అమావాస్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమావాస్య, ప్రథమ తిథి

అమావాస్య (సంస్కృత: अमावास्या) అంటే సంస్కృతంలో అమావాస్య రోజున చంద్ర దశ. అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. సూర్య గ్రహణాలు అమావాస్య రోజులలో సంభవిస్తాయి. పురాతన బాబిలోనియా, గ్రీకు, భారతీయ క్యాలెండర్లలో తిథులు అని పిలువబడే 30 చంద్ర దశలను ఉపయోగించాయి.[1][2] చంద్రుడు కనిపించని తిథి అంటే సూర్యుడు, చంద్రుల మధ్య 12 డిగ్రీల కోణీయ స్థానబ్రంశం లోపల (సంయోగం) ఉన్నప్పుడు సంభవిస్తుంది.[3]

అమావాస్య అర్థం

[మార్చు]

సంస్కృతంలో "amā" ఆనగా "కలసి", "vásya" అనగా "నివసించడానికి" లేదా "సహవాసం" అని అర్థం. వేరొక విధంగా "na" +"ma"+"asya" అనగా "na" = లేదు, "ma"= చంద్రుడు, "asya" =అక్కడ అని అర్థం. దీని ప్రకారం చంద్రుడు లేని రోజు అని అర్థం. అనగా ఆ రోజు చంద్రుడు కనబడడు.

చాంద్రమాన కేలండరు ప్రకారం భారత ఉప ఖండంలో అనేక ప్రాంతాలలో చాంద్ర మాసం పౌర్ణమి తిథి గల దినంతో ప్రారంభమవుతుంది. అప్పుడు అమావాస్య నెల మధ్యలో వస్తుంది. అవంత మాన కేలెండరు ప్రకరం కొన్ని ప్రాంతాలలో అమావాస్య దినంతో నెల ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య దినాలలో కూడా దీపావళి వంటి కొన్ని పండగలు వస్తుంటాయి.

పండుగ

[మార్చు]
మాస అమావాస్య వ్రతము/పర్వము
భాద్రపద అమావాస్య పోలాల అమావాస్య/మహాలయ అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య దీపావళి
పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య/థై అమావాస్య
ఫాల్గుణ అమావాస్య యుగాది అమావాస్య

మూలాలు

[మార్చు]
  1. Most, Glenn W. Hesiod Volume 1: Theogony. Works and Days. Testimonia. Loeb Classical Library 57, Harvard University Press, Cambridge, Massachusetts, 2006.
  2. Kolev, Rumen. The Babylonian Astrolabe. State Archives of Assyria Studies, Volume XXII, 2013.
  3. Cole, Freedom. Amāvásya and Pratipad. Jyotish Digest, Vol XI, Issue II, April-Sep 2014

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమావాస్య&oldid=3898830" నుండి వెలికితీశారు