కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
సెక్రటరీ జనరల్సీతారాం ఏచూరి
లోక్‌సభ నాయకుడుఅమర్ రామ్[1]
రాజ్యసభ నాయకుడుసీతారాం ఏచూరి[1]
స్థాపన తేదీనవంబరు 7, 1964; 60 సంవత్సరాల క్రితం (1964-11-07)
ప్రధాన కార్యాలయం27-29, Bhai Vir Singh Marg, కొత్త ఢిల్లీ - 110001
పార్టీ పత్రికPeople's Democracy (ఆంగ్లం),
Lok Lehar (హిందీ)
విద్యార్థి విభాగంఎస్.ఎఫ్.ఐ. (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
యువత విభాగండెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
మహిళా విభాగంఆల్ ఇండియా డెమోక్రటిక్ వుమెన్స్ అసోసియేషన్
కార్మిక విభాగంసెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్
రైతు విభాగంఆల్ ఇండియా కిసాన్ సభ
రాజకీయ విధానంమార్కిజం-లెనినిజం
International affiliationInternational Conference of Communist and Workers' Parties.
రంగు(లు)Red
కూటమిలెఫ్ట్ ఫ్రంట్
Election symbol
దస్త్రం:ECI-hammer-sickle-star.png
ఏ.కే.జి. భవన్, సి.పి.ఐ. (ఎమ్) ప్రధాన కార్యాలయం క్రొత్త ఢిల్లీ

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కలకత్తాలో అక్టోబరు 31 నుండి 1964 నవంబరు 7 వరకు జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఏడవ కాంగ్రెస్‌లో ఏర్పడింది [2] కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ)1960 లలో, కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ చేతిలో ఓడిపోయింది. 1950 లలో రష్యా, చైనా కమ్యూనిస్టుల మధ్య చీలిక రావడం, భారతదేశం - చైనా మధ్య 1962 సరిహద్దు ఘర్షణ ఏర్పడిన సిద్ధాంత భేదాలు పార్టీ సభ్యుల మధ్య రావడం ప్రారంభించాయి . దీనితో కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) తో విడిపోయి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( సిపిఐ (ఎం)) ను ఏర్పాటు చేయడం జరిగింది . కమ్యూనిస్టుల చీలిక కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) ని జాతీయ స్థాయిలో గణనీయంగా బలహీనపరిచింది [3] మార్క్సిజం-లెనినిజం యొక్క శాస్త్రీయ, విప్లవాత్మక సిద్ధాంతాలను భారత రాజకీయాలలో కలుపుకొని,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక స్థానము నిలబెట్టడానికి సిపిఐ (ఎం) ఆవిర్భవించినది . 1920 లో స్థాపించబడిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విప్లవాత్మక వారసత్వాన్ని కలయికతో ఏర్పడినది. సిపిఐ (ఎం) 1964 లో ఏర్పడినప్పటి సమయంలో 118,683 గా ఉన్న పార్టీ సభ్యత్వం 2014 లో 10,48,678 కు పెరిగింది. మార్క్సిజం-లెనినిజానికి స్వతంత్రంగా వర్తింపజేయడానికి పార్టీ ప్రయత్నించింది. భారతీయ పరిస్థితులు, ప్రజల ప్రజాస్వామ్య విప్లవం కోసం వ్యూహాలను రూపొందించడం, సామ్రాజ్యవాద, పెట్టుబడి విధానాలలో ( బూర్జువా), భూస్వామి దోపిడీని అంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ ప్రాథమిక పరివర్తనను తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ప్రముఖ వామపక్ష పార్టీగా సిపిఐ (ఎం) వామపక్ష, ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడములో తనదయిన కర్తవ్యం నిర్వహించి, రాజకీయాలలో మార్పులకు చేయుత నిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ (ఎం) అనుసరించిన "భారతదేశ సమాజానికి మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించింది", పార్టీ మనుగడను, ఆర్థిక, అభివృద్ధి విధానాలతో కేరళ, పశ్చిమ బెంగాలలో పరిపాలన చేసారు [4]

కమ్యూనిస్టు అఫ్ ఇండియా ( మార్కిస్టు ) స్థాపనకు నాంది పలికిన వారు. వీరిని సి.పి.ఐ ( మార్క్సిస్టు ) పార్టీ సభ్యులు అందరు నవరత్నములుగా పిలుస్తారు [5]

  1. పి. సుందరయ్య (ఆంధ్రప్రదేశ్)
  2. E.M.S. నంబూద్రిపాద్ (కేరళ)
  3. హర్కిషన్ సింగ్ సుర్జీత్ (పంజాబ్)
  4. ప్రమోడ్ దాస్‌గుప్తా (పశ్చిమ బెంగాల్)
  5. ఎ.కె. గోపాలన్ (కేరళ)
  6. బి.టి. రణదీవ్ (ఆంధ్రప్రదేశ్)
  7. ఎం. బసవపున్నయ్య (ఆంధ్రప్రదేశ్)
  8. పి.రామమూర్తి (తమిళనాడు)
  9. జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్)

ప్రస్తుతం సి.పి.ఎం లోక్ సభలో సంఖ్య 4, రాజ్య సభలో 5 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సి.పి .ఎం అధికారంలో వున్నా రాష్ట్రం కేరళ లోనే [6] అని

రాష్ట్ర శాసనసభ లలో ప్రాతినిధ్యం

[మార్చు]
రాష్ట్రం సి.పి.ఐ. (ఎం)

సభ్యుల సంఖ్య

కేరళ 62
తమిళ నాడు 2
మహారాష్ట్ర 1
రాజస్థాన్ 2
హిమాచల్ ప్రదేశ్ 1
జమ్మూ కాశ్మీర్ 1
బీహార్ 2
ఒడిశా 1
అస్సాం 1
త్రిపుర 16

పార్టీ సంబంధ వెబ్-సైట్లు

[మార్చు]

పార్టీ ముద్రణలు

[మార్చు]

కూటమి

[మార్చు]

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, విదుతలై చిరుతైగల్ కట్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలతో కలిసి 2015 అక్టోబరులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-18. Retrieved 2009-02-19.
  2. "communist party of india marxist: Latest News, Videos and communist party of india marxist Photos | Times of India". The Times of India. Retrieved 2020-10-21.
  3. "Communist Party of India | political party, India". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-10-21.
  4. "Communist Party of India (Marxist) [CPI(M)]". www.globalsecurity.org. Retrieved 2020-10-22.
  5. "Who are the founder members of the Communist Party of India Marxist (CPIM)? - Quora". www.quora.com. Retrieved 2020-10-22.
  6. "About Us". Communist Party of India (Marxist) (in ఇంగ్లీష్). 2009-03-18. Archived from the original on 2020-10-24. Retrieved 2020-10-22.

బయటి లింకులు

[మార్చు]