మద్రాసు ప్రెసిడెన్సీలో పరిపాలనా విభాగాలు
మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది బ్రిటిష్ ఇండియాలోని ఒక ప్రావిన్స్. ఇందులో ప్రస్తుత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్ణాటక, కేరళ, ఒడిశాలలోని కొన్ని జిల్లాలు, తాలూకాలు భాగంగా ఉండేవి. కొన్ని సంస్థానాలు, ముఖ్యంగా రామ్‌నాడ్, పుదుక్కోట్టై కూడా ఏదో ఒక సమయంలో ప్రెసిడెన్సీలో విలీనం అయ్యాయి. ప్రెసిడెన్సీ 1950 వరకు కొనసాగి, భారతదేశం రిపబ్లిక్ అయిన తర్వాత మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. తదనంతరం, 1956 లో కన్నడ, మలయాళం మాట్లాడే ప్రాంతాలు వరుసగా మైసూర్, ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌లలో విలీనమయ్యాయి.
ప్రెసిడెన్సీ లోని అడ్మినిస్ట్రేటివ్ జోన్లు
[మార్చు]మద్రాసు ప్రెసిడెన్సీ లోని జిల్లాలను ఐదు జోన్లుగా విభజించారు.[1] అవి:
పశ్చిమ తీరం (వెస్ట్ కోస్ట్)
[మార్చు]అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రెసిడెన్సీ జిల్లాలు పశ్చిమ తీర జోన్‌లో భాగం. అవి ప్రధానంగా ప్రస్తుత కేరళ, కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంత జిల్లాలు.[1]
దక్కన్
[మార్చు]ఆంగ్లో-మైసూర్ యుద్ధం తర్వాత బ్రిటిషు వారికి అప్పగించబడినందున వీటిని సీడెడ్ జిల్లాలు అని కూడా పిలుస్తారు. ప్రస్తుత కర్ణాటకలోని బళ్లారి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కడప, కర్నూలు జిల్లాలు ఈ జోన్‌లోకి వచ్చాయి.[2]
ఏజెన్సీలు
[మార్చు]తూర్పు కనుమల పర్వత ప్రాంతాలు, ప్రస్తుత కోస్తా ఆంధ్ర, ఒరిస్సాలో, ప్రత్యేకించి ప్రస్తుత గంజాం జిల్లా, విశాఖపట్నం వంటి ఆంధ్రాలోని కొన్ని జిల్లాలను ఏజెన్సీలు అని పిలిచేవారు. గవర్నర్‌కు ఏజెంట్లుగా ఉన్న బ్రిటిష్ జిల్లా కలెక్టర్లు ఈ ప్రాఅంతాన్ని "ట్రైబల్ బెల్ట్" పేరుతో పాలించేవారు.[2]
ఉత్తర సర్కారులు
[మార్చు]ఈ జోన్‌లో ప్రస్తుత కోస్తా ఆంధ్ర, ఒరిస్సాలోని గంజాం జిల్లాల తీర ప్రాంతాలు ఉండేవి.[2]
కోరమాండల్
[మార్చు]ప్రెసిడెన్సీలో, ఆధునిక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల లోని ప్రస్తుత చిత్తూరు జిల్లాతో కూడిన దక్షిణ భాగాన్ని కోరమాండల్ అనేవారు.[2]
ప్రెసిడెన్సీ జిల్లాలు
[మార్చు]మద్రాసు
[మార్చు]ఆధునిక తమిళనాడులోని చెన్నై జిల్లా, మద్రాసు జిల్లాగా ఉండేది. బ్రిటిషు వారు వలసరాజ్యంగా చేసుకున్న తొలి ప్రాంతాలలో ఇది ఒకటి. 1640 లో ఫ్రాన్సిస్ డే నాడు కాళహస్తి నాయక్ నుండి ప్రస్తుత చెన్నై నగరాన్ని - అప్పటి మద్రాసు - విరాళంగా పుచ్చుకున్నారు.[3][4] ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన కర్నాటిక్ యుద్ధాల సమయంలో మద్రాసు ఒక ముఖ్యమైన యుద్ధ ప్రదేశం.[5] చాలా కాలం పాటు మద్రాసు, ప్రెసిడెన్సీకి పరిపాలనా రాజధానిగా ఉండేది.
చింగిల్‌పుట్
[మార్చు]చింగ్లెపుట్ జిల్లాలో ఆధునిక జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంజీవరంలు ఉండేవి. 1763 లో ఆర్కాట్ నవాబు తాను తీర్చాల్సిన అప్పుకు బదులుగా చింగ్లేపేట పట్టణాన్ని అప్పగించడంతో అది బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లింది.[5] సర్దాస్ పట్టణం 1819 వరకు డచ్చివారి ఆధీనంలో ఉండేది. దీనిని బ్రిటిష్ వారికి అప్పగించారు.[5] 1825 నుండి 1835 వరకు జిల్లాకు రాజధానిగా కరుంగుజి ఉండేది. ఆ తరువాత దాన్ని కంజీవరానికి మార్చారు. మళ్లీ 1835 - 1859 మధ్య రాజధానిని కరుంగుజికి మార్చారు. తరువాత 1859 లో సైదాపేటను రాజధానిగా చేసారు.
ఉత్తర ఆర్కాట్
[మార్చు]ఆధునిక ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, ప్రస్తుత తమిళనాడు లోని వెల్లూరు, తిరుపత్తూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, అరణిలతో పాటు, తిరువళ్లూరు లోని కొన్ని తాలూకాలు (తిరుత్తణి, పల్లిపట్టు) ఉత్తర ఆర్కాట్ జిల్లాగా ఉండేవి. చిత్తూరు, ఈ జిల్లాకు పరిపాలనా కేంద్రంగా ఉండేది.[4]
దక్షిణ ఆర్కాట్
[మార్చు]తమిళనాడులోని విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు ఆధునిక జిల్లాలు దక్షిణ ఆర్కాట్ జిల్లాలో భాగంగా ఉండేవి. బ్రిటిష్ వారి ఆధీనంలోకి రాకముందు, ఉత్తర ఆర్కాట్, చెంగల్‌పట్టు, నెల్లూరులతో పాటు ఇది కూడా కర్ణాటిక్‌లో భాగంగా ఉండేది.[6]
సేలం
[మార్చు]ఆధునిక జిల్లాలైన సేలం, ధర్మపురి, కృష్ణగిరి, నమక్కల్ సేలం జిల్లాగా ఉండేవి.[7] పారిశ్రామిక అభివృద్ధి జరిగిన ముఖ్యమైన జిల్లాలలో సేలం ఒకటి. ఉక్కు పరిశ్రమ, TV సుందరం అయ్యంగార్ హోసూర్‌లో స్థాపించిన TVS గ్రూప్‌లు ఇక్కడి పరిశ్రమల్లో ముఖ్యమైనవి. సేలం, ఈ జిల్లా పరిపాలనా కేంద్రంగా ఉండేది.[8]
కోయంబత్తూరు
[మార్చు]ఆధునిక కోయంబత్తూరు, ఈరోడ్, తిరుపూర్ జిల్లాలు, కర్ణాటకలోని కొల్లేగల్ తాలూకాలోని కొన్ని తాలూకాలు కోయంబత్తూరు జిల్లాగా ఏర్పడ్డాయి.[9] సేలంతో పాటు, కోయంబత్తూరు ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి. GD నాయుడు, G. కుప్పుస్వామి నాయుడు, SP నరసింహులు నాయుడు వంటి పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డారు. 1792 లో ధీరన్ చిన్నమలైని, 1799 లో టిప్పు సుల్తాన్‌ను ఓడించిన తర్వాత సేలం, కోయంబత్తూర్‌లను మైసూర్ రాజ్యం నుండి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు.[10][11]
మధుర
[మార్చు]ఆధునిక జిల్లాలైన మదురై, తేని, దిండిగల్, శివగంగ, రామనాథపురం, విరుదునగర్‌లోని కొన్ని తాలూకాలు మధుర జిల్లాలో భాగంగా ఉండేవి.[12] తిన్నెవేలీతో పాటుగా, బ్రిటిషు వారికి, మదురై రాజకుటుంబానికి చెందిన కొంతమంది ముఖ్యులకూ జరిగిన పాలెగాళ్ళ యుద్ధాల తర్వాత మదురై బ్రిటిషు వారి స్వాధీనమైంది. బ్రిటిషు వారికి లొంగిపోయిన లేదా సహాయం చేసిన చాలా మంది పాలెగాళ్ళను కొన్ని గ్రామాలలో జమీందార్లుగా నియమించారు. రామనాడ్, శివగంగ రాజ్యాలను 1803 లో జమీందారీలుగా మధురలో విలీనం చేసారు. [13] [14] [15]
నీలగిరులు
[మార్చు]
తిన్నెవేలి
[మార్చు]ఆధునిక జిల్లాలైన తిరునెల్వేలి, తెన్‌కాసి, టుటికోరిన్, విరుదునగర్‌లోని కొన్ని తాలూకాలు కలిపి తిన్నివేలీ జిల్లాగా ఏర్పడ్డాయి.[16] 1801లో తిన్నివేలీలో పాలెగాళ్ళకు బ్రిటిషు వారికీ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. బ్రిటిషు వారితో పోరాడిన ప్రముఖ పాలెగాళ్ళలో వీరపాండ్య కట్టబొమ్మన్ కూడా ఉన్నాడు. టుటికోరిన్ ఓడరేవును డచ్చి వారి నుండి బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్నారు. [16]
ట్రిచినోపోలీ
[మార్చు]ఆధునిక జిల్లాలైన తిరుచిరాపల్లి, పుదుకోట్టై, కరూర్, పెరంబలూర్, అరియలూర్ లు ట్రిచినోపోలీ జిల్లాగా ఉండేవి. గ్రేట్ సదరన్ రైల్వే కంపెనీని ట్రిచినోపోలీలో స్థాపించారు. 1871 జనాభా లెక్కల ప్రకారం, మద్రాసు ప్రెసిడెన్సీలో, రాజధాని మద్రాసు తర్వాత ట్రిచినోపోలీయే రెండవ అతిపెద్ద నగరం. 1928 లో పొన్మలైలో గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్ స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ట్రిచినోపోలీ విమానాశ్రయం తమిళనాడులో రెండవ విమానాశ్రయంగా స్థాపించారు. 1938లో, టాటా ఎయిర్‌లైన్స్ తన మొదటి సర్వీసును నిర్వహించింది. ట్రిచినోపోలీ బ్రాండెడ్ సిగార్‌లకు ప్రసిద్ధి చెందింది. నాయక రాజులు నిర్మించిన తిరుచ్చి కోట ఫ్రెంచి వారితో జరిగిన యుద్ధంలో ముఖ్యమైన సైనిక స్థావరంగా పనిచేసింది.
తంజావూరు
[మార్చు]ఆధునిక జిల్లాలైన తంజావూరు, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్, నేటి పుదుక్కోట్టై జిల్లాలోని అరంతంగి తాలూకాలు తంజావూరు జిల్లాగా ఉండేవి.[17] చోళుల పతనం తరువాత, తంజావూరు దేశం విజయనగరం కిందకు రావడానికి ముందు పాండ్యుల పాలనలోను, ఆ తరువాత ఢిల్లీ సుల్తానేట్‌లోనూ ఉండేది. చివరికి సేవప్ప నాయుడు అనే విజయనగర సేనాని 1532 లో ఇక్కడ ప్రతినిధిగా నియమించబడ్డాడు. అతనే తంజావూరు నాయకర్ రాజ్యాన్ని స్థాపించాడు. వారు ఈ ప్రాంతాన్ని 1673 వరకు పాలించారు. 1674లో ఈ ప్రాంతం మరాఠాల ఆధీనంలోకి వచ్చి, 1855 వరకు వారి పాలనలో ఉంది. చివరి మారాఠా రాజు మరణానంతరం తంజావూరు, బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చి ప్రెసిడెన్సీలో భాగమైంది.
మలబార్
[మార్చు]మలబార్ జిల్లాలో నేటి జిల్లాలైన కన్నూర్, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం, పాలక్కాడ్ (అలత్తూర్, చిత్తూరు తాలూకాలు మినహా), కేరళ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో త్రిసూర్ జిల్లా (పొన్నాని తాలూకా పూర్వ భాగం) చవకడ్ తాలూకా ఉన్నాయి.
దక్షిణ కెనరా
[మార్చు]దక్షిణ కెనరా జిల్లాలో ప్రస్తుత కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు, కేరళలోని కాసరగోడ్ జిల్లా ప్రాంతాలుండేవి. కన్నడ, తుళు, కొంకణి, మలయాళ భాషలు ప్రధానంగా మాట్లాడే ఈ జిల్లా మద్రాసు ప్రెసిడెన్సీలోనే అత్యంత వైవిధ్యంగా ఉండేది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Thurston 1913
- ↑ 2.0 2.1 2.2 2.3 Thurston 1913
- ↑ "District Profile - CHENNAI". Chennai.tn.nic.in. Archived from the original on 9 April 2009. Retrieved 2009-09-07.
- ↑ 4.0 4.1 A Short Account of the Madras Presidency 1862
- ↑ 5.0 5.1 5.2 A Short Account of the Madras Presidency 1862
- ↑ A Short Account of the Madras Presidency 1862
- ↑ A Short Account of the Madras Presidency 1862
- ↑ TVS Iyengar Archived 8 మార్చి 2009 at the Wayback Machine
- ↑ A Short Account of the Madras Presidency 1862
- ↑ "The city that is Coimbatore". The Hindu. 30 April 2005. Archived from the original on 26 July 2011. Retrieved 9 June 2010.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ Markovits, Claude (2004). A history of modern India, 1480–1950. Anthem Press. p. 253. ISBN 9781843310044.
- ↑ A Short Account of the Madras Presidency 1862
- ↑ "Sethupathi Tondaimans". The History of Tamil Nadu. Archived from the original on 2021-07-12. Retrieved 2024-07-12.
- ↑ "Holder of History:The Ramnad Sethupathis". Archived from the original on 2012-10-23.
- ↑ "Sethupathi Dynasty of Ramnad - Guardians of Rama Sethu". Bridge of Ram. Archived from the original on 6 October 2011.
- ↑ 16.0 16.1 A Short Account of the Madras Presidency 1862
- ↑ A Short Account of the Madras Presidency 1862