రాష్ట్రీయ లోక్‌దళ్
రాష్ట్రీయ లోక్‌దళ్ | |
---|---|
Chairperson | జయంత్ చౌదరి[1] |
స్థాపకులు | చౌదరి చరణ్ సింగ్ |
స్థాపన తేదీ | 1996 |
Preceded by | లోక్ దళ్ |
ప్రధాన కార్యాలయం | AB 97, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ, 110011 |
రాజకీయ విధానం | సెక్యులరిజం[2] ప్రాంతీయవాదం[3] జాట్‌ల అభ్యున్నతి[4] రైతుల హక్కులు[5] |
ECI Status | గుర్తింపు లేని పార్టీ[6] |
కూటమి | Current
గతంలో
|
లోక్‌సభ స్థానాలు | 0 / 543 |
రాజ్యసభ స్థానాలు | 1 / 245 |
శాసన సభలో స్థానాలు | 9 / 403 |
Election symbol | |
Party flag | |
Website | |
www.rashtriyalokdal.com | |
రాష్ట్రీయ లోక్ దళ్ (సంక్షిప్తంగా: ఆర్ఎల్‌డీ) ( అనువాదం : నేషనల్ పీపుల్స్ పార్టీ ) అనేది ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లోని ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ. 1996లో జనతాదళ్ నుండి విడిపోయిన తరువాత భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు చౌదరి అజిత్ సింగ్ ఈ పార్టీని స్థాపించాడు.
చరిత్ర
[మార్చు]అజిత్ సింగ్ 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఎన్నికయ్యాడు. కానీ పార్టీకి, లోక్‌సభకు రాజీనామా చేసి భారతీయ కిసాన్ కంగర్ పార్టీని స్థాపించి 1997లో లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో బాగ్‌పట్ నుండి తిరిగి ఎన్నికయ్యాడు.
1999లో రాష్ట్రీయ లోక్ దళ్ పేరుతో పార్టీని పునఃప్రారంభించాడు. అయన 1998 ఎన్నికలలో ఓడిపోయి, 1999, 2004, 2009లో తిరిగి ఎన్నికై ఎన్‌డీఏ ప్రభుత్వంలో 2001 నుండి 2003 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2011లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో చేరిన తర్వాత 2011 డిసెంబరు నుండి 2014 మే వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు. అజిత్ సింగ్ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో ముజఫర్‌నగర్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి అభ్యర్థి సంజీవ్ బల్యాన్ చేతిలో 6526 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
ఆర్ఎల్‌డీ ఆ తరువాత 2014 నుండి 2022 వరకు ఉనికిని కోల్పోయి 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగంగా 33 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది స్థానాలను గెలుచుకోగలిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) ఇండియా కూటమిలో ఉండగా 2024 మార్చి 2న ఎన్‌డీఏ కూటమిలో చేరింది.[7]
ఆర్ఎల్‌డీ పార్టీ ఆఫీస్ బేరర్లు
[మార్చు]- జాతీయ అధ్యక్షుడు - జయంత్ సింగ్
ఎన్నికల చరిత్ర
[మార్చు]లోక్‌సభ
[మార్చు]లోక్‌సభ | భారత
సాధారణ ఎన్నికలు |
సీట్లలో
పోటీ చేశారు |
సీట్లు
గెలుచుకున్నారు |
%
ఓట్లు |
---|---|---|---|---|
12వ లోక్‌సభ | 1998 | 8 | 0 | - |
13వ లోక్‌సభ | 1999 | 7 | 2 | 0.37% |
14వ లోక్‌సభ | 2004 | 10 | 3 | 0.63% |
15వ లోక్‌సభ | 2009 | 7 | 5 | 0.44% |
16వ లోక్‌సభ | 2014 | 8 | 0 | 0.13% |
17వ లోక్‌సభ | 2019 | 3 | 0 | 0.24% |
ఉత్తర ప్రదేశ్ శాసనసభ
[మార్చు]శాసనసభ | అసెంబ్లీ ఎన్నికలు | సీట్లలో
పోటీ చేశారు |
సీట్లు
గెలుచుకున్నారు |
%
ఓట్లు |
---|---|---|---|---|
13వ శాసనసభ | 1996 | 38 | 8 | 2.13% |
14వ శాసనసభ | 2002 | 38 | 14 | 2.65% |
15వ శాసనసభ | 2007 | 254 | 10 | 1.95% |
16వ శాసనసభ | 2012 | 46 | 9 | 2.33% |
17వ శాసనసభ | 2017 | 171 | 1 | 1.71% |
18వ శాసనసభ | 2022 | 33 | 9 | 5.18% |
రాజ్యసభ సభ్యులు
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | నియోజకవర్గం | ||
---|---|---|---|---|---|
1 | జయంత్ చౌదరి | 2021 మే 25 | ప్రస్తుతం | ఉత్తర ప్రదేశ్ |
శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు)
[మార్చు]నం. | పేరు | నియోజకవర్గం | రాష్ట్రం |
---|---|---|---|
1 | డా. సుభాష్ గార్గ్ | భరత్‌పూర్ | రాజస్థాన్ |
2 | రాజ్‌పాల్ సింగ్ బలియన్ | బుధాన | ఉత్తర ప్రదేశ్ |
3 | పర్సన్ చౌదరి | షామ్లీ | |
4 | అజయ్ కుమార్ | చప్రౌలి | |
5 | ప్రదీప్ కుమార్ సింగ్ | సదాబాద్ | |
6 | గులాం మొహమ్మద్ | సివల్ఖాస్ | |
7 | అష్రఫ్ అలీ ఖాన్ | థానా భవన్ | |
8 | చందన్ చౌహాన్ | మీరాపూర్ | |
9 | అనిల్ కుమార్ | పుర్ఖాజి | |
10 | మదన్ భయ్యా | ఖతౌలీ |
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల జాబితా
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | పోర్ట్‌ఫోలియో | ప్రధాన మంత్రి | ||
---|---|---|---|---|---|---|
1 | చౌదరి అజిత్ సింగ్ | 2001 జూలై 22 | 2003 మే 24 | వ్యవసాయ మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | |
2011 డిసెంబరు 18 | 2014 మే 26 | పౌర విమానయాన శాఖ మంత్రి | మన్మోహన్ సింగ్ |
రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రుల జాబితా
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | పోర్ట్‌ఫోలియో | ముఖ్యమంత్రి | ||
---|---|---|---|---|---|---|
1 | సుభాష్ గార్గ్ | 2018 | 2023 | రాష్ట్ర సాంకేతిక విద్య (IC), ఆయుర్వేద & భారతీయ ఔషధాల (IC), పబ్లిక్ గ్రీవెన్స్ & రిడ్రెసల్ (IC), మైనారిటీ వ్యవహారాల వక్ఫ్, వలసరాజ్యాల వ్యవసాయ కమాండ్ ఏరియా, అభివృద్ధి & నీటి వినియోగం | అశోక్ గెహ్లాట్ |
మూలాలు
[మార్చు]- ↑ "Jayant Chaudhary appointed new RLD president". The Economic Times.
- ↑ "Obituary: Ajit Singh Braved All Odds but Never Sacrificed His Secular Ideology". 11 January 2022.
- ↑ "Obituary: Ajit Singh Braved All Odds But Never Sacrificed His Secular Ideology". 11 January 2022.
- ↑ "RLD: SP, RLD release first list of 29, field 9 Jats & 9 yadavs | Uttar-Pradesh Election News - Times of India". The Times of India. 14 January 2022.[permanent dead link]
- ↑ "RLD: SP, RLD release first list of 29, field 9 Jats & 9 yadavs | Uttar-Pradesh Election News - Times of India". The Times of India. 14 January 2022.[permanent dead link]
- ↑ "Big blow to RLD from Election Commission, snatched the status of state level party Dated 10.04.2023". India: Patrika. 2013. Retrieved 10 April 2023.
- ↑ Andhrajyothy (3 March 2024). "ఎన్‌డీఏలో చేరిన రాష్ట్రీయ లోక్‌దళ్". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.