బెంజ్ సర్కిల్
బెంజ్ సర్కిల్ | |
---|---|
ప్రదేశం | |
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ | |
అక్షాంశ,రేఖాంశాలు | 16°29′54″N 80°39′21″E / 16.4982196°N 80.655764°E |
జంక్షన్ వద్ద రహదార్లు | ఎన్‌హెచ్ 16 (పాత ఎన్‌హెచ్ 5) ఎన్‌హెచ్ 65 (పాత ఎన్‌హెచ్ 9) |
నిర్మాణం | |
రకం | గుండ్రనిచుట్టు |
బెంజ్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని బందరు రోడ్‌లో ఉన్న ఒక ప్రముఖ చౌరాస్తా.[1] ఈ రహదారిలో రెండు రహదారులు ఎన్‌హెచ్ 16 (పాత ఎన్‌హెచ్ 5), ఎన్‌హెచ్ 65 (పాత ఎన్‌హెచ్ 9) ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]ఇంతకు మునుపు బెంజ్ కంపెనీ (టాటా మోటార్స్-మెర్సిడెస్ బెంజ్ జాయింట్ వెంచర్) ఈ జంక్షన్తో ఉంది. ఈ జంక్షన్‌ను బెంజ్ సర్కిల్‌గా పిలిచారు. తర్వాతి కాలంలో కంపెనీని తొలగించారు, కాని ఈ సర్కిల్కి బెంజ్ సర్కిల్‌గా, బస్ స్టాప్‌గా ప్రజలు "బెంజ్ కంపెనీ బస్టాప్"గా పేర్కొన్నారు.
ట్రాఫిక్
[మార్చు]బెంజ్ సర్కిల్ నుండి రోజువారీ సగటున 57,000 వాహనాలు వెళ్ళతాయి. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌గా చెప్పవచ్చు.[2] బెంజ్ సర్కిల్‌కు సమీపంలో రహదారి విస్తృత ప్రాజెక్టులో భాగంగా కొత్తగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పనిలో చేర్చబడింది. తూర్పు దిశగా బెంజ్ సర్కిల్ తరువాత "విజయవాడ-మచిలీపట్నం హైవే" విస్తరణ జరిగింది. ఈ రహదారి విస్తరణ తరువాత ఫ్లైఓవర్ నిర్మాణం రద్దు చేయబడింది.[3]
ఆస్తి విలువ
[మార్చు]రాజధానిని ప్రకటించిన తరువాత విజయవాడ ప్రాంతంలో, బెంజ్ సర్కిల్‌కు సమీపంలో ఉన్న భూమి విలువ చదరపు అడుగుకి 1.2 లక్షలకు పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లోను, కామన్ రాజధానిగా ఉన్న హైదరాబాదు ప్రాంతంలో కంటే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ M. Srinivas. "Benz Circle turns major traffic bottleneck". The Hindu.
- ↑ Rajulapudi Srinivas. "'57,000 vehicles cross Benz Circle daily'". The Hindu.
- ↑ "Pending road projects pile up". The Times of India.
- ↑ "Benz Circle beats Banjara Hills!". The Times of India.