Jump to content

కలశం

వికీపీడియా నుండి
(కలశ ఆరాధన నుండి దారిమార్పు చెందింది)
కలశం

కలశం లేదా కలశి అనగా సన్నని మూతి కలిగి నీటితో నింపబడిన చిన్న పాత్ర.. కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక. అందువలన ప్రార్థనలలో, పుణ్యకార్యాలలో, పట్టాభిషేకాలలో, నూతన గృహ ప్రవేశాలలో, తీర్థయాత్ర ప్రారంభ సమయాలలో ఇలాంటి అనేక సందర్భాలలో కలశ ఆరాధన లేదా కలశ పూజ చేయడం ఆనవాయితీగా మారింది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో కలశము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] కలశము లేదా కలశి అనగా నామవాచకం A vase, flagon, or water pot: కుండ అని అర్ధం. హస్తసాముద్రంలో కలశరేఖలు certain lines in the palm of the hand. కలశమునిలుపు or కలశముపెట్టు or కలశస్థాపనము చేయు the preliminary rite of solemnly placing a vase. కలశపూజ the adoration paid to that vessel, being the principal rite in all religious celebrations. కలశాబ్ధి అనగా పాల సముద్రం The ocean of milk. కలశబ్ధిజ అనగా లక్ష్మీదేవి. కలశీసుతుడు or కలశీసంభవుడు The "Vase-born" కలశం నుండి జన్మించిన అగస్త్యుడు. who was born in a pot.

కలశ పూజ

[మార్చు]
శ్రీ దుర్ముఖి నామ ఉగాది పండగ వేడుకలలో ఏర్పాటుచేసిన కలశం

మంత్ర జలంతో నింపబడిన కలశాన్ని పూజా మందిరంలో స్థాపించాలి. అందుకోసం కలశానికి చుట్టూ పసుపు రాసి, మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. కలశ జలంలో గంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

అర్ధం: కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠ భాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉన్నారు. కలశంలోని జలాల్లో సాగరాలన్నీ, సప్తద్వీపాలతో కూడిన భూమి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, వేదాంగాలతో సహా సమస్త దేవతా గణాలు ఆశ్రయించి ఉన్నారు. సమస్త పాపాలను తొలగించడానికి వారంతా వచ్చెదరు గాక !

మూలాలు

[మార్చు]
  • కలశ పూజా విధానం, ఆచార వ్యవహారాలు - అంతరార్ధాలు - 20, రెంటాల జయదేవ, శ్రీ రామకృష్ణ ప్రభ, అక్టోబరు 2007 పత్రికలో ప్రచురించిన వ్యాసం, పేజీ: 35.


"https://te.wikipedia.org/w/index.php?title=కలశం&oldid=4350838" నుండి వెలికితీశారు