గౌడ చరిత్ర
ఋగ్వేదమున ఐతరేయాఅరణ్యములో భారతదేశం వంగదేశము, పుండ్రసుమహా తామ్రలిప్తి, దేశములున్నవని వ్రాయబడింది. స్టెయిన్సు అను అతడు వ్రాసిన రాజతరంగిణి 1-163 లో బంగళా భాగంలో పంచగౌడ దేశములు చెప్పబడ్డాయి. అవి 1. పుండ్ర వర్ధనము 2. రాడ దేశము 3. మగధ దేశము 4. తిరుభుక్త దేశము 5. వరేంద్ర లేక బరేంద్ర దేశము. పుండ్ర దేశానికి తూర్పు భాగానికి నివృత్త దేశమనే మరొక పేరుంది. త్రికాండ శేషమనే గ్రంథంలో గౌడ పురమునకు నివృత్తియని చెప్పబడింది. ఇప్పుడది గౌర్ అని పిలవబడుతున్నది. వంగదేశమునక తూర్పుభాగానికి హరి కేళమనే పేరుండేదని హేమచంద్రుడు రాసిన అభిదాన చింతామణి నే గ్రంథం లో ఉంది. అంతకు ముందు పుండ్ర వర్ధన దేశమని పులవబడుతూ గౌడుల రాజ్యపాలనకు లోబడియున్న వంగదేశము క్రీ.పూ. 648 లో స్వతంత్ర రాజ్యమైనట్లు తెలుస్తుంది. ఈ దేశమున చెప్పబడిన అజయా నది ఇప్పటి కట్వా పట్టణం దగ్గర గంగానది లో కలుస్తుంది. దీన్ని గురించిన ప్రశంస గాలవ తంత్రంలో ఉంది. థియో పారాశి శిలా శాసనము : ఎఫిగ్రాఫికా ఇండికా 1,3 లో వివరించబడిన దనిని అనుసరించి, గౌడేశ్వరుడైన సామంత సేనుని కుమారుడు హేమంత సేనుడని, అతని కుమారుడు విజయ సేనుడని, యీతని కుమారుడు బల్లాలసేనుడని, యితని కుమారుడు లక్ష్మణ సేనుడని ఈ లక్ష్మణ సేనుని మనుమడు రెండవ లక్ష్మణ సేనుడని యితనికి అశోకుడనే నామాంతరం ఉండేదని రాజపరంపరలో చెప్పబడింది. అధిశూర నృపాలుని కాలంలో కర్ణ సువర్ణపురము గౌడులకు రాజధాని అని చెప్పబడింది. అది రాను రాను కాన్యోరాయై ఇప్పుడు రంగమతి అని పిలవబడుతుంది. ఇప్పటి ముర్షాదా బాదు జిల్లాలోని బరంపురానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంది. ఈ పురాన్ని సంబంధించిన వివరణ కుబ్జికా తంత్రం 7వ అధ్యాయంలో ఉంది. ఈ అధిశూరుడే క్రీ.పూ.732లో వంగదేశాన్ని జయించి గౌడపుర సింహాసనం ఎక్కెనని మరొక చోట రాయబడింది. ఈ రాజుకు సంతానం లేక తన మిత్రుడైన కమాజి రాజైన వీరసింహగౌడుని అర్ధించి అచటి నుండి ఐదుగురు మంత్రవేత్తలైన వింద్వాంసులను రప్పించి వారిచేత పుత్రకామేష్ఠి యాగం జరిపించి తత్ప్రభావం వలన ఒక కుమారుని పొంది, అ కుమారుడు పుట్టిన శుభసమయంలో వారికి ఐదు గ్రామములు అగ్రహారాలుగా ఇచ్చెనట! ఈ విషయం గౌడపుర దుర్గమందు కల ఒక శిలాశాసనంలో వ్రాయబడింది. తిరిగి క్రీ.పూ. 1072లో హేమంత సేనుని కుమారుడు విజయసేనుడు అధిశూరుని. వాని సంతతిని సంహరించి గౌడపుర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తరువాత యితని పెద్ద కుమారుడు, తరువాత క్రీ.పూ. 1119లో రెండవ వాడైన బల్లాల సేనుడు రాజ్యాధిపతులయ్యారు. ఈ బల్లాలసేనుడే గౌడపుర సింహాసనమెక్కిన వారిలో ప్రసిద్ధుడు. ఈతని పట్టణంలో వున్న విరోధియైన ఒక మహంతి కుట్రపన్ని మాయాయుద్ధం కల్పించి యెన్నెన్నో ప్రమాదాల్ని కల్పించగా అవి సహించలేక అభిమాన ధనులైన ఆ గౌడేశ్వరుని కుటుంబము అగ్నికి ఆహుతి అయ్యెను యుద్ధంలో ఘనవిజయం సాధించిన స్వార్ధపరుడైన ఒకని కుతంత్రం మూలంగా తన కుటుంబాన్ని కోల్పోయిన బల్లాల సేనుడా గౌడపురాన్ని విడిచి విక్రమ పురమనే మరొక రాజధానిని నిర్మించుకుని దానిలో నివసించాడు. అది రాను రాను బల్లాలబాదిగా మారింది. ఇప్పుడా పట్టణం ఢక్కా జిల్లాలోని ముంన్షిగంజి పట్టణానికి నాలుగుమైళ్ళ దూరంలో విక్రమపూర్ అని పిలువ బడుచున్నది. జనరల్ కాన్నింగ్హమ్ అనే పండితుడు – పూర్వం అధిశూరుని రాజధాని రామపాల పురమని అతడే యీ గౌడపురానికి రాజధానిని మర్చాడని వ్రాశాడు. ఈ గౌడ పురము కలకత్తా నుండి 194 మైళ్ళ దూరంలో ఉంది. ఇప్పుడది పాడుపడి పల్లెటూరుగా మారిపొయింది. ఉత్తర బంగాళమున వున్న మాల్డాపట్టణం నుండి తూర్పుగా 14 మైళ్ళు అక్కడ వున్న ఇంగ్లీషు బజారనే చోటు నుండి రెండు మార్గాలున్నాయి. ఆ రెండు పియాజ బరి మీదుగా పోవును. ఇది 900 సంవత్సరాలు హిందువులైన గౌడుల కాలంలోను, మహమ్మదీయుల కాలంలో కూడా ప్రధాన ప్రభుత్వ స్థానపు దశను అనుభవించింది. క్రీ.పూ. 8వ శతాబ్దంలో పాలవంశపు రాజైన ధర్మపాల గౌడు మహారాజు 12వ శతాబ్దం మధ్య కాలంలో దీనిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఇప్పుడీ స్థలం బల్లాల్ బారి అనే దిబ్బలక్రింద పిలువబడుచున్నది. 1345 లో షంషుద్ధీన్ లియాన్ షా అను అతడు గౌడదేశాన్ని ఆక్రమించి పాండువా అనే స్థానానికి రాజధానిని మార్చి దానికి ఫిరోజా బాద అని పేరు పెట్టాడు. అప్పటి నుండి 1445 వరకు ఇది బంగాళామునకు రాజధాని. 1446 లో తిరిగి గౌడ పురానికే ప్రభుత్వ కార్యాలయాలు మార్చబడి 1550 వరకు రాజధాని గౌరవాన్ని పొందింది[1].
చైతన్య మహాప్రభువు
[మార్చు]ఈ నవ ద్వీపములలో అంతర్ధ్వీపము ప్రధానమైనది. దానినే మాయాపూర్ అంటారు. ఇచటనే శ్రీ చైతన్య మహాప్రభువు క్రీ॥ వె॥ 1489లో ఫిబ్రవరి 18వ తేది సాయంత్రం జన్మించాడు. ఇది చైతన్య మతస్థులకు గొప్ప యాత్రాస్థలం. వీరు చైతన్యుని శ్రీకృష్ణుని అవతారం అంటారు. వీరంతా కృష్ణ భక్తులు. ఈ మతాన్ని కృష్ణ చైతన్య మతము అంటారు. వంగదేశాన్ని పాలించిన సేన వంశపు రాజులలో చివరి వాడైన లక్ష్మణ సేనునికి ఇది రాజధానిగా ఉండేదని 1880 ఇంపీరియల్ గజిటీర్ లో సర్ విలియం హంటర్ అను అతడు ఈ మీయాపూర్ను 1063లో గౌడేశ్వరుడైన లక్ష్మణ సేనుడు నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడని మహమ్మదీయ దండయాత్ర యందు అతడు పరారి అయి మరణించెనని రాశాడు. ఇంతవరకూ ఈ ఘట్టము థియో పారశీ శిలాశాసనానికి సరిపోవుచున్నది. ఇక్కడ వున మైలు పొడవు అరమైలు వెడల్పు గల ఒక పెద్ద సరస్సునకు ఈయన తండ్రి పేరు బల్లాల సేనుని పేరుండెనట.పాడైపోయిన లక్ష్మణ సేనుని దుర్గము ఇప్పటికీ ఉంది. గౌడులే ఈ చైతన్య మతానికి ప్రధాన పోషకులుగా వుండటం వలన దీనికి గౌడియా మిషన్ అనియు, చైతన్యునకు గౌరాంగుడనే పేరు వచ్చిందని చెప్తారు. ఇటీవల ఠాకూర్ బృందా బంద అనే ఒక చైతన్య భక్తుడు చైతన్య దేవుని జీవిత చరిత్ర చైతన్య భాగవత అనే పేరున రాశాడు. అందులో వారి కాలమున వంగదేశాన్ని గౌడులు పాలించే వారని తదుపరి అది షుశేన్ షా అనే పేరుగల నవాబు వశమైనదని, అతడు మౌలానా సిరాజుద్దీన్ సాహెబు ఫౌజు దారుగా నవద్వీపమున అధికారిగా వుండెనని ఆయనకే చంద్ కాజీ అనే వాడుక నామం ఉండేదని – ఇతడు చైతన్య ప్రభువునకు శిష్యుడయ్యాడని నేటికినీ అతని గోరీ గౌడియా మిషన్ వారి ఆధీనమందున్నదని చెప్తారు.
గౌడ దేశపు హద్దులు
[మార్చు]అయోధ్యకు ఉత్తరదిశ యందును సరయూనదికి (సరస్వతి) కి ఉత్తరమున సర్వార్ కొండలకు మధ్యగల దేశానికి గౌడ దేశమని పేరు ఈ దేశానికి తూర్పున గంగానది పశ్చిమమున యమునా నది, దక్షిణమున సరస్వతీనదీ ఉండుట వలన త్రివేణీ సంగమం అవడం వలన ఈ క్షేత్రానికి ప్రయాగా అనే పెరూ వచ్చిందని దీనికే శ్రావస్తీ పురమనే పేరుందనియు, ఉత్తరాన హిమాలయములు హద్దులుగా కలిగిన ప్రదేశము గౌడ దేశమని బోధాయనులు వివరించి ఉన్నారు.
మత్స్య పురాణంలో (12 శ్లో। 30 పుట) శ్రావస్తీ నగర వర్ణన
శ్లో॥శావస్థస్య మహాతేజ వత్సకస్తత్సుతోభవత్ ।
నిర్మితా యేన శ్రావస్తీ గౌడదేశే ద్విజోత్తమా ॥
స్కంద పురాణంలో గౌడ దేశ వర్ణన
శ్లో॥వంగదేశం సమారభ్య భువనేశాంతగం శివే ।
గౌడ దేశః సమాఖ్యాతః సర్వ విద్యా విశారదః ॥
వంగదేశము మొదలుకుని భువనేశ్వరము (ఒరిస్సా) వరకు గల దేశము గౌడ దేశమని, గౌడులు సర్వ విద్యా విశారదులని అర్ధము.
బృహత్ సంహిత – 14వ అధ్యాయం
బ్రాహ్మణ భేదేషు చ । స్వర్థేక తత్రార్థే । అథపూర్వస్యామ్
ఇత్యుపక్రమే-ఉదయగిరి, భద్ర, గౌడక, పౌడ్రోత్కల, కాశి, మేఖలాంభష్ఠాః ।
గౌడులు బ్రాహ్మణ భేదముల యందును, స్వార్ధకమైనక ప్రత్యయ మచ్చట (ఆదేశమున) అను అర్ధం వలన అథపూర్వస్యామ్ అను ప్రారంభమున ఉదయగిరి, భద్ర, గౌడక, పౌండ్ర, ఉత్కల, కాశి, మేఖ లాంభష్ఠులందు గౌడులు కలరు.
హితోపదేశం
కూర్మ విభాగే విభాగే పూర్వస్థ దేశోకౌ ।
అస్తి గౌడ విషయే కౌశాంబీ నామ నగరీ ॥
కూర్మ విభాగమున – ఒక భాగమందు తూర్పుగా వున్న గౌడ దేశమందు కౌశాంబీ అనే నగరం ఉంది.
ప్రబోధ చంద్రోదయం
గౌడోరాష్ట్ర మనుత్తమం నిరుపమా తత్రాపి రాఢా పురీ గౌడ దేశము అత్యుత్తమమైనది. అందులో రాఢా పురియనునది నిరుపమానమైనది.
మూహుర్త చింతామణి
కళింగ దేశములోను, గౌడ దేశములోను, గుర్జర దేశములోను గురువు సింహరాశి గతుడై యుండగా వివాహాది శుభకార్యాలు చేయకూడదు. ఎందుకనగా గురుడు సింహరాశి యందున్నపుడు గోదావరీ నదికి పుష్కరాలు వస్తాయి. ఇవి పండెండు సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. దీన్ని బట్టి కళింగదేశానికి గుర్జర (గుజరాత్) దేశానికి మధ్యనున్న దేశము గౌడ దేశమనియు, అది గోదావరి నదికి తూర్పున వున్నదని, ఆ గౌడ దేశవాసులీ గోదావరీ నదీ తీర వాసుల ఆచార వ్యవహారములకు, ధర్మాలకు నిబంధనము కలవారని తెలుస్తుంది. సా.శ. 554లో ఈశ్వర వర్మన మౌఖరీ అనునతడు గౌడదేశాన్ని జయించాడని వ్రాయబడింది[1].
మాధాయీ నగరపు తామ్రశాసనంలోని వర్ణన గౌడ నరేశుడైన బల్లాల సేనుని కుమారుడు లక్ష్మణ సేనుడు కళింగ దేశము వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడని, బెంగాలుకు రాజధాని కాలక్రమమున కాశీ, వరేంద్ర లక్ష్మణపురికి మార్చారు. 13వ శతాబ్దంలో ముసల్మానులు బెంగాలు పై దండెత్తి దానిపై ఆధిపత్యం వహించిన తరువాత బెంగాలు ముఖ్యపట్టణం కొన్నాళ్ళు గౌడదేశమందును, కొన్నాళ్ళు దానికి 20 మైళ్ళ దూరంలో నున్న పౌడువా అనే పట్టాణంలోను వుంటూ వచ్చింది. ఇది మొదట వర్ణించిన దియోపారశి శిలాశాసనంలో రాసిన దానికి గౌడియా మిషనుకు సరిపోతుంది. తెలంగాణములో చాలా మందికి పాండు, పాండువా అనే పేర్లున్నాయి.
మహా కవి బాణభట్టుడు వ్రాసిన విషయము
శ్రీ హర్ష చక్రవర్తి ఆస్థాన పండితుడై, హర్ష చరిత్ర, కాదాంబరీ మహా కవ్యాలు రాసిన మహా కవి బాణభట్టుడు గౌడేశ్వరుడైన శశాంకుని గూర్చి వర్ణించాడు. ఈ శశాంకుడే హర్షవర్ధనుని జ్యేష్ఠ సోదరుడైన రాజ్యవర్ధనుని వధించాడు.
పద్మపురాణం – 189-2లో గౌడ దేశవర్ణన
పద్మ పురాణంలో గౌడ దేశాన్ని పాలించిన మహారాజులలో నరసింహగౌడొకడని రాయబడింది
పురాణ నామ చంద్రికలో – గౌడపురి
గౌడపురి – నా ॥ లక్ష్మణపతి – వంగదేశమందలి ఒక ముఖ్య పట్టణం. ఇచ్చట ముందు జహ్ను మహర్షి ఆశ్రముండేదని చెప్తారు. ఇచ్చటి బ్రాహ్మణులు గౌడలనబడుదురు. వీరు అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు నరేంద్రుని కాలంలో కురు – కోసలదేశముల నుండి వచ్చిరి[2].
మహా భారతంలోని విషయం
పంచ పాండవు లు, అజ్ఞాతవాసం గడపడానికి విరాట్ రాజు కొలువులో మారు పేర్లతోను మారు వేషాలతోను చేర్తారు. విరాట్ రాజు – మహారాణి సుథేక్షణాదేవి – ఆమె సోదరుడు కీచకుడు మొదలైన వారంతా గౌడులని వ్యాస భారతంలో వ్రాయబడింది. ఈ విధంగా గౌడదేశపు పేరు అనేక సంస్కృత కావ్యాలలో కనిపిస్తుంది. ఈ గౌడ దేశపు ఉత్కర్షాకాలమందు అచ్చటి జనులందరు సర్వ విద్యా విశారదులై సంస్కృత విద్యకు కేంద్రంగా భాసిల్లిన విఖ్యాత దేశమది. ఇది సస్య శ్యామలమై, ధనధాన్య సమృద్ది తోను, పాడిపంటలతోను తులతూగుతూ కవులకు, కళాకారులకు పుట్టినిల్లయి ధర్మనిలయంగా ప్రసిద్ధి చెంది ప్రాచీన లక్ష్మణావతి (లక్ష్మణ సేనుడు కట్టిన విక్రమపురం) లేక నేటి లఖనౌతి నగరం మహాకవి జయదేవుడు, కవిరాజ్ గోవర్ధనాచార్యుడు, వ్యాకరణా చార్యుడైన ఉమాపతి ధర్, శబ్దకోశ్ కర్త యైన హలాయుధుడు మున్నగు మహామహులైన సుప్రసిద్ద విద్వాంసులకు జన్మస్థానమై వారితో సంబంధ బాంధవ్యములున్న ప్రసిద్ధ నగరమిది. ఆ మధ్య యుగములోని భవ్యనగరపు శిథిలాలు బెంగాలుకు మాల్డా పట్టణానికి పది మైళ్ళ దక్షిణంగా ఉన్నాయి. ఇందలి ధ్వంసావ శేషాల్లో ఆనాటి గౌడ రాజులు నిర్మించిన ప్రాచీన దేవాలయాలు, పఠనమందెరాలు, రాజప్రాసాదాలపై చెక్కబడిన శిల్పకళానైపుణి వర్ణనాతీతము.
ఈతడు క్రీ.పూ. 321-298 లో మగధ సింహాసనాన్ని అధిష్ఠించుటయే గాక సుప్రసిధ్ధ క్షత్రియులతో సన్నిహిత బంధుత్వం కలిగియుండెనని, క్రీ.పూ. 185లో ఆ సామ్రాజ్యం విచ్ఛిన్నమై అంతరించిన కాలంలో అన్యదేశీయులైన యవన్, శక, పల్లవ, పార్థివ, కుషాణ, యూబీ జాతుల వారు ఈ దేశము పైకి క్రీ.పూ. 185-200 ప్రాంతంలో దండెత్తి వచ్చి ఇక్కడి ఆర్యులతో సంబంధ బాంధవ్యము లను జరిగించి వారితో కలిసిపోయి పురుషపురము (పెషావరు) క్రీ. త. 78-123లో తమ రాజధానిగా చేసుకుని సింధు మైదాన ప్రాంతము, కాశ్మీర, పారశీకదేశాలను ఏలినట్టి సుప్రసిధ్ధ రాజ్యపాలకుడైనట్టి కుషాణ జాతీయుడైన కనిష్కుడు హర్షవర్ధుని (క్రీ. త. 606-647) తరువాత ఉత్తర హిందూ స్థానంలో రాజ్యము స్థాపించెననియు, హిందూ దేశములో ప్రముఖులని పేర్కొనబడిన 56 దేశాల్లో ప్రాగ్దక్షణ హిందూ స్థానమందు సామంత దేశములు కలది, శత్రురాజులకు అజేయమైనది, సకల కళాపరిపూర్ణము, సంపద సమేతంగా విరాజిల్లబడిన గౌడమ (గౌళము) అనెడు, బలవత్తరమైన రాజ్యమొకటి ఉండేదని అందులో నిమ్న జాతీయులు అధిక సంఖ్యాకులు గాను, అగ్ర జాతుల వారు అల్ప సంఖ్యలో ఉండేవారని, ఆ గౌడ దేశము జన్మభూమిగా గలవారందరూ గౌడులని మాతృదేశ నామంతో పిలువబడుతూ ఉండేవారని, ఆంధ్రదేశమందలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమాది ప్రధాన జాతుల వలె గౌడ దేశములో కూడా ఆదిమ వాసులలో ప్రధానంగా ఐదు తరగతులుండెడివని వారినే పంచగౌడులని పిలిచే వారని రాయబడింది. కొన్ని ప్రాంతాలలో గౌడులు, గౌణులు, గౌండరులనియు, మద్రాసు దాని పరిసర ప్రాంతాలలో ఉండే వారిని నాడారులు అని పిలవబడుచుండేవారు. కాలక్రమేన గౌడదేశమున వున్న జనసంఖ్య అభివృద్ధి చెంది వారు జీవనోపాదికి ఇతర ప్రదేశములకు వెళ్ళిరనియు, ఇప్పటి బీహారు (మిథిల దేశము) రాష్ట్రము, దాని దక్షిణమున వున్న ఒరిస్సా రాష్ట్రము అనగా వైతరణీ నదికి తూర్పు భాగమున వంగ రాష్ట్రము (బెంగాలు) సరిహద్దులు కలిగి కలిగి పశ్చిమ బాగమున బ్రాహ్మణీ నది సరిహద్దుగా కలదియు, మహానదికి పశ్చిమ ఉత్తర దిశలను అనుకుని వున్న నిమ్నోన్నత భూభాగముల మధ్యనున్న చతురస్త్ర సమతలమే గౌడ దేశమని, గో రక్షపురము, కాష్ఠ మందిరముల వద్ద నుండి తుహినాద్రి యందు ఉద్భవించి బీహారు రాష్ట్రములో ప్రవహించే (గన్ డాక్),కూసీ (కౌశీక) ఉప నదులకు ప్రాక్పశ్చిమ దిశలను, గంగానదికి వాయవ్య ఉత్తర దిశలను, నేపాళమునకు దక్షిణాపథమున గల ఎల్లలతో అలరారుచుండేదే గౌడ దేశమని దాని హద్దులు నిశ్చయించబడినవి. ఈ మిథిలా నగరాన్ని విదేహ రాజగు జనకుడు పాలించియుండెనని, ఇప్పుడు ఈశాన్య దేశములని పిలువబడుచున్న ఒరిస్సా, వంగ, బీహారు రాష్ట్రమందలి సమధీక ప్రాక్సాగర తీర ప్రాంత దేశమంతా గౌడ పాలిత దేశములని తెలుస్తుంది. ఇచట గౌడులు మిథిలాపుర వాసులగుట వలన నిఘంటుకారులు వారిని మైధులు అని కూడా చెప్పియున్నారు. అందువలన సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతగా జన్మించిన ప్రదేశము గౌడులకు నివాసము కనుక అప్పటి నుండి ఈ లక్ష్మీదేవి గౌడులకు ఆరాధ్య దేవత అయినది[1].
సారస్వతో పాసకులు (సారస్వతులు), కన్యాకుబ్జ (కనౌజు) దేశీయులు, గౌడదేశీయులు, మిథిలా దేశీయులు, ఉత్కల (ఒరిస్సా) దేశీయులు, ఈ ఐదు దేశముల వారు పంచ గౌడులని విఖ్యాతి గాంచి ఉండిరి వీరంతా వింధ్య పర్వత ఉత్తర దేశవాసులుగా పరిగణింపబడిరి. సా.శ. 500-542 ప్రాంతంలో గౌడ దేశము మీదికి అనాగరికులు, క్రూరులు, నరహంతకులగు హూణులనే ఒక మొరటు తెగవారు దండెత్తి వచ్చారు. హిందూ మతరక్షనే పరమావధిగా నెంచిన గౌడ భూపాలురు వారిని చీల్చి చెండాడి సమూలముగా నాశనం చేశారు. గౌడుల ధర్మబద్ధమైన పరిపాలనలో కరువు కాటకాలంటే ఏమిటో ఆనాటి ప్రజలకు తెలియవు. పాడిపంటలతో సకలైశ్వరములతో తులతూగుచున్నా కులవృత్తిని విడువకుండా సురాకరణ వృత్తితో బంగారు నాణెములను రాశులుగా సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉండేవారు.
శశాంకుని రాజ్య విస్తరణ
[మార్చు]క్రీ.త. 600 సం॥ ప్రాంతంలో శౌర్యధనుడు, రణతంత్ర కోవిదుడు, సర్వ విద్యా విశారదుడు, రాజకీయ చతురుడు, మంత్రశక్తి పరుడైన శశాంకు డను గౌడేశ్వరుడు శత్రుభీకరుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ కాలంలో వర్ధనులనే వైశ్య వంశజులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర హిందూదేశాన్ని పాలించేవారు. మౌఖరులనే మరో క్షత్రియ తెగ కన్యాకుబ్జమును రాజధానిగా చేసుకుని మధ్య హిందూదేశమును పాలించేవారు. వర్ధనులకు మూల పురుషుడు పుష్ప భూపతి మౌఖరులతో ఈశ్వరవర్మ, ఈశావర్మ అనే వారు ప్రసిధ్ధులు, గౌడేశ్వరుడైన శశాంకుడు ఇటు వర్ధన వంశీయులైన రాజ్యవర్ధన, హర్షవర్ధనులకు – అటు మౌఖర వంశీయులైన హ్రహ వర్మాదులకు సమకాలికుడు. ఈ రాజ్యవర్ధన, హర్షవర్ధనులు ఇద్దరూ సోదరులు, వీరికి రాజ్యశ్రీ అనే తోబుట్టువు వుండెది. ఆమెను మౌఖరుల వత్తిడు వలన క్షత్రియ వంశజుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం చేశారు. క్రీ॥శ॥ 606-612 మధ్య సమయ6లో గౌడ భూపాలుడైన శశాంకుడు రాజ్యవిస్తరణ కాంక్షతో తన రాజ్య ప్రజలను, గూఢచారులను, మంత్రి, సామంత, మండలేశ్వర, చతురంగ బల దళాద్యక్ష్యులను సమావేశపరచి తన నిర్ణయము వారందరికి చెప్పగా వారంతా యేకగ్రీవంగా దండయాత్ర చేయడానికి అంగీకరించారు. శశాంకునికి మిత్రులైన మాళవులనే మరో తెగ వారు కూడా సహకరిస్తామన్నారు. వీరందర్నీ కలుపుకుని అసంఖ్యాక సేనావాహిని వెంటరాగా క్రీ.త. 606 సం॥ శశాంకుడు మొట్టమొదట కన్యాకుబ్జాన్ని ముట్టడించాడు. అక్కడ ఘోర సంగ్రామం జరిగింది. ఆ యుధ్ధంలో శశాంకుడు – గ్రహవర్మను సంహరించి అతడి పట్టమహిషి అయిన రాజ్యశ్రీని చెరబట్టాడు. ఈ విషయం తమ దేశపు గూఢాచారుల వలన తెలుసుకున్న ఆమె సోదరుడు రాజ్యవర్ధనుడు చతురంగ బలాలతో తన సోదరిని విడిపించడానికి కన్యాకుబ్జం వచ్చి శశాంకునితో క్రూర యుధ్ధం చేసి చివరికి అతనిచే చంపబడ్డాడు. ఇతడే గాక ఈ యుద్ధంలో వర్ధనుని సైన్యంలోని ముఖ్యమైన సైన్యాధ్యక్షులంతా చంపబడ్డారు. ఈ వార్త తెలిసిన హర్షవర్ధనుడు రోషా వేషాపరుడై చతురంగ బలములు కల మహా సైన్యాన్ని కూర్చుకుని శశాంకుని పై పగతీర్చుకోవడానికి వచ్చి అతనితో తలపడ్దాడు. కాని అతన్ని ఎదిరించే సాహసం హర్షనుకి లేక ఆరు సంవత్సరములు పగలు రాత్రి తేడా లేకుండా యుధ్ధం జరిపించాడు. తన భర్త మరణము, అన్న రాజ్యవర్ధనుని మరణము, చిన్నన్న దుస్థితి చూచి దుఃఖించి ప్రయోజనం లేదని ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవాలని యెంచి చతురత అయిన రాజ్యశ్రీ తన వంటి మీద నున్న నగలన్నిటిని తన అమూల్య రత్నాభరణాలను తాను బంధించబడి వున్న కారాగృహాదికారికి అంతరంగీకుడు, దురాశాపరుడైన నాగంబొట్లు అను అతని మంచి చేసుకుని వానికి ఆ నగలను ఇచ్చి తనని తప్పించమని ప్రార్థించింది. అవి తీసుకుని నాగంభొట్లు కారాగృధికారి వద్దకు వెళ్ళి – యాజమానీ! మన చెరసాలలో చిరకాలం నుండి పడివున్న ఆడకూతురికి ఈనాడు ఇక్కడికి సమీపంలో వున్న దేవాలయాన్ని దర్శించి ఆ దేవతకు నైవేద్యం చెల్లించి రావలనే కోరిక కలింగిందని బ్రతిమాలుతుంది. కనుక ఆమె యందు దయచూపి దైవకార్యం నెరవేరేటట్లు చేయు డని ప్రాధేయపడ్డాడు. పరమభక్తుడైన ఆ కారాగృహాధికారి చక్రధర గౌడు – దైవకార్య మనడంతోనే, అది నెరవేర్చడం ధర్మమని త్న అంతరంగీసుడైన నాగంభొట్లనే దగ్గర వుండి కాపుకాస్తూ దేవతాదర్శనం చేయించి తీసుకురమ్మని అనుమతించాడు. దొరికినదే సందు అనుకుని నాగంభొట్లు ఆమెని విడిపించి బయటకు పంపి, తానా ఆభరణాలను తీసుకుని తత్కాల రాజకీయ కారాగృహాధ్యక్షుడు, సామంతరాఅజు, స్వార్ధపరుడు, రాజద్రోహి అయిన హరి హర వర్మ అని వానికి బహుకరింపగా – ఆ అమూల్య ఆభరణాలను చూచిన దురాశాపరుడైన వాడు శత్రువును విడువకూడదనే ధర్మాన్ని కూడా మరచి వెంటనే రాజ్యశ్రీని విడుదల చేసి పారిపొమ్మని సలహా ఇచ్చాడు. అప్పుడామె నాగంభొట్లు సాయంతో తన వారున్న స్కందావారానికి వెల్ళింది. అప్పుడా సమయంలో హర్ష వర్ధనుడు భావికార్యక్రమాన్ని గూర్చి తన మంత్రులతో గూడిపుఠాన్ని (రహస్య ఎత్తులు) సాగిస్తున్నాడు. రాజ్యశ్రీ తన అన్నకు ప్రణమిల్లి తాను విడుదలై వచ్చుటకు పన్నిన పన్నాగం చెప్పి తరువాత శశాంకుని చతురంగ బలాల రహస్యాలన్నిటిని వివరించి చెప్పింది. ఆమె మాటలను విన్న హర్షవర్ధనుడు హతాశుడై అరు సంవత్సరాలు యేకథాటిగా యుధ్ధం చేసినా కూడా శశాంకుని ఏమి చేయలేక పోయినందుకు విచారించి, కనీసం తన సోదరియైన దొరికిందని సంతోషించి శత్రువు బలవంతుడై ఉండగా ఇక అతనితో యుధ్ధం చేసి విజయం సాధించడం దుర్లభమని నిశ్చయించుకుని క్రీ.త. 612 సం॥లో యుధ్ధం విరమించి హతశేషులైన సైన్యాలను, తన సోదరిని తీసుకుని తన దేశం వెళ్ళిపోయాడు. యుధ్ధం దానంతట అదే పరిసమాప్తం అయినందుకు శశాంకుడు సంతసించి రాజ్యశ్రీ కొరకు పట్టుదల చూపక ఊరుకున్నాడు. సా.శ. 637 లో శశాంకుడు తన మరణానికి ముందు బెంగాల్, బీహార్ ఒరిస్సాలోని గంజాము ప్రాంతము వరకు జయించి సకలోత్తర పరమేశ్వరు డయ్యాడు[2].
గోపాల గౌడు మహారాజా
[మార్చు]గుప్తరాజులు, వర్ధనులైన పుష్పభూపతి, పాలవాంశముల వారి పతనాంనంతరము, గౌడ వంశీయుడైన శశాంకుడు కూడా మరణించిన పిదప, గోపనాశ్యుడు వీనికి రాజ్యపాలుడైన నామాంతరము ఉంది. రాజయ్యేడు. ఇతని కుమారుడు, గోపాలగౌడు తండ్రి మరణానంతరము సా.శ. 948లో గౌడ దేశ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈతని తల్లి పేరు కళ్యాణి ఈమెకు భాగ్యదేవి అనే పేరు కూడా వున్నది, ఈమె రాష్ట్రకూట కన్య.
ఖాలీపురమందలి తామ్రశాసనం
దీనిని బౌధ్ధ ఇతిహాసకారులైన తారానాథ్, ధర్మపాలుడను వారలు పరిశోధి6చి – ఈ క్రింది విధంగా రాశారు. ప్రాచీనకాలంలో రాజ వంశాలన్నీ అసహనము, పరస్పర విద్వేషాలాతో దండయాత్రలు సాగించి ఘోరయుధ్ధాలు చేసి పతనమవగా ఎక్కడ చూసినా అరాజకత్వం హింసాకాండ ప్రబలిన తరుణంలో ప్రజలు తమకు తామై సత్యధర్మపరాయణుడు, సాహసి అయిన గోపాల గౌడును తమ ఏలికగా ఎన్నుకుని యీ అరాచకాన్ని అంతమొందింపమని ప్రార్థించారు. దాని కాయన అంగీకరించాడు. అప్పటి నుండి ఈయన రాజై తన బుధ్ధి కుశలత, బహుబలము, ధైర్య సాహసములు అకుంఠిత సేవాతత్పరలతో, సుగుణ సత్కార్యాలతో పజామన్ననలు పొంది, వారందరకు ఆరాధ్యుడై మహోన్నత స్థానం ఆక్రమించుకుని మహారాజాధిరాజై ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు[1].
సంధ్యాకర్ నంది అను పండితుడు వ్రాసిన రామపాల చరిత్రలో గోపాలగౌడు మహారాజు తాను ఉత్తర వంగదేశీయుడని ఒక మూలశాసనంలో వ్రాసుకున్నాడని, యితడు దక్షిణ పూర్వ బంగాళములను ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు తెచ్చి ఏలుబడి చేయుచు గౌడాధిపతి అనిపించుకున్నాడని, ఈయన రాజ్యము మగధ వరకు వ్యాపించి ఉండేదని, ఈయన రాజనీతితో విదేహ, కోసల, కాశీరాజ్యములను పాలించి మహారాజు బిరుదాన్ని పొందాడని, యితడు కోసలేశ్వర మహారాజు పరిపతి మహారాజు కుమార్తె అయిన వీరమాంబను పరిణయమాడెనని యితడు నిత్యపూజా దురంధరుడని, శివలింగాభిషేకం చేసి ప్రసాదము తినకొండా ఏమీ తినేవాడు కాదని వ్రాశాడు. ఈ విషయమే ఆది గౌడదీపికలో కూడా వ్రాయబడింది. ఈయన భార్య వీరమాంబ కూడా పరమ శివ భక్తురాలై పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుచు, యెన్నెన్నో వ్రతోపవాసములు, నోములు నోచి దాన ధర్మాలు విరివిగా చేస్తూ గొప్ప సాధ్వీమణిగా పేరొందింది. కొంత కాలానికి పురాణ దంపతులకు ఈశ్వర వరప్రసాదం వలన సకల గుణాన్యుఢుడైన ఒక కుమారుడు జన్మించాడు... ఇతనికి కాటమగౌడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇతడు బాల్యం నుండి భక్తులతో గూడి పరమేశ్వరారాధన చేస్తుండేవాడు. పెద్దవాడై సకలవిద్యా పారంగతుడై బహుబాషా కోవిదుడై శివలీలా మహత్యము, శివతత్త్వసారమనే గ్రంథాలు వ్రాశాడని ఆదిగౌడ దీపికలో వ్రాయబడింది. ఇతడు మహాభారత యుధ్ధానంతరం వరకు వున్నాడని శివపురాణంలో ఉంది. ఇతడు కూడా తండ్రితో పాటు రాచ కార్యాల్లో పాల్గొంటూ తండ్రికన్ని విధాల సహకరిస్తూ తాత్కాలీన భారత వర్షంలో గౌడ రాజ్యాన్నొక మహోన్నత రాజనీతి గల దేశంగా తీర్చిదిద్దాడు.
ఆనాటి రాజ్యాభిషేక వేడుకలు
వైదిక రీతిలో జరిగే హిందూ రాజ్యాభిషేక విధానం ఏ విధంగా ఉండేదో తెలియచెప్పింది ఆనాటి గోపాల గౌడు మహారాజా వారి రాజ్యాభిషేకం. రాజ్యాభిషేకపు ముందు రోజున సుంధర భవ్యనగరంలో వుండే రాజ్యమందిరంలో పూర్వరంగం ఏర్పరచబడుతుంది. ఆ రోజున రాజుకు దీర్ఘాయువు, సమృద్ధి ఆజాత సత్రుత్వం అపార అజేయం కలుగుటకు గాను హోమం చేస్తారు. ఇందులో అష్ట మాతృకలైన మహేశ్వరి, వారాహి, బ్రాహ్మీ, మహాలక్ష్మి, వైష్ణవీ, చాముండా, శైలపుత్రి, శారదా దేవతలకు పూజ, నవగ్రహాఅరాధన చేసి గ్రహశాంతి అయిన తరువాత వినాయక శాంతి, ఐంద్రిక శాంతి చేస్తారు. ఇవన్నీ రాజురాజ్యకాలం సుదీర్ఘకాలం వర్థిల్లాలనే సంకల్పంతో పూజలు చేస్తారు. మరునాడు పట్టభిషేకం నాడు పవిత్ర జలంతో స్నానం ఇందులో సర్వశుద్ధి నిమిత్తం ఓషధీమూలములు, పంచగవ్యములు, సర్వబీజము, సర్వఫలము, సర్వపుష్పము మొదలగు వాటిని ఉపయోగిస్తారు. ఈ స్నానం చేయించడంలో చాతుర్వర్ణముల వారు పాలు పంచుకుంటారు. ఇందులో ప్రప్రథమముగా శూద్రులు మట్టికుండలోని నీటిని రాజుపైన చల్లుతారు. తరువాత వైశ్యులు రాగి పాత్రలోని పాలు చల్లుతారు, తరువాత క్షత్రియులు వెండి బిందెలోని పెరుగును చల్లుతారు, ఆఖరున బ్రాహ్మణులు బంగారు పాత్రలో వున్న వెన్నను తీసి రాజుకు పూస్తారు. దీని తరువాత అంగశుద్ధి క్రమం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియలో రాజుశరీరంలోని ప్రతి అంగాన్ని విభిన్నమైన మట్టి ధూళులతో లేపనం చేస్తారు. ఇందులో ప్రముఖంగా చీమల పుట్టలలోని మట్టిని, ఏనుగు దంతంతో తీయబడిన అడుసు, ఇంఫ్ర ధ్వజ దండం క్రింది ధూళి, గుఱపు డెక్కల క్రింది ధూళి, గోసాల యందలి అడుసు, విష్ణు మందిరం లోని ధూళి, వేశ్య గృహ ద్వారంలోని ధూళి, రథచక్రముల క్రింది ధూళి, పవిత్ర నదీ – సాగర సంగమ మందలి మట్టిని ఉపయొగిస్తారు.అటు పిమ్మట రాజ పురోహితుడు బంగారు పాత్రతో హోమ కుండలోని భస్మాన్ని తెచ్చి రాజుపైన చల్లుతాడు. అటు తరువాత అనేక రంథ్రాలుగల స్వర్ణపాత్రలో పొసిన పవిత్రోదకంతో బ్రాహ్మణులు రాజును అభిషేకిస్తారు. పవిత్రోదకమంటే గంగా-యమునా-సరస్వతీ (త్రివేణి సంగమం) నదులలోని నీరు, నాలుగు సముద్రములు, సప్త సరోవరలలోని నీరు. ఈ నీళ్ళు అభిషేకం జరిగే సమయంలో మంగళ తూర్యనాదాలు వేదమంత్ర పఠనం, శంఖారావాలు దుందుభి మొదలగు వాద్యములు మార్మ్రోగుచుండగా, చాతుర్వర్ణముల ప్రతినిధులు రాజుపైన నీళ్ళు చల్లుతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత పుణ్యాంగనలు స్నానం చేయిస్తారు. స్నానంతరం దౌత్యవస్త్రాలు కట్టించి భద్రాసనం పైన కూర్చొబెడతారు. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది ప్రజలు, సామంతులు, దేశ విదేశ రాయబారులు, గూఢచారులు మొదలగు ప్రముఖులెందరో ఆహ్వానింపబడతారు. స్వర్ణసింహాసనానికి ఇరువైపులా రాజ్యంలోని ఉన్నతాధికారులు, చతురంగ దళముల అధ్యక్షులు కొలువు తీర్చి వుంటారు. ఛత్రం పట్టే వేదుక గొప్పది. చామరాఅలు వీచే సుందరాంగుల నేర్పు గొప్పది. సింహాసనం మీద వరుసగా సింహ, వ్యాఘ్ర, హరిణ, వృషభ చర్మాలని పరుస్తారు. దీని వలన రాజుకి పరిసరముల సృష్టితో ఏకాత్మకభావం ఉదయించడానికి దోహదపడుతుంది. కుండలోని భస్మాన్ని తెచ్చి రాజు పైన చల్లుతాడు. అటు తరువాత అనేక రంథ్రాలు గల స్వర్ణపాత్రలో పోసిన పవిత్రోదకంతో బ్రాహ్మణులు రాజుని అభిషేకిస్తారు. పవిత్రోదకం అంటే గంగా - యమున – సరస్వతి నదులలోని నీరు (త్రివేణి సంగమము), నాలుగు సముద్రముల, సప్త సరోవరముల లోని నీరు. ఈ నీళ్ళు అభిషేకం జరిగే సమయంలో మంగళ తూర్యనాదాలు వేదమంత్ర పఠనం, శంఖారావాలు దుందుభి మొదలగు వాద్యములు మార్మోగుచుండగా, చాతుర్వర్ణముల ప్రతినిధులు రాజుపైన నీళ్ళు చల్లుతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత పుణ్యాంగణలు స్నానం చేయిస్తారు. స్నానానంతరం ధౌత వస్త్రాలు కట్టించి, భద్రాసనం మీద కూర్చుండబెడతారు. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది ప్రజలు, సామంతులు, దేశ విదేశ రాయబారులు, గూఢచారులు మొదలగు ప్రముఖులెందరో ఆహ్వానింపబడతారు. స్వర్ణసింహాసనానికి ఇరువైపులా రాజ్యంలోని ఉన్నతాధికారులు, చతురంగ దళముల అద్యక్షులు కొలువు తీరి వుంటారు. ఛత్రం పట్టే వేడుక గొప్పది. చామరులు వీచే సుందరాంగుల నేర్పు గొప్పది. సింహాసనం మీద వరుసగా సింహ, వ్యాఘ్ర, హరిణ, వృషభ చర్మాల్ని పరుస్తారు. దీని వలన రాజుకు పరిసరముల సృష్టితో ఏకాత్మభావం ఉదయించడానికి దోహదపడుతుంది. తరువాత రాజ పురోహితుడు నూరు మంగళ ద్రవ్యాల్ని చూపిస్తాడు. వీటి దర్శనం శుభాన్ని సూచిస్తుంది. తరువాత మాతృభాషలో రాజగురువు శపథం చేయిస్తాడు. జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహుర్తం రాగానే రాజగురువు గోపాల గౌడును మహారాజుగా ప్రకటిస్తూ, ధగదగా మెరిసే నవరత్నఖచిత స్వర్ణమకుటం (కిరీటాన్ని) శిరోభూషణంగా అలంకరించి – రాజులు ధరించే దుస్తులని ఇచ్చి మహాజనులారా నేటి నుండి ఈయన మన మహారాజు అని అనగానే ప్రజలు జయ జయధ్వానాలు, కరతాళద్వనులు ఆకాశాన్నందేట్లు చేస్తారు. 35 ఫిరంగులు పేలుప్తారు. మంగళ వాయిద్యాలు, శంఖానాదాలు, దశదిశల మార్మ్రోహుచుండగా నూతనాబిషిక్తుడైన రాజుకు తిలక ధారణ చేస్తారు. తరువాత రాజమాత ఆశీర్వాదం పొంది నల్లని చెవి గల తెల్లని గుర్రాన్ని అధిరోహిస్తాడు. ఈ అశ్వాన్ని ముందుగానే విశేష పూజలతొ సిద్ధపరిచి ఉంచుతారు. గుఱం మీద నుంచి దిగగానే పూజలు చేసి సిద్ధపరిచి వున్న భద్రగజాన్ని (పెద్ద ఏనుగు) అధిరోహిస్తాడు. గజారోహణానంతరం రాజదంపతులు గణేశ మందిరానికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించి పూజించి ఆశీర్వాదం పొందుతారు. నగరమంతా సుందరంగా అలంకరింపబడి ఇంటింటా ఉత్సవాలు, వేడుకలు జరుఫుకుంటూ విందులు వినోదాలతో ప్రజలంతా మహదానందంతో క్రీడిస్తారు. పరిసరమున వున్న గిరిజనులు, కొండ జాతీయులు రాజు ఎడల తమ భక్తి విశ్వాసాలు ప్రకటించుకోవడానికి వచ్చి దర్శనం చేసికొని వారి వారి కళా కౌశలాన్ని ప్రదర్శిస్తారు. తరువాత రాజు ఖడ్గాన్ని ధరించి, ఒక చేతిలో గదను ధరించి గజారూఢుడవగా వాని వెంట వివిధ హోదాలు గల ఉన్నతాధికారులు 50 ఏనుగుల నెక్కి ఊరంతా ఊరేగుతారు. ఈ ఉత్సవ వేడుకలు ఒక నెల రోజులు జరుగుతాయి. ఈ నెల రోజులు దాన ధర్మాలు అతిథి పూజలు జరుగుతూనే ఉంటాయి[1].
గోపాల గౌడుని ప్రతిభ
తారానాథ్ అనే పండితుడు గౌడాధిక్య మనే గ్రంథంలో గోపాల గౌడ మహారాజా వారు ధార్మిక విశ్వాసములందు బౌద్ధుడని, ఆజేయమగు శక్తి సామర్ధ్యములు గల చతురంగుడనియు, పరిపాలనా దక్షుడనియు పాట్నా జిల్లా బీహారు వద్ద నరేంద్ర (నలందా) బీహారు రాజ్యస్థాపకుడని రాశాడు.
మంజుశ్రీ అను చరిత్రకారుడు మూలకల్ప అనే గ్రంథంలో గోపాల గౌడుని రాజ్యపాలనలో దేశమంతటా అనేకానేక విహారప్రదేశాలు, ఉద్యానవనాలు, త్రాగు నీటి, పంట చెరువులను నిర్మించుటయే గాక నదుల నుండి పొలములకు పంటకాలువలు త్రవ్వించెనని, అనేకానేక దేవాళయములు, గుహలను నిర్మించెనని వ్రాశాడు. ఈయన గుర్జర (గుజరాత్) ప్రతీహార శాసకుడైన వత్సరాజుకు బద్ధశత్రువని ఇతని కుమారుడు కాటమగౌడు గుర్జర దేశీయులకు శత్రువుగానే వుండేవాడని రాయబడింది[2].
గౌడ దేశ పతనము
1575లో అక్బరు పాదుషౌ సుబేదారైస వలీఖాన్ గౌడదేశఫు సిరి సంపదలకు సౌందర్యమునకు చూసి ఆశ్చర్యము పొంది దుర్భుద్ధి కలవాడై గౌడ దేశాన్ని హఠాత్తుగా ముట్టడించాడు, శాంతిని కోరుకునే వారవడం వలన గౌడలు తగినంత సైన్యాన్ని సమకూర్చుకొని వుండనందు వలన, ఉత్తర పశ్చిమ బంగాళములలో అంతః కలహాల కారణంగాను, తరుచుగా శత్రువులు ఆకసిస్మిక దండయాత్రలు జరుపుచుండుట వలన హిమాలయాలకు ఉత్తర భాగం నుండి పశ్చిమాన కాంభోజుల చేతిలో దెబ్బ తినివుండుట వలనను అప్పటి చందేలు రాజు యశోవర్మ కూడా ఒక వైపు నుండి దండెత్తి వచ్చినందు వలన గోపాలుగౌడుని సైన్య బలం తగ్గిపోయింది. తుదకు మహమ్మదీయుల కాలంలో గౌడులు నామమాత్ర రాజులుగానే వుంఢిఫోయిన కారణంగా వలీఖాన్ గోపాల్ గౌడుని ఓడించి తన రాజధానిని పాండువా నుండి గౌడ దేశానికి మార్చుకున్నాడు. తత్ఫలితంగా గౌడ దేశం అత్యధిక ముస్లీముల జనాభాతో నిండిపోయింది. గౌడులకు రాజు లేని కారణంగా మహమ్మదీయులు నానా హింసలకు గురిచేసారు. గౌడులు వారి అమానుష కార్యాలకు, దౌర్జన్యాలకు గురై సర్వస్వం కోల్పోవడం బట్టి, నిరాయుథులు, నిస్సహాయులైన కారణంగా వారిక చేసేదేం లేక తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారంగా తమ విద్యాబలంతోను, దేవతోపాననా మంత్రశక్తితోనూ మహమ్మారిని సాయపడమని ప్రార్థించారు. వారి ఉపచారాలకు సంతోషం చెంది ఆ దేవత దేశంలో ప్రవేశించి అ౦దరిని రోగగ్రస్తులను చేసి మూడు వంతుల మంది మహమ్మదీయులను కబళించి గొప్ప జన సష్టం కలిగించింది. ఈ మహా ఉపద్రవానికి భయపడిన తురకలలో చాలా మంది ప్రాణ రక్షణ కొరకు ఇతర పట్టణాలకు పారిపోయారు. పాండువాలో కూడా మహమ్మారి ప్రవేశించి చాలా మంది తురకలను హతమార్చి అపారజన నష్టం కలిగించింది. పీనుగుల పెంటగా మారిన గౌడ దేశాన్ని విడిచి గౌడులందరు సరిహద్దున వున్న ఆంధ్రప్రాంతానికి వలస వెళ్ళి పోయారు. ముస్లీములు నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టుకు పోయారు. మహమ్మారి ఉధృతి తగ్గిన పిమ్మట చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి ఆర్తనాదాలు హాహాకారాలు నలుమూలలా చెలరేగాయి. నగరమంతా నిర్మానుష్యమై పోయింది. రాజభవనాలన్నీ పాడుపడిపోయాయి. రాజమార్గంలో గడ్డి మొలిచింది. పరిసర ప్రాంతపు అడవులలో నుండి పెద్ద పులులు, సింహాలు మొదలగు కృర జంతువులు వచ్చి మిగిలిన శత్రువుల్ని సంహరించాయి. క్రమంగా పాండువా నుండి గౌడదేశం వరకు గల ఇరవై మైళ్ళ ప్రదేశమంతా గొప్ప అరణ్యంగా తయారై పోయింది. దాని తరువాత బెంగాల్ నివాసులకు ఆ కారడవిలో కప్పు పడిపోయిన సుందర భవ్యనగరం ఆచూకి తెలియరాలేదు. ఇపుడిపుడే ఆ ప్రాచీన సుందర నగర వైభవాలు భారత పురాతత్వ శాఖవారి త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఈ గౌడదేశం గోపాల గౌడుని అనంతరము 9, 10 శతాబ్దములలో వారి వంశీయుల క్రింద, 12వ శతాబ్దంలో సేన వంశీయుల ఆధిపత్యంలో‘ను ఉంది. ఈ కాలంలో గౌడ రాజులు ఇక్కడ అనేకానేక హిందూ మందిరాలు, స్వర్ణమందిరాలు కూడా నిర్మించారు. వాటన్నిటిని ముసల్మానులు మతోన్మాదంతో నాశనం చేసి దోచుకున్నారు. వాటి స్థానంలో మహమ్మదీయులు 1580లో నసరత శాహా అనే మశీదు, లోటోన్మశీదు, బంగారు మశీదు, ఫిరోజ్ మీనార్ (స్తంభం) వెలిశాయి. 1526లో ధనవంతుడైన సుబ్బారాయ గౌడు అనే అతను దుర్గాలయాన్ని నిర్మించాడు. అది కూడా జీర్ణావస్థలో ఉంది. భారత పురాతత్వశాఖ వారు త్రవ్వకాలను పరిశోధించి ఆ ప్రాచీన నగర కట్టుబడి, అందమైన శిల్పము, విశాలమైన రాజ బాటలు, సౌధ నిర్మాణంలో ఉపయోగించిన వస్తుసామగ్రి గౌడుల నైపుణ్యానికి తార్కాణమని రాశారు. మశీదులు కూడా కళాదృష్టిలో గొప్పవని వ్రాశారు. దీని అవశేషాలు బెంగాలుకు మాల్దా పట్టణానికి పదిమైళ్ళ దక్సిణంగా వున్న ప్రదేశంలో ఉన్నాయి. కొన్ని శాసనములలో ఈ గోపాలగౌడు మగధ, అంగరాజ్యములను కూడా పాలించెనని ఉంది. ఈ మహనీయుని మరణం కూడా ఎక్కడా చెప్పబడి లేదు. గత సంస్కృతిని స్మరించి కీర్తింపని జాతికి మనుగడ సాగించే హక్కు పోతుందని పెద్దలంటారు. కనుక గౌడులైన ఫ్రతీవారు యీ పవిత్ర ఇతిహాషాన్ని మననం చేసికొని వూర్వజులను కీర్తించాలి అది ధర్మం. గౌడులను గురించిన ప్రాచీన ఇతిహాసం గల తామ్ర శాసనాలు 200 లకు ఫైగా ఢిల్లీ ప్రాచ్యలిఖిత భాండాగారంల్‘ ఇంకా వున్నాయి[1].
వేదయుగం లోని గౌడుల పేర్లు
ఈ విధంగా కౌండిన్య వంశొద్భవులైన గౌడులందరు క్రమంగ కృతయుగంలో దేవగౌడులని, త్రేతాయుగంలో ఆదిగౌడులని, ద్వాపరయుగంలో శివగౌడులు సత్యగౌడులనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. వీరందరు శిపపూజా దూరంథరులు, శైవమతస్తులని ఆదిగౌడ దీపికలో రాయబడింది. అది గౌడ వంశోత్పత్తి పూర్వ వివరణ చరిత్రాంశములను బట్టి ఉత్తర హిందూస్థానం గౌడదేశమని నిరూపించబడింది. ఈ ప్రదేశంలో సృష్టి ఆది నుండి గౌడ నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. సృష్ట్యాది నుండి వుండుట వలన వారు ఆదిగౌడులని పిలువబడ్డారు. వీరి వంశం ఇంచుమించు పదివేల సంవత్సరములకు పూర్వం నుండి వున్నట్టు ప్రాచీన స్మృతుల్లో ఉంది. వీరు వేద వేదాంగ పారంగతులైన యజుర్వేదీయులు. వీరిలో స్మార్త అద్వైతము, స్మార్త శాక్తేయమనే రెండు తెగలున్నాయి.
జనమేజయుడనే రాజు ఆర్యవర్త దేశాన్ని పాలించేవాడు. అప్పుడొక యజ్ఞం చేయాలని సుప్రసిధ్ధ యాజ్ఞికుడైన వటేశ్వర మునిని, ఆయనకు గల 1444 మంది శిష్యులతో సహా రమ్మనమని ఆహ్వానించాడు. వారంతా వచ్చి చాలా ధన వ్యయంతో కూడిన గొప్ప యజ్ఞాన్ని పరిసమాప్తి చేశారు. యజ్ఞానంతరం అవబృధ స్నానం పూర్తి చేసుకుని వచ్చిన రాజు వటేశ్వరుని ఘనంగా సత్కరించి ఆయనకు అమూల్య కానుకలు దక్షిణంగా యివ్వబోయాడు. కాని ఆ ముని పుంగవుడా కానుకలని స్వీకరింపక అశీర్వదించి వెళ్ళిపోవడనికి ప్రయాణమయ్యాడు. అప్పుడా మహారాజు తమలపాకు మడుపులలో ఒక్కొక్క గ్రామం దానంగా వ్రాసి ఆ తమలపాకులను 1444 మంది శిష్యులకు ఇచ్చాడు. శిష్యులా మడుపులను తీసికొని తిరుగు ప్రయాణమై నడుస్తున్నారు. వీరంతా మంత్ర తంత్ర విద్యలలో నిపుణులు. వీరు నీటి మీద కూడా సునాయాసంగా నడువగల జలోపరిగమన విద్య గలవారు. మార్గమధ్యలో వారంతా ఒక నదిని దాటవలసి వచ్చింది. వారు తమ విద్యను స్మరించి నీటిపై కాలుమోపగా కాళ్ళు నీటిలో దిగబడిపోయాయి. అది గ్రహించి వారంతా ఆశ్చర్య చకితులై తమకు గల జల్‘పరిగమన విద్య నశించిపోవడానికి కారణం తెలియక గుర్వాజ్ఞుసారం తమలపాకు మడుపులను విప్పి చూచుకునారు. అందులో గ్రామ దానాలు వ్రాయబడి వుండడం చూచి రాజ వద్ద దానం పట్టడం కారణంగానే తమ జలోపరిగమన విద్య నశించిందని తెలిసికొని వారంతా తిరిగి రాజాస్థానానికి వెళ్ళి ఓ రాజా! దానములు గ్రహింపమని ముందుగానే చెప్పాము కదా! తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే ధనాపేక్ష లేని మా వంటి సాధువులను ఈ విధంగా మభ్యపెట్ట వచ్చునా! నీ గ్రామ దాన స్వికరణచే మా అమోఘ విద్యలు నశించాయి కనుక నీవిచ్చిన దానము నీవే తీసుకొ అని చెప్పగా విన్న రాజు మిక్కిలి భయపడి వారినెంతగానో బ్రతిమలాడుతు, యెన్నోవిధాల ప్రార్థించి – ఓ మహాత్ములారా! సర్వజ్ణులైన మీకునేనేమని చెప్పగల వాడను. రాజు యజ్ఞం చేయించుకుని ఋత్వుక్కులకుదానమీయక పోతే ఆ యజ్ఞం ఫలింపదని మీకు తెలియంది కాదు. నేనా యజ్ఞఫలాన్ని కాంక్షించే మీరు కాదన్నా అలా వ్రాసి ఇచ్చాను. నా అపరాథాన్ని మన్నించి మీమీ గ్రామాల్ని తిరిగి స్వీకరింపుడని ప్రాధేయపడి వారందరిని శాంతింప చేసి గౌడ దేశంలో వుండుమని ప్రార్ధింపగా వారంతా అంగీకరించి అక్కడనే నివాసమేర్పరచు కున్నారు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణులు ఆది గౌడులు అనిపించుకున్నారు. ధన మధాందత వలన వీరిలో ఆచారాలు, అడుగంట నారంభించాయి. భోగలాలసులై పక్వాన్నాన్ని పూటకూటి వాళ్ళ ఇళ్ళ నుండి కొని తెప్పించుకుని తినేవారు[1]. కర్ సోదే అనే గ్రంథంలో ప్రాచీన కాలం లోని గుజరాతీ గౌడ బ్రాహ్మణులను మేడల్ వాలా అని పిలిచెవారని, విక్రమనామ సంవత్సరం 160 మార్గశిర శుద్ధ పంచమీ గురువారం నాడు గుజరాత్ దేశాధిపతి మహాప్రతాపి, రాజా విజయ సింహగౌడు తమ దేశమున వున 200 మంది గౌడ బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు దానంగా యిచ్చి వారి నందర్ని తన రాజ్యమందుండ మని ప్రార్థించాడు. వీరు సామవేదులు. భర్ద్వాజ సంతతి వారని చెప్పుకుంటారు. వీరప్పుడు మాళవ, కాశీ ప్రాంతంలో ఉన్నారు. కాశ్మీరమందలి శ్రీ హట్ట నగరంలో గౌడులుండేవారు. తదుపరి వారు కాల ప్రభావం వలన మాలవీ దేశానికి వెళ్ళిపోయారు. రాజా విజయ సింహ గౌడు వారిని అందరిని తన దేశానికి ఆహ్వానించి వారికనేక భూములను, ధనాదులనిచ్చి పోషించేవాడు. వీరికి కులదేవత లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వారు ఆ దేవిని శ్రధ్ధాభక్తులతో పూజిస్తూ ఉండేవారు. వీరికి వేదాధికారం గల ధర్మాలుండేవి. కాని వీరు కాల క్రమేణా ఇతర వృత్తులు చేపట్టి తమ ధర్మాలని విస్మరించారు. వీరిలో 22 కుటుంబాల వారు మేడల్ (మీరట్) పట్టణానికి వెళ్లిపోయారు. అందువలన వారు మెడల్ వాలా అని పిలవబడ్డారు. వీరే మాలవీ శ్రీ గౌడులు. రాను రాను వీరు శూద్ర కన్యలను వివాహమాడి సురాకరణ వృత్తి చేయడం ఆరంభించారు. దానికి ప్రమాణం ఈ క్రింది విధంగా ఉంది.
శ్లో II గౌడ బ్రాహ్మణ సంజాతొ ఆర్యావర్తే ప్రవర్థితః
ఆసావ ధర్మ ఇత్యుక్తః సర్వధర్మ బహిష్కృతః
సురాకృత్వా విక్రాయీత కుర్యాత్తద్ధన జీవనం
ఇత్యేతు గౌడ సంభూతః సౌష్కల్యేతు ఇతిస్మృతః II
మూలం:అది గౌడ దీపిక 895 వర్ణన - 193 పుట
ఈ ప్రమాణాన్ననుసరించి మాలవీ శ్రీ గౌడులైన వారు తమ బ్రాహ్మణ ధర్మాల్ని విడచి, స్వధర్మాచార హీనుళై తమ కుల దేవేత అయిన లక్ష్మీదేవిని పూజించుట మాని వేసిన కారణంగా ఆ దేవి ఆగ్రహం కలిగి వారిని ధన, విద్యావిహీనులగు నట్లు శపించింది. అప్పటి నుండి గౌడులు విద్యా విహీనులై ధన హీనులై ఆ దేశాన్ని విడిచి కొందరు మాలవీ దేశానికి, కొందరు మార్వాడీ దేశానికి, కొందరు బంగాళా దేశానికి, మరి కొందరు ఢిల్లీ, పా తదితర వృత్తులు చేయనారంభిరిచి జీవించే వారని ఫై ప్రమాదాల వలన తెలుస్తుంది[3].
అగ్రదాని గౌడశాఖ
ప్రప్రథమంగా దానం పట్ట నరులు కనుక వీరికి ఈ బిరుదు నామం ఏర్పడింది. ఈ శాఖీయులు అపర కర్మలయందును, ప్రేత కార్యములందును దానాలు పట్టేవారు. ఈ ఆచారం కాశీ పట్టణంలో యిప్పటికీ ఉంది. నేను కాశీలో వీరితో కలసి మాట్లాడి విషయసేకరణ చేశాను.
ఆచార్య గౌడ శాఖ
వీరు అపర కర్మలందు భోక్తలై యుండుట ఆచారంగా గలవారు. పూర్వం దశరథ మహారాజు మరణించినప్పుడు భరతుడు మేనమామ గారింటి నుండి వచ్చే వరకు ఈ ఆచార్య గౌడ సంఘం వారే ఆ కళేబరాన్ని రక్షించారు. భరతుడు వచ్చి వీరి సేవాతత్పరతకు సంతసించి దశరథ మహారాజు ధరించిన అమూల్య వస్తు వస్త్ర, భూషణాలంకారాలన్నీ ఏకాదశాహమున వారికి ఇవ్వబోగా వారు సంశయించి నిరాకరించారు. అప్పుడు వశిష్ట మహర్షి వచ్చి వారిని సమాధాన పరచి ఆ సముదాయానంతా తీసుకొమ్మని ప్రేరేరింపగా అప్పుడా అమూల్య సంపదను స్వీకరించారు.
ఆరణ్యవాసానంతరం సీతాసమేతుడై శ్రిరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి తన తండ్రి కళేబరాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో కాపాడిన విశ్వాసపాత్రులైన గౌడాచార్యులను రప్పించి వారిని పూజించి సత్కరించాడు. అప్పటి నుండి అపర కర్మలందు ఏకాదశాహాంలో యీ శాఖ గౌడులు పూజనీయులని, ఆ సమయంలో కనీసం ఒకరినైనా పూజింపని యెడల కర్మసిద్ధింపదని అందువలన తన రాజ్యం లోని ప్రజలందరు వీరిని ఫూజింపవేలెనని శాసించాడు. నేటికీయీ ఆచరము కోసల, విదేహ దేశాల్లో పాటింపబడుతుంది.
కీర్తన్య గౌడ
[మార్చు]ప్రస్తుత కర్నాటకలో వున్న మోరస గౌడులు వీరే (వొక్కలిగలో ఒక శాఖ)
శుక్లవాల గౌడ శాఖ
వీరు కూడా అది గౌడ శాఖీయులవలె శుక్ల యజుర్వేదీయులు, వీరిలో జోషీలని, ఓఝలనే రెండు తెగలున్నాయి. వీరు వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పారంగతులు. భూగర్భ జలాలను, ఖనిజ సంపదను, రత్నాదులను కనిపెట్టి వెలికి తీయుటలో ప్రవీణులు
సరస్వత గౌడ శాఖ
లేఖనము, (కావ్య ప్రబందాల రచన) కవిత్వము, ఆయుర్వేద శాస్త్రంలో ప్రావీణ్యులై, సర్వ సర్వ విద్యలందు విశేష ప్రజ్ఞా పాటవాలను సంతరించుకుని అందరకు ఫూజ్యులై కీర్తింపబడినవారు. కాల క్రమేణా వీరి శాఖీయులే ఆంధ్రదేశానికి వలస వచ్చారని ఆధారలను బట్టి తెలుస్తుంది.
ద్వాదశ ప్రకార – గౌడ వంశోత్పత్తి వర్ణన
ఏడు శాఖల వారేగాక పూర్వపు గౌడులు ఆధ్యాత్మిక చింతనతో మహర్షుల నాశ్రయించి వారికి శిష్యులై వారి వారి నామములతో గోత్రముల నేర్పరచుకొన్నరని, అలాంటివి పండెండు కలవని ఆ ఋషుల వారి శాఖల గౌడుల పేర్లు యీ క్రింది విధంగా వున్నవని ఆది గౌడ దీపిక యందు వర్ణింపబడి ఉంది.
శ్లోII 1. మండపాచల సాన్నిధ్యే మండపేశ్వర సన్నిధౌ I
గౌడస్తే పి చ మాండవ్య శిష్యా స్తే గురవః స్మృతాః II
2. మాండవ్యాస్త్రత శ్రీ గౌడా గురవః శంసిత వ్రతాః I
గౌతమో దత్తవాన్తేషాం గుర్వర్ధం తాన్ ఋషీన్ విభుః II
3. గౌడ తత్త చ శిష్యాన్వై గురవస్తే తపస్వినః I
శ్రీ హర్షేశ్వర సాన్నిధ్యే గ్గతవాన్ ఋషి సత్తమః II
4. గౌడా స్తస్యతు వై శిష్యా గుర్వర్థం సంప్రకల్పితః I
చతుర్థం తు సుతస్తస్య హారతాయ దదౌ పునః II
5. గృహీత్వా గతవాన్ సోపి దేశె హర్యాణకే శుభే I
హర్యాణశ్చైవ శ్రీ గౌడ గురుత్వే సంప్రణోది తాః II
6. దేశేర్యుదే మహారణ్యే వాల్మీకాశ్రమ సంజ్ణకే I
వాల్మీకాశ్చైవ గురవో మునినా సంప్ర కల్పితాః II
7. వాశిష్టా ఋషి శిష్యాశ్చ వశిష్టస్య మహాత్మ నః I
సౌర భేయే శుభే దేశే సౌరభా గురవః స్మృతాః II
8. అష్టమూర్తి సుతం తస్య దాలభ్యాయ దదౌ తతః I
తచ్చిష్యా శ్చైవ దాలభ్య గూరుత్వే తే ప్రకీర్తి తాః II
9. తత్తసేభ్యో దదౌ హంసాన్ శిష్యాంశ్చ యజనాని వా I
విప్రాస్తు సుఖదాశ్చైవ సుఖసేనా మహౌజసః II
10. దశమంత్రస్య పుత్రంతు భట్టఖ్యా మునయే దదౌ I
తన్ గురుత్వేన సంపాద్య భట్ట నాగర సంజ్ణ కాః I
11. ఏకాదశంతు సుతం తస్యా మాదురాయ దదౌ తతః I
సూర్య ద్వజాశ్చ తచ్చిష్యా గురుత్వే తే ప్రకల్పితాః II
12. ద్వాదశంతు సుతం తస్యా మాదురాయ దదౌ తతః I
మాధురీయశ్చ గురవో వర్తంతే బహవ స్మృతాః II
పై శ్లోకములో ముఖ్యంగా గౌడుల పర్ణనము మాత్రమే చేయబడింది. మండపాచల సమీపమున నున్న మాండవ్య ఋషి శిష్యులు-మాండవ్య గౌడులు. వీరిలో కొందరు లంబితా నగరంలో వుండుట వలన లంబితా గౌడులనియు, గౌతమ మహర్షి శిష్యులు – గౌతమ గౌడులనియు, సరయూ నదీ తీరవాసులగు శ్రీ హర్ష వంశధరులు - శ్రీహర్ష గౌడులనియు, హర్యానా దేశమున వున్న హరీత మహాముని శిష్యులు-హర్యాణ గౌడులనియు, ఆర్య దేశ మందలి మహారణ్యంలోనున్న వాల్మీకి మహర్షి శిష్యులు-వాల్మీకి" గౌడులనియు, వసిష్ఠ మహర్షి, వాసిష్ట గౌడులనియు, సౌరభేయ దేశమందలి సౌరభేయ మహర్షి శిష్యులు - సౌరభ గౌడులనియు, దాలభ్య ముని శిష్యులు దాలభ్య గౌడులనియు, భట్టుడను ముని శిష్యులు - భట్ట నాగర గౌడులనియు, సౌరభుని శిష్యులలో కొందరు సూర్యధ్వజ గౌడులనియు, మాధురుడను ముని యెుక్కశిష్యులు – మాధురీయ గౌడులనే ప్రసిద్ధ నామములతో యీ ద్వాదశ విధ గౌడులను పిలిచేవారు. హిందువులు హిందు దేశవాసులెట్లో అట్లే గౌడదేశ వాసులగుట వలన బట్టి గౌడులని పిలువబడారు[1].
మను ధర్మశాస్త్రము
[మార్చు]గౌడీ పౌష్ఠీ తథా మాధ్వి విజ్ఞాయా త్రివిధా సురా
యథైవైకా తథా సర్వా నపాతవ్యా ద్విజోత్తమైః
సుర-మద్యము, గౌడి-యనియు, పౌష్టి యనియు, మాధ్వియనియు మూడు విధములు దీనిలో ఏ ఒక్కటి గాని మొత్తము కాని బ్రాహ్మణోత్తములు (గౌడులు) త్రాగరాదు. గౌడ బ్రాహ్మణులు గౌడీ మద్యమునుగౌని, మాద్వీమద్యము (సారాయి) గాని, ఫైష్టి మద్యము (బ్రాందీ, విస్కీ మొదలైనవి) గాని త్రాగినచో తప్త – ఇనుపశలాకను కాల్చి వేయుట ద్వారాను మూడు దినములు పగలు మాత్రమే భోజను చేసి, మూడు దినములు రాత్రుల యందు మాత్రమే భుజించి, మూడు దినములు అడుగకుండ వచ్చిన పదార్ధములను మాత్రమే భుజించి, మూడు దినములు కేవలము ఉపవశించి వ్రతము చేయుట ద్వారాను, పరాక పై దాని వలనె ఇది కూడా ఒక కృచ్చ్ర వ్రతం దీని యందు నాల్గు దినములు నీరు కూడా త్రాగకుండా నిరాహారుడై ఉపవశించుట ద్వారాను, చాంద్రాయణం ఇది కూడా పై దాని వలనే చంద్రకళల వృద్ధి క్షయములను బట్టి ఆహాఅర కబళ వృద్ధి – క్షయములతో వ్రతమాచరించుట ద్వారాను ప్రాయశ్చిత్తము చేసికొనిన గాని సురాపాన దోషపు పాపము పోదు. అట్టి వారిని వెలివేసి సమాజములోనికి రానిచ్చెడు వారు కాదు.
గౌడరీతి లక్షణ గ్రంథముల వ్యాఖ్య
కావ్యాదర్శం కావ్యరీతి భేదేస్త్రీ
పదం సంఘటనా రీతి రంగ సంస్థా విశేషవత్ |
ఉపకత్త్రౌ రసాదీనాం సా పునః స్యాత్ చతుర్విథా |
వైదర్భీ చా ధ గౌడీ చ పాంచాలీ లాటి కౌ తధా విభజ్య |
గౌడీ రీతి యనునది కావ్యరీతి భేదములలో ఒకటిగా చెప్పబడింది. సంఘటనారీతి కలిగి రంగ సంస్థా విశేషా విషయకరమైన పదము రసాదుల కుపకారకమై వై దర్భీ, గౌడీ-పాంచాలీ-లాటిక అనే భేదాలతో నాలుగు విధాలుగా ఉంది.
సమాస బహుళమై సంఘటన యెుక్క ఆడంబరము కలిగి ఓజస్సును ప్రకాశింపజేయ వర్ణము కలది సమాన బహుళమైన రీతి గౌడి అనబడును. ఉదా:- చం చంద్భుజ భ్రమతి చండ గదాభి వాత
గౌడ జనులకు ప్రియమైన దగుట చేతను, గౌడ జనులు ప్రయోగించుట చేతను,ఆ రీతి ఒక ప్రత్యేకమైన ఆచరణీయ లక్షణమగుట చేతను గౌడియా రీతి అని పురాణ కావ్య గ్రంథములందు లాక్షిణికులు దీనిని ప్రత్యేకంగా గ్రహించుట జరిగింది[2].
బాలునికి ఆరవ - ఎనిమిదవ నెలలోగాని, బాలికకు ఐదవ - ఏడవ నెలలోగాని అన్న ప్రాశము చేయవలెను. అనగా ప్రథమాన్నభక్షణ సంస్కారము. తండ్రి మంచి లగ్నమందు సుస్నాతుడై (సుభ్రంగా స్నానమాచరించి) వృద్ధి శ్రాద్ధానంతరము, శుచి, అనే పెరు గల అగ్నిని స్థాపించి విరూపాక్ష జపం చేసి, కుశండిక అనే అగ్ని సంస్కార కార్యము చేసేవాడు. తరువాత ప్రకృత కర్మారంభంలో ప్రాదేశ ప్రమాణములైన నేతిలో ముంచిన సమిధలను అగ్నిలో హొమం చేసి నిర్వర్తిత మహావ్యాహృతి హవనుడై మంత్రోచ్ఛారణ పూర్వకంగా నేతిలో పంచాహుతి హోమం చేసిన పిదప పంచ ప్రాణ హోమము మహావ్యాహృతి హోమాలు చేసితిరిగి నేతిలో ముంచిన సమిధలమ హోమం చేసి ప్రకృత కర్మమును సమాప్తి చేస్తాడు, అటు తరువాత ఉదీచ్యమైన శాట్యాయన హోమం మొదలుకొని వామదేవ్యగానాంతముగ గల కర్మ చేసి మంత్ర పూర్వకంగా కుమారుని నోటిలో అన్నము పెట్టేవారు. తదుపరి పురోహితులకు దక్షిణ ఇచ్చేవారు. ఈ కార్యము బాలునకు ఆరవ నెలలోనే చేస్తారు. శూన్యధులు మొదలైనవి వదిలి శుక్లపక్ష తిథులయందు ఈ సంస్కారం చేయవలెనని మార్కండేయంలో ఉంది. చక్కగా నూతన వస్త్రలు, భూషణాలు అలంకారములతో సుసజ్జితుని చేసిన కుమారుని ఒడిలో కూర్చుండబెట్టుకొని దేవతా సమక్షంలో బంగారు పాత్రతో అన్నం తినిపించి తరువాత తేనె, నెయ్యి, బంగారము కలిపిన పాయసాన్ని పెట్టెవారు. ఈ ప్రకారముగా అన్నప్రాశన అయిన తరువాత కుమారుని తల్లి ఒడిలో కూర్చుండబెట్టి, దేవతా సాన్నిధ్యంలో సకల శిల్పకళాపదార్థాలు, శస్త్రాస్త్రములు, స్వర్ణాభరణాలు, గ్రంథములు వాటిని వ్రాయు గంటములను (కలము) అలంకరించిన స్థలము మధ్యలో బాలకుని వదలి, శిశువు స్వయంగా యే పదార్థాన్ని తీస్తాడో అదే అతని వృత్తి యగునని నమ్మి, దాని యందే ఆతనికి శ్రద్ధ కలిగే టట్లు చేసేవారు[1].
గౌడాభినందుడు
[మార్చు]ఇతని పూర్వులు గౌడ దేశ నివాసులగుటచే ఇతడు కాశ్మీరమున నున్న గౌడ విశేషణము యితనికి వచ్చింది. శక్తిపంతుడు గౌడ దేశము నుండి కాశ్మీరమునకు వలస వచ్చినవాడు. అతడి మనుమడు అయిన శక్తి స్వామి లలితాదిత్యనృపాలుని మంత్రులలో ఒకడు. ఆ రాజు శాలివాహన శకము 617 - 654 లోని వాడు. ఆ మంత్రి సంతతిలో అయిదవ వాడే ఈ గౌడాభినందుడు. ఇతడు గొప్ప సంస్కృత పండితుడు, కవి. ఇతడు రాజశేఖరునకు సమకాలీకుడు. బిల్హణ కవి యితనిని తన సూక్తి ముక్తావలిలో పేర్కొని యున్నారు. కావున ఇతడు శాలివాహన శకము 800 ప్రాంతం వాడగును.
ఇతడు బాణుని కాదంబరీ కథను గైకొని కాదంబరీ కథా సారమను పేర ఎనిమిది సర్గల పద్యకావ్యమును రచించెను. అభినవ గుప్తపాదుడు కథా తాత్పర్యమును సర్గ బంధముగా జేయుట ఉదాహరణగా దీని పేరెత్తి యిది భట్ట జయంతునిది అనెను. అభినందుడు అనుటకు బదులుగా యితని తండ్రి పేరు పొరపాటుగా పేర్కొన్నాడు అనుట నిజము. ఏమనగా క్షేమేంద్రుడు తన సువృత్త తిలకములో - కథా ప్రనంగే యథాభినందస్య అని యీ కథాసారమునే స్మరించెను. ఈ కవి సరిగా బాణుని గద్యము అనుసరించి ఈ కృతి నిర్మించేననుటకు ఉదాహరణ.
తస్యాం నిజ భుజోద్యోగ విరాజితారాతి మండలః I
అఖండల ఇవ శ్రీమాన్ రాజా సూద్రక ఇత్యభూత్
అని పేర్కొనియుండెను. ఇది సంస్కృతకవి జీవితము బ్రహ్మశ్రీ మల్లా సూర్యనారాయణ శాస్త్రి గారిచే రచింపబడిన గ్రంథము నుండి గ్రహింపబడింది. గౌడ పాద పర్వతము: ఋగ్వేదము 10-75లోను, ఐతరేయ బ్రాహ్మణము 8 – 14 - 4 లోను, బృహద్ధర్మ పురాణము 22వ అధ్యాయంలోను గంగానది ప్రశంస, దాని గమనాదులు వివరింపబడ్డాయి. అరుణోదయ దేశం (ఇప్పాటి గడవాల్ సంస్థానం) లోని గంగోత్తరీ అనబడే చోట గంగా భగీరథీ దేవస్థానముంది. దీనిపైన కొంచెం దూరంలో పాండవుల నివాస క్షేత్రం ఉంది. ఇదే పాండవుల చివరి నివాస స్థానం గాని, యిచ్ఛటి నుండియే ద్రౌపదీ సమేతంగా ధర్మరాజాదులు స్వర్గారోహణ చేసినట్టు చెప్పబడింది. ఇచ్చటి పర్వత పంక్తికి రుద్ర హిమాలయమని పేరు. ఇందుల్‘ ఐదు శిఖరాలున్నాయి. అవి రుద్ర హిమాలయ శిఖరము, బ్రహ్మ శిఖరము, విష్ణుఫురి శిఖరము, ఉద్గురు కాంత శిఖరము, స్వర్గా రోహణ శిఖరము అనునవి. ఈ ఐదు శిఖరాలతో కూడిన రుద్ర హిమాలయ పర్వత పంక్తి ధనురాకారంగా వంగి మధ్యలో పలమేర్పడి ఉండుట వలన అది మంచుచే కప్పబడి గ్లేసియర్ నయి మెల్లగా కరుగుచు నీరుగా జారి యిపతల వైపున హద్దుగా గట్టువలె నేర్పడి నిలచి, గోపురాకారంగా నున్న గోముఖ పర్వతం ముఖము వలె వున్న దారి నుండి గోముఖమునందు గల నోతి యందుగల రంథ్రాకార మార్గం గుండా జారి ఇవతలకు జలపాత రూపంగా భయటపడి చిన్న ప్రవాహంగా నడుస్తుంది. ఇదే భాగీరథీ గంగా ప్రారంభ స్థితి. ఈ హిమనిలయానికి బిందు రూప సరస్సని పేరు. ఇక్కడ బంగారు, పసుపు పచ్చ, ఊదారంగు పూలు ఉండేవని వాటిని తామర జాతి పూలని పోల్చారని చెప్పబడింది. ఇచ్చటనే రుద్ర హిమాలయ పర్వత శిఖరంగా ఏర్పడియున్న మరొక చిన్న పర్వతానికి గౌడ పాద పర్వతమని పేరు. దీని వద్దనే గంగోత్తర దేవాలయం ఉంది. గౌడ పాద పర్వతాన్ని చుట్టి నడిచి తదుపరి కేదార గంగయనే వేరొక ప్రవాహం భాగీరథిని తాకుతున్నట్టు దానికి మిక్కిలి సమీపం నుండి నడుస్తుంది. ఇక్కడే భగీరథుడు గంగ కోసం తపస్సు చేసిన చోటని చూపిస్తారు. మన భరత ఖండంలో ఎందరెందఠో మహానుభావులు ఆవిర్భవించారు. భగవంతుని సృష్టిలో కొందరు కొన్ని పనులే చేయడానికి సృష్టించబడతారనేది పరమ సత్యం. అనాదిగా మన గౌడ వంశీయులు సారస్వతాభిమానులై సాహిత్య కళామతల్లికి ఎనలేని సేవ చేసి కృతార్థులుగా చిరంజీవులై నిలిచారు. పైన వివరించబడిన పరమ పవిత్ర గంగాముఖ ద్వారమున గల గౌడపాద పర్వతంపై ద్వాపర యుగారంభంలో తపమాచరించి సిద్ద్ధి పొందిన దివ్య అవతారుడు మన గౌడపాదాచారులవారు. గౌడవంశీయులు అందరకు ప్రాతఃస్మరణీయుడు, ఆరాధ్యుడైన యీమహనీయుని గురించి మన వారి కంతగా తెలియక పోవుటకు కారణం ఆయన సాహిత్య పరంగా చేసిన కృషి అంతా సంస్కృతంలో నిక్షిప్తమై యున్నందున దీనిని పరిశోధనాత్మకంగా చూచిన గాని లభించుట అత్యంత దుర్లభం. ఈయన సనాతన ధర్మపు విలువలను ప్రచారం చేస్తూ ఉపనిషత్ ప్రామాణ్యాన్ని నమ్మినవాడు. ఈయన జీవిత చరిత్రను సేకరించుట అత్యంత క్లిష్టమైనా చివరజు తదేక దీక్షతో కాశీ హిందూ విశ్వవిద్యాలయ గ్రంథాలయం, కలకత్తాలోని నేషనల్ సెంట్రల్ లైబ్రరీ, మద్రాసుల్‘ని కెన్నమెరా లైబ్రరీ, గోరఖ్పూరు గీతా ప్రెస్‘ మొదలగు అనేకానేక గ్రంథాలయాలు దర్శించి సంక్ష్లిప్తంగా నై నా కొంత విషయం సేకరింప గల్గినందుకు సంతోషిస్తున్నాను. నా పరిశోధన మూలంగా ప్రాచీన గౌడుల చరిత్ర సేకరించి మీకు అందించగలిగినందుకు నా శ్రమ ఫలించినట్టుగా భావించి ఆనందిస్తున్నాను.
గౌడపాదుని జననము
[మార్చు]నర్మదానదీ తీరంలో నున్న సుఖ దేవర్షి ఆశ్రమ సమీపంలో వున్న భూపాల గ్రామంలో విష్ణు దేవుడను మహాత్ముడు గుణపతియను సాధ్వీమతల్లిని వివాహమాడి యుండెను. ఈ పుణ్య పురాణ దంపతుల నోమ్ముల పంటయే మన గౌడపాదుడు. ఈయనకు తండ్రి సుఖదత్తు డని నామకరణం చేశాడు. ఈ సుఖదత్తునకి తండ్రియే గురువై బాల్యమునందే సకల శాస్త్రాలు బోధించాడు. యుక్త వయస్కుడైన పిమ్మట తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేశారు. కాని పరచింత నాభిలాషియైన సుఖదత్తుడు వివాహానికి అంగీకరించక ఇంటి వద్ద ఉంటే వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేస్తారని తలచి మాతృదేశమైన గౌడదేశం వెళ్ళి అక్కడ వున్న వేదాంత శిరోమణియైన జిష్ణు దేవుండనే తపస్వి నాశ్రయించి ఆయన గుహాముఖంబున ఆయన దయను కోరి దీర్ఘకాలం తపస్సు చేశాడు. సుఖదేవర్షి ఆశీర్వాద బలంతోనే యీ మహామహుడు ఉదయించాడు. ఈయన తండ్రి విష్ణుదేవుడు సుఖదేవుని గురువుగా ఆరాధించే వారు. ఆ కారణంగానే తండ్రి ఈయనకు సుఖదత్తుడని పేరు పెట్టాడు. ఈయనలోని పరమార్థ చింతనకు, ఈయన ఏకాగ్ర, నిష్కపట పూర్వకంగా జపించి తపస్సిద్ధిని పొందగా ఆయనకు - గౌడ పాదుడ నే పేరు పెట్టాడు. పాదుడనగా నెలకొన్నవాడు, నిలచిన వాడు. గౌడజాతి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టువాడని అర్ధము. ఈ పేరుతోనే ఈయన ప్రసిద్ధుడయ్యాడు[1].
ఆధ్యాత్మిక దివ్యానుభవ సంపత్తిని తన సొమ్ముగా చేసుకున్న ఈ మహనీయుడు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించి నిత్యము పరదేవతారాధన చేస్తుండేవాడు. కొంతకాలనికి ఆయన అమోఘ తపశ్శక్తి ఫలితంగా జగజ్జనని దివ్య సాన్నిధ్య సాక్షాత్కారాన్ని పొంది తన మహిమ వలన శంకర భగవత్పాదులకు దేశికుడైన గోవింద భగవత్పాదులవారికి గురువై మహోన్నత శిఖరాన్నధిరోహించాడు. తరువాత ఈయన గంగోత్తరకి పశ్చిమ దిశగా నున్న పర్వతాగ్రం మీద తపస్సు చేసి సిద్ధుడైనందున ఆ పర్వతానికి గౌడపాద పర్వత మనే పేరు వచ్చింది. ఈ విషయాలన్నీ హు ఆన్ చ్యాంగ్‌కు పూర్వుడగు భావనివేకుడనే పండితుడు రచించిన తర్కజ్వాల అనే గ్రంథంలో సా.శ. 550 వ్రారి ప్రాంతమున నున్న గౌడపాదుని కారికల (సూత్రాది వివరణ శ్లోకములు) లో ఉద్ధ్రుతములని వ్రాయబడింది. ఈయన పాండవ వంశోద్భవుడైన పరీక్షిన్మహారాజకు శ్రీ మద్భాగ వతాన్ని అద్వైత బ్రహ్మతత్వంగా ఉపదేశించాడు. శ్రీ శంకర భగవత్పాదులకు గురువైనందున ఆయన గౌడు పాదు నెల్లప్పుడు - వేదాంత విద్యభిరాచార్వై అని స్మరించేవాడు.
ద్వాపర యుగారంభం నుండి హిమాలయములందు సమాధి అవస్థలో వుండుట వలనను, ఆయనను గురించిన ప్రచారం లేనందు వలనను, ప్రజలాయనను మరచి పోయివుందురని తలంపవలసి వేస్తుంది. జగద్గురువు ఆదిశంకరులు తన - రత్నమాలాస్తవ మనే గ్రంథంలో తన గురువగు గౌడపాదునికి గ్రీకు దేశీయులతో సంపర్కముండేదని, యాయనకు ఆపోల్‘నియస్ అనే త్యానా దేశపు రాజకుమారుడు శిష్యుడుగా వుండేవాడని వ్రాశాడు. శంకరులకు గౌడపాదుడు ఆరాధ్య దేవుడు. గౌడపాద విరజితములైన అద్వైత సిద్ధాంతాలనే శంకర భగవత్పాదులు సమన్వయ పరచుకొని, స్వంతము చేసుకుని అద్వైత మతస్థాపనాచార్యుడయాడు. గౌడ పాదీయ దర్శన శాస్త్రమే యీ మతానికి మూలాధారం. ఈ కారణంగానే శంకరాచార్యులు గౌడపాదుని పరమ గురువుగా పూజించేవాడు.
ఈయన ఉపనిషత్తుల ప్రామాన్యాన్ని నమ్మి వాటిలో చెప్పబడిన ధర్మాలన్ని నిత్య నైమిత్తిక కార్యాల్లో ప్రవేశపెట్టి తూ.చ. తప్పకుండా ఆచరించేవాడు. కాని బౌద్ధ సిద్ధాంతాలు ఈయన బుద్ధికి ప్రతిపన్నాలుగా కనిపించేవి. విజ్ఞన వాదం, శూన్యవాదాదులను, అకుంఠిత తర్క విజృఁభణములైన వాటిని త్రోసివేయరదని, వేదాంతి ఎవడును ఉపనిషత్తులకు విరుద్ధంగా నున్న సిద్ధాంతాల్ని అంగీకరింపలేదని వాదించేవాడు. తన కారికలలో గౌడ పాదుడు ఉపనిషదనుయాయులు తర్క సహాయంతో వేదాంత వాక్యాల్ని అనుసంధానం చేసి వాటి నుండి చేసిన నిగమములు బౌద్ధ దార్శినికులను భాధింపనని చూప ప్రయత్నించాడు. సత్యము - సత్యాన్ని బాధింపదని ఆయన విశ్వాసం. ఐతరేయ, తైత్తరీయ, బృహదారణ్యకాల ఆధారం పై ఆత్మ )అనగా విజ్ఞనం) ఒక్కటే సత్తు అనియు, అదియే తన మాయచేత భేదాల్ని కల్పించుకొని తనకుతానే యెరుకపడుచున్న దనేది గౌడపాదుని సిద్ధాంతం. స్వప్నముచే మాయ చూడబడినట్లు, వేదాంతంచే యీ విశ్వం చూడబడిందని, స్వప్న పదార్థాల అభావాన్నిశ్రుతి చెప్పింది. నానత్వమనేది ఇక్కడ లేశమాత్రం కూడా లేదు. ఒకటియే మాయచే అనేకంగా కన్పిస్తుంది. అజాయమన (పుట్టనిది) మగునదియే మాయచే అనేకంగా జాయమన (పుట్టినది) అగుచున్నదని శాస్త్రం చెప్తుంది. ఇదంత ఎక్కణ్ణుఁచో వచ్చింది కాదు. మార్పు చెందిందేమి లేదు. అనేది సంభమగుట (మార్పు కార్యవర్గము) శ్రుతి చేత ప్రతిషేధింపబడింది. ఇది కాదు - ఇది లేదనేది అగ్రాహ్యమవడం వల్ల ఆత్మ యందు భావాల్ని నిషేధించే దాని అజత్వాన్ని (పుట్టుకలేని తనాన్ని) శ్రుతి విపులీకరించి ప్రకాశవంతంగా చేసింది. సత్తు అనేది నిజంగా పుట్టదు. మాయచేతనే అది పుడుతుంది. స్వప్నావస్థలో ఒకే మనస్సు రెండుగా అయినట్లు నిద్రావస్థలో కూడా అదే ద్వయము (గ్రాహ్య – గ్రాహక రూపం) గా భాసిస్తుంది. కాబట్టి దీని సారంశమేమనగా జీవుడనే వాడెవడు పుట్టలేదు. బంధనంలో కూడా ఎవడూ లేడు. (దీన్ని అజాత వాదమంటారు) సాధనా లేదు – ముక్తి లేదు. అందువల్లనే జీవాత్మల అనన్యత్వం ప్రశంసింపబడి నానాతత్వం ఉపనిషత్తులచే నిందింపబడింది. వేదపారగులు, వీత రాగ భయ క్రోధులు అగు మునులచే ప్రపంచ ఉపశమనము, అద్వయము, నిర్వికల్పమైన ఆత్మ చూడబడింది. ద్విపదాంపరుడైన బుద్ధుడు, బౌద్ధ అద్వయ వాదులీ అజాతీ వాదాన్నే ఖ్యాసించారు. కనుక వేదాంతులమైన మాకు వారితో మాకు వివాదం లేదని గౌడపాదుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గౌడపాదుడు శంకరుల గురువైన గోవింద పాదులకు ఆచార్యుడని నిర్ణయింపబడింది. ఈయన సా.శ. 17వ శతాబ్దం చివర 18వ శతాబ్దం ప్రాఅరంభంలోని వాడని చరిత్ర కారులు నిర్ణయించారు. గౌడపాదుని మాండూక్యోపనిషత్ కారికల భాష్యానికి టీకా రాస్తూ ఆనందగిరి అనే అతడు శ్రీ గౌడా పాదాచార్యుల వారా పూర్వపు దినాల్లో నరనారాయణుల వాసస్థానమైన బదరిక ఆశ్రమంలో భగవధ్యాన నిమగ్నుడై తపస్సు ఆచరించారని, నారాయాణుడు ఆయన భక్తికి సంతోషించి ఉపనిషత్ప్రతి పాదకమైన బ్రహ్మజ్ఞాననుభూతిని ప్రసాదించెనని రాశాడు. బాలకృష్ణానంద సరస్వతి 17వ శతాబ్దంలో తాను రచించిన – శరీరక మీమాంసా వార్తికమున గౌడపాదులను గూర్చి – కురుక్షేత్రమనే దేశంలో హీరావతి (హిరణ్యవతి) నదీ తీరమున గౌడులనే ప్రసిద్ధికెక్కిన ఒక జాతి ప్రజలు సురాకరణ వృత్తిచే నివసిస్తూ ఉండేవారని వారి వంశీయుడైన శ్రీ గౌడ పాదాచార్యుల వారు ద్వాపర యుగారంభంలో గొప్ప తపస్సు చేశాడని రాశాడు[2].
మాండూక్యోపనిషత్తు
[మార్చు]గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వారు ప్రచురించిన మాండూక్యోపనిషత్ గ్రంథ భూమికలోని కొంత హిందీ భాగానికి నా ఆంధ్రానువాదం యీ క్రింది విధంగా ఉంది. మూండూక్యోపనిషత్తు అనేది అధర్వ వేదీయ బ్రాహ్మణ భాగ అంతర్గతమైనది. ఇందులో 12 సూత్రాలున్నాయి. గ్రంథ పుటలను బట్టి ఇది ఉపనిషత్తులు అన్నిటి లోను చిన్నది. కాని దీని మహత్వం దేనికీ తక్కువ కాదు. భగవాన్ గౌడ పాదాచార్యులు దీనికి కారికలు రాసి దీని మహత్వాన్ని ఇంకా ఎక్కువ ఇనుమడింప చేశాడు. కారికాలు – శంకర భాష్య సహితమైన ఈ ఉపనిషత్తు అద్వైత సిద్ధాంత రసికులకు పరమ ప్రమాణ ఆదరణీయ గ్రాంథం. కారికలను అద్వైత సిద్ధాంతం ప్రథమ నిబంధనమని చెప్పారు. ఈ గ్రంథాధారంతోనే భగవాన్ శంకరాచార్యులు అద్వైత మందిరాన్ని స్థాపించాడు. ఎందుకనగా అద్వైత సిద్ధాంతం అనాదికాలం నాటిది కనుక దానికి సాంప్రదాయక మతవాద రూపం ప్రాప్తించింది. దీని ప్రధాన శ్రేయస్సు ఆచార్య వర్యుడైన భగవాన్ శంకరునిది. దాని మూల గ్రంథం గౌడ పాదీయ కారికలు. కారికా కారుడైన భగవాన్ గౌడ పాదాచార్యుని జీవితము, ఆయన ఆయన జీవిత కాలము విశేషాలు కొంత వరకు పైన వివరించాను. బెంగాల్ యందు వేదాంత దర్శనేర ఇతిహాస అనే గ్రంథం రాసిన శ్రీ ప్రజ్ఞానానంద సరస్వతి స్వామీజీ అను అతడు గౌడపాదుడు – గౌడ దేశీయుడు (బెంగాలీ) అని వ్రాశాడు. ఈ విషయంలో దానిలో నైష్కర్మ్య సిద్ధికారుడు భగవాన్ సురేశ్వరాచార్యుని యీ క్రింది శ్లోకం ప్రమాణ పూర్వకంగా గ్రహింపబడింది.
ఈ ప్రకారంగా సాక్షాత్తు భగవంతుడే అజ్ఞానోపాధికుడై అహంకారాదుల సాక్షి (జీవుడు) అయి ఉన్నాడు. ఆ పరమార్ధ తత్త్వాన్ని మన పూజనీయ గౌడదేశీయ ద్రవిడ దేశీయ ఆచార్యులు వర్ణించారు. ఇక్కడ గౌడ దేశీయ ఆచార్యుడు గౌడ పాదాచార్యుల వారిని, ద్రవిడ దేశీయ ఆచార్యుడు శ్రీ శంకరాచార్యులు వారని చెప్పబడింది. గౌడ పాదాచార్యుడు వివాహాన్ని త్యజించి సన్యాసి అయ్యాడు. ఈయన శిష్యుడు గోవింద పాదాచార్యుడు. గోవింద పాదాచార్యుని శిష్యుడు భగవాన్ శంకరాచార్యులు. శాంకర సంప్రదాయంలో ఏ ఆచార్యుడు వందనాత్మక మంగళాచరణ ప్రసిద్ధుడో అందులో ఆరంభం నుండి శ్రీ పద్మపాదాచార్యాది భగవాన్ శంకరుని శిష్యపర్యంతం యీ సంప్రదాయం ఆచార్యులు శిష్య పరంపర యీ విధంగా చెప్పబడింది.
నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ I
వ్యాసం సుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యమ్ II
శ్రీ శంకరా చార్య మధాస్య పద్మపాదం చ హస్తా మలక్ చ శిష్యమ్ I
తం త్రోటకం వార్తిక కార మన్యాస న్మద్గురూన్ సంతత మానతోఃస్మి II
శాంకర సంప్రదాయ యందు శాస్త్రాధ్యయానికి పూర్వం ఆచార్యుడు – శిష్యగణం ఈ మంగళాచారణం పఠిస్తారు. దీని వలన శ్రీ గౌడ పాదాచార్యుడు భగవాన్ సుకదేవర్షి శిష్యుడని మనకు తెలిసినదే. భగవాన్ గౌడపాదాచార్యుని గ్రంథములందలి ఆయన కారికలు జగత్ప్రసిద్ధములైనవి. ఈయన భాష్యం రాసిన మరొక గ్రంథం ఉత్తర గీత. దీన్ని వాణీ విలాస్ ప్రెస్, శ్రీరంగం వారు ప్రచురించారు. ఆ భాష్యంతో ఆయన మహాయోగి అని స్పష్టపడుతుంది. ఇవి గాక యీయన వ్రాసిన మరొక గ్రంథం సాంఖ్య కారికల భాష్యం కూడా ప్రసిద్ధమైనదే. గౌడ పాదకృతమైన యీ కారికలు గొప్ప ఉదాత్తము మర్మస్పర్శిని యైనవని యీయనను ప్రపంచ అందలి సర్వోత్కృష్ణ సాహిత్యమందు గణన చేశారు. ఏ విధంగా శ్రీ మద్భగవధీత విషయంలో
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః
అని నిర్ణ్యించబడిందో అదే విధంగా అద్వైత బోధ కొరకు యీ గ్రంథ రత్న మొక్కటియే శరణ్యము. ఇందులో సాధన, సిద్ధాంతం, పరమత నిరాకరణ, స్వమత సంస్థాపనాదులన్నింటిని శాస్త్ర సమ్మతంగా, యుక్తి యుక్తంగా వర్ణించారు. ఈ గ్రంథ మొక్కటియే ముముక్షువులన్ను పరమపదాన్ని పొందేటట్లు చేస్తుంది.
ఇందులో మొదటిది – ఆగము ప్రకరణము – ఈ ప్రకరణలో సత్వరూపాన్ని గూర్చి వ్రాయబడిన తన భావాన్ని శృతి సమ్మతం సహేతుకమని నిరూపించాడు.రెండవది – వైతథ్య ప్రకరణము – ఇందులో తర్కవితర్కాల ద్వారా నానాత్వంతో గూడిన ప్రపంచ వైఖరిని – సుఖ దుఃఖాలను వివరించాడి.
మూడవది – అద్వైత ప్రకరణం – ఇందులో జీవోత్పత్తి, ఆత్మ అసంగత్వము, అత్మైకత్వ సమీక్ష, స్వప్న – జాగృతులు, తత్త్వబోధ, శాంతవృత్తి స్వరూపం, సుషుప్తి, సమాధుల భేదం, బ్రహ్మ స్వరూపం, మనోనిగ్రహాదుల వివరణ ఉంది. నాల్గవది – అద్వైత దర్శన, ద్వైత వాదుల పారస్పరిక విరోధము, జీవుని జనమరణాదులను గుర్తించుటలోని దోషము, అజాతవాద నిరూపరణ, బాహ్యర్థ వాద నిరూపరణ, విజ్ఞానవాదన ఖండన, ప్రపంచం అసత్యత్వ హేతువు, స్వప్నం మిధ్యాత్వ నిరూపణ, సన్మార్గ గాములైన ద్వైత వాదుల గతి, పరమార్ధవస్తువేది? ఆత్మ యందు కార్య – కారణ భావమెందుకు అసంభవము, హేతు ఫల భావ6 అభినివేశం ఫలము, ఆత్మ స్వాభావిక స్వరూపాదుల గురించి వ్రాశాడు. కొరివి కట్టెను చేత్తో గుండ్రంగా త్రిప్పితే ఏ విధంగా నిప్పు గుండ్రని వలయాకారంగా గల చక్రంలా కనిపిస్తుందో అదే విధంగా ప్రపంచ వ్యవహారమంతా అనగా జనన మరణాదులు, మాతా పితాది బాంధవ్యజనము, హితులు, అహితులు మొదలైనవన్నీ భ్రాంతియని వివరించాడు.
1.పైన వివరించిన ఉత్తర గీతాదుల భాష్యం, 2. నృసింహ తాహినీ ఉపనిషత్తు, 3. దుర్గా సప్తశతికి టీకా, 4. శుభగోదయమనే శాక్తేయ గ్రంథము, .5 శ్రీ విద్యారత్న సూత్రము.
ఈ రచనకు ఆధారాలు విధురేశ్వర భట్టాచార్య గౌడపాదీయ ఆగమ శాస్త్రము T.M.P. మహాదేవన్ కృత ఫిలాసఫి ఆఫ్ గౌడపాద పండిత గోపీనాథ కవిరాజ కృత బ్రహ్మసూత్ర శాంకర భాష్యపు భూమిక.
గౌడ డిండిమ భట్టు చరిత్ర
[మార్చు]గౌడ దేశ ప్రజలందరూ సురాకరణ వృత్తి చేయుచు మాతృదేశనామంతో గౌడులుగా ప్రసిద్ధి చెందారు. వారిలో వేద-శాస్త్ర-పురాణేతిహాసాదులు నేర్చిన వారు బ్రాహ్మలుగా పిలువబడేవారు. నేటి ఆధునిక సమాజంలో క్షత్రియ బ్రాహ్మణులు, కమ్మ బ్రహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు (కంసాలి) మొదలగు వారు కుల వృత్తితో పాటు పౌరోహిత్యది కార్యక్రామాలు చేస్తూ బ్రాహ్మణులుగా పరిగణింప బడినట్లు ఆనాడు కూడా చదువబడిన వారు ఎల్లరు బ్రాహ్మణులుగా గణింపబడ్డారని తెలియచున్నది. ఈ డిండిములు నలుగురుండేవారు. వీరందరూ కవిసార్వభౌములే. 2వ డిండిమభట్టు యోగానంద ప్రహసన మనే ఒక రూపకం వ్రాశాడు. అందులో తన వంశం గురించి యీ క్రింది విధంగా వ్రాసుకున్నాడు.
అస్తి ఖలు గౌడేషు పరియేంద్ర పురాగ్రహార నాయక మణేః సామవేద సాగర సాయాంత్రి కస్య, అష్ట భాషా కవితా సామ్రాజ్యాభిషిక్తస్త బళ్ళాళ రాయ కటక కవికుల గర్వ పర్వత పదేః నాగణకవి గజకేసరణః శ్రీ కవిప్రభోః పౌత్రః పుత్రశ్శ్రీ రాజనాథ దేశీకస్య, బ్రహ్మాండ భాండ పిచండ మండలిత విజయ డిండిమ చండిమ్నః, శ్రీ కంఠాగమ శిఖండ మండన మణేః శ్రీ డిండిమ ప్రభోర్దౌహిత్రః శ్రీ మదభిరామ నాయకాస్తనంధయః, సభాపతి భట్టారకాచార్య భాగినేయః, శ్రీ డిండిమ కవిసార్వభౌమ ఇతి ప్రధిత బిరుదాంకిత నామధేయః, సరస్వతీ ప్రసాదలబ్ధ కవితాసనాథః; శ్రీ మానరుణ గిరినాథః తేన కృతేన యోగానంద నామ్న ప్రహసనే సభానియోగ మని తిష్టామి- నీయోగానంద ప్రహసన కర్త డిండిమ కవిసార్వభౌముడని, బిరుదాంక అను పేరు గల అరుణ గిరినాథుడను గౌడ బ్రాహ్మణుడని తెలుస్తున్నది. అతని తండ్రి కవి ప్రభుడని, అతడు బల్లాళ (దోరసముద్రము) రాయస్థాన కవీస్వరుల గర్వమును అనిచిన వాడని, నాగణ అను కవీశ్వరుడుని ఓడించిన వాడని, తండ్రి రాజనాథ దేశీకుడని, మాతామహుడు (తల్లి, తండ్రి) డిండిమ ప్రభుడని, అతడిని విజయ డిండిమము గల వాడని, శైవ వేద పారాంగతుడని, తల్లి అభిరామ నాయక అని, మేనమామ సభాపతి భట్టారకాచార్యుడని విశదమగుతుంది. శ్రీ కంఠాగమ పారంగతుడై విజయడిండిమము ఆర్జించిన మాతామహుని వద్ద నుండి యీ యోగానంద ప్రహసన కర్తకు డిండిమ కవి సార్వభౌమ బిరుదు, విజయ డిండిమమును లభించినవి. ఇతని పితామహుడే ప్రఖ్యాత కవీశ్వరుడుగా కీర్తించబడ్డాడు. తండ్రి అంతటి వాడు అని మాత్రం కాలేకపోయాడు, పై రూపకుములో కొన్ని చోట్ల అప్పటి రాజు దేవరాయలు అని తెలియచున్నది. భరతవాక్యమున – దీర్ఘాయుర్దేవరాయో దధతు వసుమతీ చక్రమాచంద్రతారకమ్ అని ఉంది. కనుక ఇతడు దేవరాయలు అను పేరు గల విద్యానగర ప్రభువు ఆస్థానమున ఉండినట్లు నిర్ధారింపబడింది. దేవరాయలు అను పేరు విద్యానగరంన అనేక మంది ప్రభువులకు ఉన్నప్పటికీ, ద్వితీయ హరిహర రాయల కుమారుడైన దేవరాయలందు, తరువాత అతని మనుమడు అయిన దేవరాయలందును గట్టిగా కనబడుతుంది. రెండవ దేవరాయలకు ఇమ్మడి దేవరాయలని, ప్రౌఢ దేవరాయలని, ప్రతాప దేవరాయలని, నామాలు ఉన్నాయి. యోగానంద ప్రహసనములో పేర్కొనబడిన ఇద్దరి రాయలలో ఎవరో ఒకరు దేవరాయలలో ఒకరు అయి వుండవలెను. రెండవ దేవరాయలు కాదు అనుటకు ఒక ఆధారము ఉంది. సంస్కృతములో నిమ్మది దేవరాయలు రచించినట్లు అతని పేర మహానాటక సుధానిధి అను ఒక ఇంపైన కావ్యముంది. అందులోని యీ శ్లోకం చూడండి[1].
శ్లోII అగ్రే డిండిమ తాడనం తత ఇతో వంది ప్రజోద్ఘోషణం
ద్విత్రాశ్చిత్ర పటాః కిం యతి బిరుద ప్రోతాని పద్యాని నఃII
అస్థాంతావ దిదం మహేశ మకుటీ కోటీర కల్లోలినీ
కల్లోల ప్రతిమల్ల సూక్తి విభవైర్ధ్వ్యేష్యా న్విజేష్యా మహేII
దీని వలన నిమ్మడి దేవరాయల కాలములో డిండిమ భట్టారకుడు ఉండినట్టు తెలియచున్నది. అరుణ గిరినాథునకి రాజనాథ దేశీకుడు అను కుమారుడు కలడు. ఈతనికి డిండిమ కవి సార్వభౌము డని బిరుద నామము సంక్రమించింది. ఈతడే సాళ్వాభ్యుదయ అను పదనాల్గు సర్గముల మహాకావ్యమును రచించాడు. క్రీ.త. 1490 ప్రాంతంలో విద్యానగర రాఅజ్యాన్ని వశపరుచుకుని పాలించిన సాళ్వగుండ నరసింహరాయల ప్రభావము ఇందు వర్ణింపబడింది. ఈ కావ్యంలోని ప్రతి సర్గాంతంలోను గద్యములు భేదించుచున్నవి. వాటిలో కొన్ని యీ క్రింది విధంగా ఉన్నాయి. 4వ సర్గ – బిరుదకవి ప్రపితామహ, 5వ సర్గ – దశరూపనారాయణ బిరుద మండన, 6వ సర్గ – ర్సిక కవితా సామ్రాజ్య లక్ష్మీపతి, 8వ సర్గ – నవనాటక భరతాచార్య, 10వ సర్గ – కవి మల్ల గల్ల తాడన పటు, 11వ సర్గ – ప్రటిభట కవికుంజర పంచానన బిరుద మండనన, 12వ సర్గ – చేర – చోళ – పాండ్య – ప్రథమారాధ్య హృదయ శివాభిఖ్య డిండిమ కవి సార్వభౌమ బిరుద శోణాధి నాథాత్మజ, 14వ సర్గ ద్వాదశ దేశ్య వృత్తిపార దృస్వశోష్టభాషా పరమేశ్వరస్యాభి నవనాటక భవభూతేర్మాఘాద్యతి వర్తి చిత్ర ప్రబంధ పరమేశ్వర స్యాష్ట దిగ్విజయ పటిహీకృత బిరుద డిండిమాడంబరస్య, షడ్దర్శసన షణ్ముఖస్య, శైవ శాస్త్ర జీవాతొ రఖిల వేదసాగర, సాయాంత్రికస్య – డిండిమ కవి సార్వభౌమ ఇతి కృతాపర బిరుద నామ్నః శ్రీమదరుణ గిరీశస్య తతః పాకస్య డిండిమ కవి రాజనాథస్య కృతౌ శ్రీ సాళు సాభ్యుదయే – ఇతడు గద్యములందు ప్రపితామహుని, తర్వాత తండ్రిని, ప్రఖ్యాత కవీశ్వరులను వర్ణించెను కాని పితామహుని పేర్కొనలేదు. ఈయన తండ్రి అయిన అరుణ గిరినాథుడుని తన ప్రహసనమున పితృనామస్మరణము మాత్రం కావించెను. కాని అతడు విద్వాంసుడని వర్ణింపలేదు. తన తండ్రియగు 2వ డిండిమ భట్టరకుని పాండిత్య ప్రభావమును అతడు గద్యములందు మిక్కిలిగా కీర్తించెను. తత్తద్విషయములు తెలుగున వివరి6చుట చర్విత చర్వణమగునని వదలెను. చేర-చోళ-పాండ్య దేశములందాతడు పరమారాధ్యుడట! అష్టభాషా పరమేశ్వరుడట ! అష్ట దిగ్విజయ పటహమగు బిరుద డిండిమాడంబరము గలవాడట! సాళ్వాభ్యుదమును రచించిన యీ మూడవ డిండిమ భట్టారకుని కుమారుడు అరుణ గిరినాథుడు. ఇతనికి కుమార డిండిమ డని బిరుదు గలదు. వీర భద్ర విజయమను పేరుగలా డిమము నీతడు రచించాడు.
సూత్ర – శ్రుణు తావత్ సంతి ఖలు సంతత శివలింగా రాధన ప్రతినో, గంగాతటాలంకార గౌడ దేశ చూడావేడా పరేంద్రాగ్రహార నాయక మణయః శైవాగమ జీవాతవః, చేర-చొళ-పాంద్య శ్యకుల సంస్కృత మహిమానస్స్సామ వేద సీమానః I శ్రౌతాచార పూతాత్మనః, పవిత్రతర గౌతమ గోత్ర జన్మానో, ద్విజన్మానః... తదన్వ వాయార్ణవ పూర్ణ చంద్రస్య నాగణకవి గజ కేసరిణః, సరస కవితా సామ్రాజ్యానుభోగ సార్వభౌమస్య, కవి ప్రభోః వృత రాజన్య పౌత్రః, పరమ మహేశ్వరస్య, పవిత్ర తర చరిత్రస్య, శివ తత్త్వ జ్ఞాన శీలస్య శ్రీమతో రాజనాథస్య పురాతన పుణ్య పరిణామస్య మభూద బిరుద కవి పితా మహాస్య, బిరుద డిండిమ వ్యాజ సంతాడిత వియత కవిత గండ మండలస్య, డిండిమ కవి సార్వ భౌమస్య, శ్రీమతో అరుణగిరి నాథస్య, పౌత్రేణ విచిత్ర తర చిత్రహ యమక కావ్యధూర్వ హాస్య అప్రతి రూపబహు రూపక సృష్టి కౌశల పరమేష్ఠినః పరమ మహేశ్వరస్య చతుర్విధ కవితా చాతుర్యధుర్యస్య, రాజనాథా చార్యస్య, పుత్రేణ పవిత్ర తమ గౌతమ గోత్రేణ, గంగా తటాలంకార గౌడ దేశాలంకార రత్నాఅపీడ పై రంద్రగ్రాహార మౌళెమణి నా దుర్గాదేవీస్తనంధ యేన షడ్భాషా సార్వభౌమేన కుమార డిండిమ కవినా అరుణగిరి నాథేన ప్రణీతే- ఈ రెండవ అరుణ, గిరినాథుడు (కుమార డిండిముడు) వీరనర్సింహ రాయల కాలమందును, శ్రీ కృష్ణదేవరాయల వారి కాలమందు వున్న వాడు. ఇఅతని తండ్రి రాజనాథుడు. సాళ్వగుండ నరసింహరాయల కాలమందున్నట్లు కుమార ధూర్జటి కవి రచించిన కృష్ణరాజ విజయమను ప్రబంథము తెలుపుచున్నది. ఈ నాల్గవ డిండిమ భట్టారకుని కుమారుడు రాజనాథుడు. ఈతడచ్యుత దేవరాయల ఆస్థానంలో కవీశ్వరుడుగా వుండెను. అచ్యుత రాయాభ్యుదయమనే కావ్యం యీయన వ్రాసినదే. పైన వివరించిన డిండిమ భట్టారకుల వంశవృత్తాదికమును తెలుపు గ్రంథమొకటి విభాగ రత్నమాల అని ఉంది. అది డిండిమ వంశజులు రచించింది. పైన వర్ణింపబడిన డిండిమ భట్టారకులలో శ్రీనాథ కవికి ప్రత్యర్థి ఎవరో తెలుసుకుందాము. కవి తార్కిక సింహ సర్వతంత్ర స్వతంత్రాది బిరుద మండనుడై విశిష్టాద్వైతమును
పెంపొందిచిన వేదాంత దేశీకులను డిండిమ భట్టారకునకును మహా వివాదము జరిగినట్లు దక్షిణ దేశ ఇతిహాసంలో పండిత పరంపరాగతంగా చెప్పుకొనబడుచున్నది. దేశికులు 1270 మొదలు 1370 వరకు గలరని గురు పరంపరా ప్రభావమందలి యీ శ్లోకం తెలుపుచున్నది.
శ్లోIIశ్రీ థీ యోగ్యే శాకే శుక్ల ఉదభూద్వేంకటేశ్వరః I
లబ్ధ ప్రాయేశకే ప్రయాత్యౌమ్యేవ పరమం పదం II
శ్రీకంఠాగమ శిఖండ మండన మణియై విజయ డిండిమము మొదట నార్జించిన డిండిమ ప్రభుడును, యోగానంద ప్రహసనకర్త (మాతామహుడు) వేదాంత దేశీకులును, సమకాలీకులు,. కనుక దేశకుని ప్రత్యర్థి ప్రథమ డిండిమ ప్రభుడని నిర్ధారింపనగును. శ్రీనాథుని ప్రత్యర్థి ప్రౌఢదేవరాఅయల కాలమున గల యోగానంద ప్రహసన కర్త ద్వితీయ డిండిమ భట్టరకుడగును. శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయల ఆస్థానమునందే కనకాభిషేక సత్కారము ప్రౌఢదేవరాఅయల కాలమున జరుగుట కూడా సంభవమే.
ప్రాచ్యా లికిత పుస్తక భాండాగారమున మెకంజీ గ్రంథ పరంపరలో (15-3-56, 44-45)చంద్రభూషణ క్రియాశక్తి యెడయురలకు రాయదత్త భూదానము తెల్పు తామ్ర శాసనంలో చంద్రభూషణాచార్యుల కాలమున శ్రీనాథ డిండిముల వివాదకాలమును సువిదితము కాగలదు. వీరే ఈ వాదమునకు మధ్య వర్తిత్వము నెరపి తీర్పు చెప్పినది వారి కాలముననే, ఈ వివదములో విజయము సాధించిన శ్రీనాథునకి జాయము చాటిస్తూ ప్రౌఢ దేవరాయలు అతనికి కనకాభిషేకం చేసెను.
శ్రీనాథుడు తన చాటువులో – పగుల గొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచుడక్క అని వ్రాసుకున్నాడు. డిండిమ అనగా రాయడి గిడ గిడి అను వాద్యము. దీనిని కలిగి ఉండేవాడు డిండిమడు. అనగా డిండిమ బిరుదును సంపాదించిన తన ఆధిక్యమును శూచించుటకై రాజసభకి వెళ్ళునపుడు ముందుగా ఈ వాయుద్యమును వాయించుచు గమ్యమును చేర్చెదరు. శ్రీనాథుని జననము 1360-1365 మధ్యలో అని, కనకాభిషేకము 1430-1435 మధ్యలో అని శ్రీ బండారు తిమ్మయ్యగారి అభిప్రాయము. డిండిమనితో వాదించుటకు సామర్ధ్యము శ్రీనాథునకు ముప్పై ఏళ్ళ వయస్సులో ఉండునో లేక డెబ్బై ఏండ్ల వయ్యస్సులో ఉండునో విజ్ఞులు నిర్ణయింపలసి ఉంది. అసలు పండితులతో వాదము ముప్పై ఏళ్ళ వయస్సులో సహజము కాదు, అందులో డిండిముని వంటి ఉద్ధండ పండితునితో తోడి వాదమునక సామర్ధ్యము ముప్పై ఏండ్ల వయ్యస్సున సాధ్యము కాదు. ఏభై ఏళ్ళ వయస్సున మాత్రమే పండిత వాదములు సాధారణము, శ్రీనాథుని వంటి సకల విద్యా సనాథుడు ఏభై ఏండ్ల వయస్సు నందే కాదు డెబ్భై ఏండ్ల వయస్సునందును వాదించు సామర్ధ్యము కలిగి ఉందటము విపరీతము కాదు.
శ్రీ మల్లంపల్లి సోమ శేఖర శర్మగారి అభిప్రాయము
[మార్చు]మొదటి అరుణ గిరినాథుడు రచించిన సోమవల్లీ యోగానంద ప్రహసనము దేవరాయల కాలమున రచించినట్లు ఉంది. రెండవ దేవరాయల కాలము నందే సాళువ నరసింహరాయులు ప్రాముఖ్యమునకు వచ్చెను. ఇతని మొదటి శాసనము 1437వ సంవత్సరములోనే వెలువడింది. అరుణ గిరినాథుదు రామాభ్యుదయమనే సంస్కృత కావ్యాన్ని రచించినట్లు సర్గాంత శ్లోకము ఉంది. కాని పంచమ సర్గాంత శ్లోకము అభిరామాంబికా రాజనాథుల తనయుడైన శోణాద్రినాథ డిండిమ కవీంద్రుడు రచించినట్లుంది. రెండవ దేవరాయల మహానాటక సుథానిధి కంటే రామాభ్యుదయము పూర్వ రచనము. దీనిని బట్టి మొదటి అరుణగిరి నాథుడైన గౌడ పండితుడు రెండవ దేవరాయల కాలమున వున్నాడని సువిదితము. అంతే కాదు శాసన ప్రమాణమును ఉంది. అరుణ గిరినాథుడు తన కుమారునికి భూపతి పేరు పెట్టినందుకు మెచ్చిన వీరభూపతి ముడియనూరు అగ్రహారాన్ని కానుకగా ఇచ్చి వేయించిన శాసనమది. ఈ భూపతి రెండవ దేవరాయల తండ్రి వీరభూపతి లేక వీర విజయ భూపతి. శ్రీనాథునికి కవి సార్వభౌమ బిరుదము, భీమఖండంలో లేదు. కాశీ ఖండమున శివరాత్రి మహాత్మ్యములో ఉంది. కాబట్టి భీమఖండ రచనము తరువాత కాశీ ఖండ రచనకు పూర్వము శ్రీనాథునికి కనకాభిషేకము జరిగినట్లు స్పష్టము. కనుక శ్రీనాథుని ప్రత్యర్థి మొదటి అరుణగిరి నాధుడైన గౌడ డిండిమ భట్టు అనుట సమంజసము.
రామాభ్యుదయము అరుణ గిరినాథ కృతముగా నున్న శ్లోకమిది – శోణాద్రీంద్రం కవీంద్రం శ్రవణ కటురటడ్డిండిమం సార్వభౌమం ప్రసూతాంబాభి రామ నవ నవకవితా భాజనం రాజనాథాత్ తస్యైతస్మెన్న యాతి క్రమ విషయ మహానాటక స్యాగ్రజాతే కావ్యే సర్గోని సర్గోజ్జ్వల రసవిల సత్పంచ మోయం జగామ I 1380 వ సంII జనన కాలమగు డిండిమ ప్రభువైన అరుణ గిరి నాథుడే శ్రీనాథుని ప్రత్యర్థి అని నిర్ధారింపబడింది. ఈ గౌడ పండితుడు ప్రౌఢదేవరాయల సంబంధము గల డిండిమ కవి సార్వభౌముడే. విభాగ పత్రమాల అనే గ్రంథంలో అరుణ గిరినాథుని జనన కాలము 1380వ సంవత్సరం సరైనదేనని, జననీ జనకుల, మాతామహుని విషయములు కూడా నిస్సంశయము అలానే మాతులుని విషయము అతని పెంపకము కూడా యథార్థమే. అరుణగిరి నాథుని తండ్రియైన రాజనాథుడు కుమారుని ఎనిమిదవ సంవత్సరం లోనే మరణించుట వలన అతని మేనమామ పెంచెననుట నమ్మతగినదే. తండ్రి మరణీంచునప్పటికి అతని మాతామహుడు గాని, పితామహుడు గాని జీవించి ఉంటే మేనమామ పెంచనక్కరలేదు. తండ్రిలేని పిల్లలను మాతామహుడు పెంచుటయే లోక ధర్మము. 1406వ సంవత్సములో విజయనగర ప్రభువైన మొదటి దేవరాయల కాలములో నలుబది సంవత్సరములు లోపు వయస్సు గల అరుణగిరి నాథుడు శ్రీనాథునికి ప్రత్యర్థి అగుట సంగతము కాదు. కనుక శ్రీనాథుని తోడి వాదము రెండవ దేవరాయల కాలంలోనే జరుగుట సంభవము. ఈ సందర్భంలో రాయలగురువైన చంద్రభూష క్రియాశక్తి యనునత డ్గ్రాసనాధి పత్యమును, మధ్యవర్తిత్వమును వహించెను. ఈ తార్కిక యుద్ధంలో డిండిమ భట్టు పరాజితుడయ్యాడు. అతని గర్వాపహరణము గావించు ఉద్దేశముతో శ్రీనాథుడు ప్రౌఢ దేవరయల ఆస్థాన పండితుడైన గౌడ డిండిమ భట్టుని కంచుఢక్కను పగుల గొట్టించుటయే కాక ఇంత వరకు అతడు వహించిన కవి సార్వభౌమ బిరుదమును తాను వహించుటతో బాటు కనకాభిషేక గౌరవము పొందుట సామాన్యమైన విషయము కాదు. శ్రీనాథుని కనకాభిషేక సత్కార కాలం స్థూలంగా 1431వ సంవత్సరం. అప్పటికి 1360వ సంవత్సరం జనన కాలం గల శ్రీనాథుని వయస్సు 71 సంవత్సరములు. 1380వ సంవత్సరము జనన కాలమగు అరుణగిరినాథుని వయస్సు 51 సంవత్సరములు ఈ వయస్సు నందే గౌడుడు ఉద్భట ప్రౌఢ వివాదంలో పాల్గొన్నాడు. ఈ విషయము లన్నీ శ్రీ డాఅక్టరు కొర్లపాటి శ్రీరామమూర్తి ఏం.ఏ, పి.ఎచ్.డి., గారి శ్రీనాథుడు అనే గ్రంథము నుండి సేకరింపబడినవి.
రెండవ హరి హర రాయలు (1377-1404). ఇతడు విజయ నగరాధీసుడైన బుక్కరాయని కుమారుడు. ఇతని వద్ద మిక్కిలి సమర్ధులైన మంత్రులుండేవారు. వీరిలో మాధవాచార్యుని సోదరుడగు నారాయణా చార్యుడొకడు. రెండవవాడు గౌడుడగు మాధవ మంత్రి ఇతడు బుక్కరాయల కాలంలో కూడా రాజసేన యందున్నవాడు. ఇతడు గోవా పట్టణంలో జన్మించాడు.
శ్రీరాముని కాలంలో సుగ్రీవుని పోషణలో నున్న గౌడులు
బొంబాయి వస్తుప్రదర్శన శాలలోని రాగి ఫలకము
శ్రీమద్రామాయణం యుద్ధకాండములో శ్రీ వాల్మీకి మహర్షి సురను తయారు చేయువారిని గూర్చి వ్రాస్తూ – సుగ్రీవుని కపి సైన్యంలో విదేహుడు, వామాక్షుడు కుండలుడు, భీతావహుడు, మధుడు, చక్రి మొదలగు గౌడలు వుండె వారిని వీరు సురని సృష్టించి రామదండుకు, కపిసైన్యములకు సమృద్ధిగా సరఫరా చేస్తూ వుండేవారని, వీరి సంప్రదాయం క్రమంగా ద్వపరయుగాంతం వరకు వుందని, శ్రీమన్మహా భారతమున విరాట్ నగరంనను, యాదవకులం అస్తమించు కాలములో యాదవులు సురాపానము చేసి వారిలో వారిలో ఒకరిని ఒకరు హత్యచేసుకుని నశిస్తారని, ఆకాలమున మద్య పదార్థములను తయారు చేయు వారందరు గౌడ నామములతో విలసిల్లిన గౌడ కులమునకు చెందిన వారనియు, కలియుగంలో వీరు కూడా అస్తమించారని రాయబడింది.
త్రేతాయుగంలో రఘు వంశీయుడైన హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్ర మహర్షికి సర్వస్వము దానమిచ్చి రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడనే కాటికాపరికి అమ్ముడై అతనికి సేవలు చేస్తూ ఉండేవాడు. వీరబాహుడు నిత్యం కల్లు త్రాగేవాడు. ఆ కల్లు కుండలను హరిశ్చంద్ర చక్రవర్తి మోయడం మనకు తెలిసినదే, దీని బట్టి మద్యపానము మూడు యుగాల పూర్వం నుండి వున్నదని మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుని అన్న బలరాముడు కూడా సురను సేవించినట్లు మహాభారత యుద్ధ సమయంలో మద్య మాంసాలను విరివిగా వాడినట్లుంది. మధువు, మగువ, మాంసము, యివి అప్పటికి యిప్పటికి వ్యసనపరులకు నిత్యావసరాలై ఉన్నాయి. సత్యయుగం నుండి యిప్పటి వరకు అన్ని జాతుల వారు కల్లును విరివిగా ఉపయోగిస్తున్నట్లు పూర్వ చరిత్ర వలన విశద మవుతుంది. ఈ విధంగా గౌడులు సృష్ట్యాది నుండి వుండి వున్నట్లు మనకు అనేకానేక ఉదాహరణలు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులయందును, పితృ కర్మల యందును.
సురను ఉపయోగించుట ఒకప్పుడు శంకర భగవానుడు కైలాసములో ప్రమథగణములతో గూడి సంతోషంగా యిష్టాగోషీ సలుపుచుండగా స్కందు డేతెంచి శంకరునకు నమస్కరించి – మహాదేవ! ఏ కర్మ ఎట్లు చేస్తే మాతృదేవతలు తృప్తులై మోక్షమును పొందుదురో చెప్పు మని ప్రార్ధింపగా ఆనందించిన శంకరుడీ విధంగా చెప్పియున్నాడు. వత్సా! సుగుణ సంపన్నుడు, బ్రహ్మజ్ఞాన పరాయణూడు నాయంశమున జన్మించిన నా భక్తుడగు దేవగౌడుడైన కౌండిన్య మహర్షి గౌడ మంత్ర ప్రభావముచే సృష్టించిన అమృత సిధ్ధ రసము. వారుణీ మద్య దివ్యరసంబులతో పితృదేవతలకు తర్పణము చెసిన వారు తృప్తులై యమర లోకమున కరిగి శాశ్వతానందము నందుదురు. ఈ అమృయ సిధ్ధ రసము మహర్షులచే శ్లాఖింపబడుట వలన దీని సేవన వలన దేవతలు ఆనందిస్తారు. అందువలన ప్రతివారును యజ్ఞయాగాది క్రతువులందును. పితృకర్మల యందును అవశ్యము దీనినుపయోగింతురు ప్రమాణము
శ్లోII పురా సుధా సమాయుతా కలౌ స్మ్మూలె కాత్మకా
మధునా వారుణీ త్యేవా మధు మద్యం తధైవ చ I
పురా బ్రహ్మ ప్రియా సా చ సర్వకర్మార్ధ సిద్ధి దా
మధునా తర్పితా దేవాః మధునా తర్పితా ద్విజాః
మధునా సర్వకర్మాణి మధు స్సర్వత్ర సిద్దిదం II
దేవతలు, బ్రాహ్మణాది సమస్త జనులు ఫల పుష్పముల తోను, మూలికలతోను, తయారు చేయబడిన వారుణీ మద్యము, సురా (కల్లు), తేనె మొదలగు పదార్థములు యజ్ఞయాగాది క్రతువుల యందును పితృ కర్మల యందును ఉపయోగించిన దేవతలు, పితురులు, తృప్తులయ్యెదరు గాన ప్రతివారు వీటిని అవశ్యం ఉపయోగించ వలెనని శాసింపబడింది.
స్కందపురాణం
[మార్చు]శివుడు పార్వతీ సమేతంగా తాండవ నృత్యం చేసే సమయంలో సురను సేవించే వాడని, నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, వీర భద్రాది శివగణములు నిత్యము వారుణీ మద్యమును సేవించెడి వారని పురాణ గ్రంథాలలో ఉంది. సూర్యభగవానుడు విరామం లేని నిరంతర తన ర్థ గమనాయాసం బాపుకోవడానికి నిత్యము సురను సేవించునని ఉంది. శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో అగస్త్య మునిని దర్శించడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వార్ని సాదరంగా ఆహ్వానించి, ఆర్ఘ్య పాద్యాదులతో పూజించి, ఫలపుష్పములతోను, మూలికలతోను, తయారు కాబడిన సారాయమును తెచ్చి – వీరి వన వాస క్లేశానికెంతగానో విచారించి – ఓ రామా! ఇది క్రొత్తగ చేయబడిన పానీయము. పానయోగ్యమైనది. పరిమళ సహితమైనది, మధూక పుష్సములతో తయారు చేయబడిన దివ్య సారాయము, వారుణీ మద్యము యిది త్రాగిన మీ మార్గాయాసం తీరు అని చెప్పి ఆసారాయము నీయగా దానిని సీతారామ లక్ష్మణులు సుష్టుగా త్రాగి సేద దీరిరి.
దీనిని నాశ్రమ వాసులుగా ఋషులు, ఋషి కన్యలు, ఋషి పత్నులు నిత్యము పానము చేసి దివ్యజ్ఞాన సంపన్నులై వెలసిరి. (వాల్మీకి రామాయణ అరణ్యకాండ 102 సర్గ)
దశకంఠుడు – శివపూజా దురధరుడైన రావణ బ్రహ్మ దీనిని నిత్యము త్రాగేవాడు. రావణుని మరణానంతరం ఉత్తర కమలు చేసే సమయంలో విభీషణుడు పితృకార్యమును నిర్వహించెను.
ఆర్యులలో కూడా యజ్ఞ యాగాది క్రతువులు పితృతర్పణము మొదలగు వాని యందును, ఆహి తాగ్ని సంస్కారము లందును సురాపానము చేసేవారు. ముని పల్లెలలో, మతంగ, శరభంగాది మునులు నిత్యము యీ వారుణీ మద్యమును సేవించి సత్వగుణ సంపన్నులై, దీర్ఘకాలమీశ్వరునారాధించి తరించిరి. క్షీర సాగర మధన కాలమందు వరుణుని కుమార్తెయగు వారుణీదేవి సుర (కల్లు) అనే పేరుతో సురలు చూచుచుండగా ఉద్భవించింది. ఆ సురాదేవిని రాక్షసులు చూడలేదు. సురలు ఆ దేవిని గ్రహించిరి. ఆ సురాదేవిని పరిగ్రహింప నందుకు దితిపుత్రులైన రాక్షసులు అసురులనబడిరి. దేవతలాసురా దేవిని గ్రహించి పూజించి నందున వారు సురలన బడిరి. వేదకాలమున, ఆర్యగౌడులని ప్రసిద్ధి గాంచిన యీ జాతీయులు వారుణీ దేవిని తమ కులదేవతగా పూజించేవారు. ఈ దేవి పాలసముద్రము నుండి శ్రీ మహాలక్ష్మితో పాటు ఉద్భవించింది. గనుక యీ దేవిని వరలక్ష్మిదేవిగా పరిగణించి ఆశ్వీయుజ బహుళ దశమి మొదలు ద్వాదశి వరకు మూడవ దినములు వేదమంత్రములతొ, సహస్ర నామార్చనలతో షోదశోపాచార పూజలు చేసి, దానితో బాటు శివలింగాఅర్చన అభిషేకాదులు చేసి ద్వాదసి నాడు సమారాధన చేసి, శివ ప్రసాదము స్వీకరించి ఆనాడీ శ్రీవారుణీ వరలక్ష్మి దేవికి ఊరేగింపుగా మహోత్సవము చేసి శివ పురాణ కాలక్షేపంతొ ఆ రాత్రి జాగరణ చేసి మరునాడు ఆ దేవిని పీఠములో ప్రతిష్ఠించి బీదలకు అన్న వస్త్రదానాదులు చేయుచుండెడి వారనియు, అందువలననే ఆనాటి గౌడజాతీయులు అష్టైశ్వర్య భోగ భాగ్యములతో తులతూగే వారనియు, రాజభోగములను అనుభ్వించే వరని, ఈ విధంగా వారి జీవితము ఆనందమయంగా జరిగిపోయేదని ఆదిగౌడ దీపిక యందు వ్రాయబడింది[2].
వివాహాలయ్యాక భరత శతృఘ్నులు తన మేనమామ యధాజిత్తు కూడా కేకయ రాజ్యానికి తాతగారి పిలుపున వెళతారు. ఇంతలో దశరథుడు శ్రీ రామ పట్టాభిషేకం తలపెట్టి ముహూర్తం నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న మందర తన యజమానురాలైన కైకకు దుర్భోద చేసి ఏ విధంగా నైనాఅ భరతునికి పట్టభిషేకం జ్రగాలని పూర్వం దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన రెండు వరాలను జ్ఞాపకం చేసి అవి కోరుకోమని ప్రోత్సహిస్తుంది. దాని ప్రకారం కైక భరతునికి పట్టాభిషేకం, రాముని వనవాసం కోరుకుంటుంది. వృద్ధుడైన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు సీతాలక్ష్మణులతో వనవాసానికి వెళతాడు. పుత్ర వియోగం భరింప లేక దశరథుడు నలుగురు కొడుకులుండి కూడా ఒక్కడు దగ్గర లేకుండా మరణిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు భరత శతృఘ్నులకు కబురు చెసి రప్పిస్తాడు. వారు వచ్చి తండ్రి మరణం, రామలక్ష్మణులు లేకపోవడానికి కారణం అడిగి తెలుసుకుని తల్లిని యెంతగాఅనో దూషించి, తండ్రికి అంత్యక్రియలు చేసి రాముని తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేసి, మంత్రి సామంత, పురోహిత, చతురంగ బలాలు వెంటరాగ, జానపదులు, అయోద్యా పురవాసులను వెంట తీసుకుని రాముణ్ణీ వెతుక్కుంటూ అరణ్యాలకు బయలు దేరతాడు. మార్గమధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. వెంటనే భరతుడు అనతి దూరంలోనే రథం దిగి పాదచారి అయి ముని వద్దకు వెళ్ళి ఆయనకు ప్రణమిల్లి తాను వచ్చిన సంగతి చెప్పి దుఃఖిస్తాడు. అప్పుడు భరద్వాజుడతనిని సాంత్వన పరిచి ఆనాటికి తనకు అతిథులుగా ఉండమని వారిని ఒప్పించి వారికి గొప్ప విందు చేయ సంకల్పించి తనా తపోమహిమతొ స్మరణ మాత్రముతొనే విశ్వకర్మను రావించి విషయం చెప్పి భరత మహారాజుకు ఆయన పరివారానికి అంతకు వసతి గృహాలు నిర్మింపుమని, వారి కొరకు కొన్ని చెఱకు రసంతోను, కొన్ని మైరేయమనే పుష్పఫలాదులచే చేయబడిన సారాయముతోను, కొన్ని కల్లుతోను నిండిన సరస్సులను సృష్టించి పానార్ధమునకు ఉపయోగునట్లు చేయమని ఆజ్ఞాపించగా విశ్వకర్మ అత్యంత సుందర భవనాలను, వాతిలో స్వర్ణ రజిత పాత్రలను, తూగుటుయ్యాలను, హంస తూలికా తల్పాఅలు మొదలైన సౌకర్యములు అన్నింతిని కల్పించి, కల్లు సారాయముతో నిందిన సరస్సులను సృష్టించాడు. తరువాత ముని దేవేంద్రుని పిలిపించి దెవతా వస్త్రాదులు, దేవకాంతల నాట్యాలను ఏర్పాటు చేయించాడు. చంద్రుని వలన వివిధాన్నములు, భక్ష్య, భోజ్య, లేహ్య, పేయ, చోష్యాదులను, పానము కొరకు మధుసిద్ధి రసము (విప్ప సారాయి), వారుణీ మద్యము (కల్లు) మొదలగు అనేక రకములైన పానీయాలను, అనేక రకములైన మాంసాదులతో కూడిన కూరలను తయారు చేయించి భరతునకు అతని అపార సేనకు విందు చేశాడు. భరతాదులందరూ భోజనాదులతో పాటు తృప్తిగా సురాపానము చేసి విశ్రమించారు. సీతాన్వేషన కొరకు లంకలో ప్రవేశించిన హనుమంతుడు సురాపానాముతో మత్తెక్కి వివశులై పడి వున్న రావణుని అతని పక్కన వున్న రాక్షసి స్త్రీలను చూశాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పాఠశాల లను అందులో వున్న సారాయము మొదలగు వాటిని చూశాడు. మూలం:వాల్మీకి రామాయణం
మహాభారతం
[మార్చు]పాండవుల అజ్ఞాతవాస సమయంలో మారు వేషాలలో విరాటుని కొలువులో కుదిరి వారికి సపర్యాలు చేస్తున్నారు, అందులో ద్రౌపదీ దేవి విరాటుని భార్య అయిన సుదేష్ణా దేవి వద్ద పరిచారికగా వుండేది. ఒకనాడు సుదేష్ణా దేవి సోదరుడు కీచకుడు అక్క వద్దకు ఆమె వద్ద నున్న జగదేక సుందరిని చూచి కామించి ఆమెను పొందాలన్న కోర్కెను అక్కతో చెప్పాడు. నా మాట వినక పోతే రాజ్యమంతా సర్వనాశానం చేస్తానని చెప్పాడు, ఇక వేరే దారి లేక సుదేష్ణా దేవి ద్రౌపదితో ద్రాక్ష సారాయమును తీసుకుని వెళ్ళి తన సోదరుని భవనంలో ఇచ్చి రమ్మని చెప్పింది. సారాయముతో వచ్చిన ద్రౌపదిని చూచి కామాతురుడైన కీచకుడు ఆమెను బలవంతంగా పట్తుకోభోయాదు, ఆమె అతని బారి నుండి తప్పించుకుని వంట ఇంట్లో వున్న భర్త భీమునితో మొరపెట్తుకోగా, ఆమె చీరను చుట్టుకుని ద్రౌపదిలా కీచకుని సంజ్ఞ చేసి సంహరిస్తాడు. ఆకాలంలోని శివగౌడులు అమృత సిద్ధ రసాన్ని తయారు చేసి ఆయాదేశాధినేతలకు పంపి, అంతఃపురాలకు కాపలా వారిచేత సరఫరా చేయించి వరి చేత అధికంగా గౌరవింపబడేవారు. ఆ రాజులు సంతోషంతో ఆ గౌడులకు తమ రాజ్యమందలి కొంత రాజ్యమిచ్చి గాని, కొన్ని గ్రామాలను దానంగా గాని ఇచ్చేవారు. వాటిని యీ గౌడులే సొంతంగా పాలించి వచ్చే ఆదాయంతో సుఖంగా జీవించేవారు. ఇట్టి గౌడులను మహారాజులు తమ ఆస్థానంలో గౌరవనీయ వ్యక్తులుగా పరిగణించి మిగతా వారితో సమానంగాఅ ఆసనాదులనిచ్చి అదరించి పోషించేవారు. ఈ విధంగా సురాపానం, సృష్ట్యాది నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మహారాజులు, మహాత్ములగు వారు అందరూ సురాపానం చేసినట్లు మనకు చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలుగా లభిస్తాయి. గాఅంధీజీ కూడా తాఅను స్వయంగా నీరాను తాగినట్లు వ్రాసుకున్నాడు.
శుక్రాచార్యుడు సురను శపించుట – కచ – దేవయాని కథ
ఈ కథ శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం లోనిది. ఈ పర్వాన్ని కవిత్రయంలోని మొదటి వాదైన నన్నయ భట్టారకుడు వ్యాసకృత సంస్కృత భారతాన్నుండి ఆంధ్రీకరించాడు. భారతంలో చతుర్వేద సారమంతా నిండి యుండుట బట్తి దీన్ని పంచమ వేదమని, భరత వంశస్థుల చరిత్ర ఉండుట వలన భారాతమని, గొప్ప అర్ధ గౌరవం కలది కనుక మహాభారతమని, పూర్వ రాజుల చరిత్ర ఇందులో ఉండుట వలన దీనిని ఇతిహాసం అని, సర్గ, ప్రతి సర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితము అనేడి ఐదు పురాణ లక్షణములు ఉండటం బట్టి దీనికి పురాణమని ప్రసిధ్ధ నామములు ఉన్నాయి. ఇది 11వ శతాబ్దంలో రాజమహేద్రవరం రాజధానిగా వేంగి దేశము నేలిన రాజ రాజ నరేంద్రుని ప్రోత్సాహంతో ఆస్థాన కవి అయిన నన్నయ దీనిని తెలుగించాడు. సంస్కృతము మొదలగు అనేక భాషలలో కవిరాజశేఖరుడని ప్రసిద్ధి నొందిన నారాయణ భట్టును గౌడ కులజుడు యీ నన్నయకు సమకాలీకుడు. వ్యాస భగవానుడు జన్మే జయనుకు భారతకథను వినిపించుమని వైశంపాయుని నియమించాడు. అతడు కథను ప్రారంభించి కౌరవ వంశ క్రమాన్ని తెలుపుచుండగా యయాతి ప్రసక్తి వచ్చింది. అపుడు జనమే జయనుకు సందేహం వచ్చి – ‘ఓ మహాత్మ యయాతి మహారాజు బ్రాహ్మణ కన్య అయిన దేవయానిని వివాహమాడడం ఎలా సంభవించింది?ఆ యయాతి చరిత్ర చెప్పు అని ప్రార్ధింపగా వైశంపాయనుడు యయాతి చరిత్రకు ముందుగా దేవయాని వృత్తాంతం చెప్పుట కొరకై దానికి సంబంధించిన కచుని విద్యాభ్యాసం గురించి యీ విధంగా చెప్పాడు.
ఓ జనమే జయ మహారాజ! వృషపర్వుడనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువై సమస్త విధముల రాక్షసులకు మేలు చేయుచుండెను. నిత్యము రాక్షసులకు జరిగే యుద్ధంలో మరణించిన వారిని తన మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తున్నాడు, ఆ సంగతి తెలిసిన దేవతలు మిక్కిలి భయపడి ఇలా అయితే రాక్షసులను జయింప లేమని ఎలా అయినా శుక్రుని వద్ద గల మృత సంజీవనీ విద్యను సంపాదించి తెలుసుకురాగల మహానుభావుడు ఎవరా అని ఆలోచించి అందుకు బృహస్పతి కుమారుడైన కచుడే తగిన వాడని, అందరూ కలిసి కుమారా! మేము ఒక సహాయం కొఅరకు నీ వద్దకు వచ్చియున్నాము, నీవు చిన్నవాడైనను నియమ పాలన చేయువాడవు, గుణ సంపన్నుడవు అన్ని విధాల యోగ్యమైన వాడవు. నిత్యము మనకు రాక్షసులతో యుద్ధం జారగటం అందులో మరణించిన రాక్షసులు బ్రతికి రావడం జరుగుతుంది, దానికి గల కారణం శుక్రుని వద్ద గల మృత సంజీవనీ విద్య, ఇలా కొనసాగితే మనము ఆ రాక్షసులను జయించడం చాలా కష్టం. మనకు మృత సంజీవనీ లేని కారణంగా ఆ రాక్షసుల చేతిలో చంపబడుతున్నారు. కనుక నీవు ఆ శుక్రాచార్యుని ధైర్యంతో అశ్రయించి మృత సంజీవనీ విద్యను సంపాదించి మన దేవతలను కాపాడవలెను, అలానే శుక్రునకు దేవయాని అనే కూతురుంది, ఆమె పై తండ్రికి మిక్కిలి ప్రీతి, శుక్రుడు కుమార్తె మాటను త్రోసివేయడు, కనుక నీవు ఆమె మనస్సుకు నచ్చునట్లుగా ప్రవర్తిస్తూ శుక్రునితో పాటు, ఆమెను కూడా సేవించి ఆ మృత సంజీవని విద్యను సాధించుమని ప్రోత్సహించారు[3].
దేవతలా కోరికను అనుసరించిన కచుడు వృషపర్వుని పట్టణానికి వెళ్ళి, అక్కడ వేదాద్యాయన పరుడై దానవులందరికి గురువై వున్న శుక్రుని చూసి మహాత్మ నేను కచుడను, బృహస్పతి కుమారుడను, నీకు శిష్యుడనై యుండి సేవలు చేయడానికి వచ్చాను, నన్ను శిష్యునిగా స్వీకరించి నన్ను కరుణింపు మని ప్రార్థించాడు. కచుని కోమలత్వాన్ని, క్రమశిక్షనని, వినయ, విదేయతలను చూసి శిష్యునిగా అంగీకరించెను, కచుడు విధేయుడై, నిష్ఠా గరిష్ఠుడై గురువు మనోఃలోచనములను గ్రహించి
ముందుగానే తదానుగునాఅంగా ప్రవర్తిస్తూ, గురు పుత్రిక అయిన దేవయానికి మిక్కిలి విధెయుడై పూలు, పండ్లు క్రోస్తూ ఆమెకు ప్రీతి కలిగిస్తూ ఉండేవాడు. ఇలా ఎన్నో ఏళ్లో గడిచిన పిదప శుక్రునకు కచుడు ప్రియ శిష్యుడైనాడు, ఇది చూసి రాక్షసులు సహింపలేకపోయారు, దానితో పాటు దేవాతల గురువైన బృహస్పతి మీద పగ కూడా తోడు రాగ ఏలా అయినా కచుడుని చంపవలెనని ఎదురు చూస్తున్నారు, ఒక నాడు కచుడు హోమదేనువుల్ని కాస్తూ అడవిలో ఒంటరిగా కనిపించాడు, అదే సరైన సమయమని కచుడిని చంపి ఒక చెట్టుకి వ్రేలాడ దీసి వెళ్ళిపోయారు, సూర్యాస్తమయినా కచుడు రాకపోయే సరికి దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి, నాయన గారు, సూర్యుడస్తమించినా కచూడు అడవి నుండి ఇంకా రాలేదు, హోమదేనువులు కూడా వాచ్చినవి, నాకెందుకో అనుమానంగా వున్నది అనగా, శుక్రుడు తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని మృతసంజీవనిని కుమార్తెకు ఇచ్చి కచుడిని బ్రతికించి తీసుకు రాగా శుక్రుడు, దేవయాని సంతోషించారు, తమ ప్రయత్నం విఫలించిందని తెలుసుకుని ఈ సారి కచుడిని నామ రూపాలు లేకుండా చేయాలని తలచి అవకాశం కోసం చూస్తూ ఒకనాడు అడవిలో దొరికిన కచుడుని చంపి కాల్చి బూడిద చేసి, ఆ భస్మాన్ని కల్లులో కలిపి నేర్పుతో ఆ కల్లును శుక్రునికి తాగించారు, సురాపానం కలిగిన మత్తులో శుక్రుడా సంగతి గ్రంహింప లేకపోయాదు, కచుడు కనబడకపోనందుకు దేవయాని దుఃఖించి, తండ్రి వద్దకు వెళ్ళి ఈ రోజు కూడా కచుడు రాలేదని, రాక్షసులు అతనిని చంపి ఉంటారని మొరపెట్టుకోగా శుక్రుడు తన దివ్య దృష్టితో లోకలోక పర్వతము వరకు గల సామస్తము చూచాడు. ఎ లొకంలోను కనబడ లేదు, చివరకు కచుడు బూడిద రూపంలో కల్లులో కలిసి తన కడుపులో వున్నాడని తెలుసుకుని కల్లు వలన కలిగిన దోషాన్ని, రాక్షసులు చేసిన అపకారాన్ని గ్రహించి మిక్కిలి కోపించి పూర్వమనేక జన్మలయందు పుణ్యకర్మములెన్నియో చేసినందున కలుగు జ్ఞానము కల్లు త్రాగుట వలన క్షణంలో నశించును. జనులెవ్వరునూ కల్లు త్రాగరాదు. నేడు మొదలు బ్రాహ్మణులు మొదలగు జనులీ కల్లు త్రాగిన యెడల పాపముల యందు దగిలి భ్రష్టులై పోవుదురు. నేనీ కట్టడి చేశాను జనులందరూ దాన్ని అనుసరింపవలెను అని శుక్రుడు మద్యపానాన్ని శపించాడు. శుక్రాచార్యుడు సురాపానమును మహాపాతకంగా శపించి, తన ఉదరమున వున్న కచుని వెంటనే బ్రతికించడు. అప్పుడు కడుపులో వున్న కచుడు ఓ పుణ్యాత్ముడ నీ దయ వల్లన నా దేహమును, ప్రాణమును, బలమును పొందాను, కాని భయటకు వచ్చు మార్గము చెప్పుము అనెను, తన ఉదరము చీలకుండా ఇతను భయటకు రాలేడు, పొట్ట పగిలి మూర్చిల్లిన నన్ను బ్రతికింపవలసియుండు అని తలచి కచునకు మృత సంజీవనీ మంత్రాన్ని ఉపదేశించాడు, అప్పుడు కచుడు శుక్రుని పొట్ట చీల్చుకుని వచ్చి మూర్చిల్లిన గురుదేవునను బ్రతికించాడు. ఇలా చాలా ప్రయాసతో శుక్రుని వద్ద నుండి విద్య సంపాదించి, చాలా కాలామైన తరువాత కచుడు గురువు అనుమతి పొంది స్వర్గలోకమునకు పోదలచి ఆ విషయం దేవయానికి చెప్పాడు ఆ మాటలు విన్న దేవయాని అతని యడబాటుని సహింప లేక ధుఃఖిస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠుడవైన ఓ కచుడా! నీవు బ్రహ్మచారివి, సత్ప్రవర్తన కలిగిన వాడవు, నేను కన్యను. మన ఇరువురికి మన్మధుని మాయ వలన ఎప్పుడొ పెండ్లి అయిపోయింది, నా తండ్రి దయచేయ సంజీవనీ విద్యను పొందాఅవు, దాంతో పటు నన్నుకూడాఅ పెండ్లాడి నాకానందాన్ని కల్గింపుమని ప్రాధేయపడింది. దేవయాని మాటలు విన్న కచుడు, గురుపుత్రి చెల్లెలితో సమాఅనం, నేను నిన్ను నా చెల్లెలుగా భావించాను అని చెప్పగా దెవయాని కోపంతో నీవు నా కోర్కె తీర్చవు కనుక నీకు సంజీవనీ విద్య ఫలింపక విఫలమగు గాక! అని శపించింది. దానికి కచుడు ఓ సొదరీ! నేను ధర్మ మార్గము విడువని వాడను కావున, ఈ సంజీవనీ విద్య నాతో ఉపయోగించలెకున్నను, నేను ఉపదేశించిన వారికి పనిచేయును గాక! నీవు అధర్మాన్ని తలపెట్టవు కనుక నిన్ను బ్రాహ్మణేతరుడు వివాహమాడుగాక అని ప్రతిశాపమిచ్చి వెంటనే స్వర్గానికి పోయి మృతసంజీవనీ విదునుపదేశించి వారికెంతగానో సాయపడి మేలు చేస్తున్నాడు.
పురాతన చారిత్రాత్మక శాసనాదులను గూర్చి చలా వరకు తృతీయ, చతుర్ధాధ్యాములలో వివరించాను. మిగిలినవి ఈ ఆధ్యాయములో పొందు పరుచుచున్నాను. పూర్వము 9, 10 శతాబ్దములలో యీ గౌడ జాతీయుల మహారాజుల రాజ్యకాలములో యుద్ధ రంగమునకు పోయే పదాతాది చతురంగ దళములకు, అశ్వగజాది వారు వాహనములకు పనికి వచ్చే వివిధ రకములైన మద్యములను తయారు చేయించి, మహారాజుకు ప్రత్యేక మద్యములను తయారు చేయించి ఇచ్చుట వలన వీరు మద్యకృతాది వర్గముగా పరిగణింపబడి వారి వారి ఆస్థానములందు గౌరవింపబడేవారు. ఈ వర్గము వారికి రాజ్యాధిపతులు పారితోషముగా వారి రాజ్యమందలి కొంత రాజ్యమిచ్చుట గాని, కొన్ని గ్రామములను ఇచ్చుట గాని చేయుచుండిరి. ఇది పురాతన కాలము నండి వస్తున్న సదాచారము. ఆ రాజ్యములను రాష్ట్రాదులను పాలించు వారినీ రాష్ట్ర గౌడులని, గ్రామాలని పాలించు వారిని ఊర్ గౌడులని పిలిచేవారు. వీరు కూడా యుద్ధ సమయాల్లో స్వదేశ రక్షణకు చతురంగ బలాల్లో వరి వారి హోదాలను అనుసరించి ఉద్యోగులుగా ఉండేవారు. యుద్ధ రంగములో వీరికి ప్రత్యేక స్థానము ఉండేది. అట్టి వారికి గురుతులుగా మహారాజావారి అధికార చిహ్నలతో వుండే ఎర్రని పచ్చని రంగులు గల చాందినీ తొడుగులు బాహువుల వలె ఉందే చామరములు బిరుదులుగా ఉందేవి. అట్టి బిరుదములు గల వారిని శత్రువులు తాకేవారు కాదని ఆదిగౌడ దీపికలో వ్రాయబడింది. అందువాలన ఈ రాష్ట్ర గౌడులు రాష్ట్ర పాలకులుగా వుండే వారని పై ప్రమాణము వలన తెలియచున్నది. అట్టి పాలకుల పేర్లు లభ్యము కాలేదు. కని రాష్ట్రమూలను పాలించినట్లు మాత్రము శాసనముల వలన తెలుస్తుంది. మన ఆంధ్రా రాష్ట్రానికి సంబంధించినంత వరకు అట్టి రాష్ట్రగౌడులు ఎక్కువగా నిజాం రాష్ట్రంలో ఉందేవారు. వారి రాజధాని నగరాలు కట్టలూరు, మాల్యఖేటాదులు. ఉస్మానాబాదు ప్రాంతంలో ఉన్నాయి. ఈ మాల్యఖేటము ప్రపంచంలో నాల్గవ సార్వభౌముడని ప్రశంసింపబడిన గోవింద రాజు రాజధాని. అశోకుని రాజప్రతి నిధి నివసించిన సువర్ణగిరి, అమూల్యమైన అశోకుని శిలాశాసనంలో దొరికిన మాస్కే అనునది ‘రాయచూర్ ప్రాంతములో ఉంది. విక్రమాంక దేవ చరిత్రలో బిల్హణ కవిచే వర్ణింపంబడిన ఆరవ విక్రమాధిత్యుని రాజధాని అయిన కళ్యాణమురము గుల్బర్గా మండలములో ఉంది. ఈ రాష్ట్రములో ఇంకా చరిత్ర ప్రసిద్ధికెక్కిన గంగాపురము, నేలకొండపల్లి, పానుగల్లు, ధర్మపురి, నందగిరి ఆమనగల్లు, ఏలేశ్వరము, ఓరుగల్లు మొదలయిన గ్రామాలున్నాయి. రాష్ట్ర గౌడుల గురించి, పశ్చిమ చాళుక్యులు, చోళులు, కాకతీయులు, మొదలగు ఆంధ్ర రాజుల చరిత్రలలో ఇంకా ఎన్నో నిగూఢ చరిత్రాంశాలున్నాయి. మహమ్మదీయు ల ఎడతెగని దండయాత్ర ఫలితంగా నిజాం రాష్ట్ర రాజులు సర్వస్వాన్ని కోల్పోయారు. ఛిన్నాభిన్నము కాని హిందూ దేవాలయము గాఅని, దేవతా విగ్రహములు గాఅని, రూపు మాయని దేవీ దేవతల విగ్రహాలు గాని లేనే లేవు. శాసనలన్నీ విరగ గొట్టబడి చెల్లా చెదురుగా పడవేయబడ్డాయీ. హనుమకొండ లోని ఒక శాసనము లో కాకతీయులు మొదట జైనులని ఉంది. మరొక శాసనములో రుద్రమరాజ గౌడు, గుండరాజు, జగద్దేవుడు, మేడరాఅజు, గోవిందరాజు, మైళగిరి దేవుడు మొదలగు వారి పేర్లు వ్రాయబడ్డాయి. కొఱవి, గూడూరు, గ్రామములోని శాస్సనములు నన్నయ్య భట్టుకు పూర్వమున చరిత్రను తెలుపుతున్నాయి.రంగశాయి పేట గుట్ట వద్ద నున్న గుహలోని శసనములు, సిద్ధేశ్వరాలయ గుహాశాఅసనాలు ఆంధ్ర వైభవాన్ని చాటుచున్నవి. అయ్యవోలు శాసనము వలన అనపోత నాయకుడు అను వెలమ వీరుడు సోమకుల పరశురామ బిరుదము పొందినట్లుంది. టేకు మాలు శాసనంలో ప్రతాప రుద్రుని మంత్రి పురపరి మహాదేవ నాయకునై ఉంది. సామంత శూరుని శాసనం, పానగల్లు శాసనము, ఇనుగుర్తి శాసనము, కొలను పాక శాఅసనములలో రుద్రమదేవి గణపతి దెవుని పుత్రిక అని ఉంది. ద్విసింహ గౌదు కుమారుడు రుద్రమ గౌడని తెలుస్తున్నది. హైదరాబాదు సమీపంలో కొలనుపాక క్షేత్రం ఉంది. ఇందులో వీరనారాయణాలయం ఉంది. 1700 సంవత్సరంలో మల్లిఖార్జున సిద్ధయోగి అను ఒకా సిద్ధుదు కొలనుపాకలో గౌడ మత స్థాపనను గురించిన వృత్తాంతాన్ని గౌడపురాణ మనే పేరుతో ద్విపద కావ్యంగా గ్రంథస్థం చేశాడు.
మహమ్మదీయుల దండయాత్రలో సుసంపన్నమైన గౌడులు నిర్మించిఅ చిత్రవిచిత్ర శిల్పములు గల ఆలయాలన్నీ నేల మట్టమై రూపు మాసిపోయాయి. వృత్తులు నశించాయి. పూజాపునస్కారాలు శూన్యమయ్యాయి. ఎందరెన్ని విధాల నాశనం చేసినప్పటికి కొన్ని చోట్ల ప్రాచీన శిల్పకళ మాత్రం అప్రతిహతంగా నిలబడి ఉంది. ఓరుగల్లు లోని శంభుని గుడి వారి మతోన్మాదం, అత్యాచారాల వలన రూపుమాసింది. ఇప్పుడున్న ఆలయం ఈ మధ్య కట్టింది. ప్రస్తుతం కొలను పాకలోని వీరనారాయణాలాయము, అల్లదుర్గం లోని వీరభద్రాలయం, నుగునూరు లోని శివాలయం, వేముల వాడలోని రాజేశ్వరీ ఆలయము మొదలైనవి, పంట చెరువు లోని మూడు వందల జైనుల ఆలయాలను శైవులు శివాలయాలుగా మార్చివేశారు. హనుమకొండ లోని పద్మాక్షి అమ్మవారి జైన దేవత ఇప్పుడామె కాళేఎ అవతారమైనది. ఇవన్నీ కూడా మత కలహాలతో పొందిన రూపాంతరములని గమనించవలసింది. రాయన భాస్కరుడనే మంత్రి తెలుగు దేశమంతటి లోను గొప్ప పేరు పొందిన వాడు. దానిక్కారణం అతడు చేసిన ప్రజా ఉపయోగ కార్యక్రమములే, దాన్నే మంత్రి మహా నాటికట్టుబాట్లు అని అంటారు. మొదట ఈ కాట్టుబాట్లు కొందరికి బాధించినట్టు కనిపించినా తరువాత అన్ని వర్ణముల వారికీ అంగీకార యోగ్యమైనవి. అందు వలన దీనిని సాధించి తెచ్చిన యీ రాయన భాష్కరుడు అన్ని వర్ణాల వారి వలన విశేష గౌరవాన్ని పొందాడు. ఆ శాసనములు వాని కాలమున ఈ క్రింది విధంగా వుంది[3].
- 1వ శాసనం – శాలివాహన సం. 1428 సం. సమమగు క్రోధన సంవత్సరము.
- 2వ శాసనం – శాలివాహన సంవత్సరం తెలియలేదు.
- 3వ శాసనం – శాలివాహన సం. 1429 సం సమమగు అక్షయ సంవత్సరము
పై మూడు శాసనముల లోని విషయం ఒక్కటియే అందులోని మొదటి రెండు శాసనములు అశ్వపతి, గజపతి, నరపతి, అనే ముగ్గురు మహారాజుల వలన విధింపబడిన పన్నుఅను మాన్పించుటకు గాను ఈ రాయన భాష్కరుడు వారు కోరినంత మొత్తాన ధనము వారికిచ్చి అందుమూలముగా చేయించిన కట్టుబాట్ల వృత్తాంతాఅన్ని తెలిపే శాసనాలు. మూడవ శాసనం పై ముగ్గురు రాజులకు ఆ కాలంలో హిందూ దేశానికంతకు ప్రభువగు డిల్లీలో వున్న అలంఘీరు పాదుషా వద్దకు వెళ్ళి పై రాజులిచ్చిన మర్యాదలకు పాదుషాను సమ్మతింప చేసి వాని వలన పొందిన ఫర్మానా (ఆజ్ఞాపత్రం) అయివుంది. ఈ ఫర్మానాలో గౌడ జాతీయుల గురించి ఈ విధంగా వ్రాయబడింది. గమలా, కాలాల్, గమండ్ల వాళ్ళ పెండ్లిడ్ల సమయాల్లో మాలవాళ్ళు వచ్చి గమళ్ళ వాళ్ళా మందిరాల పై బడి తోరణములు త్రెంపి, పాందిళ్ళకు గొడ్డు దుమ్ములు కట్టి, పందిరి పాకలు విరగగొట్టించి, వీధులలో వేసి తగులబెట్టించి, వహనాదులను విరుగ గోట్టించి సంఘ వ్యతిరేఖంగా నడిచి, దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు గాను, మహానాటి వారి సెలవు ప్రకారం మాలవాళ్ళు వాహనములు, పల్లకీలు మొదలగునవి ఉపయోగించరాదు. ఈ ఫర్మానా క్రింద పార్శీ మొహరు ఉంది. పాదుషా సంతకం కూడా పార్శీభాషలోనే ఉంది. దానికి సరియైన తెలుగు సంవత్సరం అక్షయ సంవత్సర చైత్రశుద్ధ దశమి యిందు వాసరం.ఇందుకు తార్కాణము ఈ జాతీయులలోని సామంత రాజులు చాలా కాలం వరకు పారసీకులపై దండ యాత్రలు సగించి వారి రాజ్యానికి ఉపద్రవాలు కలుగజేస్తూ వచ్చినందున ముసల్మానులే పరోక్షంగా మాల వారిని ప్రోత్సహించి శుభకార్యాల్లో వీరికి కీడు తలపెట్టి పగ తీర్చుకునేవారు. ఎందుకనగా యుద్ధ సన్నాహాలుండవు, అందువలన ఈ గౌడ జాఅతీయుల గూర్చి రాయన బాష్కర మంత్రి చరిత్రములో లిఖించిన శాసనము పరిశోధిస్తే మహమ్మదీయులకును, ఈ గౌడులకును నిరంతరము శత్రుత్వముతో కూడిన బద్ధవైరమున్నట్టు విశదమవుతుంది. ఆ వైరానికి కారణం గౌడులు మహా ధనవంతులై ప్రభువులను లెక్క చెయక స్వతంత్రంగా జీవించేవారు.
కాటమ గౌడుని శిష్యుని వలన ఆదిశంకరాచార్యులు గౌడ మంత్రోపదేశం పొందుట
శంకరాచార్యు ల వారు శివాంశతో సా.శ. 785 సంII లో శివశర్మ శ్రీ మహాదేవి అనే దంపతులకు కేరళ దేశములోని శృంగేరీ మోరువను గ్రామంలో విళంబి నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి నాడు జన్మించాడు. ఈయనకు ఎనిమిదవ ఏటనే ఉపనయనం 12వ ఏట పితృవియోగం కలిగింది. చిన్న తనము నుండి పర విషయములందు ఆసక్తి గలవాడై తండ్రి మరణానంతరం సన్యసించాలని తలంచాడు. కాని తల్లి అనుమతించలేదు. ఆమెకు తన మహిమలెన్నో చూపించి చివరకు ఒప్పించి ఆమె అనుమతితో సన్యసించి పాదచారియై దేశమంతా పర్యటిస్తూ మతభోద చేస్తూ తన బోధామృతం వలన అనేక వేల మంది శిష్యులను తయారు చేసి, ఆస్తికత్వం-దైవచింతన-సదాచారములు ప్రతి వారికి అలవడేట్లు చేయడానికి ధర్మవిప్లవం తీసుకుని వచ్చిన దేవతామూర్తి. కాంచీపురంలో కామాక్షీ అమ్మవారిని ప్రతిష్ఠించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించి దేవిని స్తుతిస్తూ ఎనిమిది శ్లోకాలు వ్రాశాడు. ఇక్కడే ఏకాంబరేశ్వర మహాలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. శివకేశవులకు భేడా లేదని ప్రచారం చేసేవాడు. తరువాత ఆయన దేశాటన్ చేస్తూ కాశీ నగరం చేరుకుని అక్కడ కొంత శాస్త్రాధ్యయనం చేసి అక్కడ న్యాయ శాస్త్ర కోవిదుడు, తర్కవేత్త, మండనమిశ్రుడనే మహాపండితుడు వున్నాడని విని, ఆయనని దర్శించి మాట్లాడవలెనని కోర్కెతో నర్మదానదీ తీరమందున్న విద్యానిలయమనే పేరు గల మండన మిశ్రుని వూరికి వెళ్ళాడు. శంకరుడు వాని ఇంటికి వెళ్ళి ద్వారము వద్ద నిలబడగా అక్కడున్న ఎనిమిది చిలుకలు శాస్త్ర చర్చ చేశాయట ! వాటి పాండిత్య మహిమకు ఆశ్చర్యపడిన శంకరుడు – ఆహా1 పక్షులే ఇంత పాండిత్యము కలవై యుండగా శిష్య బృందము, వారి గురువు ఎట్టి వాడై ఉండునోనని తలచి తత్కాలంలో వానితో వాదించుటకు మనస్సంగీకరించక ఏమియు తోచకా ఆలోచించగా మండన మిశ్రుని దొడ్డిలో వున్న తాటి కొబ్బరి మొక్కల నుండి ఒక గౌడుడు ఆ చెట్లు ఎక్కకుండానే మంత్ర ప్రభావంతో ఆ చెట్లను క్రిందకు వంచి కల్లు గీస్తుండటం చూచి ఇంకా ఆశ్చర్యపడి వాడు భయటకు వచ్చే వరకు వేచి ఉండి వాని వద్దకు వెళ్ళి తనకు ఆ విద్యను ఉపదేశించుమని కోరాడు. దానికా గౌడుడు – ఆచార్య వర్యా! కౌండున్యోద్భవ సంజాతులగు పూజ్యపాదులు కాటమ మహేశ్వరుల వారు నాకు గురువులు. వారి కృపాకటాక్షములతో ఈ విద్య నేర్చుకుని పొట్ట పోసుకునుచున్నన్నాను. నా గురువర్యులు నాకీ విద్యను ఉపదేశించునపుడు తన అనుమతి లేకుండా ఈ విద్య ఇతరులకు ఉపదేశిస్తే అది ఫలించక పోగా దరిద్రుడవు అవుదువని నాకు చెప్పి యున్నారు. అందువలన మీకీ విద్యను ఉపదేశిస్తే నేను నా జీవనోపాధి పోతుంది. గురువాజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. కనుక మీకు నేనీ విద్య నివ్వజాలను అని ఖండితముగా చెప్పాడు.
అది వినిన శంకరాచార్యుడు – ఓయూ! నీకు గురుధిక్కార పాపం కలుగకుండా చేస్తాను. నేను కూడా మహామహి మాన్వితుడనే – ఇక మీ జీవనోపాధికి వేరొక ఉపాయామాలోచించాను. నీవు ప్రతీ రోజు ప్రతి చెట్టు నుండి సురను తీసి దాన్ని విక్రయించి ఉద్ర పోషణ చేసుకునే శ్రమలేకుండా నీవు నిశ్చింతగా నీ యింటి వద్దనే కూర్చుండి ధనము సంపాదించే మరొక విద్యను నీకిస్తాను. దాని ప్రభావంతో నీ ఇళ్ళంతా బంగారు రాశులతో నిండిపోతుంది. మహారజైనా నీ వద్దకు రావల్సిందే అని అతనికి నచ్చ జెప్పి వానికి – సువర్ణ ముఖి అనే బంగారు చేసే విద్యను ఉపదేశించి దానికి ప్రతిగా గౌడుని వద్ద నుండి గౌడ మంత్రాన్ని పొందాడు. ఆనందించిన గౌడుడు వెళ్ళిపోయాడు.
మండన మిశ్రుడు ద్వారమును బంధించి లోపల పితురులకు శ్రాద్ధకర్మ చేయించి భోక్తలగు వారికి భోజనాలు పెడుతున్నాడు. ఆ తలుపులు ఎప్పుడు తీస్తారో తెలియదు. కాలహరాణ సహింపలేని శంకరుడు మండన మిశ్రుని దొడ్డిలోని కొబ్బరి చెట్టును గౌడమంత్ర ప్రభావం వలన క్రిందకు వచ్చి దాని నెక్కి గోడ దాటి మండన మిశ్రుని వద్దకు వెళ్ళాడట! వాఅని రాకను గమనించిన అతడు ఆశ్చర్యచకితుడయ్యాడట! తరువాత శ్రీశంకరభగవత్పాదులు మండన మిశ్రుని వాదంలో ఓడించి వెల్ళిపోయాడు. చెట్లను వంగునట్లు చేయు విద్య కాశ్మీరములోని గౌడులకు మాత్రమే తెలుసునని, వారు తమ అసంఖ్యాక శిష్యులకు ఆ విద్య ఉపదేశించారని దాని ప్రభావం వలన వారు తాళ వృక్షమును క్రిందకు వంచి సురలను గ్రహించి రాజాంతఃపురమునకు పంపే వారని తెలుస్తుంది.
సువర్ణ ముఖి విద్యను గ్రహించిన గౌడడు ఆ విద్యా ప్రభావంతో అపరిమిత స్వర్ణాలను తయారు చేసి తన పేర నాణెములను పోయించాడని, అందువలన అట్టి నాణెములను కొంత కాలం క్రితం వరకు అట్టి నాణెములను ఈడిగకాఅసు అని పిలిచే వారని పెద్దలు చెప్పుచుందురు. ఈ ఇతి హాసము వలన గౌడ వంశీయుల మంత్రోపాసన గౌరవ ప్రపత్తులు విశదమగుచున్నవి. శంకరాచార్యుడు అంతటి గొప్ప వ్యక్తి గౌడుని వద్ద మంత్రోపదేశం పొందడం ప్రతి గౌడుడు గర్వింపవలసిన విషయం.
వీరు శ్రీగోపాల గౌడు మహారాజా వారు రాజ్యపాలన చేసే సమయంలో వారి వంశావళిని, తత్ప్రతాప ప్రజ్ఞా సంపన్నతను, వారి సత్య ధర్మా చరణాదులను నిత్యము పారాయణము చేయు వంది మాగాదులై రాజాంతఃపురములందు నిత్యము కైవారము చేయుచు మహారాజు మన్నలను పొందు చుండిరి. వీరు రాజమందిరము లందే నివసించుచు వేకువ జామున లేచి మహారాజు గారి బిరుదావళులను గానం చేస్తూ, గానం చేస్తూ, గనర సంకీర్తన చేస్తూ వారిని మేల్కొల్పి, రాజును, రాణి వాసపు స్త్రీలను, అంతఃపురముల నుండి శివార్చనకు ప్రేరేపించి వారి కాన్న ముందుగా శివాలయములకు పోవుచు మహారాజు రాకను ప్రజలకు ఎరుకపర్చేవారు.
గోపాలగౌడు అస్తమించిన తరువాత వారి ఆస్థానములోని వందిమాగాదులలో ఒక తెగకు చెందిన సుప్రసిద్ధ గుణ సంపన్నులు, ప్రభు భక్తి పరాయణులు, విశ్వాసపాత్రులైన వంది అనే ఒక తెగ వారు వారికి గల సర్వస్వము విడిచి పెట్టి సంసారాది సమస్త సుఖములను పరిత్యజించి, కాటమ మహేశ్వరుడు యోగ సమాధిలో నుండు కాలమున వారికి సేవలు చేయుటకై వారి యందు గల భక్తి శ్రద్ధలతో శ్రీ వారి పాద పద్మములు ఆశ్రయించి మోక్షా పేక్షులై వారి సన్నిదిని ఎల్లపుడూ శుశ్రూషలు చేస్తూ వారి వద్ద వుండేవారు. ఈ విదంగా కొంతకాలం గడిచింది. ఒకప్పుడు కాటమ మహేశ్వరుల వారు యోగ సమాధి నుండి కనులు విప్పి చూశరు, వారి చరణ కమలమందు పడి వున్న కొందరు సేవకులను వారు చూశారు. వారాప్పుడు దయార్ధ్ర హృదయులై వారితో అయ్యలార! మీరీ విధంగా నిద్రహారాలు లేకుండా నేనేదో చేస్తానని వేచి ఉండటం మంచిది కాదు మీ కోరిక మోక్షా పేక్ష అని నాకు తెలుసు. అది సామాన్యులెవరికి సాధ్యము కాదు. దానికి శమదమాది సంపన్న జనకమైన మనః పరిపక్వము కావలెను. మీరింకా ఆ స్థితికి చేరుకో లేదు. భూలోకంలో మీరింకా చేయవలసిన పనులు, అనుభవించ వలసిన సుఖ సంపదలున్నాయి. కనుక మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్ళి నిత్యము గౌడమంట్ర రాజాన్ని పారాఅయాణ చేస్తూ, కౌడిన్య ఋషి పుంగవుని అంశమున జన్మించిన గౌడులను ఆశ్రయించి, వారి వంశావళులను స్తుతింపు చుండిన ఆ గృహస్తులు మిమ్ములను ఎల్లపుడు పోషించి రక్షింపగలరు. నాఆశీః ప్రభావము వలన మీ యందు మన కులస్థులందరికి ఆదరణ కలిగి మిమ్మలను గౌరవ మర్యాదలతో అదరిస్తారు అని వారికి బోధించాడు. అప్పుడు వారంతా ప్రభూ! తమ యాజ్ఞానుసారం మేము నడుచుకుంటాము గౌడ మంత్ర పునశ్చరణ వలన మాకు ముక్తి కల్గునట్లు అనుగ్రహింపుడు అని ప్రార్థించారు. సానికి సంతోషించిన కాటమ మహేశ్వరుడు – మీరు కోరిన ప్రకారము పరమేశ్వరుడు మిమ్మలను అనుగ్రహింతుడు గాక అని చెప్పి తిరిగి సమాఅధిస్థితి యందు లీనమయ్యాడు. అప్పుడా గౌడస్తుతి పాఠకులు తమ తమ నివాసములకు వెళ్ళి కాటమ మహ్ఱ్శ్వరుని ఆనతి ప్రకారాం నడుచుకోజొచ్చారు. వీరు అమృత సిద్దరస స్రావక మనే మహామంత్రాఅన్ని తోటి వారికి ఉపదేశించి వారిని తమ శిష్యులుగా చేసుకుని, వారామంత్ర సిధ్ధిని పొందిన వారై తత్ప్రభావమున ఆనాయసముగా అమృత సిధ్ధ రసమును కల్పించి బ్రాహ్మణాది సమస్త జాతుల కిచ్చుచు వచ్చిరి – వారలా అమృత సిద్ధ రసమును త్రాగి సత్వ గుణ సంపన్నులై ఈశ్వరు నారాధింపుచు అనంతరము శాశ్వత కైవల్యమును పొందిరి.
ఇట్టి మహా తపస్సంపన్నులగు మన వారా కాలమున ఉందే వారనుటకు వేరే తార్కాణం ఆవసరం లేదు. అందులో కలియుగములో మొదటి వాడు కాటామ మహేశ్వరుడు. ఇప్పటికీ మన వారు ఆ పురాణ పురుషుని పూజిస్తున్నట్టు ప్రత్యక్ష ప్రమాణాములున్నవి. తెలంగాణలో ప్రతి ఉత్సవంలోను మన వారు కాటమయ్యాను విధిగా పూజిస్తారు. అట్టి స్తుతి పాఠకుల మిప్పుడు యేనాట్లు, జట్టీలని గౌరవ నామములతో పిలుచుచు మానవారు వారిలో కొందరిని గౌడవందు అని కూడా పిలుస్తారు. సామాన్యంగా వీరు వైష్ణవ మత సాంప్రదాయకమైనా వైష్ణవులు. వీరే మనకు గురువులని వస్తూ వుండడం మనం చూస్తున్నాము. శివారాధకులు, శివ పూజా దురంధరులైన గౌడులకు వైష్ణవులు ఎలా గురువులయ్యారో తెలియలేదు. ఒక వేళ కాటమ గౌడుకు ఉపదేశమిచ్చిన జ్ఞాన మహా ఋషి వైష్ణవుడై ఉండ వచ్చును. ఆయన ఉపదేశములలో విష్ణువు గురించియే చెప్పి ఉన్నాడు. గౌడులకు శివ-కేశవ భేదం లేదని ఇరువురు సమాన ఆరాధ్య దైవములని మనకీ ఇతిహాసము వలన తెలియాచున్నది.
కళింగ రాజ్యము ఉత్తరమున బ్రాహ్మణీ, మహానది నుండి, దక్షిణమున నాగావళి వరకు వ్యాపించి ఉండెను. ఇది 1. ఉత్కళ, 2. ఉత్తరతోసల, 3. దక్షిణతోసల, 4. కాంగోడా, 5. కళింగ అను ఐదు భాగములుగ్ విభజింపబడెను. ఇది చోళరాజు రాజేంద్ర చోళుని అధిపత్యము క్రిందకు సా.శ. 1020 సరికి వచ్చెను. పిమ్మట విజయనగర రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు సా.శ. 1515 సంI ప్రాంతమున కళింగ గంగా వంశపు రాజులను జయించిన తరువాత, ఈ గంగ వంశ రాజులకు విజయనగర రాజులతో సంబంధ బాంధవ్యములు వెలసినవి. కాన ఈ గంగా వంశ రాజుల ప్రతిభ ఉత్తరమున మహానది మొదలు పశ్చిమమున తుంగభద్రానది, దక్షిణమున కన్యాకుమారి అగ్రము వరకు వ్యాపించి ఉండెను. మౌర్యచక్రవర్తి అశోకుడు క్రీ.పూ. 261 లో కళింగ దేశము పైకి దండయాత్ర జరుపు నప్పటికి కళింగ రాజ్య పాలకుడు భారవేళుడు. ఇతడు జైన మతం అవలంభించేవాడు. ఇతడు లక్షల సంఖలో వున్న మౌర్య సైన్యమును వేల సంఖ్యలో వున్న కళింగ సైన్యముతో ఎదుర్కుని, చాలా సాహసోపేతంగా ఎదురుంచి, చివరకు విధిలేక ప్రజాక్షయమునకు ఇష్టపడక లొంగవలసి వచ్చెను. అశొక చక్రవర్తి అప్పటి బౌద్ధపీఠాధీపతి అయిన ఉపగుప్తుని బోధనల వలన రక్తపాతంతో కూడిన యుద్ధములపై విరక్తి కలిగి బౌద్ధ సైన్యాసము స్వీకరించెను. తాను బుద్ధ దేవుని ప్రతినిధిగా భావించి రాజ్యపాలన చేసెను. అశోక చక్రవర్తి యుద్ధములపై విరక్తి పొందినప్పటి నుండి బౌద్ధ సన్యాసిగా మారిపోయెను. వేట, మాంసభోజనము విసర్జించెను. బౌద్ధ మత ప్రచారనికి తన రాజ్యములో ఒక ప్రత్యేక శాఖను ఏర్పరచెను. అదే ధర్మమహామంత్రి శాఖ. ఈ ధర్మ మహామంత్రి ఆధిపత్యము కింద అనేక సహాయ మంత్రులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రములో మత ప్రచార కార్యక్రమమును నిర్వర్తిస్తారు. వీరి ప్రత్యేక మత ప్రచారక ఉద్యోగులు గ్రామములలోను, పట్టణంలలోను సంచారము చేసి, బౌద్ధమత సూత్రాలు ప్రచారం చేయడమే కాకుండా ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటిని ప్రభుత్వాలకు తెలుపుచు వారి అక్కరలను తీరుస్తూంటారు. అశోక చక్రవర్తి తన కుమారుడు మహేంద్రుని, కుమార్తె సంఘమిత్రను సింహళానికి (శ్రీలంక) పంపి బౌధ్ధమత ప్రచారాం చేయించిన సంగతి తెలిసినదే. అశోకుడు బౌద్ధం అవలంభించిన తరువాత తన సైన్యాన్ని యుద్ధ కాంక్ష నుండి, మత వ్యాప్తి లోనికి దింపాడు. అప్పటి నుండి సైన్యానికి శ్రీ సేన అని పేరు వచ్చెను. ఈ శ్రీ సేనలోని వారె మన శ్రీశయన కులస్థులు. ఈ సత్యము తెలిసిస్న సెగిడు జాతి ప్రతినిధూ సా.శ.1938లో సెగిడి, చెవర, చెట్టు గీత మొదలగు జాతులను అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం శ్రీశయన జాతిగా నమోదు చేయించిరి. భారవేలుని అనంతరం కళింగములో సుస్థిరమైన ప్రభుత్వము వున్నట్లు చరిత్రాధారాలు లేవు. అశోకుని తరువాత బొద్ధమతాన్ని ఆదరించిన రాజైన కనిష్కుని ఆధిపత్యములో కొన్నాళ్ళు కళింగ దేశమున్నట్లు కనిపిస్తుంది. అశోకుని పాలనలో సేనానాయకులుగా వున్న ఈ స్రీసేనులు గుప్త వంశరాజులు, బలహీనమైన పిమ్మట కళింగ రాజ్య ప్రాంతాలలో స్వతంత్రించి, స్వతంత్ర రాజ్యముని స్థాపించారు. వీరి రాజధాని మహానది ఒడ్డున గల కటకమగుట చేత, గంగ అతి పవిత్రమగుట వలన వీరు తమ వంశమునకు గంగ వంశమని, తమ రాజ్యమునకు గంగ రాజ్యమని నామకరణము చేసిరి. సా.శ. 230 నాటికి కళింగ దేశ దక్షిణ భాగాన్ని గంగ వంశపు రాజులు పరిపాలించెనని కొందరు చరిత్రకారులు తెలుపగా, సా.శ. 351లో ప్రారంభమైనదని మతి కొందరి వాదము. ఏది ఏమైనను సా.శ. 351 నాటికి అనంతవర్మన్ కుమారుడు దేవేంద్ర వర్మన్ పరిపాలనలో కళింగ దేశముండెను. సా.శ. 526 సం సరికి మధుకుమార్ నవ అను రాజు పాలించెను. అంటే అంతకుముందు కాలంలో మధుకుమార్ రాజులు పాలించగా సా.శ. 526 అతని వంశమునకు చెందిన మధుకుమార్ నవ నవ క్రొత్త రాజు పాలించెనని అర్ధమగుచున్నది. యీ వంశపు రాజులు సా.శ. 351 నుండి క్రీ. జవ. 960 సం వరకు సుమారు 6 వందల ఏండ్లు నిరాటంకముగా రాఅజ్యపాలన గావించిరి. వీరు ఉదయపురి, దంతపురి, సింహపురి, కటకము, కళింగపట్నము, జయపురములు రాజధానులుగా చేసుకొని రాజ్యపాలన గావించిరి.
ఈ రాజ్యము పై విజయనగర రాజుల ఆధిపత్యము తొలగిన పిమ్మట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాఅజు బలపడి తమ తమ ప్రత్యేక రాజ్యములను ఏర్పరచుకొనిరి. ఈ విధంగా వీరు ఐదు శాఖలుగా విభజింపబడి బంజరాజులని నామము పొందిరి. వీరిలో ఒక శాఖ వారు మహేంద్ర తనయ నదీ ప్రాంతంలో రాజ్యస్థాపన గావించిరి. వీరు పర్లాకిమిడిని కేంద్రముగా తీసుకుని పరిపాలన గావించిరి. కిశోరి, చంద్రదేవు ఈ శాఖకు చెందిన రాజులు... మరియొక శాఖ వారు జయపురమును రాజధానిగా చేసుకుని పాలింపదొడగిరి. ఈ వంశములో చివరి రాజు విక్రమదేవ వర్మ. అట్లే మిగిలిన భంజ రాజులు కళీంగములో ఐదు ప్రాంతములందు రాజధానులను స్థాపించి పరిపాలించిరి. వీరిలో మరి కొన్ని శాఖల వారు సిరి పురము, వినిత పురములను రాజధానిగా చేసుకొనిరి. భంజరాజులలో రణభంజుడు, అతని తండ్రి చతుర భంజుడు లేక గంథ హతకుడు ముఖ్యులు. వీరి రాఅజధాని ఖిజ్జంగ కోట. గంగ వంశపు రాజులు పరిపాలనా దక్షులే కాకుండా, శిల్పకళాకు విశేష సేవ చేసిరి. శైవమతమును విశేషంగా ఆదరించి అనేక శివాలయములను నిర్మింపజేసిరి. శైవమతముతో పాటు, వైష్ణవమును, శాక్తాలయములను కూడా ఆదరించి మత సహనము పాటించిరి. సా.శ. 6వ శతాబ్దము నాటికి కళింగములో శైవాలయములు, వైష్ణాలయాములు, శక్త్యాలయములతో పాటు బౌద్ధ జైన మఠములు కూడా ప్రక్క ప్రక్కన సామరస్యంతో వర్ధిల్లెను. ఈ దేవాలయ నిర్మాణము ఆరవ శతాబ్ద6 నుండి 10వ శతాబ్దం వరకు అవిచ్ఛిన్నంగాఅ జరిగెను. మహానది ఒడ్డున గల గంగాధారి పురంలో నీల మాధవ దేవాలయము (విష్ణాలయము) గణేశ్వరపురములో గల పంచాయతన దేవాలయములు వైష్ణాలయములు, దంతపురి బౌద్ధరాయము, బుద్ధుని దంతముంచి నిర్మింపబడి, కాలక్రమమున శిథిలమై మన దేశానికి హ్యూన్ త్సాంగ్ వచ్చునాటికి సా.శ. 7వ శతాబ్దములో దానిపై పుష్పగిరి ఆరామము వెలసియున్నదని హూన్ త్సాంగ్ చైనా యాత్రికుని రచనలు బట్టి తెలియచున్నది. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు క్రీ.పూ. నాల్గవ శతాబ్దమున జైన మత ప్రచారము చేయుచు కళింగ దేశములో పర్యటించినట్లు చరిత్రాధారములు ఉన్నాయి. అటు పిమ్మట నందవంశపు రాజులు మహావీరుని జైన మతాన్ని మగధ రాజ్యములో వ్యాపింపజేసిరి. గంగ వంశపు రాజులలో ఒక శాఖ వారగు శైలోద్భవ వంశమునకు చెందిన ధర్మరాజు వాజపేయము, అశ్వమేధము, రాజసూయాయాగములు చేసి ఎనలెని కీర్తి గావించెను. ఈవంశమునకు చెందిన శుభకర అను రాజు సా.శ. 8వ శతాబ్దము ప్రాంతములో ప్రజన అను బౌద్ధ సన్యాసిని చైనా దేశానికి పంపి అక్కడ బౌద్ధమతమును ప్రచారము చేసినట్లు చరిత్రాఆధారము ఉంది. హ్యూన్ త్సాంగ్ సా.శ. 638 లో ఓఢ్ర దేశమును దర్శించి దాని రాజధాని 5 మైళ్ళ పొడవు వున్నన్న దనియు, దానిలో 50 హిందూ దేవాలయములు, 10 బౌద్ధ విద్యాపీఠములలో 10 వేల బౌద్ధ సన్యాసులు నివసించు చున్నారని అది రేవు పట్టణంగా వర్ధులుచున్నట్లు తన డైరీలో వ్రాసెను. అది పూరీ అయి ఉండవచ్చునని కొందరు చరిత్రకారులు ఊహించిరి. కాని దాని చుట్ల ప్రక్కల బౌద్ధ జైన మఠ చిహ్నములు, కాంపించాలేదు. కాని హ్యూన్ త్సాంగ్ దర్శించిన రాజధాని కటకమై యుండుననియు, అక్కడ నుండి పడవలు బయలుదేరి మహానది శాఖల గుండా పోయి బంగాళా ఖాతములో ప్రవేశించి విదేశములతో వర్తక వ్యాపారములు చేసెనని కొ6దరు చరిత్రకారులు ఊహించుచున్నారు. గంగ వంశపు రాజులు మొదట బౌద్ధ, జైనాములను ఆదరించినను కాల క్రమేపి శైవమును పోషించి, శైవాలయములను నెలకొల్పి అటు పిమ్మట మత సహనము అవలంభించి వైష్ణాలయములను, శాక్త్యాలయములను కూడా నిర్మింపజేసిరి. దీనికి తార్కాణముగా మహేంద్రగిరి పై భీమెశ్వరాలయము, భువనేశ్వరములో లిందరాజ దేవాలయము, నీల మాధవ దేవాలయము, చాముండేశ్వరాలయము, ముక్త్యేశ్వరాలయము, మార్కండేశ్వరాలయము, స్వర్ణజలేశ్వరాలయము, శత్రుఘ్నేశ్వరాలయము, పరశురామేశ్వరాలయము, పశ్చమేశ్వరలాయము, మోహినీ, దుర్గాలయములు ఉన్నాయి. ముఖలింగములో మధుకేశ్వరాలయము, నాగావళీ, వంశధారల మధ్య గల కోటీశ్వరాలయము, సూర్యనాధాలయము, కూర్మనాధాలయములు వెలసినవి. ఈ కూర్మనాధాలయము మొదట శైవాలయముగా ఉండి అటు పిమ్మట వచ్చిన వైష్ణవ మత ప్రభావ6 వలన వైష్ణవాలయముగా మార్చినట్టు దేవాలయమ నిర్మాణమె చెప్పగలదు. దేవాలయ పోషణార్ధము రాజులు కొన్ని గ్రామములను ధారాదత్తం చేసి పూజారులకు వంశపారంపర్య హక్కులను ప్రసాదించిరి. కళింగదేశమున బొద్ధ కాలములో పాళీ భాష, గుప్తుల కాలంలో సంస్కృతముతో పాటు మతృభాష అయిన ఓఢ్రము కూడా వాడుకలో ఉండేను. గంగ వంశమునకు చెందిన భంజ రాజులు ఆంధ్రమును మాతృభాషగా వాడినను సంస్కృత భాషలో పరిచయము కలిగి ఉండిరి. రాజులు భాషా పోషకులే కాకుండా భాషా కారులుగా కూడా వర్ధిల్లిరి. ఉదాహరణకు పర్లాకిమిడిని ఏలిన దేవ్ రాజులు, జయపురమును ఏలిన విక్రమ వర్మాది రాజులు తమ ఆస్థానములో పెక్కు కవులను ఆదరించుటయే కాక, తాము కూడా పెక్కు గ్రంథములను రచించిరి. గంగ వంశపు రాజులు పరాక్రమ వంతులై శత్రుభయంకరులైనను, తమ ప్రజలను కన్నబిడ్డలుగా చూచేవారు. పేదవారికి పెండ్లిండ్లు చేయుట, దిక్కులేని వృద్ధులకు భోజన వసతి, సౌఖర్యములు కల్పించుట, దేవాలయమునకు మాన్యములు ఇచ్చి దేవునకు నిత్యభీగ ప్రసాదములు కల్పించుట, పురోహిత కుంటుంబముల వారీ పోషణ బాధ్యతలు స్వీకరించుట వలన ప్రజలు మిక్కిలి సంతృప్తి చెంది రాజులను దేవునిగా భావించుట మొదలిడిరి. భంజ రాజునకు భంజదేవుడని, అర్క రాఅజును అర్క దేవుడని, ప్రజలు వాడుటచే కాలక్రమేనా అటుపిమ్మట పాలించిన రాజులకు ‘దేవు’ అనుపదము వంశపారంపర్యంగా వాడుకలోనికి వచ్చెను. ఐదవ భంజ రాజులు కళింగదేశ దక్షిణ భాగాన్ని పర్లాకిమిడిని రాజధానిగాను, కలింగపట్టణాన్ని ఓడరేవుగను చేసుకుని పరిపాలించారు. రాజేంద్ర చోళదేవుదు క్ర్ర్.శ. 1020 సంలో కళింగముపై దండెత్తి గంగరాజులను ఓడించినను వారి ప్రతామునకు మెచ్చుకుని వారి రాజ్యమును తమ రాజ్యములో కలుపక పరిపాలనా భారమును వారిపై ఉంచి వారి నుండి కప్పములను మాత్రము వసూలు చేసిరి. చోళరాజులు గ్రామ పాలనకు ప్రాధాన్యతను ఇచ్చిరి. గ్రామపాలనా భారమును అనుభవజ్ఞుడైన ఒక రాజ కుటుంబీకునిపై మోపిరి. ఇతడు గ్రామమంతటిని అజమాయీసి చేసి గ్రామ భాగోగులు చూసుకునేవాడు. వీరినే వీరినే బెవర అను నామంతో పిలిచె వారు. శారీ శయనులను కొన్ని ప్రాఅంతాలలో బెవరులు అని పిలుచుటకి ఇదే కారణం. ప్రాచీన కాలములో రాజులు రథములపై పోయు యుద్ధము చేయువారు. రథములను నడుపువారు రథుకులు. రథానికి ఇంకొక పేరు శకటము, శకటమును నడుపు వాడు శకటి. ఈ శకటి అను పదము కాలాంతరము రూపాంతరము చెంది శగడిగా మారినది. జట అను పదము జడగస్తు, అటవి అనుమాట అడవి గను వాడుకలోనికి వచ్చినవి. శకటి అను పదము శగడిగా మారి- శగడీలు, సెగడీలు, చెగిడీలు అను పేర్లు ప్రాంతీయతను బట్టి, కాలనుగుణంగా వాడుకలోనికి వచ్చినవి. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం అతని అల్లుడగు అలియ రాయల పాలనలో అతడు ఖురానును అవమానించుటచే బహమనీ, బీజాపూర్, బీదరు, బీరారు, అహమ్మదునగరు, గోల్కొండ నవాబులు తమలో తమకు గల వైషమ్యాలను మరచి ఏకమై విజయనగర రాజ్యము పై దండెత్తి దానిని సర్వనాశనం చేసిరి. భూతల స్వర్గమై దేదీప్యమానంగా శోభవంతమైన రాజధానిగా వునా విజయనగరం పై చాలా సార్లు దండెత్తి నేలమట్టము గావించారి. ఈ యుద్ధసందర్భములో విజయనగర రాజులకు సామంతులైన గంగవంశ రాజులు మహమ్మదీయులతో హోరాహోరీగా పోరాడి కడు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దానికి మహమ్మదీయులు మండిపడి గొప్ప పౌరుషవంతులైన వారిని లేకుండా చేయుటకు సంకల్పించి దొరికిన వారిని దొరికినట్టు నరకడం ప్రారంభించారు. వారికి గ్రామ ప్రజలు రక్షణ ఇవ్వగా తురక సిపాయిలు గ్రామంలోని ఇళ్ళలోకి చొరబడి ఆశ్రయమిచ్చిన గృహస్థులను గుఱములకు కట్టి కమ్చాలతో కొట్టి మరణించే వరకు కొట్టి మారణహోమం గావించారు. మిగిలిన రాజ వంశీయులు తమ వలన గ్రామ ప్రజలు కష్ట పడటం చూడలేక అడవులలోకి పోయి తమ జీవనము సాగించారు. పండ్లు దుంపలు తింటూ అవి దొరకని సమయంలో తమ వద్దనున్న పదునైన కత్తులతో తాటి, ఈత మొదలగు చెట్ల మోపులను కోసి దానిలోని తీపి చెక్కలను తిన మొదలెట్టిరి. ఈ మోపులు కోయుటలో దానిలోని తీపి గల్ల ద్రవ పదార్ధము కారుటచే దానిని వారు సేకరించి మద్యముగా మార్చుకొని త్రాగుట మొదలెట్టిరి. కాన అప్పటి నుండి వీరికి రాజ్య పదవులు పోయి కల్లు గీత ముఖ్య వృత్తిగా తయారైనది. కనుక సెగడి, ఏత, సెట్టి బలిజ, ఈడిగ, గవళ, గౌడ, తమిళనాడులో నాడరు అని ప్రాంతీయ భేదాలను బట్టి పిలువబడుచున్నారు.దీనికి తార్కాణముగా శ్రీశయనులు, మన దేశంలో ఏ ప్రాంతంలో నివసించునప్పటికీ పాత సంప్రదాయం బట్టి యుద్ధ విన్యాసములు ప్రదర్శించుచు సాము గారడీలును నెలకొల్పుతూ పండుగ పబ్బములందు కర్రసాము, కత్తి యుద్ద్ధము, ద్వంద్వ యుద్ధము, మొదలగు యుద్ధ విద్యలలో శ్రీశయనులు విన్యాసములు చేస్తున్నారు. పై విశేష వివరణను బట్టి, గౌడ దేశీయులు విద్యాధికులై, విద్యోపాసనాపరులై, సారస్వత జీవనము చేయువారై, సమస్త కళల యందును సంపూర్ణ వికాసము కలిగి ఉచ్చస్థితి నందుటం బట్టి అలంకార శాస్త్రమునందు గౌడ రీతి కొక ప్రత్యేకస్థానము కలిగినది. పంచ గౌడులలో సారస్వతులను విభాగమొకటి పైన తెలిసికొని యున్నాము. కాలక్రమమున గౌడ దేశము పతన మగుట వలన ఆదరణ లేక గౌడులలో కొందరు యితర వృతులను చేపట్టి జీవించుటం బట్టి కొందరు మాత్రమే సారస్వత జీవనము కలిగిన్న వారగుట వలన పంచ గౌడులలో సారస్వత విభాగమేర్పడి ఉండవచ్చును. పై వివరణను బట్టి మనము ఆంధ్రకు వలస వచ్చిన సారస్వత గౌడ బ్రాహ్మణుల వంశీయుల మనుట నిర్వివాదాంశము. ఇట్టి మహా విజ్ఞాన సంపన్నము మహూన్నత జాతియగు గౌడ జాతి మద్య పానాసక్తితోను, మత్స్య-మాంసాది భక్షణ తోను, రాజస తామసా హార ఫలంగా – సాత్విక – సారస్వత జీవనం సన్నగిల్లి ఆచార వ్యవహారములో కూడా సదాచారం విస్మరించి, కాలానుగుణంగా పతనమైన దనుట సుస్పష్టము. ఇట్టి ఉన్నత ఆర్షసారస్వత జీవనం కల్గిన జాతి చరిత్ర సంస్మరణము వలన సన్మార్గోన్ముఖమై, సదాచారాభిలాష కల్గి, సంస్కారం పొంది, సంస్కృతమై, ఉత్తమ సంస్కృతిని అలవర్చుకుని పూర్వపు ఔన్నత్యాన్ని ఉన్నతిని నిరంతర కృషి, క్రమ శిక్షణల వలన సంపాదించి మరల గౌడులు అకుంఠిత కార్య దీక్షలతో ప్రాచీన ఔన్నత్యాన్ని అనతికాలంలో పొంద గలరు అనుటలో ఎట్టి సందేహం లేదు.
నానాస్వాద రసముల యెుక్కయు, ఖండ చెక్కరల యు, గుడ సంబంధములైన భో‘జనములు వేలకొలది సంపూర్ణములైనవి, గౌడ శబ్దము ఆస్వాద్యమైన భోజన, పానీయ, ఆసవాది పరంగా శ్రీరాముడు సురాదులను వాడినట్లు దీని వల్ల తెలుస్తుంది.
గౌడ బ్రాహ్మణులు - బీహారుకు, వంగదేశానికి, భువనేశ్వరమునకు నడుమ గల దేశము. బంగాళమునకు ముఖ్య పట్టణంగా నుండిన గౌడియను పట్టణాన్ని బట్టి యీ ప్రదేశ వాసులకు గౌడి బ్రాహ్మణులని పేరు కలిగినది. వీరు మత్స్య మాంసములను భక్షిస్తారు. వీరిలో అగ్రదాని గౌడ బ్రాహ్మణులు, ఆది గౌడ బ్రాహ్మణులు, కీర్తన్య గౌడ బ్రాహ్మణులు, శుక్లవాల గౌడ బ్రాహ్మణులను వారు కలరు. వాడుక గౌడ బ్రాహ్మణులని వ్యవహరింతురు.
మూల గ్రంథాలు ఋగ్వేదము, శివనందీశ్వర సంవాదము, శివతత్త్వసారము, బోధాయన సూత్రం, మత్స్య పురాణం, స్కంద పురాణం, బృహత్ సంహిత, హితోపదేశం, ప్రబోధ చంద్రోదయం, మూహుర్త చింతామణి, వరహా శాసనం, పురాణ నామ చంద్రిక, మహా భారతం, ఖాలీపురం తామ్రశాసనం, బ్రాహ్మణోత్పత్తి మార్తాండం, అది గౌడ దీపిక, మను ధర్మశాస్త్రము, సాహిత్య దర్పణం, మాండూక్యోపనిషత్తు, సనత్కుమార సంహితం, కచ దేవయాని కథ, శౌనక శుక్ర సంవాదము. మల్లిఖార్జున సిద్ధయోగి గౌడపురాణ, గంగవంశ చరిత్ర, వాల్మీకి రామాయణం, సుశ్రుత సంహిత, కల్హణ రాజతరంగిణి, శతపథ బ్రాహ్మణం, కాశీయోగీశ్వరుల వారు మౌఖికంగా చెప్పిన బ్రాహ్మణ చరిత్ర[3].
మూలాలు
[మార్చు]- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 https://www.examrace.com/Study-Material/History/Kingdoms-Society-Economy/Kingdoms-of-India.html https://www.ancient.eu/Gauda_Kingdom/
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-02. Retrieved 2020-10-25.
- ↑ 3.0 3.1 3.2 3.3 https://www.mintageworld.com/media/detail/11236-the-gauda-kingdom/