కన్నడ భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q33673 (translate me)
పంక్తి 78: పంక్తి 78:
{{ద్రవిడ భాషలు}}
{{ద్రవిడ భాషలు}}
{{భారతీయ భాషలు}}
{{భారతీయ భాషలు}}
{{కర్ణాటక}}


[[వర్గం:ద్రావిడ భాషలు]]
[[వర్గం:ద్రావిడ భాషలు]]

02:58, 26 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

కన్నడ (ಕನ್ನಡ)
మాట్లాడే ప్రదేశం: కర్ణాటక, భారత దేశం
ప్రాంతం: దక్షిణ ఆసియా
మాట్లాడే వారి సంఖ్య: 4.5 కోట్లు
స్థానం: 33
అనువంశిక వర్గీకరణ: ద్రావిడ

 దక్షిణ
  తమిళ-కన్నడ
   కన్నడ

అధికార స్థాయి
అధికార భాష: కర్ణాటక, భారత దేశం
నియంత్రణ: కన్నడ సాహిత్య పరిషత్
భాష కోడ్‌లు
ISO 639-1 kn
ISO 639-2 kan
SIL KJV
చూడండి: భాషప్రపంచ భాషలు

సిరిగన్నడగా పేరొందిన కన్నడ (కొంతమంది కెనరీస్ అని కూడా పిలుస్తారు) పురాతన ద్రవిద భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.

భాష

కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది మరియు దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉన్నది మొదటిలో దాని అభివృద్ది మిగతా ద్రావిడ భాషలు, తెలుగు ఆశ్రియు లానే ఉన్నప్పటికీ తరువాతి కాలములో అదికూడా సంస్కృత భాష, సాహిత్య ప్రభావాలకు గురి అయ్యింది.

కన్నడ మూడు విధముల బేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల బేదములు.

'కన్నడ భావుటా' - కన్నడ పతాకము

ఈ భాషలో మౌఖిక లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మండలికలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర మరియు ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరె భాషే (దక్షిణ కర్ణాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.

వికిపీడియాలో కన్నడ

భౌగోళిక వ్యాప్తి

కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలలో మాట్లాడతారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డం మరియు కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు.

A Kannada language sign board

అధికారిక స్థాయి

కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష మరియు భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి.

కన్నడ లిపి

కన్నడ అక్షరమాలను ఇక్కడ చూడండి

కన్నడ భాషలో 52 అక్షరాలు ఉన్నాయి. ఇతర భారతీయ భాషలలోని అక్షరాలకు కన్నడ అక్షరాలకు సారూప్యము ఉన్నది. కన్నడ లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించినది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి.

లిప్యాంతరీకరణ

ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఐట్రాన్స్ పై అధారితమైన బరాహ మరియు కర్ణాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన నుడి ముఖ్యమైనవి.

కొన్ని విశేషాలు

  • భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత శివతత్వరత్నాకరమనే పేరిట సంస్కృతములోకి అనువదించబడినది.

ఇవికూడా చూడండి

తరచూ వాడే కొన్ని వాక్యాలు

  • నమస్కారము: నమస్కార
  • వందనము: వందనెగలు
  • దయచేసి: దయవిట్టు
  • ధన్యవాదము: ధన్యవాద
  • క్షమించండి: క్షమిసి
  • అది: అదు
  • ఎంత?: ఎష్టు
  • అవును: హౌదు
  • లేదు: ఇల్లా
  • నాకు అర్ధం కాలేదు: ననగె అర్ధవాగలిల్లా
  • మరుగు దొడ్డి ఇక్కడ?: శౌచ గృహ ఎల్లిదె ? (లేదా) బచ్చలు మనె ఎల్లిదె ?
  • మీకు ఆంగ్లము తెలుసా?: తమగె ఆంగ్ల భాషే తిలిదిదేయొ ?
  • కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే సుస్వాగత!

కన్నడ నేర్చుకొనుట

సహాయక గ్రంథాలు
కన్నడ స్వయం బోధిని
  1. కన్నడ స్వయం బోధిని, కన్నడ అభివృద్ధి ప్రాధికార, బెంగళూరు, ఆంగ్ల మూలం:లింగదేవర హళెమనె, అనువాదం: జిఎస్ మోహన్, 2003

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కన్నడ_భాష&oldid=1028000" నుండి వెలికితీశారు