Jump to content

రాజౌరీ

అక్షాంశ రేఖాంశాలు: 33°23′N 74°19′E / 33.38°N 74.31°E / 33.38; 74.31
వికీపీడియా నుండి
రాజౌరీ
రాజౌరిలోని మదీనా కాలనీలో పాత జుల్లా వంతెన దృశ్యం.
రాజౌరిలోని మదీనా కాలనీలో పాత జుల్లా వంతెన దృశ్యం.
రాజౌరీ is located in Jammu and Kashmir
రాజౌరీ
రాజౌరీ
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో రాజౌరీ స్థానం
రాజౌరీ is located in India
రాజౌరీ
రాజౌరీ
రాజౌరీ (India)
Coordinates: 33°23′N 74°19′E / 33.38°N 74.31°E / 33.38; 74.31
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లారాజౌరీ
స్థాపన623 BC
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyరాజౌరీ మునిసిపల్ కౌన్సిల్
Elevation
915 మీ (3,002 అ.)
జనాభా
 (2011)
 • Total41,552 (Including Kheora and Jawahar Nagar) 6,42,415 (in Rajouri district)[1]
Time zoneUTC+5:30
Websitehttp://rajouri.nic.in/ https://rajouri.in/

రాజౌరి, భారత కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీరు లోని రాజౌరి జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది శ్రీనగర్ నుండి 155కి.మీ. (96 మైళ్లు), పూంచ్ రహదారిపై జమ్మూ నగరం150 కి.మీ.దూరంలో ఉంది. ఈ పట్టణంలో బాబా గులాం షా బాద్షా విశ్వవిద్యాలయం ఉంది.ఇది సిక్కు జనరల్ బండా సింగ్ బహదూర్ జన్మస్థలం.

కొత్త రాజౌరి వంతెన

చరిత్ర

[మార్చు]

రాజౌరి రాజ్యంలో సరైన రాజౌరి, తన్నా మండి, బాగ్లా అజీమ్ గర్, బెహ్రోట్,చింగస్, దర్హాల్, నాగ్రోటా, ఫల్యానా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ఆధునిక చరిత్ర

[మార్చు]

1813లో, జమ్మూకు చెందిన గులాబ్ సింగ్, రాజా అగర్ ఉల్లా ఖాన్‌ను ఓడించి సిక్కు సామ్రాజ్యం మహారాజా రంజిత్ సింగ్ కోసం రాజౌరిని స్వాధీనం చేసుకున్నాడు.[2] తరువాత రాజౌరి సిక్కు సామ్రాజ్యంలో భాగమైంది.కానీ దానిలోని కొన్ని భాగాలను రహీమ్ ఉల్లా ఖాన్ (అగర్ ఉల్లా ఖాన్ సోదరుడు)కు,ఇతర భాగాలను గులాబ్ సింగ్ కు జాగీర్లుగా ఇచ్చాడు. [3]

మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం తరువాత అమృతసర్ ఒప్పందం (1846) ప్రకారం రవినది, సింధు మధ్య ఉన్న అన్ని భూభాగాలు గులాబ్ సింగ్ కు బదిలీ చేయబడ్డాయి.అతను జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర మహారాజాగా గుర్తించబడ్డాడు.ఆ విధంగా రాజౌరి జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రంలో భాగమైంది.[4] గులాబ్ సింగ్, రాజౌరి పేరును రాంపూర్ గా మార్చాడు.అతను మియాన్ హతును రాజౌరి గవర్నర్‌గా నియమించాడు.మియాన్ హతును గవర్నర్‌గా 1856 వరకు రాజౌరిలోనే ఉన్నాడు. మియాన్ హతు రాజౌరి నగరానికి సమీపంలో ఉన్న తన్నా నల్లా మధ్య అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు.ధన్నిధర్ గ్రామంలో రాజౌరి కోటను కూడా నిర్మించాడు. 

మియాన్ హతు తరువాత, భీంబర్ జిల్లాతో అనుబంధంగా రాజౌరీని తాలూకాగా మార్చారు.1904 లో,రాజౌరీ తాలూకా భీంబర్ నుండి వేరుచేసి, రియాసి జిల్లాతో అనుబంధంగా కలిపారు.[4]

విభజన

[మార్చు]

భారతదేశ విభజన తరువాత 1947 అక్టోబరులో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన తరువాత, భారతదేశం పాకిస్తాన్ మధ్య మొదటి కాశ్మీర్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పాలకులు రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాల నుండి పారిపోయినవారితో, తిరుగుబాటుదారులతో కలసి,1947 నవంబరు 7న రాజౌరీని స్వాధీనం చేసుకున్నారు.రాజౌరిలో నివసిస్తున్నహిందువులు, సిక్కులలో సుమారు 30,000 మంది హత్యలకు, గాయపర్చటానికి, అపహరించటానికి గురైయ్యారు. [5] [6] [7] రెండవ లెఫ్టినెంట్ (ఉప సైన్యాధిపతి) రామా రాగోబా రాణే ఆధ్వర్యంలో రాజౌరిని 1948, ఏప్రియల్ 12న, పదాతిదళ బ్రిగేడ్ -19 భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.రాన్, గాయపడినప్పటికీ, ప్రధాన రహదారి వెంబడి ఉన్న రహదారి అడ్డంకులను నివారించడానికి తావి నది తీరం వద్దకు ట్యాంకులను చేరవేసి, దైర్యంతో ట్యాంకులద్వారా దాడిచేశాడు.భారత సైన్యం పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, బందీలు పారిపోయారు. పట్టణంలో చాలా భాగాన్ని నాశనం చేసి, దాని నివాసులందరినీ చంపారు.సైన్యం వచ్చిన తరువాత, మహిళలు పిల్లలతో సహా కొండలకు పారిపోయిన 1,500 మంది శరణార్థులు పట్టణానికి తిరిగిచేరుకున్నారు.[8]రాజౌరీ-రియాసి జిల్లాకు పశ్చిమాన యుద్ధం ముగింపు కాల్పుల విరమణ జరిగింది.

భారతదేశం లోపల

[మార్చు]

యుద్ధం ముగిసిన వెంటనే, రాజౌరి, రియాసి తాలూకాలు వేరు చేయబడ్డాయి.రాజౌరి తహసీల్‌ను భారత పరిపాలన పూంచ్ జిల్లాలో విలీనం చేసి, పూంచ్ రాజౌరి జిల్లాను ఏర్పాటుచేసింది.[4] రియాసి తహసీల్‌ను ఉధంపూర్ జిల్లాలో విలీనం చేశారు.

1968 జనవరి 1న, రెండు తహసీల్సు తిరిగి కలిపారు.ఫలితంగా వచ్చిన కొత్త జిల్లాకు రాజౌరి జిల్లా అని పేరు పెట్టారు. [4]

2006 లో రియాసి తాలూకా, ప్రత్యేక రియాసి జిల్లాగా వేరు చేయబడింది. ప్రస్తుత రాజౌరి జిల్లాలో1947నాటి రాజౌరి పాత తాలూకా ఉంది.

ఆపరేషన్ జిబ్రాల్టర్ సందర్భంగా కాశ్మీర్‌లో పాకిస్తాన్ చొరబాటు వల్ల స్థానిక ముజాహిదీన్ల సహాయంతో పాకిస్తాన్ భద్రతాదళ సైనికులు, భారత సైన్యంపై దాడిచేసి రాజౌరిని రహస్యంగా ముట్టడించారు

కానీ పాకిస్తాన్ భద్రతాదళ సైనికులు విస్తృత సైనికచర్య విఫలమైంది. భారతదేశంతో యుద్ధం ముగియటంతో, పాకిస్తాన్ తన దళాలను ఉపసంహరించుకుంది.

భౌగోళికం,

[మార్చు]

రాజౌరి 33°23′N 74°18′E / 33.38°N 74.3°E / 33.38; 74.3. వద్ద [9] ఇది సముద్ర మట్టం నుండి 915 మీటర్లు (3001 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

విద్య

[మార్చు]

చాలా పేరు పొందిన బాబా గులాం షా బాద్షా విశ్వవిద్యాలయం (బి.జి.ఎస్.బి.యు) రాజౌరిలో ఉంది.ఇది వివిధ డిప్లొమా, యుజిసి, పిజి కోర్సులను అందిస్తుంది. దీని పర్వేక్షణలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల జిఎంసి రాజౌరితో పాటు, ఇతర డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]

చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రదేశాల కంటే రాజౌరి వాతావరణం కొంత చల్లగా ఉంటుంది.వేసవికాలం సమయం తక్కువుగా,ఆహ్లాదకరంగా ఉంటుంది.వేసవి ఉష్ణోగ్రత సాధారణంగా 41 డిగ్రీలకు మించదు. శీతాకాలం చల్లగా ఉంటుంది,పాశ్చాత్య అవాంతరాల కారణంగా వర్షపాతం ఉంటుంది.హిమపాతం చాలా తక్కువగా ఉంటుంది.కానీ డిసెంబరు మాసంలో ఎక్కువుగా ఉంటుందిసగటు వర్షపాతం 769 మిల్లీమీటర్లు (26.3 లో) తేమ నెలల్లో వేసవి సగటు ఉష్ణోగ్రత 29'C, శీతాకాలపు సగటు ఉష్ణోగ్రత 16'C.ఉంటుంది [10]

జనాభా

[మార్చు]

రాజౌరి పట్టణంలో అతిపెద్ద మతం హిందూ మతం.దీని తరువాత 57% మంది ఇతర మతాల ప్రజలు ఉన్నారు.వారి తరువాత రెండవ అతిపెద్ద మతం ఇస్లాం వారి అనుచరులతో కలిపి 37.08%గా ఉంది.క్రైస్తవ మతం 0.51%, సిక్కు మతం 5.09% ఉంది. [11]

రాజౌరీ పట్టణంలో మతాలువారిగా

  హిందువులు (57.06%)
  ఇస్లాం (37.08%)
  సిక్కు (5.09%)
  క్రిష్టియన్ (0.51%)
  బౌద్ధులు (0.08%)
  జైనులు (0.02%)
  ఇతరులు (0.00%)
  పేర్కొనబడలేదు (0.17%)

2011 జనాభా లెక్కల ప్రకారం, [12] రాజౌరి పట్టణ జనాభా 37,552 పురపాలక సంఘ పరిధి జనాభా 41,552.అందులో పురుషులు 57%, స్త్రీలు 43% ఉన్నారు. రాజౌరి సగటు అక్షరాస్యత రేటు 77%, జాతీయ సగటు 75.5% కంటే ఇది ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 83%, స్త్రీల అక్షరాస్యత 68%. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు జనాభాలో 12% ఉన్నారు.గుజ్జర్లు, పహారీలుకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు.

రవాణా

[మార్చు]

వాయు మార్గం

[మార్చు]

రాజౌరి విమానాశ్రయం పట్టణానికి 1 కి.మీ.టర్ల దూరంలో ఉంది. కాని ప్రస్తుతం అది పనిచేయటలేదు.జమ్మూ విమానాశ్రయం రాజౌరీకి సమీప విమానాశ్రయం.ఇది రాజౌరి నుండి 154 కి.మీ. దూరంలో ఉంది.దీనిని చేరుటకు ప్రయాణ సమయం గం.4.00లు పట్టింది.

రైలు మార్గం

[మార్చు]

రాజౌరికి సొంత రైల్వే స్టేషను లేదు.జమ్మూ తవి రైల్వే స్టేషన్ రాజౌరికి సమీప రైల్వే స్టేషను.ఇది పట్టణానికి 151 కి.మీ. దూరంల ఉంది.దీనిని చేరుటకు ప్రయాణ సమయం గం.4.00లు పట్టింది.సమీప భవిష్యత్తులో జమ్మూ-పూంచ్ రైల్వే లైన్ ద్వారా రాజౌరిని రైలు ద్వారా అనుసంధానించే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తుంది. [13]

త్రోవ మార్గం

[మార్చు]

రాజౌరి ఇతర పట్టణాలు, గ్రామాలు, జమ్మూ కాశ్మీర్ నగరానికి రహదారుల ద్వారా బాగా కలిపారు.జాతీయ రహదారి144A రాజౌరి గుండా వెళుతుంది.

ప్రస్తావనలు

[మార్చు]
  1. http://www.census2011.co.in/census/district/624-rajouri.html
  2. Panikkar, Gulab Singh 1930, p. 31.
  3. Panikkar, Gulab Singh 1930, p. 40.
  4. 4.0 4.1 4.2 4.3 Sudhir S. Bloeria, Militancy in Rajouri and Poonch, South Asia Terrorism Portal, 2001.
  5. Prasad, Sri Nandan; Pal, Dharm (1987-01-01). Operations in Jammu & Kashmir, 1947-48 (in ఇంగ్లీష్). History Division, Ministry of Defence, Government of India. pp. 49–50.
  6. V. K. Singh, Leadership in the Indian Army 2005, p. 160.
  7. Ramachandran, Empire's First Soldiers 2008, p. 171.
  8. Sarkar, Outstanding Victories of the Indian Army 2016, pp. 37–40.
  9. Falling Rain Genomics, Inc - Rajouri[dead link]
  10. =IMD Archived 2012-03-15 at the Wayback Machine
  11. "Rajouri Town Population". Census India. Retrieved 27 September 2020.
  12. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  13. "Centre nod to Jammu-Poonch rail line after several years". Daily Excelsior. Retrieved 24 December 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజౌరీ&oldid=4016661" నుండి వెలికితీశారు