తెవికీనే కాకుండా ఇతర వికీ నిబంధనలు కూడా తెలియజేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ముందుగానే ఇతర వికీల నియమాలు కేవలం పరిశీలనకే అని చెబితే బాగుంటుంది, లేనిచో రేపు ఏదైనా చర్చలో మీ పాఠాన్ని ఉదహరించే అవకాశమూ ఉంటుంది. ఆ నిబంధన తెవికీ నియమానికి విరుద్ధంగానూ ఉండవచ్చు. ఇదివరకు నేను చేసిన చర్చలలో ఆంగ్లవికీ నియమాలు కూడా తెలియజేశారు. తెవికీకి విరుద్ధంగా ఉన్న ఇతర వికీ నియమాలతో భవిషత్తులో ఇబ్బందులు రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 13 సెప్టెంబర్ 2013 (UTC)
ఇకపై ఈ విషయం గురించిన చర్చ ఇక్కడ కొనసాగించగలరు --వైజాసత్య (చర్చ) 06:00, 14 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీలో Echo (Notifications) వ్యవస్థ అందుబాటు - మీ సహకారం

తెవికీలో Echo (Notifications) ఒక కొత్త ప్రకటనల వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థ సముదాయ సభ్యుల మధ్య పరస్పర సందేశాలను మరింత ఉన్నతంగా బట్వాడా చేయడానికి సహకరిస్తుంది. ఇది ఇప్పటికే ఆంగ్ల, మీడియా వికీ మరియు ఇతర పాశ్చాత్య వికీపీడియాలలో సమర్ధవంతంగా అమలు చేయబడింది. దీనిని భారతీయ భాషా వికీలలో (బహుశా ఆసియా అంతటిలోనూ అనుకుంటా) మొదటి సారి మన తెవికీ సముదాయానికి అందుబాటు చేయడానికి ఈ ప్రయత్నం. ఈ అధునాతన వ్యవస్థను తెవికీలోకి సెప్టెంబరు చివరన అమలు పరచడానికి దీనికి సంబందిత వికీమీడియా ఇంజనీరింగ్ జట్టు చాలా ఉత్సాహం చూపిస్తుంది. దీనికి మనందరి సహకారం అవసరం.

మనం అందించవలసిన సహాయం
  • ఈ క్రింది లంకెలలో ఇచ్చిన సిస్టం మెసేజులను అనువదించడం. అంతే.
  1. Echo [1]
  2. Thanks [2]
  3. సహాయ సూచిక [3]

మీరందరు మన తెవికీ అభివృధ్ధికై చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తూ --విష్ణు (చర్చ)08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)

మంచి ప్రయత్నం. --అర్జున (చర్చ) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)

Tamil Wikipedia turns 10. We need your wishes

Andharukku Namaskaram :) This is Ravi from Tamil Wikipedia. We are celebrating our 10 years with an event in Chennai on 29th September. I invite you all to join us as it would be great to share our experiences and learn from each other. If you cannot make it to the event, please leave your best wishes for us here. --Ravidreams (చర్చ) 22:51, 19 సెప్టెంబర్ 2013 (UTC)