Jump to content

ఎర్నాకుళం జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 10°00′N 76°20′E / 10.00°N 76.33°E / 10.00; 76.33
వికీపీడియా నుండి
ఎర్నాకుళం జిల్లా
ఎర్నాకుళం
జిల్లా
ఎర్నాకుళం జిల్లా is located in Kerala
ఎర్నాకుళం జిల్లా
ఎర్నాకుళం జిల్లా
కేరళ పటంలో ఎర్నాకుళం
Coordinates: 10°00′N 76°20′E / 10.00°N 76.33°E / 10.00; 76.33
దేశం India
రాష్ట్రంకేరళ
ప్రధాన కార్యాలయంకక్కనాడ్
Government
 • కలెక్టరుఎం. జి.రాజమానిక్కం
విస్తీర్ణం
 • Total3,068 కి.మీ2 (1,185 చ. మై)
 • Rank4
జనాభా
 (2011)
 • Total32,79,860
 • జనసాంద్రత1,069/కి.మీ2 (2,770/చ. మై.)
 [1]
భాషలు
 • అధికారికమళయాళం, ఆంగ్లం
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
ISO 3166 codeIN-KL-KO
Vehicle registrationKL-7,KL-17,KL-39,,KL-40,KL-41,KL-42,KL-43,KL-44,KL-63

ఎర్నాకుళం జిల్లా, భారతదేశం , కేరళ రాష్ట్రం లోని ఒక జిల్లా. [2]ఈ జిల్లా రాష్ట్రానికి మద్యభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 3,068 చ.కి.మీ. రాష్ట్రం లోని 12% మంది ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఎర్నాకుళం కేరళ రాష్ట్రంలో ఒక ప్రముఖ వాణిజ్యకేంద్రంగా ఉంది. ఈ జిల్లా పురాతనమైన ఆలయాలు, మసీదులు, చర్చీలు ఉన్నాయి. ఈ జిల్లాలోనే కొచ్చిన్ మహానగరం ఉంది. ఈ జిల్లా నుండి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం లభిస్తుంది.[3] జనసాంధ్రతలో ఇది రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో మలప్పురం, తిరువనంతపురం ఉన్నాయి.[1] ఎర్నాకుళం జిల్లా అత్యధిక సంఖ్యలో దేశీయ విదేశీ పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సౌకర్యం కల్పిస్తుంది. కొచ్చిన్ నగరానికి సమీపంలో ఉన్న కక్కనాడ్ ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ప్రజలు అత్యధికంగా మళయాళం మాట్లాడతారు. వ్యాపార రంగంలో ఉండే ప్రజలు ఆంగ్లం అత్యధికంగా అర్ధం చేసుకుంటారు. 1990లో 100% అక్షరాస్యత సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.[4][5]

పేరువెనుక చరిత్ర

[మార్చు]

ఎర్నాకుళం అంటే శివుని నివాసం అని అర్ధం.[6] పురాతన కాలంలో ఎర్నాకుళం ప్రాంతం " రిషినాగకుళం " అని పిలువబడేది.

చరిత్ర

[మార్చు]
Cheena vala (Chinese fishing net)

పురాతన దక్షిణ భారతదేశ చరిత్రలో ఎర్నాకుళం జిల్లా ఒక పాత్రను పోషించింది. కొచ్చిన్ యూదులు, సిరియన్లు, అరబ్బులు, చైనీయులు, డచ్, బ్రిటిష్, పోర్చుగల్ నావికులు సముద్రమార్గం ద్వారా కొచ్చిన్ సామ్రాజ్యానికి చేరుకున్నారు. తరువాత వారు ఈ పట్టణంలో వారి చిహ్నాలను వదిలివెళ్ళారు. 1896లో " కౌంసిల్ ఆఫ్ ఎర్నాకుళం " ఏర్పాటుచేసి ప్రాంతీయ పాలన ఆరంభించాడు. ఆరంభంలో ఎర్నాకుళం జిల్లా కేంద్రం ఎర్నాకుళం పట్టణంలో ఉండేది. అందువలన ఈ జిల్లాకు ఎర్నాకుళం జిల్లా అని పేరు వచ్చింది. తరువాత జిల్లా కేంద్రం కక్కనాడుకు మార్చబడింది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మొత్తం జనాభా 3,282,388. వీరిలో 1,619,557 మంది పురుషులు కాగా, 1,662,831 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 8,14,011 కుటుంబాలు ఉన్నాయి. ఎర్నాకులం జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,027. మొత్తం జనాభాలో 68.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 31.9% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 96.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 95.2% ఉంది. అలాగే ఎర్నాకులం జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,029 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,021 ఉంది. జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3,04,242, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 15,5,182 ఉండగా, ఆడ పిల్లలు 14,9,060 ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 961, ఇది సగటు లింగ నిష్పత్తి (1,027) కంటే తక్కువ ఉంది.[7]

2011 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 32,82,388,[1]
ఇది దాదాపు మారిటానియా దేశ జనాభాకు సమానం[8]
అమెరికాలోని లోవా నగర జనసంఖ్యకు సమం [9]
640 భారతదేశ జిల్లాలలో 104వ స్థానంలో ఉంది [1]
1 చ.కి.మీ జనసాంద్రత 1069 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 5.6%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1068: 1000 [1]
అక్షరాస్యత శాతం 95.68%.[1]
జాతియ సరాసరి (72%) కంటే
నగరీకరణ శాతం 68.07%.[10]

జిల్లాలో హిందువుల శాతం 46.53%, క్రైస్తవులు 38.78%, ముస్లిములు 14.55%, సిక్కులు, జైనులు, యూదులు కూడా స్వల్పసంఖ్యలో నివసిస్తూ ఉన్నారు.[11] దేశంలో క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో ఉన్నా జిల్లాగా ఎర్నాకుళం జిల్లాకు ప్రత్యేకత ఉంది. జిల్లా ప్రజలలో మతపరమైన జాతులలో ఎళువా, నాయర్, జకోబైట్, సిరో- సిరియన్ కాథలిక్కులు, లాటిన్ క్రైస్తవులు, ముస్లిములు ప్రధానంగా ఉన్నారు. అదనంగా ప్రధాన మతాలకు చెందిన బౌద్ధులు, జైనులు, సిక్కులు, యూదులు ఈ కాస్మోపాలిటన్ నగరంలో నివసిస్తూ ఉన్నారు. యూదుల పూర్వీకులు సా.శ. 70లో జెరుసలేం నుండి ఇక్కడకు వలసవచ్చారు. వీరిలో అధికులు సిరియన్ క్రైస్తవులుగా మారగా మరికొందరు, అబ్రహాం బరాక్ సేలం తీసుకున్న చొరవ కారణంగా ఇజ్రాయేల్ దేశానికి వలస వెళ్ళారు. ప్రస్తుతం ఇక్కడ అల్పసంఖ్యలో మాత్రమే యూదులు నివసిస్తున్నారు.

భౌగోళికం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా వైశాల్యం 3,068 చ.కి.మీ. ఇది భరతీయ పశ్చిమతీర మైదానంలో ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో త్రిస్సూర్ జిల్లా, తూర్పు సరిహద్దులలో ఇడుక్కి, తమిళనాడు]] రాష్ట్రం, దక్షిణ సరిహద్దులలో అలంపుజ్హ జిల్లా, కొట్టాయం జిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. భౌగోళికంగా జిల్లా ఎగువభూమి, మద్యభూమి, తీరప్రాంతంగా విభజించారు. ఏగువభూమి సముద్రమట్టానికి 300 మీ ఎత్తున ఉంది. కేరళ రాష్ట్రంలో అత్యంత పొడవైన నది అయిన పెరియార్ నది జిల్లాలోని మూవత్తుపుళా తాలూకా కాక మిగిలిన ఆన్ని తాలూకాలలో ప్రవహిస్తుంది. మూవత్తుపుళా నది దాని ఉపనది అయిన చలక్కుడి నది కూడా ఈ నదిగుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 3,432 మి.మీ. ఈ భూభాగం మలబార్ తీర వర్షాధార అరణ్యాల కోవకు చెందింది. ఎగువభూములు నైరుతీ పర్వత అరణ్యాల కోవకు చెందింది. భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన వివిధ రకాల ఇసుక, మట్టి, రాళ్ళు ఇక్కడ విస్తారంగా ఉన్నాయి. జిల్లా ఉత్తరభాగంలో నెడుంబస్సేరి వద్ద " కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం " ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం, జలమార్గాలు, రైల్వే, రహదారి మార్గాలు వ్యూహాత్మకంగా అనుసంధానితమైన జిల్లాగా ఎర్నాకుళం జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చింది.

జిల్లా భూ విభాగాలు

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా దిగువభూమి, మద్యభూమి, ఎగువభూమి అని మూడు భాగాలుగా విభజించబడింది. సముద్రతీరాలు, మైదానాలు, కొండప్రాంతాలు ఉన్నాయి. దిగువభూమి శాతం 20% ఉంది. మద్యభూభాగంలో మైదానాలు, ద్వీపసమూహాలు, బ్యాక్‌వాటర్ కాలువలు ఉన్నాయి. కొండలతో చేరిన తూర్పుభూభాగం పశ్చిమకనుమలు భూభాగంలో ఉన్నాయి. మూవత్తుపుళా, కోతమంగళం ఒకప్పుడు కొట్టాయం జిల్లాలో ఉండేవి. మూవత్తుపుళా నది, పెరియారు నదులు తొడుపుళా, మూవత్తుపుళా, అలువా, కున్నత్తునాడు, పరూర్ తాలూకాల మార్గంలో ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ నదులు నిండుగా ప్రవహిస్తూ దిగువప్రాంతాలలో వరదలకు కారణం ఔతున్నాయి. వేసవి కాలంలో అవి ఎండి సన్నగా ప్రవహిస్తుంటాయి. పెరియార్ నది 229 కి.మీ దూరం ప్రవహిస్తుంది.

కొచ్చి లోని మెరైన్ డ్రైవ్ రాత్రి అందం,

ఆర్ధికం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా కేరళ రాష్ట్రంలో రెండవ సంపన్న జిల్లాగా గుర్తింపు పొందింది. మొదటి స్థానంలో త్రివేండ్రం జిల్లా ఉంది. ఎర్నాకుళం జిల్లా ప్రకృతి ప్రసాదించే ఆన్ని కానుకలను కలిగి ఉంది. అందువలన ఇది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకంటే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. జల,వాయు, రహదారి, రైలు, విమాన, సముద్రమార్గాలకు ఇది అనూకూలంగా ఉన్నందున కేరళ రాష్ట్రంలో ఈ జిల్లా వాఝిజ్యరంగానికి అనుకూలంగా ఉండి రాష్ట్ర వాణిజ్యకేంద్రంగా ప్రసిద్ధిచిందింది. ఎం.జి రోడ్డులో కొన్ని పెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి. జిల్లా మొత్తం సముద్రతీరం ఉన్నకారణంగా సముద్ర, ప్రాంతీయ చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. చేపల పరిశోధనకు, అధ్యయనానికి, అభివృద్ధికి కొచ్చిన్ అనుకూలమైన ప్రదేశంగా ఉంది.

వ్యవసాయం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా వ్యవసాయానికి అనుకూలమైనది. తేమ భూములు వరి పంటకు అనుకూలంగా ఉంటుంది. 3 దశాబ్ధాలుగా వరిపంట పొలాలు క్రమంగా క్షీణిస్తూఉంది. ఎర్నాకుళం జిల్లా పోక, అనాస పంటలు పండినబడుతున్నాయి. పోక తోటల పెంపకం అధికరిస్తూ ఉంది. కేరళ రాష్ట్రంలోని 70% అనాస పంట ఈ జిల్లాలోనే పండినచబడుతుంది. మూవత్తుపుళా, వళకుళం తాలూకాలలో అనాస పంట విస్తారంగ పండినబడుతుంది. కేరళ రాష్ట్రంలో రబ్బర్ అధికంగా పండిస్తున్న జిల్లాలలో ఎర్నాకుళం రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కొట్టాయం జిల్లా ఉంది. అదనంగా జిల్లాలో కర్రపెడెలం, నల్లమిరియాలు, వక్క, కొబ్బరి, పసుపు, అరటి పండ్లు, అరటికాయలు వంటి పంటలు కూడా పండించబడుతున్నాయి.

Mattancherry Palace – temple courtyard
The old Dutch cemetery in Kochi
High Court of Kerala at Ernakulam
Ernakulam ESI hospital new building
Ernakulam Town North Railway Station a view from Ernakulam north bridge
KHCAA Golden Jubilee Chamber Complex

విభాగాలు

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా 2 విభాగాలుగా (కొచ్చి హార్బర్, మూవత్తుపుళా) విభజించబడింది.

తాలూకాలు

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా 2 రెవెన్యూ విభాగాలు, 7 తాలూకాలుగా విభజించబడింది. రాష్ట్రంలో అధికసంఖ్యలో తాలూకాలున్న జిల్లాగా ఎర్నాకుళం జిల్లాకు ప్రత్యేకతచుంది.

  • పరవూర్
  • అలువా
  • కున్నతునాడ్
  • మూవత్తుపుళా
  • కొచ్చి
  • కనయనూర్
  • కోతమంగళం

జిల్లా లోని పురపాలికలు

[మార్చు]

కేరళ రాష్ట్రంలో అత్యధిక పురపాలికలు ఉన్న జిల్లాగా ఎర్నాకుళం జిల్లాకు ప్రతేకత ఉంది.

  • కొచ్చి
  • ఉత్తర పతవూర్.
  • మూవత్తఉళా
  • పెరుబవూర్
  • అలువా
  • అంగమలి
  • త్రిపునితుర
  • కలమస్సేరి
  • కోతమంగళం
  • ఏలూర్
  • మరదు
  • తిరుక్కకర

పార్లమెంటు నియోజక వర్గం

[మార్చు]

అసెంబ్లీ నియోజక వర్గాలు

[మార్చు]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

ఎర్నాకులం జిల్లా అన్ని రకాల రవాణా సౌకర్యాలతో కలిగిఉంది. ఇది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రాంతీయ 9 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉన్నాయి.

  • ఎర్నాకుళం - కె.ఎల్ 07
  • మూవత్తుపుళా - కె.ఎల్ 17
  • త్రిపునితుర - కె.ఎల్ 39
  • అలువా - కె.ఎల్ 40
  • పరవూర్ ఉత్తరం - కె.ఎల్ 42
  • మట్టంచేరి - కె.ఎల్ 43
  • కోతమంగళం - కె.ఎల్ 44
  • అంగమలె - కె.ఎల్ 63

అలాగే ఈ జిల్లా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో వాహనాలను పొందింది.ఎర్నాకులం జిల్లాలో అద్భుతమైన రోడ్డు అనుసంధానం సౌకర్యం ఉంది. ఎర్నాకులం జిల్లా గుండా వెళ్ళే 3 ప్రధాన జాతీయ రహదారులు కొచ్చిన్-ముంబై హైవే (ఎన్.ఎచ్. 17), సేలం-కన్యాకుమారి (ఎన్.ఎస్.ఇ.డబ్ల్యు. కారిడార్‌లో ఎన్.ఎచ్. 47 భాగం), కొచ్చిన్-ధనుష్కోడి హైవే (ఎన్.ఎచ్. 49) ఉన్నాయి.

ఉత్తర కారిడార్ రహదారి వ్యవస్థ ఎడపళ్ళి కొచ్చిన్లో జాతీయ రహదారి 47 నుంచి ప్రారంభమై త్రిస్సూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, సేలం (తమిళనాడు) , చివరిగా ఉత్తర చెన్నై, ఉత్తర భారతదేశంతో అనుసంధానిస్తుంది. అలాగే దక్షిణం దిశలో అలంప్పుజ్హ, కొల్లాం, త్రివేండ్రం, మార్గంలో నాగర్‌కోయిల్, కన్యాకుమారి లను అనుసంధానిస్తుంది. జాతీయ రహదారి 17 కూడా ఎడపళ్ళి నుండి మొదలై గురువాయూర్, కాలికట్ కలుపుతుంది, కన్నూర్, కాసర్‌గోడ్, మంగుళూరు, మర్మగోవా, ముంబై లను అనుసంధానిస్తుంది. మధురై హైవే అని పిలిచే జాతీయ రహదారి 49, కొచ్చిన్ సమీపంలో కుందనూర్ నుండి మొదలై, మున్నార్, కోతమంగళం, మూవత్తుపుళా ద్వారా థేని, మధురై నుడి ధనుష్కోడిలో వద్ద ముగుస్తుంది. జిల్లలో రెండు చిన్న జాతీయ రహదారులు ( జాతీయ రహదారి 47 (భారతదేశం), కోసం కొచ్చిన్ పోర్ట్ లను అనుసంధానించే (చిన్న భారత జాతీయ రహదారి) కుందనూర్, నేషనల్ హైవే 47 సిలో భాగంగా ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, కొచీ (కలమస్సేరి) నుండి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినలను అనుసంధానిస్తుంది. జిల్లా అదనంగా జిల్లాను రాష్ట్ర రహదార్లు, ఇతర రోడ్లు ఉన్నాయి. అంగమల్ వద్ద ఆరంభయ్యే ఎం.సి రోడ్డు, జిల్లా నున్పెరుంబవూర్, మూవత్తుపుళా, కూత్తత్తుకుళం మార్గంలో రాష్ట్రరాజధాని త్రివేండ్రంతో అనుసంధానిస్తుంది. ఇతర ప్రధాన రాష్ట్ర రహదారులు

  • సముద్ర ఓడరేవు -కక్కనాడు ద్వారా విమానాశ్రయం రోడ్
  • పలరివట్టం- మూవత్తుపుళా - పునలూర్ ఎస్.హెచ్: - ఇది అనుసంధానిస్తుంది కక్కనాడు, పళ్ళికర, కిళ్క్కంబాలెం, పట్టిమట్టోం,మూవత్తుపుళా, వళకుళం,, ఫ్రాంక్, తిట్టలను అనుసంధానిస్తుంది.
  • ఉత్తర పరవూర్ - అలూవా - మున్నార్ ఎస్.హెచ్ : - ఇది అలెంగాడ్, అలెంగాడ్, పెరుంబవూర్, కోతమంగళం ( ఎర్నాకులం), తట్టేకాడ్ లను కలుపుతుంది.
  • విపిన్- మునాంబం ఎస్.హెచ్: - ఇది చెరై, న్జరచ్కల్, విపిన్, మునాంబంలను అనుసంధానిస్తుంది.
  • త్రిపూనితుర - కోతమంగళం - జలయజ్ఞం:- ఇది ములాంతురుతి, పిరవోం, పాల, కుమిలి లను అనుసంధానిస్తుంది.
  • వితిల్ల - కొట్టాయం రహదారి: - ఇది వైకోం,త్రిపూనితుర, నదక్కవు, పూతోట్ట ద్వారా కుమారకోంను కలుపుతుంది.
  • ఫోర్ట్ కొచీ - అలంప్పుజ్హ రహదారి
  • అంగమల - మూక్కనూర్ మీదుగా అత్తిరప్పిల్లీ రోడ్
  • పెరుబవూర్ - పుతెంక్రజ్ రోడ్

రైల్

[మార్చు]

ఎర్నాకులం జిల్లాలో మొత్తం 17 రైల్వే స్టేషన్లు, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం ప్రధాన రైల్వే స్టేషన్లును ప్రధాన రైల్వేస్టేషన్లుగా చెప్పవచ్చు. అదనంగా అంగమలె రైల్వే స్టేషను, త్రిపునితుర, ఎడపల్లి (రైల్వే స్టేషను), ములంతురుతి, అలూవా రైల్వే స్టేషను కొచ్చిన్ హార్బర్ టెర్మినస్, కరకుట్టి, చొవర, కలమస్సేరి, నెట్టర్, కుంబళం (ఎర్నాకులం), మట్టన్చేరీ హెచ్, చొట్టనిక్కర రోడ్, పిరవోం రైలు మార్గాలు ఉన్నాయి. రైలు మార్గాలు :- త్రిస్సూర్, కొట్టాయం, కొచ్చిన్ హె.చ్.టి, అనంపుళా, వల్లర్‌పదం మీదుగా ఉంది. అంగమలె - ఎరుమలె - శబరిమల మార్గం ఈ జిల్లా మీదుగా పోతుంది. గురువాయూర్, ఎన్.పరవూర్ మీదుగా మూవత్తుపుళా - థేని మార్గాలు కూడా ప్రతిపాదించబడ్డాయి. నగరంలో కొచీ మెట్రో పట్టణ రైలు కూడా ప్రతిపాదించబడింది.

వాయుమార్గం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లాలో 2 విమానాఅశ్యయాలు ఉన్నాయి. అవి వి. దీవి వద్ద ఉన్న నావల్ ఎయిర్ పోర్ట్ (ఓల్డ్ కొచ్చిన్ ఎయిర్ పోర్ట్), కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది దేశంలో 4 పెద్ద విమానాశ్ర్యయంగా గుర్తుంపు పొందింది. మొదటి 3 స్థానాలలో ముంబై, ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండియాలోని ప్రధాన నగరాలకు విమానసర్వీసులు లభిస్తున్నాయి.

జలమార్గం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లాలో పెరియార్ నది, మూవత్తుపుళా నది ముఖద్వారాలు ఉన్నాయి. నదులు, మడుగుల ద్వారా ఈ జిల్లాలో జలమార్గాలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్నాకుళంలో ప్రధాన బోటు సర్వీసులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతంలో ఫెర్రీ సర్వీసులు ఉన్నాయి. భారతదేశ పశ్చిమ సముద్రతీర నౌకాశ్రయాలలో కొచ్చిన్ హార్బర్ పెద్దదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఇది బృహత్తర పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంది. సమీపకాలంలో నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న వల్లర్‌పదం అంతర్జాతీయ నౌకాశ్రయం జిల్లా అభివృద్ధికి తోడపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

సంస్కృతి

[మార్చు]

పండుగలు, ఉత్సవాలు

[మార్చు]
Adi Shankara with disciples, drawing by Raja Ravivarma,1904

పెరియార్ నదీతీరంలో ఉన్న అలువా మనప్పురం శివరాత్రి ఉత్సవాలు దేశంలోని పలు ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఎర్నాకుళంలో పలు పురాతన శివాలయాలు ఉన్నాయి. జిల్లాలోని కలడి పట్టణంలో జగద్గురు ఆదిశంకరాచార్య జన్మించాడు. ప్రపంచంలోని హిందువులు అందరికి ఇది ప్రధాన యాత్రాస్థలం. పెరంబవూర్ సమీపంలో ఉన్న ప్రదిద్ధ జైన క్షేత్రం కల్లిల్ చాలా ప్రసిద్ధిచెందిన జైన క్షేత్రాలలో ఒకటి.

చర్చిలు ఉత్సవాలు

[మార్చు]

పుతెంక్రుజ్ సమీపంలో ఉన్న జాకోబ్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ ఇండియా లోని సిరియాక్ ఆర్థడాక్స్ చర్చ్ రీజనల్ సీట్‌గా ఉంది. మలయత్తుర్ వద్ద ఉన్న సెయింట్ థామస్ సిరో మలబార్ కాథలిక్ చర్చ్ ప్రపంచ క్రైస్తవ యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందింది. సెయింట్ మేరీ కాకోబైట్ సిరియన్ వలియపల్లి, తమరాచల్ వద్ద ఎట్టు నోంబు ఫీస్ట్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఏప్రిల్ మాసంలో మొత్తం 10 రోజులు ఉత్సవం నిర్వహిస్తారు. ప్రబల మత ఉత్సవమైన ఇది రాష్ట్రం అంతటి నుండి వేలాది మందిని ఆకర్షిస్తుంది. మూవత్తుపుళా సమీపంలో కడమట్టం వద్ద ఉన్న సెయింట్ జార్జ్ కాకోబైట్ సిరియన్ ఆర్ధడాక్స్ చర్చ్ చాలా పురాతనమైనదని భావిస్తున్నారు. దీనిని సా.శ. 5వ శతాబ్దంలో మార్ అబో సిరియన్ మెట్రోపాలిటన్ ఆరంభించారని భావిస్తున్నారు. ఆయన పర్షియా నుండి తీసుకువచ్చిన శిలువ ఇప్పటికీ ఈ చర్చిలో బధ్రపరచబడి ఉంది. సెప్టెంబరు 24న వల్లర్‌పదం వద్ద నిర్వహించబడే ఉత్సవం కులమతాలకు అతీతంగా ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న కన్య మేరీమాత విగ్రహం అనేక అద్భుతాలను చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. సియింట్ జార్జ్ స్థాపించిన సెయింట్ జార్జ్ సిరో - మలబార్ కాథలిక్ ఫోరన్ చర్చ్, ఎడపళ్ళి సా.శ. 593లో స్థాపించబడింది. కన్నమలే వద్ద సెయింట్ అంథోనీ చర్చ్ వద్ద మార్చి 19న నిర్వహించే సెయింట్ జోసెఫ్ ఫీస్ట్ చాలా ప్రాబల్యం సంతరుంచుకుంది.

రాజాధిరాజ ఎస్.టి మేరీ జాకబైట్ సిరియన్ కాథడ్రల్ (పిరవోం) చర్చి ప్రపంచపు మొదటి చర్చిగా భావించబడుతుంది. ఈ చర్చిని బిబ్లికల్ మాగీ స్థాపించాడని భావిస్తున్నారు. అంగమలె వద్ద ఉన్న ఎస్.టి చర్చి పరివోం చర్చి తరువాత భారతదేశంలో మొదటి చర్చిగా భావించబడుతుంది. సెయింట్ థామస్ స్థాపించిన 8 చర్చిలలో ఇది మొదటిదని భావించబడుతుంది. సా.శ. 405లో స్థాపించబడిన ఈ చర్చి ఆర్చిడియోన్, సెయింట్ క్రిస్టియన్‌లకు 18వ శతాబ్దం వరకు ప్రధానకార్యాలయంగా ఉంటుంది.

మసీదులు

[మార్చు]

కంజిరమట్టం కేరళ రాష్ట్రంలో ఉన్న మసీదులలో ఒకటి. కంజిరమట్టం మసీదులోని చందనకుడం ఉత్సవం రాష్ట్రంలో చాలా ప్రసిద్ధిచెందింది. త్రిప్పకుడం ఆలయంలో అన కల్లయ కుళం - పార్వతీమంగళం నిర్వహించబడే ఆర్యంకవు తూక్కమ్- ఒట్టతూక్కం, గరుడతూక్కం పూజలు ప్రజలను అధికంగా ఆకర్షిస్తున్నాయి. ద్వీపంలో చెరై పూరం ఉత్సవం కూడా కేరళ ఉత్సవాలలో ముఖ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ ఉత్సవం పౌర్ణమి రోజున నిర్వహిస్తుంటారు. పంటలు పడి ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ వేయబోయే పంటలకు భగవంతుని అనుగ్రహం కొరకు ప్రార్థించడానికి ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. అంతే కాక ప్రజలు చేపల వేట కొరకు సముద్రం లోకి వెళ్ళే సమయం కూడా ఇదే. అందువలన స్త్రీలు తమ భర్తలు, సోదరులు, తండ్రులు, దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు నిర్వహిస్తారు.

యాత్రాస్థలాలు

[మార్చు]

కోతమంగళం (ఎర్నాకులం) ఎర్నాకులంలో ఉన్న మూడు ముఖ్యమైన యాత్రా స్థలాలు:- సెయింట్ థామస్ జాకబిట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి ఉత్తర పరవూర్, మోర్ తోమా జాకొబైట్ సిరియన్ సంప్రదాయ చర్చి (చెరియపళ్ళి), త్రికున్నత్తు సెయింట్మేరీ జాకొబైట్ సెమినరీ చర్చి (అలూవా) . గ్రిగోరియస్ అబ్దుల్ జలీ అవశేషాలను సెయింట్ థామస్ చర్చి (ఉత్తర పరవూర్) లో భద్రపరచబడ్డాయి. ఏప్రిల్ 27 న సెయింట్ ఆఫ్ దుక్రునో కొరకు నుర్వహించిన కేరళ కల్మినేట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వేలాది యాత్రికులు హాజరు అయ్యారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 2, 3 న కోత్తమంగళం వద్ద ఉన్న చెరియపళ్ళిలోని థాంబ్ మోర్ తోమా చర్చిలో ఎల్డో మోర్ బసెలియోస్ విందు నిర్వహించబడుతుంది. కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఒక మిలియన్‌కు పైగా కేరళ రాష్ట్రం అంతటి నుండి యాత్రికులు ఈ విందుకు హాజరౌతుంటారు. జనవరి 26 న పౌలస్ మార్ ఆథనసిస్ విందుకు ఆయనను సమాధి చేసిన వద్ద ఉన్న అలువాలో ఉన్న మోర్త్‌మరియం జాకొబైట్ సిరియాక్ సెమినరీ చర్చి, అలువా, త్రికున్నతు " కు వేలాది యాత్రికులు వస్తుంటారు.

ఈ జిల్లాలో వివిధ యాత్రికుడు కేంద్రాలలో పెరుబవూర్ , కోతమంగళం సమీపంలో ఉన్న తురుతిపిలి లోని " సెయింట్ మేరీ జాకోబైట్ సిరియాక్ ఆథడాక్స్ చర్చి, కోతమంగళం వద్ద ఉన్న " మరియన్ సెయింట్మేరీ జాకొబైట్ సిరియన్ ఆర్థడాక్స్ చర్చి " వంటి చర్చిలు ఉన్నాయి. సెయింట్ జార్జ్ చర్చ్ (కొడమట్టం), ములాంతురుతి మొర్తమాన్ చర్చ్, సమీపంలో పెరుంపళ్ళి వద్ద ఎరూర్‌లో ఉన్న, సెయింట్ మేరీ సునొరొ చర్చి, ములాంతూర్ వద్ద ఉన్న పెరుంపళ్ళిలో ఉన్న సింహాసనా చర్చి, త్రిపునితుర సమీపంలోని నడమెల్ వద్ద సెయింట్మేరీ చర్చి, ఉదయగిరి వద్ద ఉన్న మాలంకార సిరియన్ ఆర్థోడాక్స్ థియోలాజికల్ సెమినరీ, కొలెంచెరి పళ్ళి సమీపంలో మాలేక్రజ్ " సెయింట్ పీటర్స్ & సెయింట్ పాల్స్ జాకోబైట్ చర్చ్ (కొలన్‌చెరి) మొదలైనవి ఎర్నాకులం జిల్లాలోని జాకొబైట్ సిరియాక్ సాంప్రదాయ చర్చికి చెందిన వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. పెరుమల లోని ఘీవర్గీస్ మార్ గ్రెగోరియాస్ (పెతుమల కొచ్చు తిరుమేని) , పౌలస్ మార్ ఆథనసిస్ ( అలూవా వలియ తిరుమేని) భారతీయ " సిరియాక్ ఆర్థడాక్స్ చర్చి " కి చెందిన మొదటి, రెండవ సాధువులు. వీరు ములాంతురుతి, అంగమలెలో పుట్టి పెరిగారని భావిస్తున్నారు.

పర్యాటక ఆకర్షణ ప్రదేశాలు

[మార్చు]
  • 'మేరిన్ డ్రైవ్, కొచ్చి : సుందరమైన బీచ్ దృశ్యాలు, కొచ్చిన్ హార్బర్ చూసి ఆనందించవచ్చు. జి.సి.డి.ఎ షాపింగ్ సెంటర్, అద్భుతమైన 2 వంతెనలు, బోటు రైడ్స్ కూడా పర్యాటకులను ఆనందపరుస్తాయి.
  • చైనీస్ ఫిషింగ్ నెట్స్ (చీనా వాలా): కొచ్చిన్ హార్బరులో చైనా ఫిషింగ్ నెట్స్ చూడవచ్చు.
  • హిల్ ప్యాలెస్, త్రిపునితుర ( హిల్ ప్యాలెస్ మ్యూజియం) హిల్ ప్యాలెస్, త్రిపునితుర హిల్ ప్యాలెస్ మ్యూజియం: (త్రిపునితుర). ఇక్కడ పెయింటింగులు, ఎపిగ్రఫీ, రాజకుటంబానికి చెందిన ఫర్నీచర్స్, మొదలైనవి ప్రదర్శనలో ఉన్నాయి.
  • బోల్గట్టీ ఐలాండ్: 1774లో డచ్చి వారు నిర్మించిన ప్యాలెస్, గోల్ఫ్ మైదానం ఉన్నాయి.
  • విల్లింగ్టన్ ఐలాండ్ : కొచ్చిన్ హార్బరును లోతుచేచినప్పుడు చేరిన ఇసుకతో ఏర్పడిన ద్వీపం. విల్లింగ్టన్ ద్వీపంలో ఒక ఓడరేవు, రైల్వే టెర్మినల్, కస్టంస్ ఆఫీస్ ఉన్నాయి.
  • కొడనాడు: ఇక్కడ ఏనుగుల శిక్షణాలయం ఉంది.
  • పరీక్షిత్ మ్యూజియం , ఇది 19వ సతాబ్ధానికి చెందిన మ్యూజియం.
  • డచ్ ప్యాలెస్ : 1568లో పోర్చుగల్ వారిచేత నిర్మించబడింది. తరువాత డచ్ వారిచేత ఇది పునర్నిర్మించబడింది.
  • కేరళ హిస్టారికల్ మ్యూజియం : అలువా, ఎర్నాకుళం రహదారి మార్గంలో ఇది ఎడపళ్ళి వద్ద స్థాపినబడింది.
  • చందమంగళం , ఇది పాలియం ప్యాలెస్ వద్ద ఉన్న గ్రామం. వ్యాపీనకోట్ట సెమినరీ, ఇక్కడ ఒక దానికి ఇంకొకదానికి మద్య ఒక మైలు దూరంలో ఒక హిందూ ఆలయం, ఒక చర్చి, ఒక మసీద్, ఒక సినగోగ్ నిర్మించబడడం ప్రత్యేకత.
  • భూథాన్‌కెట్టు , విస్తారమైన అరణ్యం మద్య ఉన్న సుందరమైన ఆనకట్ట ఇది. ఇక్కడ బోటు సవారి వంటి వసతులు కూడా ఉన్నాయి.
  • మలయత్తుర్ సెయింట్ థోమస్ చర్చ్ ఎస్.టి. థోమస్ సిరో-మలబార్ కాథలిక్ చర్చ్, మలయత్తూర్: ఇది ఆసియాలో ఉన్న అంతర్జాతీయ ఆలయం. ఇక్కడకు సైయింట్ థామస్ విజయం చేసాడని భావిస్తున్నారు.
  • వూండర్ లా, కక్కనాడు: దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత అమ్యూజ్మెంట్ పార్కులలో ఇది ఒకటి. ఇది కాక్కానాడు లోని పళ్ళికర సమీపంలో నిర్మించబడింది.

వ్యక్తులు

[మార్చు]

క్రింద జిల్లా నుండి ప్రముఖ వ్యక్తుల ఉన్నాయి:

  • ఆది శంకరాచార్య (అద్వైత గురువు)
  • స్వామి చిన్మయానంద (భారత నాయకులు, గీతాచార్య)
  • మార్ వర్ఘీస్ పయ్యాపిళ్ళై ( సేవకుడు, సిస్టర్స్ SD స్థాపకుడు దిక్కులేనివారికి ]])
  • సద్కళా గోవింద మారర్ (కర్ణాటక సంగీతకారుడు)
  • సహోదరన్ అయ్యప్పన్ (కారుడు, మాజీ మంత్రి ఓల్డ్ కొచీ రాష్ట్రం)
  • కె.జె ఏసుదాసు (గాయకుడు)
  • చంగమపుళా (కవి)
  • జి. శంకర కురుప్ (కవి)
  • పి కె వాసుదేవన్ నాయర్ (గత-ముఖ్యమంత్రి)
  • మార్ వర్కేయ్ కార్డినల్ వితాయతి (ప్రధాన ఆర్చ్ బిషప్ సైరో మలబార్ కాథలిక్ చర్చి)
  • డేనియల్ ఆచారుపరంబిల్ (వెరపోలి లాటిన్ కాథలిక్ డియోసి ఆర్చ్)
  • బాలచంద్రన్ చుల్లికాడు (కవి, నటుడు)
  • దిలీప్ (నటుడు) (నటుడు)
  • శ్రీశాంత్ (క్రికెటర్)
  • కె స్వతంత్ర (రాజకీయవేత్త)
  • ఆసిన్ (నటి)
  • జయసూర్య (నటుడు)
  • కొచ్చిన్ హనీఫ (నటుడు)
  • రాథోడ్ రవీంద్రన్ (భారత హాకీ ప్లేయర్)
  • శంకరాడి (నటుడు)
  • సలీం కుమార్ (నటుడు) - ఉత్తమ నటుడు 2011 జాతీయ అవార్డు విజేత.
  • టి కె. నారాయణ పిళ్ళై (కేరళ మాజీ ముఖ్యమంత్రి)
  • జయరామ్ (నటుడు)
  • లాలూ అలెక్స్ (నటుడు)
  • కె ఎమ్. జార్జ్ (రాజకీయవేత్త)
  • ఫ్రాన్సిస్ జార్జ్ (రాజకీయవేత్త)
  • జానీ నెల్లూరు (రాజకీయవేత్త)
  • టి ఎమ్. జాకబ్ (రాజకీయవేత్త)
  • అనూప్ జాకబ్ (రాజకీయవేత్త)
  • జోస్ తట్టయి (రాజకీయవేత్త)
  • రాజీవ్ ఆర్ కామత్ (మేనేజర్, నిర్వహణ, ఆర్థిక సలహాదారు).

జంతుజాలం, వృక్షజాలం

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా జంతుజాలం, వృక్షజాలం ఉష్ణమండానికి చిందినవి. అధిక వర్షపాతం కారణంగా వాతావరణం అహ్లాదకరంగా ఉంటుంది. సారవంతమైన భూమి విస్తారమైన వృక్షజాలం అభివృద్ధికి దోహదం చేస్తుంది. సముద్రతీరంలో సాధారణంగా ఉండే చెట్లు ఈ ప్రాంతంలో కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొబ్బరి పంటలు విస్తారంగా పండినబడుతున్నాయి. మద్య భూభాగంలో కొబ్బరి, పాల్ం, వరి, పోక, మిరియాలు, అనాస, పప్పుధాన్యాలు పండినబడుతున్నాయి. ఎగువ నుండి దిగువ భూభాగంలో టేక్, రబ్బర్ పంట పండినబడుతుంది.జిల్లా తూర్పు భూభాగంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి.

విద్య

[మార్చు]

ఎర్నాకుళం జిల్లా కేరళ రాష్ట్రం లోని జిల్లాలలో ప్రముఖ అక్షరాస్యతా, విద్యాకేంద్రగా ఉంది. 1990 నాటికి దేశంలో మొదటిసారిగా 100% అక్షరాస్యత సాధించిన ఘనత ఎర్నాకుళం జిల్లాకు దక్కింది. రాష్ట్ర అక్షరాస్యతా కార్యక్రమాలు అమలులో ఉన్న సమయంలో పోతనికాడ్ పంచాయితీ ముందుగా 100% అక్షరాస్యత సాధించింది. జిల్లాలో " సంస్క్రీట్ యూనివర్శిటీ (కాలడి ), కొస్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ (కలమచేరి). ఎర్నాకుళం జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లాలో కేంద్రీయ విద్యాలయ (ఎర్నాకుళం) కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  2. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  3. "District-wise Income" (PDF). Govt of Kerala. Archived from the original (PDF) on 2010-02-15. Retrieved 2014-06-30.2
  4. "Ernakulam to be declared first district with 100% banking". The Hindu Businessline. 15 November 2012. Retrieved 27 February 2013.
  5. Soundarapandian, Mookkiah (2000). Literacy Campaign in India. New Delhi: Discovery Publishing House. p. 21.
  6. "A STUDY ON COMMUNITY TOURISM AND ITS IMPACT IN KERALA WITH SPECIAL REFERENCE TO ERNAKULAM DISTRICT" (PDF). Archived from the original (PDF) on 30 ఆగస్టు 2019. Retrieved 27 February 2013.
  7. "Ernakulam District Population Religion - Kerala, Ernakulam Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-31.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Mauritania 3,281,634 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Iowa 3,046,355
  10. censusindia.gov.in
  11. "Official Ernakulam District Profile". Archived from the original on 2011-07-21. Retrieved 2014-06-30.

వెలుపలి లింకులు

[మార్చు]

సమీప ప్రదేశాలు

[మార్చు]