అక్షాంశ రేఖాంశాలు: 33°14′24″N 75°14′24″E / 33.24000°N 75.24000°E / 33.24000; 75.24000

రంబాన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంబాన్
పర్వతాలలో నదిపై సస్పెన్షన్ వంతెన
రాంబన్ వద్ద చినాబ్ నదిపై పాత వంతెన
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా స్థానం
Coordinates: 33°14′24″N 75°14′24″E / 33.24000°N 75.24000°E / 33.24000; 75.24000
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
విభాగంజమ్మూ
ప్రధాన కార్యాలయంరంబాన్
తహసీల్సు
విస్తీర్ణం
 • మొత్తం1,329 కి.మీ2 (513 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం2,83,713
 • జనసాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
 • Urban
4.16% [1]
జనాభా
 • అక్షరాస్యత54.27% [2]
 • లింగ నిష్పత్తి902
Time zoneUTC+05:30
Vehicle registrationJK-19
జాతీయ రహదారులుఎన్ఎచ్-44
Websitehttp://ramban.gov.in

జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలో రంబాన్ జిల్లా (ఉర్దు: ضلع رام بن ) ఒకటి. హిమాలయాలలోని పిర్‌పంజల్ పర్వతశ్రేణిలో ఉంది. దోడా జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. రంబా ప్రాతం వెనుకబడి ఉండడం, సుదూరప్రాంతంలో ఉండడం కారణంగా 2007 నుండి రంబా యూనిట్ స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతి లభించింది.[3] జిల్లా కేంద్రగా రంబాన్ పట్టణం ఉంది. ఈ పట్టణం జమ్మూ, శ్రీనగర్ మద్య చీనాబ్ నదీతీరంలో ఉంది. ఇది జమ్మూ, శ్రీనగర్కు సుమారు 150 కి.మీ దూరంలో జాతీయరహదారి 44 పక్కన ఉంది.[4]

పాలనా విభాగాలు

[మార్చు]

రంబాన్ జిల్లా 2 తెహ్సిల్స్‌గా విభజించబడింది.

  • రంబాన్ తెహ్సిల్
  • బనిహల్ తెహ్సిల్

ఒక్కొక్క తెహ్సిల్‌కు ఒక్కొక తెహ్సిల్దార్ ఉంటారు. తెహ్సిల్దార్ తెహ్సిల్‌కు అధికారబాధ్యతలు కలిగి ఉంటాడు. జిల్లా అదనంగా 4 బ్లాకులుగా విభజించబడి ఉంది : రంబాన్, బనిహల్, గూల్, రాంసు. ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క బ్లాక్ డెవెలెప్మెంట్ అధికారి ఉంటాడు.2001 గణాంకాలను అనుసరించి ఒక్కొక్క బ్లాకులో పలు పనచాయితీలు ఉంటాయి. జిల్లాలో 116 గ్రామాలు, 127 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో పంచాయతీ హల్కాలు 124 ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

రంబాన్ జిల్లా సముద్రమట్టానికి 1,156 మీ ఎత్తులో ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో " పత్నిటాప్ " హిల్ స్టేషను ఉంది. పశ్చిమ సరిహద్దులో గూల్, ఉత్తర సరిహద్దులో బనిహాల్ ఉన్నాయి.జిల్లాలోని టెర్రిన్ ప్రాతం కొండలమయంగా ఉంటుంది. జిల్లా సరిహద్దులలో రియాసీ, ఉధంపుర్, అనంతనాగ్, దోడా, కుల్గాం జిల్లాలు ఉన్నాయి.[5][6]

వాతావరణం

[మార్చు]

రంబాన్ జిల్లా వాతావరణం ఎత్తు పల్లాలను అనుసరించి మారుతూ ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల ° సెల్షియస్ ఉంటుంది. రంబాన్ వంటి ఎత్తైన ప్రదేశాలలో ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్షియస్‌కు చేరుకుంటుంది. క్లిష్టమైన శితోష్ణస్థితి కారణంగా ఇక్కడి ప్రజలు సంవత్సరంలో 8 మాసాలు మాత్రమే పనిచేస్తుంటారు.

రాజకీయాలు

[మార్చు]

రంబాన్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: బనిహాల్, రంబాన్.[7]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 283,313.[8]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. బార్బడోస్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 573వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 213[8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 31.81%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 56.9%.[8]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో పొగులి, రంబని కలిసిన కాశ్మీరి భాష అత్యధికంగా వాడుకలో ఉంది. సిరాజి కూడా జిల్లాలో అధికంగా వాడుకలో ఉంది. రంబాన్, బటొటే ప్రాంతాలలో డోగ్రీ భాష వాడుకలో ఉంది. జిల్లా తూర్పు, దక్షిణ ప్రాంతాలలో హిందువులు అధికంగా ఉన్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ముస్లిములు అధికంగా ఉన్నారు.భౌగోలికంగా కాశ్మీర్ లోయకు సమీపంగా ఉన్న కారణంగా జిల్లా వాయవ్యభాగంలో ఉన్న బనిహాల్, గోల్, కొన్ని ఇతర ప్రాంతాలలో వారిస్వంత యాసలో కాశ్మీరి భాషను మాట్లాడుతున్నారు. రంబాన్ జిల్లా ప్రజలు మతాలను కులాలను మరచి ఒకరికొకరు సహోదరభావంతో మెలగుతుంటారు. జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో అత్యంత శాతియుతమైన జిల్లాగా రంబాన్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు మతసంఘర్షణ నమోదు కాకపోవడం ఒక ప్రత్యేకత. [ఆధారం చూపాలి]

బృహత్తర ప్రణాళికలు

[మార్చు]

పిర్ పింజల్ రైల్వే టన్నెల్

[మార్చు]

పిర్ పింజల్ రైల్వే టన్నెల్ ప్రణాళిక భారతదేశ పొడవైన రైల్వే టన్నెల్‌గా గుర్తించబడుతుంది. ఇది 11.2 కి.మీ పొడవైనది. ఇది కాశ్మీర్ లోయ లోని బనిహాల్‌ను క్వాజీగుండ్‌తో కలుపుతుంది. ఈ టన్నెల్ కాశ్మీర్ రైల్వేలో ఒక భాగం.[10]

బగ్లిహర్ ఆనకట్ట

[మార్చు]

చందర్‌కోటే వద్ద జె.కె ఇండస్ట్రీస్ నిర్మించిన హైడ్రాలిక్ ప్రాజెక్ట్ " బగ్లిహర్ ఆనకట్ట " రంబాన్‌కు 8 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Census of India 2011
  2. "Ramban District Population, Caste, Religion Data (Jammu and Kashmir) - Census 2011". Archived from the original on 2020-09-20. Retrieved 2020-11-30.
  3. - About Ramban
  4. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  5. - About Ramban
  6. - Geography of Ramban
  7. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Barbados 286,705 July 2011 est.
  10. - Pir Panjal Railway Tunnel

వెలుపలి లింకులు

[మార్చు]