Jump to content

మీనరాశి

వికీపీడియా నుండి
(మీన రాశి నుండి దారిమార్పు చెందింది)

మీనరాశి వారి గుణగణాలు

[మార్చు]

మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపము త్వరగా రాదు.లా కొపము వాచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్ధ్యము ఉంటుంది. స్థిరత్వము కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తూంటాయి. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు.ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయసహకఅరాలు నామ మాత్రముగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగలో సాధన ఆరోగ్యము మీద ఆధార పడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గమ్ తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికిగల సంగీతాభిమాం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీఇస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు. అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు. సామర్థ్యం లేని మనుష్యులను ప్రోత్సహించడం ద్వారా సమయము శ్రమ వృధా ఔతాయి. అన్యభాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి. ఎవరిని ఏపనికి నియమించాలో బేరీజు వేయడములో చాలా వరకు పొరబాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకూంటారు. సభానిర్వహణ, సాంస్కృతిక కార్య నిర్వహణలో సామర్ధ్యము కలిగి ఉంటారు. సహజత్వానికి దగ్గరగా గదపాలన్న మీ ఆశయము నెరవేరుతుంది. ప్రచారసాధనఅలు, మీడియతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంతవారు, బంధువర్గం లెక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనుష్యుల మనోభావాలను చదువగలరు. సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. గురు, శుక్ర, సని దశలు బాగా యోగిస్తాయి. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న మీ ఆశ నెరవేరుతుంది. ధనం లేక పోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైనా అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచి పోతాయి. ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించు కూంటారు. ముఖ్యవిషయాల మీద దృష్తి సారించడం అధికమైన ఆస లెక పొవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది. వివాద రహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కాని స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయన మెలు చేస్తుంది. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్ధమౌతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది.

మీనరాశి కొన్ని జ్యోతిష విషయాలు

[మార్చు]

మీన రాశి జాతక చక్రంలో ఆఖరుది, చివరిది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి సరి రాశి, ద్విశ్వభావ రాశి, స్త్రీ రాశి, శుభ రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి జలతత్వం కలిగిన రాశి. శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, పూర్ణ జలరాశి, ఉభయోదయ రాశి, పరిమానం హస్వం, జాతి బ్రాహ్మణ, జీవులు జల జీవులు, దిక్కు ఉత్తర దిక్కు, ప్రకృతి కఫం, సంతానం అధికం, వర్ణం స్వచ్ఛం, కాల పురుషుని శరీరంలో పాదాలను సూచిస్తుంది.ఈ రాశి అధిపతి గురువు.

  • పూర్వాబాధ్ర నక్షత్రము నాల్గవ పాదము, ఉత్తరాబాధ్ర నక్షత్రము 1,2,3,4 పాదములు రేవతి నక్షత్రము 1,2,3,4 పాదములు, మొత్తము 9 పాదములు కలసి మీన రాశి యగును.
  • నిరయన రవి ఈ రాశిలో మార్చి పదిహేడవ తేదీన ప్రవేశిస్తాడు.
  • ఈ రాశిలో పదిహేను డిగ్రీలలో బుధుడు నీచను పొందగా ఇరవై ఏడు డిగ్రీలలో శుక్రుడు ఉచ్ఛను పొందుతాడు.
  • ఈ రాశి వారు వైద్యశాలలు, రాయబార కార్యాలయాలు, చేపల వ్యాపారం మొదలైనవి. జాలరులు, సముద్రమందలి అన్ని పదార్ధాలు, రత్నములు, పగడములు, ముత్యములు, నదులకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది.

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మీనరాశి&oldid=4081692" నుండి వెలికితీశారు