ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: లో → లో (3), ను → ను , ఊరులో → ఊరిలో, → , (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎చిత్రాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 51: పంక్తి 51:
==చిత్రాలు ==
==చిత్రాలు ==
* [[గాంధీ పుట్టిన దేశం]] (1973)
* [[గాంధీ పుట్టిన దేశం]] (1973)
* [[పండంటి కాపురం]] (1972) (సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
* [[పండంటి కాపురం]] (1972) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
* [[తాతా మనవడు]] (1972)
* [[తాతా మనవడు]] (1972)
* [[అదృష్ట దేవత]] (1972)
* [[అదృష్ట దేవత]] (1972)
పంక్తి 88: పంక్తి 88:
* [[విప్లవ వీరుడు]] (1961) (తమిళం డబ్బింగ్)
* [[విప్లవ వీరుడు]] (1961) (తమిళం డబ్బింగ్)
* [[కన్నకొడుకు]] (1961)
* [[కన్నకొడుకు]] (1961)
* [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
* [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
* [[నా ఇల్లు]] (1953) నేపథ్య గాయకుడు (కోరస్)
* [[నా ఇల్లు]] (1953) నేపథ్య గాయకుడు (కోరస్)



03:13, 21 మార్చి 2020 నాటి కూర్పు

ఎస్.పి.కోదండపాణి
ఎస్.పి.కోదండపాణి
జననంశ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
1932
గుంటూరు
మరణం1974 ఏప్రిల్ 5
వృత్తిసంగీత దర్శకుడు

ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం గుంటూరులో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరిలోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. అద్దేపల్లి రామారావు చిత్రం నా ఇల్లులో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.

హాస్యనటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.

పద్మనాభం చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

చిరకాలం గుర్తుండే పాటలు

చిత్రాలు

బయటి లింకులు