బౌధ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బౌధ్ జిల్లా
జిల్లా
పైన: రామ్‌నాథ్ ఆలయం, బౌధ్ దిగువ: మహానదిపై కియాకటా వంతెన
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
స్థాపన1994 జనవరి 2
ప్రధాన కార్యాలయంబౌధ్
Government
 • కలెక్టరుMr. Mahendra Kumar Mallik, IAS
 • పార్లమెంటు సభ్యుడుHemendra Chandra Singh, BJD
విస్తీర్ణం
 • Total3,098 కి.మీ2 (1,196 చ. మై)
జనాభా
 (2011)
 • Total4,39,917
 • Rank29
 • జనసాంద్రత142/కి.మీ2 (370/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
762 0xx
Vehicle registrationOD-27
సమీప పట్టణంBhubaneswar
లింగ నిష్పత్తి991 /
అక్షరాస్యత72.51%
లోక్‌సభ నియోజకవర్గంKandhamal
శాసనసభ నియోజకవర్గాలు2 (85-Kantamal ,86-Boudh)
అవపాతం1,623.1 మిల్లీమీటర్లు (63.90 అం.)ఇ

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో బౌధ్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బౌధ్ పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఒడిషా రాష్ట్రంలో బౌధ్ జనసంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో డెబాగర్ జిల్లా ఉంది.[1]మార్చు

చరిత్ర

[మార్చు]

బౌధ్ ఆరంభకాల చరిత్ర అస్పష్టంగానే ఉంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తున్న బౌద్ధ విగ్రహాల ఆధారంగా పరిశోధకులు ఈ ప్రాంతం ఒడిషా రాష్ట్రంలోని ప్రముఖ బౌద్ధకేంద్రంగా భావిస్తున్నారు. లిపిశాస్త్ర ఆధారాలు ఈ ప్రాంతం సా.శ. 8వ శతాబ్దం నుండి ఈ ప్రాంతాన్ని భంజా రాజులు పాలించారని తెలియజేస్తున్నాయి. ఈ ప్రాంతం ఖింజలి మండలంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన భంజావంశానికి చెందిన రాజులలో నెట్టభంజా మొదటివాడు. నెట్టభంజా ధేన్‌కనల్ రాజ్యానికి స్వతంత్ర రాజుగా పాలించాడు. ఆయన తరువాత వచ్చిన వారసుడు బౌధ్ సోనేపూర్‌ను ఆక్రమించి ఖంజలి మడలాన్ని స్థాపించి తోసలి తోసలికి చెందిన భౌమకరాల సామంతరాజుగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. శిలాభంజ కుమారుడు శతృభంజాదేవ్ వెలువరించిన తామ్రపత్రాలలో మొదటిసారిగా ఖింజలి మండలం పేరు కనిపించింది. దీని ఆధారంగా శిలాభంజా ఖింజలి మండల స్థాపకుడని భావిస్తున్నారు. ఖింజలి మండలానికి రాజధాని ధిర్తిపురమే ప్రస్తుత బౌధ్ పట్టణమని భావిస్తున్నారు.

జనమేజయ

[మార్చు]

రెండవ శతృభంజా సోమనంశానికి చెందిన దక్షిణకోసల రాజు మొదటి జనమేజయ చేతిలో ఓడిపోయి మరణించాడు. బౌధ్ ప్రాంతం నుండి భంజాలు తరిమివేయబడ్డారు. తరువాత బౌధ్ ప్రాంతం ఓడ్ర దేశ అని పిలువబడింది. జనమేజయ కుమారుడు, రాజ్యవారసుడు అయిన మొదటి యయాతి ఓడ్రదేశంలో యయాతినగర (ప్రస్తుత బౌధ్ జిల్లాలోని జగతి ) పేరుతో రజధానిని నిర్మింపజేసాడు. తరువాత సోమవంశస్థులు దక్షిణ కోసలకు రాజప్రనిధులను పాలకులుగా నియమించి తమస్వస్థలం వదిలి ఉత్కళ వైపు వలస వెళ్ళారు. తరువాత దక్షిణ కోసలను తెలుగు చోడులు, కలాచురీలు ఆక్రమించుకున్నారు.

గంగాలు

[మార్చు]

సామ్రాజ్యవాద కళిక గంగాలు ఉత్కలను ఆక్రమించుకున్నారు. తరువాత వారు రాజ్య సంరక్షణ, కోసలను ఆక్రమించుకోవడానికి కలచురీలతో దాదాపు 100 సంవత్సరాలు పోరాటం సాగించారు. చాటేశ్వర్ శిలాశాసనాలు (సా.శ.1220) మూడవ అనంగబీమా కాలంలో గంగాలు క్లచురియాలను ఓడించి బౌధ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తరువాత బౌధ్ ప్రాంతాన్ని గంగాల రాజప్రతినిధులు పాలించారు. ఆసమయంలో గంగాల రాజప్రతినిధులు కొంత స్వతత్రంగా పాలన సాగించారు.

బ్రాహ్మణ పాలన

[మార్చు]

కాలక్రమంలో బౌధ్ ప్రాంతంలో బ్రాహ్మణుల పాలన కొంతకాలం కొనసాగింది. ఈ వంశంలో చివరి బ్రాహ్మణ పాలకుడుగా గంధమర్దన్ దేవ్ పాలించాడు. ఆయనకు సంతానం లేనందున కెయోంఝర్ భంజా రాజవంశానికి చెందిన అనంగ భంజాను దత్తత తీసుకున్నాడు. గంధమర్దన్ దేవ్ తరువాత సింహాసనాధిష్టుడైన అనంగభంజా 14వ శతాబ్దం వరకు పాలన సాగించాడు. ఆయన తన పేరును భంజా నుండి దేవ్‌గా మార్చుకున్నాడు. ఆయన అనంగదేవ్‌గా వ్యవహరినబడ్డాడు. తరువాత 1948లో బౌధ్ ఒడిషాలో విలీనం అయ్యేవరకు అనంగదేవ్‌ పాలన కొనదాగింది. వారి రాజ్యంలో ఆధునిక అథమాలిక్, బౌధ్, రాజధానిగా సోనేపూర్ ఉండేది. తరువాత పాట్నాకు చెందిన చౌహాన్ పాలకుల రాజ్యవిస్తరణ కారణంగా రాజధాని బౌధ్‌కు మార్చబడింది.

సిద్ధేశ్వర్‌దేవ్

[మార్చు]

17వ శతాబ్దంలో బౌధ్ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. సోనేపూర్ వారి పాలనలో ఉండేది. సంబల్పూర్‌కు చెందిన చౌహాన్ పాలకులు సంపూర్ణ పశ్చిమ ఒడిషా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సంబల్పూర్‌కు చెందిన చౌహాన్ పాలకుడు బలభద్రదేవ (1605-1630) బౌధ్‌కు చెందిన సిద్ధభంజాదేవ్‌ను ఓడించి సోనేపూర్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ప్రత్యేక చౌహాన్ రాజాస్థానంగా (1640) చేసాడు.

ముస్లిం పాలన

[మార్చు]

తరువాత ఒడిషాను ముస్లిములు ఆక్రమించుకున్నారు. తరువాత సుబేదార్లు, బౌధ్ పాలకులు, కటక్ సుబేదార్లు మద్య సంబంధబాంధవ్యాల వివరణ లభించలేదు. బౌధ్ పాలకులు ముల్సిం పాలకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారని భావిస్తున్నారు. అందువలన రాజాప్రతాప్ దేవ్ తనరాజ్యాన్ని ముస్లిం పాలన నుండి సురక్షితంగా కాపాడుకున్నాడని భావిస్తున్నారు. రాజా బనమాలి దేవ్ వరకు బౌధ్ పాలకులకు " స్వస్తిశ్రీ ధీర్లక్ష్య ధుంబాధిపతి జార్ఖండ్ మండలేశ్వర్ " అనే బిరుదులు ఉండేవి.

మరాఠీలు

[మార్చు]

ఒడిషాలో మరాఠీపాలన ఆరంభం అయిన తరువాత బౌధ్ ప్రాంతం మరాఠీల ఆధీనంలోకి మారింది. ప్రధానమైన నాగపూర్, కటక్ రహదారి బౌధ్ మీదుగా పయనించేది. బౌధ్ రాజ మరాఠీ పాలకులకు కప్పం చెల్లిస్తూ వారితో అనుకూల సంబంధాలు కొనసాగించారు. సా.శ. 1800 బౌధ్, మరాఠీ పాలకుల సంబంధాలు బాధించబడ్డాయి. మరాఠీ పాలకులు బైధ్ మీద దాడిచేసి రాజా బిస్వంబరదేవ్‌ను ఓడించాడు. అయినప్పటికీ ఆతరువాత బిస్వంబర దేవ్ నాగపూర్‌కు కప్పం చెల్లిస్తూ సామంతరాజుగా కొనసాగడానికి అనుమతించబడ్డాడు.

రాజా బిస్వంబరదేవ్

[మార్చు]

రాజాబిస్వంర దేవ్ (1778-1817 ) భఘనద్, మెహరుని జోర్ మద్య ప్రాంతం అయిన పంచర ప్రగణాలను సోనేపూర్ రాజ్యానికి వదులుకున్నాడు. 1778- 81 లో బౌధ్ రాజు సోనేపూర్ రాజా వద్ద తీసుకున్న ౠణానికి బదులుగా ఈ ప్రాంతాన్ని వదుకున్నాడని ఒక వాదన ఉన్నా మరొక వాదన బౌధ్‌ రాజ్యానికి అవసరమైనప్పుడు సైనిక సహాయం కొరకు ఈ ప్రదేశం ఇవ్వబడిందని వివరిస్తుంది. ఒప్పందం తరువాత కొంతకాలం బౌధ్ పాలకుడు వదులుకున్న ప్రాంతంలో పన్ను వసూలు చేసుకున్నాడు. సోనేపూర్ పాలకుడు ప్రగణాల ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని సోనేపూర్‌కు అనుకూలంగా ఇక్కడ కప్పం పర్యవేక్షణా కార్యాలయాలను ఏర్పాటుచేసాడు.

సిద్ధభంజదేవ్

[మార్చు]

సిద్ధభంజన దేవ్ (సిద్ధేశ్వర్ దేవ్) పాలనలో బౌధ్ నుండి సోనేపూరును సంబల్‌పూర్‌కు చెందిన చౌహాన్ పాలకులు ఆక్రమించుకున్నారు. తరువాత బౌధ్ రాజ్య భౌగోళిక విభజన ప్రక్రియ మొదలైంది. 1497-99 లలో బౌధ్ రాజాకు దశపల్లా భూభాగం బహూకరించిన తరువాత రాజ్యం కుమైముహన్, కంతిలో వరకు విస్తరించబడింది. తరువాత సిద్ధభంజన దేవ్ నారాయణదేవ్‌కు దశపల్లా ప్రాంతానికి రాజును చేసాడు. తరువాత పాట్నాకు చెందిన చౌహాన్ రాజా మదన్‌మోహన్ దేవ్ రాజకుమార్తెను వివాహం చేసుకున్నందుకు కట్నంగా కరంగ నదీ ప్రాంతం, అమైముహన్ ప్రాంతం బౌధ్ పాలకునికి ఇవ్వబడింది. 1599-1600. అథమాలిక్, కొంధ్మల్ బౌధ్‌లో భాగంగా ఉన్నాయి.

బ్రిటిష్ పాలన

[మార్చు]

1803లో బ్రిటిష్ ఒడిషాను ఆక్రమించుకుంది. 1804 మార్చి 3 న రాజా బిస్వబర్దేవ్ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని బౌధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాడు. మూడవ ఆంగ్లో మరాఠీ యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మరాఠాల నుండి పూర్తిగా బౌధ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది.తరువాత ఈ ప్రాంతం 1837 వరకు " సౌత్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏజెంసీ "లో చేర్చబడింది. తరువాత ఈ ప్రాంతం " సూపరింటెండెంట్ ఆఫ్ ట్రిబ్యూటరీ, కటక్ పర్యవేక్షణలో ఉంది.

.

చంద్రశేఖర్‌దేవ్

[మార్చు]

1817లో రాజా బిస్వంబర్ దేవ్ మరణించిన తరువాత ఆయన కుమారుడు చంద్రశేఖర్ దేవ్ రాజ్యపాలకుడయ్యాడు. 1821లో రాజా చంద్రశేఖర్ దేవ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి కప్పం (800 రూ) చెల్లించాలన్న ఆదేశం అందుకున్నాడు. చంద్రశేఖర్ దేవ్ మరణించిన తరువాత ఆయన కుమారుడు రాజా పీతాంబర దేవ్ (1839) సింహాసనాధిష్టుడయ్యాడు. 1855 ఫిబ్రవరి 15న ఖొండమల్ బౌధ్ నుండి వేరు చేయబడి బ్రిటిష్ భూభాగంలో విలీనం చేయబడింది. రాజా పీతాంబర దేవ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసపాత్రుడుగా నిలిచి బ్రిటిష్ ఏజెంసీకి సహకరిస్తూ గిరిజన ప్రాంతంలో నరబలిని అణిచివేయడానికి సహరించాడు. అలాగే ఖొంఢ్, ఘుంసర్ ప్రాంతాలలో తిరుగుబాటును అణిచివేయడానికి సహకరించాడు. 1855 వరకు చక్ర బిసొయి బౌధ్ ఆధీనంలో ఉంది. ఖొండాలు పూర్తిగా రాజసంస్థానం నుండి తరిమివేయబడి రాజ్యంలో ప్రశాంతత నెలకొనబడింది. 1875లో బ్రిటిష్ ప్రభుత్వం పీతాంబర్ దేవ్‌ను రాజాగా గుర్తిస్తూ ప్రత్యేక సనద్ జారీ చేసింది.

అథమాలిక్

[మార్చు]

అథమాలిక్ బౌధ్ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. బౌధ్ రాజప్రతినిధిని రాజా అని, అథమాలిక్ రాజప్రతినిధిని జమీందార్ (సామంత) అని పిలిచేవారు. 1975లో అథమాలిక్ రాజప్రతినిధి రాజాగా గుర్తించబడ్డాడు. 1894 అథమాలిక్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడింది.

జోగీంద్ర దేవ్

[మార్చు]

రాజా పీతంబర దేవ్ 1880లో మరణించిన తరువాత ఆయన వారసుడు జోగీంద్ర దేవ్ పాలకుడయ్యాడు. ఆయన దయాళువైన, ధర్మాత్ముడైన వాడు. జోగీంద్ర దేవ్ మొదటిసారిగా రాజ్యంలో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టాడు. 1913లో ఆయన పెద్ద కుమారుడు నారాయణ్ దేవ్ మైనర్‌గా ఉన్నందున దివాన్ రాజ్యవ్యవహారాలు చూసుకున్నాడు. 1925 మార్చి 15 నారాయణ్ దేవ్ పరిపాలనా బాధ్యత చేపట్టాడు. ఆయన పాలనలో రాజుకు అధికారాలు తగ్గించబడిన కారణంగ నారాయణ దేవ్ రాజ్యప్రతినిధిగా మాత్రమే వ్యవవహరించాడు. 1930-31 లో బౌధ్ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును నారాయణ్ దేవ్ విజయవంతంగా అణిచివేసాడు. 1945లో ప్రజామండలం ఉద్యమానికి నారాయణ్ దేవ్ బలమైన వ్యతిరేకత చూపాడు. నారాయణ్ దేవ్ జగతి గ్రామం (యయాతినగర్, సోమవంశ రాజధాని) ను అభివృద్ధి చేసి దానికి నారాయణ్ నగర్ అని పేరును మార్చాడు. బౌధ్ రాజ్యానికి నారాయణ్ దేవ్ చివరి పాలకుడయ్యాడయ్యాడు. 1948 జనవరి 1 న బౌధ్ రాజాస్థానం ఒడిషా రాష్ట్రంతో విలీనం చేయబడింది. తరువాత బౌధ్ కొత్తగా రూపొందించిన బౌధ్- కొంధమల్ జిల్లాలో ఉప విభాగం అయింది. 1994 జనవరి 2 బౌధ్‌కు జిల్లా అంతస్తు ఇవ్వబడింది. బౌధ్ ప్రజలు తాము కోసల ప్రజలమని ఇప్పటికీ భావిస్తుంటారు.

భౌగోళికం

[మార్చు]

జిల్లా ఒడిషా రాష్ట్ర కేంద్ర స్థానంలో మహానదికి దక్షిణంగా ఉంది. జిల్లాకు మహానది పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో ఉంది. పశ్చిమ సరిహద్దులో బలంగీర్ జిల్లా వాయవ్య సరిహద్దులో సుబర్నపూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో అంగుల్ జిల్లా, ఆగ్నేయ, తూర్పు సరిహద్దులో నయాగఢ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఫూల్బని జిల్లా, కలహంధి జిల్లాలు, ఉన్నాయి. భౌగోళికంగా బౌధ్ జిల్లా 20º.22’ నుండి 20º.50’ ఉత్తర అక్షాంశం, 83º.34’, 84º.49’తూర్పు రేఖంశంలో ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బౌధ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

బౌధ్ జిల్లా రహదారి, రైలు మార్గాలతో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, జిల్లా కేంద్రాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. బౌధ్ నుండి భువనేశ్వర్‌కు 240కి.మీ దూరంలో ఉంది. భువనేశ్వర్‌ నుండి భువనేశ్వర్‌కు దినసరి రైలు సర్వీలు లభ్యమౌతున్నాయి. భువనేశ్వర్‌ - సంబల్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్పూర్ పాసింజర్ బౌధ్ సమీపంలోని రైర్ఖోల్ రైల్వే మీదుగా పయనిస్తున్నాయి. రైర్ఖోల్ నుండి బౌధ్ 27కి.మీ దూరం ఉంది. బౌధ్‌కు సమీపంలో ఉన్న విమాశ్రయం భువనేశ్వర్‌లో ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 439,917,[1]
ఇది దాదాపు. మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 552వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 142 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.82%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 991:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.51%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. సరాసరి

సంస్కృతి

[మార్చు]

బౌధ్ సరికొత్త జిల్లా అయినప్పటికీ ఇది పురాతన సంస్కృతికి చిహ్నంగా ఉంది. బౌధ్ నాగరికత నదీతీరంలో ప్రారంభం అయింది. నదీప్రవాహాలు బౌధ్ లోని యోర్ ప్రాంత ప్రజలకు రవాణాకు సహకరించాయి. 2 వ శతాబ్దం నుండి 1000 సంవత్సరాల కాలం బౌధ్ బుద్ధిజం, శైవిజం, శాక్తేయానికి ప్రధాన్యత కలిగిన ప్రాంతంగా ఉండేది. కోసలి సంప్రదాయానికి బౌధ్ ఒక భాగంగా ఉండేది. సోమవంశ రాజుల పాలనలో ఈ ప్రాంతం విద్యా, సంస్కృతులలో ఆధిక్యత కలిగి ఉంది. గంగా, సూర్యవంశ రాజుల పాలనలో ఈ అభివృద్ధి కొనసాగింది.

సస్కృతిక నృత్యం

[మార్చు]

జిల్లాలో ప్రజలు సాధారణంగా సాంఘిక సామూహిక ఉత్సవాలలో వైవిధ్యమైన జానపద నృత్యాలు చేస్తుంటారు.

కర్మా నృత్యం

[మార్చు]

బౌధ లోని కర్మా నృత్యం సుందర్ఘర్‌లోని ఒరియాలోని కర్మానృత్యం కంటే వ్యత్యాసంగా ఉంటుంది. బౌధ్‌లో ఘయాసిస్ ప్రజలు ఈనృత్యాన్ని పండుగ సందర్భాలలో నర్తిస్తారు. వారు సానా కర్మా ఉత్సవం బాధ్రపద శుద్ధ ఏకాదశి రోజున (ఆగస్టు-సెప్టెంబరు), కర్మా ఉత్సవం అదే సమయం బాధ్రపద కృష్ణ ఏకాదశిలో నిర్వహిస్తారు. ఈ రెండు సందర్భాలలో ఘయాసిస్ తెగకు చెందిన పురుషులు, స్త్రీలు ఈ నృత్యం ప్రదర్శిస్తారు. యివతులు కర్మా గీతాలను ఆలపిస్తుంటే యువకులు మృదంగం వాయిస్తుంటారు. ఈ నృత్యంలో కర్మా దేవత సంబంధిత గీతాలను ఆలపిస్తుంటారు.

దండా నృత్యం

[మార్చు]

బౌధ్ జిల్లాలో దండానాట్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. హరుడు, పార్వతి భక్తులు ఈ నాట్యంలో పాల్గొంటారు. ఈ నృత్యం చైత్ర, వైశాఖమాసాలలో నిర్వహించబడుతుంది.

దల్కై నృత్యం

[మార్చు]

బౌధ్ ప్రజలు ఆస్వినా (సెప్టెంబరు- అక్టోబరు) మాసంలో భైఝుంటియా సందర్భంలో దల్కై నృత్యం చేస్తుంటారు. ఈ నృత్యంలో యువతులు వరుసలలో లేక అర్ధచంద్రాకారంలో నిలబడి దల్కై నృత్యాలు పాడుతూ నృత్యంచేస్తుంటారు.

పండుగలు, ఉత్సవాలు

[మార్చు]

జిల్లాలో హిందువులు సంవత్సరమంతా పలు పండుగలను జరుపుకుంటుంటారు. ఈ పండుగలను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇవి గృహాంతర పండుగలు, సామూహిక ఉత్సవాలుగా విభజించవచ్చు. గృహాంతర పండుగలను ప్రజలందరూ గృహాలలో జరుపుకుంటారు. సంతలు వంటి సామూహిక ఉత్సవాలను ప్రజలందరూ కలిసి జరుపుకుంటారు. గృహాంతర పండుగలలో పూజలు, ఏకాదశి, వ్రతాలు, నోములు ఉంటాయి. అధికమైన పండుగలు పౌర్ణమి రోజున జరుగుతుంటాయి. మతసంబంధిత ఉత్సవాలలో పెద్ద ఎత్తున పురుషులు, స్త్రీలు పాల్గొంటారు.

చుదా కై జాత్రా

[మార్చు]

మార్గశిర మాసంలోని చివరి ఆదివారం (నవంబరు- డిసెంబరు) ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. పురుషులు, స్త్రీలు ఒకచోట కూడి ఒకరిని ఒకరు నీచమైన మాటలతో దుర్భాషలాడుకుంటారు. మంచి పంటలు పండించడానికి ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది.

రధ జాత్ర

[మార్చు]

జగన్నాథ రథ జాత్ర (రథయాత్ర) అసదమాసంలో విదియనాడు నిర్వహించబడుతుంది. బౌధ్‌లో రథజాత్ర వివిధ ప్రాంతాలలో వివిధ విధాలుగా నిర్వహించబడుతుంది. ఈ రథయాత్ర ఈ ప్రాంతంలో అత్యుత్సాహంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవసమయంలో ప్రజలు నూతన వస్త్రాలు ధరించి రుచికరమైన ఆహారాన్నితయారుచేసుకుని ఆనందిస్తారు. ఈ ఉత్సవసమయంలో సమీపగ్రామం నుండి వేలాదిమంది ప్రజలు వచ్చి ఈ యాత్రను సందర్శిస్తారు. పూరీ రథయాత్రలో బౌధ్ రాజా సంప్రదాయమైన ఆచారాలు నిర్వహిస్తాడు. జగన్నాథ్ - బలభద్ర -, సుభద్రలు ఈ యాత్రకు ప్రధాన మూర్తులుగా ఉంటారు. రథజాత్ర ప్రధానాలయంలో ఆరంభమై మౌసిమా అలయానికి చేరుతుంది.

లక్ష్మి పూజ

[మార్చు]

మార్గశిరమాసంలోని (నవంబరు-డిసెంబరు ) ప్రతి గురువారం హిదువుందరూ లక్ష్మీపూజను జార్పుకుంటారు. హిందూస్త్రీలు ఈ పండుగను గొప్ప భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. గురువారాలు గృహాలను వాకిళ్ళను చిటా, అల్పనాల డిజైన్లతో అలంకరిస్తారు. తరువాత లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మాసంలో చివరి గురువారం ఈ పూజకు ముగింపు పలుకుతూ రుచికరమైన పిండివంటలను నివేదించి ఆరాధిస్తారు.

నౌఖై

[మార్చు]

నౌఖై ఒక వ్యవసాయ పండుగ. జిల్లా అంతటా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను బాధ్రపద శుక్లపక్షంలో (ఆగస్టు-సెప్టెంబరు) జ్యోతిష్కుడు నిర్ణయించిన రోజున జరుపుకుంటారు. ఈ పండుగకు కొత్తబియ్యంతో తయారుచేసిన వంటకాలను దేవునికి, పితరులకు నివేదన చేస్తారు. తరువాత కుటుంబసభ్యులు బంధుమిత్రులతో ప్రసాదాలను స్వీకరించి ఆనందిస్తారు..

శివరాత్రి

[మార్చు]

జిల్లాలోని అన్ని శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. జాల్గుణమాసం చతుర్ధశి నాడు (ఫిబ్రవరి - మార్చి) ఈ పండుగ నిర్వహించబడుతుంది. భక్తులు రాత్రి అంతా మేలుకుని జాగారం చేస్తూ శివుని ఆరాధిస్తారు. అర్ధరాత్రి ఒక దీపం ఆలయగోపురం మీద వెలిగిస్తారు. అది రాత్రి అంతా వెలుగుతూ ఉంటుంది. మహాదీపం చూసిన తరువాత భక్తులు ఉపవాసం పూర్తిచేస్తారు. ఈ పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. బౌధ్‌లోని మాతంగేశ్వరాలయం, చంద్రచూడ, మల్లిషాయి ఆలయాలలో నిర్వహిస్తారు.

దసరా

[మార్చు]

దుర్గాపూజ, దసరా పండుగలను ఆస్వినా మాసంలో (సెప్టెంబరు -అక్టోబరు) జౌపుకుంటారు. ఈ పూజ సప్తమి నుండి దశమి వరకు 4 రోజులపాటు నిర్వహిస్తారు. బౌధ్‌లోని దుర్గాలయాలలో, పురునకటక్ లోని శక్తి ఆలయాలలో ఈ పూజ ఘనంగా నిర్వహించబడుతుంది. దసరా వీరత్వానికి సంబంధించిన పండుగ ప్రజలు వారి ఆయుధాలకు పూజ నిర్వహిస్తారు. ఈ కాలంలో రాజులు సరికొత్త దండయాత్రకు ప్రణాళిక వేస్తారు.

.

డోలా జాత్ర

[మార్చు]

డీలాజాత్ర ఫగు దశమి నుండి పౌర్ణమి వరకు నిర్వహించబడుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను పూర్ణిమ నుండి చైత్రశుద్ధ పంచమి వరకు జరుపుకుంటారు. ఈ పండుగలో అలంకరించబడిన రాధాకృష్ణులను గీతాలతో ఊరేగిస్తారు. కొన్ని ప్రాంతాలలో వివిధ ప్రాంతాల ఊరేగింపులన్నీ ఒకేచోట చేరుకుంటాయి.ఈ దైవకూటమిని మేళా అంటారు. గౌరా ప్రజలకు ఇది ప్రధాన ఉత్సవం. వారు గోవులను, నౌడీ (వేణువు) ను పూజిస్తారు. ఈ ఉత్సవంలో రాధాకృష్ణుల భజనగీతాలను ఆలపిస్తుంటారు.

పుయాజుంటియా, భైజుంటియా

[మార్చు]

ఆశ్వీజమాసం కృష్ణపక్ష అష్టమి నాడు (సెప్టెంబరు- అక్టోబరు) జరుపుకుంటారు. ఇది పూర్తిగా తల్లుల పండుగ. స్త్రీలు తమ కుమారుల దీర్ఘాయుషు, సంపన్నత కొరకు దుతిబహనా దేవిని ఆరాధిస్తుంటారు. ఆశ్వీజమాస శుక్లపక్ష అష్టమి నాడు (సెప్టెంబరు- అక్టోబరు) ఈ పండుగ నిర్వహించబడుతుంది. అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల క్షేమం కొరకు ఈ పూజను నిర్వహిస్తారు.

రామలీలా

[మార్చు]

రామనవమి లేక రామలీల పండుగను చైత్రమాసంలో నిర్వహించబడుతుంది. వివిధ రామాలయాలలో ఈ పండుగను 9 నుండి 30 రోజులవరకు ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో రామాయణాన్ని ఏడురోజుల పాటు వివిధ బహిరంగ వేదికల మీద నృత్యరూపకంగా ప్రదర్శించబడుతుంది. బైధ్‌లోని రఘునాథ్ ఆలయంలో 18 రోజులపాటు ఈ పండుగ కోలాహలంగా నిర్వహించబడుతుంది. డెబ్రాహ్, బహిరా లలోని రఘునాథ ఆలయాలలో ఈ పండుగ కోలాహలంగా నిర్వహించబడుతుంది.

కైలాషీ జాత్ర

[మార్చు]

కైలాషి లేక కైలాస్ యాత్ర కార్తిక శుక్లపక్షం ఏకాదశమి నాడు నిర్వహించబడుతుంది. దీనిని కైలాషి కోఠీ వద్ద నిర్వహిస్తారు. కైలాధికోఠి గూడలు వివిధ దేవతారూపల చిత్రాలతో అలంకృతమై ఉంటాయి. ఈ ఉత్సవంలో ధుంకేల్ అనే సంగీతపరికరం వాయించబడుతుంది. జిల్లాలో ఈ ఉత్సవానికి గైరసింగ ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలో పలాస్, లండిబంధ, గాంధీనగర్, కుంత్బంధ, సిధాపూర్, కాళీగావ్, కాళియాబగీచాలలో ఉత్సాహంగా నిర్వహించబడుతుంది.

క్రైస్తవ ఉత్సవాలు

[మార్చు]

జిల్లాలోని క్రైస్తవులు న్యూ ఇయర్ డే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మండే, క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే వంటి ఉత్సవాలను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు.

ముస్లిం ఉత్సవాలు

[మార్చు]

జిల్లాలో ముస్లిములు ఈద్- ఉఇ- జుహ, షాబ్-ఇ- క్వాదర్, జుమ-తుల్-విద, మొహరం, షాబ్-ఇ- మెరాజ్, మిలాడ్- ఉన్- నబి, రంజాన్ మొదలైన పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటూంటారు.

రిక్రియేషన్

[మార్చు]

ప్రజలు సాయంత్రపు వేళలో బహిరంగ వేదికల మీద భక్తి ప్రవచనాలు, పురాణ కథనాలు వింటుంటారు. భాగవతం, మహాభారతం, రామాయణం, హరివంశం, ఇతర పురాణాలను ప్రవచనంగా ఉపన్యసింటారు. కంజని, గిని, మృదంగ, హార్మోనియం మొదలైన సంగీతపరికరాలతో భజనలు, కీర్తనలను సామూహికంగా ఆలపిస్తుంటారు. దొమ్మరి ఆటా, కోతులను ఆడించడం, బియర్డ్ డాంస్, పాము నృత్యం, గారడి ప్రదర్శనలను సంచార కళాకారుల ప్రదర్శనలను ప్రజలు ఆనందిస్తుంటారు. నగర ప్రాంతాలలో సినిమా, ఒపేరా వంటి వినోదాలు ఉంటాయి. నగరాలలో రిక్రియేషన్ క్లబ్బులు కూడా ఉన్నాయి.

ఆలయాలు

[మార్చు]

బౌధ్ జిల్లాలో శతాబ్దం చరిత్ర కలిగిన అందమైన ఆలయాలకు, పురాతన బుద్ధ విగ్రహాలకు, గుహలకు ప్రసిద్ధిచెందింది. శైవం, వైష్ణవం, పలు ఇతర మతవిశ్వాసాలు వ్యాప్తిలో ఉన్నప్పుడు వేరువేరు దేవతల ఆరధన కొరకు పలు ఆలయాలు పలు ప్రాంతాలలో నిర్మించబడ్డాయి. ప్రకృతి సౌందర్యంతో అలరారే వాతావరణంలో ఉన్న ఆలయాలు నిరంతర భక్తసందోహం సందర్శించడానికి దోహదం చేసి ప్రోత్సహిస్తున్నాయి.

బుద్ధ శిల్పం

[మార్చు]

బౌధ్ జిల్లాలో 3 అద్భుతమైన బుద్ధశిల్పాలు ఉన్నాయి. అందువలన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధమతం ప్రాబల్యంలో ఉన్నదండానికి నిదర్శనంగా ఉంది. వీటిలో ఒక శిల్పం బౌధ్ పట్టణంలో ఉంది.దీని ఎత్తు 6.9 అడుగులు. ఇది కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం తామర ఆసనం మీద భూమిస్పరా ముద్రలో కూర్చున్నట్లు ఉంటుంది. విగ్రహం తల వద్ద ఇద్దరు గంధర్వులు దండను పట్టుకుని గాలిలో ఎగురుతూ నిలిచినట్లు ఉంటుంది.

శ్యామసుందర్పూర్

[మార్చు]

బౌధ్‌కు 40కి.మీ దూరంలో ఉన్న శ్యాంసుందర్పూర్‌లో బుద్ధుని శిల్పం ఉంది. 5 అడుగుల ఎత్తున్న ఈ శిల్పం బౌధ్ పట్టణంలో ఉన్న భంగిమలోనే ఉంటుంది. విగ్రహం తల వద్ద ఇద్దరు గంధర్వులు దండను పట్టుకుని గాలిలో ఎగురుతూ నిలిచినట్లు ఉంటుంది. ఈ విగ్రహం ఇసుకరాతితో చెక్కబడింది. ప్రాంతీయ వాసులు దీనిని " ఝరబౌడియా మహా ప్రభు " అంటారు.

ప్రగలపూర్

[మార్చు]

ప్రగలపూర్ గ్రామంలో మరొక బుద్ధ విగ్రహం ఉంది. ఇది శ్యామసుందర్పూర్ నుండి 2కి.మీ దూరంలో ఉంటుంది. ఈ విగ్రహం ఎత్తు 3.5 అడుగులు. విగ్రహానికి ఎడమ వైపు 3 అస్పష్టమైన మాయా మూర్తులు కుడి వైపు 5 మూర్తులు ఉంటాయి. దీనిని ఉగ్రతారా అంటారు.

రామనాథ్ ఆలయం

[మార్చు]
Reameshwar/ Ramanath Temples

బౌధ్ పట్టణంలో ఉన్న 3 ఆలయాలు రామేశ్వర్ లేక రామనాథ్ ఆలయాలు అంటారు. ఇవి 9వ శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. ఇవి విభిన్నరీతులలో వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బౌధ్‌లో ఉన్న మూడు ఆలయాల అలంకరణారీతులు, ప్లాస్టిక్ కళా అద్భుతంగా ఉంటుంది. లింగరాజ్ అనంత, వాసుదేవ ఆలయాలకంటే ఇవి పురాతనమైనవని భావిస్తున్నారు. ఈ ఆలయాల నిర్మాణం ప్రత్యేకత కలిగి భక్తులను ఆకర్షిస్తుంది. ఇతర ఆలయాలకంటే ఇవి ప్రత్యేకత కలిగి ఉన్నాయి. మూడు ఆలయాల నిర్మాణశైలి లిగాల అర్ఘ - వట్టం ఒకేతీరులో ఉంటాయి. అద్భుతమైన ఈ ఆలయాలను ఎర్రని ఇసుకరాళ్ళతో నిర్మించారు. ఈ ఆలయాలను 9వ శతాబ్దంలో నిర్మించారని భావిస్తున్నారు. ఈ ఆలయాల శిల్పచాతుర్యం చూపరులను ముగ్ధులను చేస్తుంది. ఈ ఆలయాలు ఎత్తైన ప్లాట్ ఫాం, గర్భగుడి, దానిని ఆనుకుని పోర్టుకోలతో నిర్మించబడ్డాయి. సూక్ష్మమైన ఖాళీలు, కోణాలు వెలుగు నీడల అద్భుతాలను ఏర్పరచి నిర్మాణాపు అందాలకు మరింత మెరుగులు దిద్దుతుంది. ఈ ఆలయాలు ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్నాయి.

జోగీంద్రా విల్లా ప్యాలెస్

[మార్చు]

జోగీంద్రా విల్లా ప్యాలెస్ బౌధ్ రాజ్యాన్ని పాలించిన రాజబతి భవనం. కారుణ్యం, ఉదారస్వభావం కలిగిన రాజాజోగీందర్ దేవ్ కాలంలో ఇది నిర్మించబడింది. మహానదీ తీరంలో ఉన్న ఈ రాజభవనం అందంగా, గంభీరంగా ఉంటుంది.

హనుమాన్ ఆలయం

[మార్చు]

బౌధ్ పట్టణానికి తూర్పున మహానదికి మద్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ఒక మతగురువు నిర్మించాడు. ఈ ఆలయం పొడవైన రాతిమీద నిర్మించబడింది. మహానదిలో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో ఈ ఆలయసౌందర్యం మరింత ఇనుమడిస్తుంది.

చంద్రచూడ మతాంగేశ్వరాలయం

[మార్చు]

చంద్రచూడ మతాంగేశ్వరాలయం బౌధ్ పట్టణంలోని మహానదీతీరంలో ఉంది. ఇవి రెండు శివాలయాలు. మాతంగేశ్వరలయంలో పార్వతీదేవికి ప్రత్యేక సన్నిధి ఉంది.

భైరబి మదన్‌మోహన్ ఆలయం

[మార్చు]

బౌధ్ రాజభవనానికి సమీపంలో ఈ రెండు ఆలయాలు ఉంటాయి. భైరబి ఆలయంలో భైరబీదేవి ప్రధాన దైవంగా ఉంది. మదన్ మోహన్ ఆలయంలో రాధాకృష్ణులు ప్రధాన మూర్తులుగా ఉన్నారు. ఈ ఆలయాలకు సమీపంలో ఒక గాయత్రీ మందిరం ఉంది.

జగన్నాథ్ ఆలయం

[మార్చు]

ఒడిషా లోని పురాతన ఆలయాలలో ఇది ఒకటి. ఇది బౌధ్ పట్టణం కేంద్రంలో ఉంది. ఇక్కడ అత్యుత్సాహంతో రథజాత్ర నిర్వహించబడుతుంది.

దేవ్‌గర్

[మార్చు]

బౌధ్ పట్టణానికి 14 కి.మీ దూరంలో రఘునాథ్ ఆలయం ఉంది. ఆలయపరిసరాలు అద్భుత ప్రకృతి సౌందర్యంతో ఉంటుంది. రామ, లక్ష్క్ష్మణ్, సీత, పాలరాతి శిల్పాలు ఇక్కడ ప్రధాన మూర్తులుగా ఆరాధించబడుతున్నారు. ఇక్కడ ఒక అందమైన కోనేరు ఉంది.

జగతి

[మార్చు]

బౌధ్ పట్టణానికి 16కి.మీ దూరంలో గంధ్రాది సమీపంలో జగతి ఉంది. ఇక్కడ నీలమాధవ, సిద్ధేశ్వర్ ఆలయాలు ఉన్నాయి. సా.శ. 9వ శతాబ్దంలో ఖింజలి మండలానికి చెందిన భంజా పాలకులు ఈ ఆలయాలను నిర్మించారని భావిస్తున్నారు. ఒకదానితో ఒకటి పోలిఉన్న ఈ ఆలయాలు రెండు ఒకే ప్లాట్ ఫాం మీద ఉన్నాయి. వీటిలో శిద్ధేశ్వరాలయం శివాలయం ఆలయగోపురం మీద శివలింగం ప్రతిష్ఠినచబడి ఉంది. రెండవది నీలమాధవ ఆలయం ఇది విష్ణుమూర్తి ప్రధానదౌవంగా ఉన్న ఆలయం. ఈ ఆలయగోపురం మీద చక్రం, బ్లూ క్లోరైన్ ఉంటుంది.

జగ్‌మోహన్

[మార్చు]

గంధారది జగమోహన్ ఆలయాలు మిగతా ప్రదేశాలలో ఉన్న జగమోహన్ ఆలయాలకంటే విభిన్నంగా ఉంటాయి. చదమైన ప్రదేశంలో 12 స్తంభాల ఆధారంగా ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఒక్కో ఐపు 4 స్థాంభాలు ఉంటాయి. నిజానికి జగమోహన్ ఆలయాలు నాలుగు వైపులా ఖాళీగా ఉంటాయి. తరువాత నాలుగు వైపులా స్తంభాలు అమర్చబడ్డాయి. తరువాత స్తంభాల మద్య ఖాళీలు పూర్తిచేయబడ్డాయి. .

గాంధారది ఆలయాలు

[మార్చు]

గంధారది జగమోహన్ ఆలయాల అలంకరణలు శైలి వైవిధ్యంగా ఉంటుంది. ఈ ఆలయాల అలంకరణ నిరాడంబరంగా ఉంటుంది. .

చారి శంభుదేవ మందిరం

[మార్చు]

గాంధాదరి ఆలయాలను ప్రాంతీయ వాసులు " చారి సాంబు మందిర " అంటారు. (నాలుగు శిలింగాలు). శివాలయంలో సిద్ధేశ్వర్ ప్రధానదైవంగా ఉన్నాడు. జగమొహన్ ఎడమవైపున జోగేశ్వర్ శివలింగం, కుడివైపు కపిలేశ్వ శివలింగం ఉన్నాయి. సిద్ధేశ్వర్ ఆలయానికి కొంచం దూరంలో పశ్చిమ సోమనాథ్ శివలింగం ఉంది. ఈ ఆలయద్వారం పశ్చిమదిశలో ఉంటుంది.

ఉపాలయాలు

[మార్చు]

ఆలయాలలోని శిల్పాలు, ఉపాలయాలు అతిపురాతనమైనవిగా ఉన్నాయి. పురాతన శిల్పాలలో పశ్చిమాలయాలలో గణేశుని విగ్రహం ఒకటి. మర్రి చెట్టు కింద ప్రతిష్ఠించబడి ఉన్న అష్టభుజ దుర్గా ప్రతిమ ఉంది. ఈ ప్రతిమ ఆరుబయట ఉన్నందున దుర్గాదేవి ప్రతిమ కొంత అరిగిపోయి ఉంది. ఈ ప్రతిమలు పూర్వం సిద్ధేశ్వరాలయంలో ఆధాధించబడి ఉండవచ్చని భావిస్తున్నారు. త్రవ్వకాలలో అలంకరించబడిన నల్లరాతి మెట్లు, ఇతర అలంకరణ అంశాలు వెలితీయబడ్డాయి. ఆలయం నుండి కనుచూపు మేరలో జగతి గ్రామం సమీపంలో చక్కగా చెక్కబడిన 5 అడుగుల హనుమంతుని విగ్రహం, అందమైన నాగబంధం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు పర్యవేక్షణలో ఉంది.

పురినకటక్

[మార్చు]

పురినకటక్ బౌధ్ నుండి 30 కి.మీ దూరంలో బౌధ్ - భువనేశ్వర్ రహదారిలో ఉంది. ఇది ఒక వ్యాపార కూడలి. ఇక్కడ ఉన్న ఆలయంలో భైరబీదేవి ప్రధానదైవంగా ఆరాధించబడుతుంది. ఈ ఆలయ ముఖద్వారం ఉంది. ఇక్కడ దుర్గాపూజ 16 రోజులపాటు నిర్వహించబడుతుంది. భైరభి ఆలయానికి ఎదురుగా మహేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. బస చేయడానికి సమీపంలో ఒక ఇంస్పెక్షన్ భవనం ఉంది.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

పద్మటోలా శాంక్ యురీ & సతకోసియా గోర్జ్

[మార్చు]

బౌధ్ జిల్లా వన్యమృగ సంపదతో అలరారుతుంది. జిల్లాలో ఉన్న పద్మటోలా శాంక్‌చ్యురీ చరిచక్‌కు 43కి.మీ దూరంలో ఉంది. బౌధ్ పట్టణం నుండి ఇది 80కి.మీ దూరంలో ఉంది. ఈ శాంక్‌చ్యురీని ఆనుకుని శతకొసియ లోయలోని పచ్చని అరణ్యాలు, వన్యమృగాలు ఉన్నాయి. లోయకు ఎడమ తీరంలో తికరపద వద్ద ఉన్న క్రొకోడైల్ శాంక్‌చ్యురీ ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా ఉంది. ఈ లోయలో 22 కి.మీ పొడవైన శక్తివంతమైన లోయలో మహానది ప్రవహిస్తుంది. ఈ లోయ భారతదేశంలో శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఈ ప్రదేశం చేపలు పట్టడం, బోటుప్రయాణం, సాహసయాత్రకు ఖ్యాతిగడించింది. లోయ ముఖద్వారంలో శతకోసియా లోయ బినికేయీ దేవి ఆలయం ఉంది. బినికేయీ దేవి తాంత్రికులు ఆరాధించే చతుర్భుజ చాముండీ రూపంలో ఉంటుంది. శతలపాణి వద్ద ఉన్న వసతిగృహాలలో బసచేసి ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

దంబరుగుడా

[మార్చు]

దంబరుగుడా పర్వతం బౌధ్ నుండి 21 కి.మీ దూరంలో బౌధ్- బలంగిర్ రహదారిలో ఉంది. ఈ ప్రాంతాన్ని సంగ్రామపూర్ అంటారు. పర్వతపాదాల వద్ద ప్రవహిస్తున్న మహానది ఈ ప్రాంతానికి మరింత మనోహరమైన సౌందర్యం ఇస్తుంది. పర్వతంలో ఉన్న వంపు పర్వత అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఈ పర్వతం ఎత్తు 70 అడుగులు. ఈ పర్వతశిఖరం మీద చైతన్యదేవా ఆలయం ఉంది.

నాయక్పద గుహ (పతలి శ్రీక్షేత్ర)

[మార్చు]

నాయక్పద గుహ బ్బౌధ్ పట్టణానికి 12 కి.మీ దూరంలో బౌధ్- భువనేశ్వర్ రహదారిలో ఉంది. ఈ గుహ పురాణప్రసిద్ధమైంది. ఒకప్పుడీ ఆశ్రమం ముని వాటికగా ఉండేది. ఇక్కడి అరణ్యం వృక్షజాలం, జంతుజాలంతో సుసంపన్నమై ఉంది. మాదాల పాంజి రచనల ఆధారంగా, చక్రవర్తి సోవన్‌దేవ్, జబన రాజు రక్తబాహు శ్రీక్షేత్ర పూరీ మీద దాడి చేసారని తెలుస్తుంది.

పతలి

[మార్చు]

పతలి దైవం జిల్లా కేంద్రానికి 12 మైళ్ళదూరంలో ఉన్న గోపాలీ గ్రామంలో ఉంది. నాయికపదా గుహకు దక్షిణంలో గోపాలి గ్రామం ఉంది. రత్నపూర్, భగపలి, బిరిబంధ్ (ప్రద్తుత బిరిఘర్) ప్రాంతాలు నైకపద గుహకు సమీపంలో ఉన్నాయని మదలపాంజి రచనలలో ప్రస్తావించబడింది. భంజా సామ్రాజ్యానికి చెందిన ఓడ్రదేశపాలకులకు నైక్పద గుహ సమీపంలో ఉన్న యజతి రాజధానిగా ఉండేదని తెలుస్తుంది. అది మహానది వరదలలో కొట్టుకు పోయిందని. ఇది ప్రస్తుత బౌధ్ లోని జగతి గ్రామానికి సమీపప్రాంతమని చారిత్రకారులు డాక్టర్ సత్యనారాయణ్ రాజ్గురు, డాక్టర్ నబిన్ కుమార్ సాహు విశ్వసిస్తున్నారు. తరువాత నీలమాధబ్‌గా విష్ణుమూర్తి జగతి గ్రామంలో ఆరాధించబడుతున్నాడు. 8వ శతాబ్దంలో ఇక్కడ రాతి ఆలయం నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆధీనంలో ఉంది. నయాఘర్ జిల్లాలో కంతిలో వద్ద మరొక నీలమాధభ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఓడ్రదేశం (ప్రద్తుత బౌధ్) పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. మదలపంజి రచనల ఆధారంగా జగన్నాథుని మూర్తి 144 సంవత్సరాల క్రితం నౌక్పద గుహలో పూడ్చిపెట్టపడిందని భావిస్తున్నారు.

ద్వీపం

[మార్చు]

బౌధ్ జిల్లాలో ఉన్న అద్భుతమైన ద్వీపం మర్జకుడ్. ఇది బౌధ్ పట్టణానికి ఎదురుగా మహానదిలో ఉంది. ఇక్కడ 3,000 మంది కంటే అధికంగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ మా పితబలీదేవి ప్రధానదైవంగా పూజించబడుతుంది. ఇది మంచి విహారానికి అనువైన ప్రదేశం. బౌధ్ జిల్లాలో అదనంగా పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కరడి వద్ద ఉన్న అసురగడ శివాలయం, సరసర, బౌసుని, బాలసింగా వద్ద ఉన్న జతసమాధి ఆలయం (ప్రధాన దైవం మహిమా), పల్ఝర్ మొదలైన ప్రదేశాలు పర్యాటక ఆకర్షక ప్రదేశాలుగా ఉన్నాయి.

రాజకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

The following is the 2 Vidhan sabha constituencies[4][5] of Boudh district and the elected members[6] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి Member of 15th Assembly పార్టీ
85 కంతమల్ లేదు కంతమల్, బౌధ్ (భాగం) మహీందర్ రాణా బి.జె.డి
86 బౌధ్ లేదు హర్భంగ, బౌధ్‌గర్ (ఎన్.ఎ.సి), బౌధ్ (భాగం) ప్రదీప్ కుమార్ అమత్ బి.జె.డి

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
Vote share of Winning candidates [7]
2014
  
48.61%
2009
  
50.60%
2004
  
38.73%
2000
  
33.91%
1995
  
40.40%
1990
  
51.01%
1985
  
42.31%
1980
  
58.35%
1977
  
60.85%

1951 నుండి 2014 వరకు 14 మార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జిల్లా నుండి ఎన్నికైన సభ్యులు.

[8][9]
  • 2014: (86): ప్రదీప్ కుమార్ ఆమత్ (బిజెడి)
  • 2009: (86): ప్రదీప్ కుమార్ ఆమత్ (బిజెడి)
  • 2004: (105): ప్రదీప్ కుమార్ ఆమత్ (బిజెడి)
  • 2000: (105): ప్రదీప్ కుమార్ ఆమత్ (ఇండిపెండెంట్)
  • 1995: (105): సచ్చిదాందానందా దలాల్ (జనతా దళ్)
  • 1990: (105): సచ్చిదానందా దలాల్ (జనతా దళ్)
  • 1985: (105): సుజిత్ కుమార్ పధి ( కాంగ్రెస్)
  • 1980: (105): హిమాంశు శేఖర్ పధి (కాంగ్రెస్ ఐ)
  • 1977: (105): నతబర్ ప్రధాన్ (జనతా పార్టీ)
  • 1974: (105):నతబర్ ప్రధాన్ (స్వతంత్ర)
  • 1971: (105: నతబర్ ప్రధాన్ (స్వతంత్ర)
  • 1967: (105): సుజిత్ కుమార్ పధి (ఒడిషా జన కాంగ్రెస్)
  • 1961: (32): శ్రీకాంత్ దీపా (గణతంత్ర పరిషత్)
  • 1951: (32): హిమాంశు శేఖర్ పధీ (ఇండిపెండెంట్)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Malta 408,333 July 2011 est.
  4. Assembly Constituencies and their EXtent
  5. Seats of Odisha
  6. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME
  7. "105 - Boudh Assembly నియోజకవర్గం". eci.nic.in. 2006. Retrieved 27 March 2014. List Of Winning Candidates
  8. http://orissa.gov.in/e-magazine/orissaannualreference/ORA-2011/pdf/453-501.pdf
  9. "Boudh Assembly నియోజకవర్గం, Orissa". Compare Infobase Limited. Archived from the original on 26 ఫిబ్రవరి 2014. Retrieved 20 February 2014.

వెలుపలి లింకులు

[మార్చు]