Jump to content

ఉదయ్‌పూర్ (రాజస్థాన్)

అక్షాంశ రేఖాంశాలు: 24°35′N 73°41′E / 24.58°N 73.68°E / 24.58; 73.68
వికీపీడియా నుండి
(ఉదయ్ పూర్ నుండి దారిమార్పు చెందింది)
ఉదయ్‌పూర్
పై నుండి క్రిందికి:ఉదయ్‌పూర్ నగరం సాయంత్రం దృశ్యం, సిటీ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్
Nickname: 
సరస్సుల నగరం
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
భారతదేశ పటంలో రాజస్థాన్ రాష్ట్ర స్థానం
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్ (India)
Coordinates: 24°35′N 73°41′E / 24.58°N 73.68°E / 24.58; 73.68
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఉదయ్‌పూర్
Founded byరానా ఉదయ్ సింగ్ II
Government
 • Bodyఉదయ్‌పూర్ నగరపాలక సంస్థ
 • మేయర్గోవింద్ సింగ్ తక్ (బిజెపి)
విస్తీర్ణం
 • నగరం64 కి.మీ2 (25 చ. మై)
Elevation
423 మీ (1,388 అ.)
జనాభా
 (2011)
 • నగరం4,51,100
 • Metro
4,74,531
భాషలు
 • అధికారికహిందీ
 • అదనపు అధికార భాషఆంగ్లం
 • ప్రాంతీయమెవారీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
313001- 313024
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91- 294
Vehicle registrationRJ-27
దగ్గరి నగరాలుజోధ్‌పూర్ , చిత్తౌర్‌గఢ్, కోట, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్,

ఉదయ్‌పూర్, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక నగరం.దీనిని సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం), సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అనికూడా అంటారు.ఇది ఉదయ్‌పూర్ జిల్లాకు, పరిపాలనా ప్రధానకేంద్రం.

జనాభా

[మార్చు]

ఉదయ్‌పూర్ నగరాన్ని ఉదయ్‌పూర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉదయ్‌పూర్ జనాభా 451,100 మంది ఉండగా, వీరిలో పురుషులు 233,959 కాగా, స్త్రీలు 217,141 మంది ఉన్నారు. ఉదయ్‌పూర్ నగరంలో 451,100 జనాభా ఉన్నప్పటికీ పట్టణ / మెట్రోపాలిటన్ జనాభా 474,531, అందులో 246,118 మంది పురుషులు, 228,413 మంది మహిళలు ఉన్నారు.[2]

చరిత్ర

[మార్చు]

రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయ్‌పూర్ రాజధానిగా ఉండేది. ఉదయ్‌పూర్ అతి దీర్ఘకాలం పరిపాలించిన సంస్థానంగా ఉదయ్‌పూర్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. రాజపుత్రుల సంతతివారు ఇప్పటికీ వారి హోదాలో కొనసాగుతున్నారు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన ప్రదేశాలు ఉదయ్‌పూర్ ఇప్పటికీ విశదీకరిస్తుంది.అనేక రాజమందిరాలు విలాసవంతమైన వసతిగృహాలుగా మారాయి. ఈ నగరాన్ని తూర్పు వెనిస్ నగరం, ప్రేమ నగరం, సరస్సుల నగరం అని ఉపనామాలు ఉన్నాయి.

మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని 1567లో ఆరావళి పర్వత పాద పంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించాడు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో ఉదయ్‌పూర్ నిండి ఉంటుంది. దక్షిణం వైపు పిచ్డా సరస్సు, మిగిలిన మూడు దిక్కులా ప్రహరీ సరిహద్దులుగా కలిగి ఉంటుంది. ఈ నగరంలో అన్నింటికన్నా చెప్పుకోదగ్గది సిటీ ప్యాలెస్.పిచోలా సరస్సు ప్రక్కనే ఉండే ఈ ప్యాలెస్ మొత్తం రాజస్థాన్ లోనే అతి పెద్దది. దీని నిర్మాణాన్ని 1559 లో మహారాణా ఉదయ్ సింగ్ II చేపట్టారు. దీన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. మరో ముఖ్యమైన ప్యాలెస్ " లేక్ ప్యాలెస్". సరస్సు మధ్యలో నిర్మించబడిన ఈ అద్భుతమైన కట్టడాన్ని మహారాణా జగత్ సింగ్ వేసవి విడిదిగా నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం 1743 లో మొదలై 1746 లో పూర్తయింది. సరస్సు మధ్యలో ఉండటం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఈ ప్యాలెస్ లోనే ఉదయ్‌పూర్ మహారాజు, మొఘల్ చక్రవర్తి షాజహాన్కి ఆతిధ్యమిచ్చాడు. ఉదయ్‌పూర్ లో అడుగడుగునా రాజపుట్ వీరుడు, అసామాన్య ధైర్యసాహసాలతో మేవార్ గడ్డపై పరదేశీయుల ఆధిపత్యాన్ని నిరసించి, తరిమికొట్టిన దేశభక్తుడు మహారాణా ప్రతాప్ ఉనికి కనిపిస్తూనే ఉంటుంది. ఈ వీరుడికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండి, ధైర్య సాహసాలతో మహారాణా ప్రతాప్ ప్రాణాలను రక్షించి, చివరకు హల్దీ ఘాట్ లో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన గుఱ్ఱం పేరు "చేతక్". ఈ గుఱ్ఱానికి ఎంతో ఆదరంతో అనేక స్థలాలలో విగ్రహాలు కట్టించారు.

ఉదయ్‌పూర్ 1159లో రెండవ ఉదయ్ సింఘ్ చేత నిర్మింపబడి మేవార రాజ్యానికి ప్రథమ, ఆఖరి రాజధానిగా స్థిరపరిచారు. ఈ నగరం నాగ్డా నగరానికి ఆగ్నేయంగా బణా నదీతీరంలో నిర్మించారు. చరిత్రననుసరించి రెండవ ఉదయ్ సింఘ్ ఆరావళీ పర్వత ప్రాంతంలో వేటాడే సమయంలో ఒక తపస్వి చెంతకు వెళ్ళాడు. ఆ తపస్వి రాజును ఆశీర్వదించి అక్కడ ఒక రాజభవనం నిర్మించమని సలహా ఇచ్చాడు. అలా నిర్మిస్తే అది సురక్షితంగా ఉంటుందని రాజుకు నమ్మకంగా చెప్పాడు. ఫలితంగా రెండవ ఉదయ్ సింఘ్ ఆ ప్రదేశంలో తన నివాస స్థలంగా భవన నిర్మాణం చేసాడు. 1568లో మొగల్ చక్రవర్తి అక్బర్ చిత్తోఢ్ కోటను స్వాధీనపరచుకున్నాడు. ఉదయ్ సంఘ్ తన రాజధానిని తన నివాసిత ప్రాంతానికి మార్చుకున్నాడు. అది ఉదయ్‌పూర్ నగరం అయింది.

మొగల్ సామ్రాజ్యం బలహీన పడిన సమయంలో మొగల్ సామ్రాజ్యాన్ని ప్రారంభం నుండి ఎదిరిస్తున్న సూర్యవంశ రాజులైన సిశోడియా రాణాస్ (మహారాణాస్) తమను స్వతంత్రులుగా ప్రకటించుకుని చిత్తోఢ్ తప్ప మిగిలిన మేవార్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఉదయ్‌పూర్ రాష్ట్ర రాజధానిగా మిగిలి పోయింది. 1818 నుండి బ్రిటిష్ పాలనా కాలంలో ఇది రాజసంస్థానంగా కొనసాగింది. ఎడారి పర్వత ప్రాంతం అయినందున, ఇది అతి పెద్ద మొగల్ అశ్వసేనకు అనుకూలం కాదు, కనుక ఉదయ్‌పూర్ మొగల్ చక్రవర్తుల ఆధిపత్యం నుండి సురక్షితంగా మిగిలి పోయింది. ప్రపంచంలో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతనమైన ఒకే రాజవంశం మేవాడ రాజవంశం. నేపాల్ రాజవంశం, జమ్మూ రాజవంశం కూడా మూలం మేవార్ రాజవంశమే.

పర్యాటకం

[మార్చు]

భారతదేశంలో ఉదయ్‌పూర్ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ కలిగిన నగరం. ఉదయ్‌పూర్ నగరం సరసులు, రాజభవనాలు, సంస్కృతి, ప్రజా జీవన విధానం వంటి వాటితో స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పలు చలనచిత్ర నటీ నటులకు, వ్యాపారులకు, రాజకీయ నాయకులకు చెందిన వివాహ వేదికగా ఉంది. వీరు ఇక్కడ వివాహ వేడుకలు, విందులు జరుపుకుంటారు.

సిటీ ప్యాలెస్
రాత్రి వేళలో ది ఉదయపూర్ ప్యాలెస్ కాంప్లెస్
సిటీ ప్యాలెస్
జగదీష్ ఆలయం
జగ్ మందిర్
లేక్ ప్యాలెస్

ఊదయపూర్ సిటీ ప్యాలెస్

[మార్చు]

1559లో పిచోల సరస్సు తీరంలో గంభీరంగా ఈ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ సముదాయం ఉంది. ఈ సరస్సుకు ఒకతీరంలో జగ మందిర్ అనే ఫైవ్ స్టార్ హోటెల్ మరొక వైపు ఉదయ్‌పూర్ నగరం ఉంది. మూడు ఆర్చులు కలిగిన త్రిపోలియా అనే ద్వారం 1725లో నిర్మించబడింది. ఈ ద్వారం వరుసగా బహిరంగ ప్రదేశాలు, తోటలు, భవన గోపురాలు, మందిరాలు వసారాలు చేరుకోవచ్చు. అక్కడ ఉన్న సూరజ్ ఘోక్డా వద్ద క్లిష్ట సమయాలలో రాణాలు ప్రజలకు దర్శనం ఇచ్చి ధైర్యం చెప్తుంటారు. భీమ్ విలాస్ లో చిని చిత్రశాలలో అందమైన కృష్ణుడి కుడ్యాచిత్రాలకు గుర్తింపు పొందింది.దిల్ కుష్ మహల్, సీష్ మహల్, మోతీ మహల్, కృష్ణ విలాస్, ఇక్కడ రాజకుమార్తె తన కొరకు శత్రు రాజకుమారులు చేయాలనుకున్న యుద్ధం తప్పించడానికి విషం తీసుకుని ప్రాణత్యాగం చేసిన ప్రదేశమిది. ఆ జ్ఞాపకంగా ఇక్కడ అనేక పురాతన కళాత్మకమైన వస్తువులు, చిత్రాలు, అలంకరించిన గృహోపయోగ వస్తువులు వేల కొలది పర్యాటకులను ఆకర్షిస్తుంది.[3] పాత సిటీ ప్యాలెస్, శివ్ నివాస్ ప్యాలెస్, ఫ్యాచ్ ప్రకాష్ ప్యాలెస్ ఇప్పుడు అయిదు నక్షత్రాల హోటెల్స్ గా మార్చబడ్డాయి.

జల మందిరం

[మార్చు]

1743-1746లో పిచోలా సరసు మధ్యలో ఉన్న జాగ్ నివాస్ ద్వీపంలో పాలరాతి రాజభవనం ఇది. ఇది రాజకుటుంబం వేసవి విడిదిగా ఉపయోగించడానికి నిర్మించబడింది. ఇప్పుడది ది తాజ్ హోటెల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ సంస్థ క్రింద 5 నక్షత్రాల హోటల్‌గా మార్చబడింది.

జగ్ మందిర్

[మార్చు]

పిచోలా సరసులో జగ్ మందిర్ మరొక ద్వీపం. ఉద్యానవన సభామండపానికి గుర్తింపు పొందింది. ఇక్కడ హెచ్ ఆర్ హెచ్ గ్రూప్ నడుపుతున్న హోటల్ ఉంది. ఇక్కడ షాజహాన్ తన తండ్రి మీద తిరుగుబాటు చేసిన కాలంలో కొంతకాలం నివసించాడు.

వేసవి విడిది

[మార్చు]

మహారాజుకు ఇది మరొక వేసవి విడిది. కొండ శిఖరం మీద నిర్మించబడిన ఈ భవనం నుండి చుట్టూ ఉన్న సరసుల సుందర దృశ్యం కనిపిస్తుంది. ఈ రాజభవనంలో వర్షపు నీటిని సేకరించి సంవత్సరమంతా అవసరాలకు వాడడానికి అనువైన నిర్మాణం చేయబడి ఉంది.

జగదీష్ ఆలయం

[మార్చు]

ఉదయ్‌పూర్ నగర మధ్యలో ఉన్న పెద్ద ఆలయం జగదీష్ మందిర్. ఈ అలయం సా.శ. 1651లో మొదటి మహారాణా జగత్ సింగ్ చేత నిర్మించబడింది. సింధు-ఆర్యన్ శిల్పకళతో నిర్మించబడిన నిర్మాణాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ ఆలయం గొప్ప శిల్పకళావైభవానికి, చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. నగరంలో ఉన్న పర్యాటక సందర్శనా ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ రాజస్థానీ దుస్తులు, చిత్రాలు మొదలైనవి లభ్యమౌతాయి. కనుక నగరంలోని పర్యాటకులకు ఆకర్షణీయ ప్రాంతాలలో ఇది ఒకటి.

ఫతే సాగర్ సరసు

[మార్చు]

ఫతే సాగర్ సరసు పిచోలా సరసుకు ఉత్తరంగా ఉంటుంది. సా.శ 1678లో దీనిని మహారాణా జైసింగ్ నిర్మించాడు. అయినా తరువాత మహారాణా ఫతే సింగ్ చేత పునర్నిర్మాణం చేయబడి విస్తరించబడింది. తరువాత అధిక వర్షపాతం కారణంగా నిర్మాణాలు అత్యధికంగా ధ్వంసం కావడం వలన 1993-1994లో నీరు పూర్తిగా ఎండి పోయింది. అయినా 2005-2006లో ఈ సరసుకు తిరిగి నీరు చేరింది.

పిచోలా సరసు

[మార్చు]

పిచోలా సరసులో రెండు ద్వీపాలు ఉన్నాయి. ఒకటి జగ్ నివాస్, జగ్ మందిర్. ఈ సరసు 4 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ముందుగా దీనిని రెండవ మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించాడు. ఈ సరసులో స్నానం చెయ్యడానికి, బట్టలు ఉతకడానికి పలు ఘట్టాలు ఉన్నాయి. ఉదయ్‌పూర్ లోని బాన్సి ఘాట్ నుండి బోట్లు లభ్యం ఔతాయి. సరసు కేంద్రంలో లేక్ ప్యాలెస్ ఉంటుంది. మంచి వర్షాలు పడినప్పుడు సరసు నీటితో నిండి పోతుంది అలాగే ఒక్కోసారి కరువు కాలంలో ఇది ఎండి పోతుంది.

సహేలియోంకి బారి

[మార్చు]

సహేలియోకి బారి అనేది రాజోద్యానవనం. దీనిని మహారాణితో పంపబడిన 48 మంది చెలికత్తెలు కొరకు ఉదయ్‌పూర్ రాజుల చేత నిర్మించబడింది. ఫతే సాగర్ సరసు తీరంలో ఈ ఉద్యానవనం నిర్మించబడింది. ఈ సరసులో తామర కొలనులు, ఏనుగు ఆకార ఫౌంటెన్లు (జలయంత్రాలు) ఉన్నాయి. ఈ ఫౌంటెన్లు సరసులోని నీటి ఆధారంగా పనిచేస్తుంటాయి.

గులాబీ తోట, జంతుప్రదర్శనశాల

[మార్చు]

రజభవనం సమీపంలో పిచోలా సరసు తూర్పు దిక్కున మహారాణా సాజన్ సింగ్ చేత ఒక ఉద్యానవనం నిర్మించబడింది. ఈ ఉద్యానవనం ఉన్న గ్రంథాలయంలో చేతితో వ్రాసిన పుస్తకాలు భద్రపరచబడ్డాయి. సత్యార్ధ్ ప్రకాష్ చేత వ్రాయబడిన వ్రాతపతులు కొంత భాగం ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి.ఈ ఉద్యానవనంలో సత్యార్ధ్ ప్రకాష్ స్థూపం ఒకటి ఉంది.ఉద్యానవనంలో ఉన్న జంతుప్రదర్శనశాలలో పులులు, చిరుతపులులు, పక్షులు, కృష్ణ జింక, ఇతర కృూరమృగాలు చిత్రాలు ఉన్నాయి.

దూద్ తాలై

[మార్చు]

ఎ రాక్ అండ్ ఫౌంటెన్ ఉద్యానవనం. సూర్యాస్తమయ దృశ్యం పిచోలా సరసు నుండి చూసి ఆనందించ వచ్చు. కార్ని మాతా ఆలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి రోప్‌వే కూడా ఉంది.

భారతీయ లోక్ కళా మందిరం

[మార్చు]

జానపదకళల ప్రదర్శన శాలలో పప్పెట్ షో కూడా నిర్వహించబడుతుంది.

మహారాణా ప్రతాప్ మెమోరియాల్ లేక మోతీ మాగ్రి

[మార్చు]

ఫతే సాగర్ నుండి కనిపించే మోతీమా గిరి శిఖరం మీద రాజపుత్ ప్రియత నాయకుడు మహారాణా ప్రతాప్ సింగ్ తన అభిమాన ఆశ్వం చేతక్‌విగ్రహంపై కూర్చొని ఉన్న కంచువిహ్రహం ప్రతిష్ఠించబడి ఉంది.

బొహరా గణేశ్ జీ

[మార్చు]

ఈ ఆలయం పాత రైల్వే స్టేషను, ఎమ్ ఎల్ ఎస్ విశ్వవిద్యాలంయం వద్ద ఉంది. పురాతనమైన గణేష్ ఆలయంలో నిలబడి ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. అత్యంత శక్తివంతుడైన దైవంగా భావించి భక్తులు ఇక్కడకు ప్రతి బుధవారం వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

నెహ్రూ ఉద్యానవనం

[మార్చు]

ఫతే సాగర్ సరసు మధ్యలో ఉపస్థితమై ఉన్న ఈ పార్క్ 41 చదరపు ఎకరాలు (170,000 చదరపు మీటర్లు). ఈ ఉద్యానవనంలో సంపెంగ కొలను, పూల తోటలు ఉన్నాయి. భారతదేశపు తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉద్యానవనం ప్రారంభించబడింది. ఈ ఉద్యానవనం నుండి మహారాణా ప్రతాప్ మోతీ మహల్, ఆరావళి పర్వతాలు దర్శనం ఇస్తాయి.

బగోర్ కి హవేలి

[మార్చు]

ఈ భవనం పిచోలీ సరసు ఒడ్డున గంగోరీ ఘాట్ వద్ద నిర్మించబడింది. ఈ భవనంలో ప్రస్తుతం రాజస్థానీ సాంస్కృతిక సంగీతం, నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి.

అహర్ మ్యూజియమ్

[మార్చు]

ఉదయ్‌పూర్ నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో మేవార్ రాణాల సమాధుల సమూహం ఉంది. ఇక్కడ 19 రాణాల సమాధులు ఉన్నాయి. 1597-1620 మధ్య కాలంలో మేవార్‌ను పాలించిన మహా రాణా అమర్ సింగ్ సమాధి కూడా ఇక్కడ ఉంది. దీనికి సమీపంలో అహర్ మ్యూజియం ఉంది. ఇక్కడ కొన్ని అతి అపురూపమైన మట్టి పాత్రలు ఉన్నాయి. అలాగే కొన్ని శిల్పాలు ఇతర వాస్తు నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని శిలా ఖండాలు సా.శ. 1700 సంవత్సరాల నాటివి. 10వ శతాబ్ధపు బుద్ధుడి కంచు శిల్పం ప్రత్యేక ఆకర్షణ.

శిల్ప్ గ్రామ్

[మార్చు]

ఉదయ్‌పూర్ వాయవ్యంలో హస్తకళల గ్రామం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ హస్తకళా వస్తు సంత జరుగుతుంటుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద హస్తకళా సంతగా భావిస్తారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ తాత్కాలిక దుకాణాలు ఏర్పరచుకుని తమ హస్తకళా ఖండాలను విక్రయిస్తుంటారు.

నీమాచ్ మాతా ఆలయం

[మార్చు]

ఉదయ్‌పూర్ లోని పచ్చని కొండల మీద దీవాలీ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరడానికి మెట్లదారి 800 మీటర్ల పొడవున ఏటవాలు దారి కూడా ఉన్నాయి. ఈ ప్రదేశానికి దిగువగా భురానీ నగర్ పేరిట ఒక భోరా కాలనీ, భురానీ మసీదు పేరిట ఒక కొత్త మసీదు ఉన్నాయి. అతి ప్రశాంతమైన ఈ ప్రదేశానికి చేరువగా దిగువన షహేలియోంకి బాడి, ఫతే సాగర్ సరసు ఉన్నాయి.

ఉదయ్‌పూర్ సోలార్ అబ్జర్వేటరీ

[మార్చు]

ఆసియా ఒకే ఒక సోలార్ అబ్జర్వేటరీ ఉదయ్‌పూర్ సోలార్ అబ్జర్వేటరీ ఫతే సాగర్ సరసు లోని ద్వీపంలో ఉంది.

సుఖాడియా సర్కిల్

[మార్చు]

ఉదయ్‌పూర్ ఉత్తర సరిహద్దులలో ఉన్న పంచవటి నుండి రాణాకపూర్, మౌంట్ అబూ పర్వత మార్గంలో ఈ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ వినోద కార్యక్రమాలు, సభలు నిర్వహణకు పేరు పొందింది.

జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్సిట్యూట్

[మార్చు]

ఆసియా లోనే అతి పెద్దది అని భావించబడుతున్న భారతీయ రైల్వే శిక్షణా కేంద్రం అతి పెద్ద పచ్చని మైదానంలో ఉంది. నిరాడంబరంగా అలాగే చూపరులను ప్రభావితులని చేసే ఆర్చ్ ఆకార భవనం, ప్రశాంతమైన ప్రహరీలతో ఈ ప్రదేశం సరసుల నగరమైన ఉదయ్‌పూర్ మరింత శోభను కూరుస్తుంది.

ఉదయ్‌పూర్ అంబామాత దేవాలయం

[మార్చు]

అంబామాత దేవాలయం ఉదయపూర్ నగరం మధ్యలో ఉన్న హిందూ దేవాలయం. గుజరాత్‌రాష్ట్రంలోని అంబామాత దేవత ఆజ్ఞ మేరకు ఉదయ్‌పూర్ మహారాణా రాజ్ సింగ్ ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం.

చలన చిత్రాలలో ఉదయ్‌పూర్

[మార్చు]
ప్యాలెస్ నుండిుదయపూర్ నగరం
ప్యాలెస్ నుండిుదయపూర్ నగరం

ఉదయ్‌పూర్ నగరం ప్రపంచంలోనే ఉత్తమ నగరమని త్రావెల్ +లీషర్ పత్రికలో ప్రచురితమైంది.ఉదయ్‌పూర్ నగరాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, కాష్మీర్ ఆఫ్ ది రాజస్థాన్ అని కూడా పిలుస్తారు. షాజహాన్ చేత నిర్మించబడిన తాజ్ మహల్ ప్రేరణతో ఉదయ్‌పూర్ లో నిర్మించబడిన జాగ్ మందిర్ కారణంగా ఈ పేరు వచ్చింది.

ఇండియాలో చిత్రీకరించిన జేమ్స్ బాండ్ చిత్రం చిత్రీకరించింది ది లెక్ ప్యాలెస్, బారిష్ మందిర్ (మాన్‌సూన్ ప్యాలెస్) మొదలైన ప్రదేశాలలోనే.బ్రిటిష్ దూరదర్శన్ ప్రసరించిన జువెల్ ఇన్ ది క్రౌన్ చిత్రీకరించింది ఇక్కడే. దిస్నీ చానల్ చిత్రం చిఠాహ్ గర్ల్స్ ఒన్ వరల్డ్ 2008లోఉదయ్‌పూర్ లో చిత్రీకరించబడింది.

అదనంగా ఉదయ్‌పూర్ లో చిత్రీకరించబడిన విదేశీ చిత్రాలు డార్జిలింగ్ లిమిటెడ్, ఓపెనింగ్ లైట్, హీట్ అండ్ డస్ట్, ఇన్డిస్క్ రింగ్, ఇన్‌సైడ్ ఆక్టోబసీ, జేమ్స్ బాండ్ ఇండియా, గాంధి, ఫాల్ మొదలగునవి.

ఉదయ్‌పూర్ లో చిత్రీకరించబడిన హిందీ చిత్రాలు గైడ్, మేరాసాయా, ఫూల్ బనే అంగారే, కచ్చే ధాగే, మెర గ్యాన్ మేరా దేష్, జల్‌మహల్, యాదిన్, రిటర్న్ ఆఫ్ ది బాగ్దాద్, ఏకలవ్య, ది యాయల్ గార్డ్, ధమ్మాల్, జిస్ దేస్ మే గంగా రహతా హై, చలో ఇషాక్ లడాయే, ఫిజా, గద్దార్, హమ్ హై రహి ప్యార్ కే, కుదా గవాహ్, కుందన్, నందిని, సాజన్ కా ఘర్ అదనంగా అనేక బాలీ వుడ్ చిత్రాల పాటలు ఉదయ్‌పూర్ లో చిత్రీకరించబడ్డాయి.

సమీప ప్రదేశాలు

[మార్చు]
  • నాధ్ ద్వారా:- ఉదయ్‌పూర్ నగరానికి 48 కిలోమీటర్లదూరంలో ద్వారకకు వెళ్ళే మార్గంలో నాధ్ ద్వారా ఉంది. భగవంతుడి చేరడానికి ద్వారమని ఈ ఊరి పేరుకు అర్ధం.
  • మౌంట్ అబూ :- ఇది ఉదయ్‌పూర్‌కు సమీపంలో ఉన్న ప్రఖ్యాత వేసవి విడిది.
  • ఏక్‌లింగ్‌జి:- ఉదయ్‌పూర్‌కు 22 కిలోమీటర్లదూరంలో ఈ శివాలయం ఉంది.సా శ 734లో నిర్మించబడిన పాలరాతితోనూ, ఇసుక రాళ్ళతోనూ నిర్మించిన 108 ఉప ఆలయాల సముదాయం కలిగిన ఈ శివాలయం రాజకుటుంబం ఆరాధనకు ప్రత్యేకించబడింది.
  • అంబికా మాతా దేవాలయం: ఇక్కడికి సమీపంలోని జగత్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం.

మూలాలు

[మార్చు]
  1. "Udaipur City" (PDF).
  2. "Udaipur City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-02-09.
  3. "10 Must-Visit Places In Udaipur, The City Of Lakes". Trans India Travels (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-02. Retrieved 2021-02-21.

వెలుపలి లింకులు

[మార్చు]