ధనూరాశి
ధనూరాశి వారి గుణగణాలు
[మార్చు]ధనూరాశి వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగిఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండీ సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకు ఏమి చేయలేక పోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్య లేరు. ఆత్మీయుల ప్రతిభా పాతవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వర్గము వారితోనె బద్ధ వైరము ఏర్పడుతుంది. వారు మిమ్మలను ఆర్థికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చెతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శముగా ఉండాలని వీరు భావిస్తారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించ లేని విషయముగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనము కొరకు ప్రాధెయపడరు. ధనమె విరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ, మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చుస్తారు. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వెస్తారు. స్వంత వారిని రక్షించే ప్రయత్నము చెయ్యరు. ఏ విషయములో అతిగా కలుగ చెసుకోరు. వీరి మాటను దిక్కరించిన వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసు కోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంత కాలము దూరమవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహొదర, సహోదరీ వర్గానికి చెసే సహాయము విపరీతాలకు దారి తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనూరాశి వారు మారక వారి సింద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఏంపికవుతారు. సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు, ఎందరికో అవకాశము ఔతాయి. అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి ఔతారు. తమ స్వంత వారికి మంచి అవకాశము ఉండదు కానుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చి దిద్దడములో విఫలము ఔతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశా కాలములో కళత్ ముతో విబేధాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
గ్యాలరీ
[మార్చు]-
14వ-/15వ శతాబ్దపు అరబిక్ జ్యోతిష్య గ్రంథం బుక్ ఆఫ్ వండర్స్లో వర్ణించబడిన ధనుస్సు
-
ధనుస్సు - ది సెంటార్, జాతకం నుండి 'ది బుక్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇస్కందర్" నుండి వివరాలు
-
1512 జర్మన్ వుడ్కట్ నుండి ధనుస్సు
-
జోహాన్ ఎలెర్ట్ బోడే ద్వారా యురేనోగ్రాఫియాలో ప్రచురించబడిన ధనుస్సు యొక్క ప్రతీకాత్మక ప్రాతినిధ్యం . ఉష్ణమండల జ్యోతిషశాస్త్రంలో, నక్షత్రరాశి, జ్యోతిషశాస్త్ర సంకేతాల మధ్య అనురూప్యం లేదు
ధనూరాశి కొన్ని జ్యోతిష విషయాలు
[మార్చు]ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విశ్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు. అల్ప సంతానం, ప్రకృతి ఉష్ణ ప్రకృతి, కాలపురుషుని శరీర భాగంలో తొడ భాగం, కపిల వర్ణం, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ గ్రహానికి అధిపతి గురువు. ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్ఛ, నీచాలను పొందదు.
- ఈ రాశిలో నిరయన రవి దిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు.
- ఈ రాశి విద్యాలయాలు, న్యాయస్థానములు, ధర్మస్థాపనలు, చర్చీలు, మసీదులు, శరణాలయాలు, సత్రములు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది.
- ఈ రాశి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, మతబోధకులను మొదలైన వారిని సూచిస్తుంది.
- ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా, వినయ సంపన్నత, పెద్దల ఎడ గౌరవ భావం, మంచి మైత్రీ భావం, శీఘ్రకోపం, ఉపన్యాసకులు, ఉపన్యాసకులుగా ఉంటారు.
- ఈ రాశి వారికి పద మూడవ సంవత్సరంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.
- ఈ రాశి జాతీయంగా కలకత్తా, గాంగ్ టక్, జోటార్ ఘాట్, డార్జిలింగ్, ఆలిపూర్, కృష్ణసాగర్, సాహిబ్ గాం, సిల్లి గురి, చుంచూరు మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది.
- ఈ రాశి అంతర్జాతీయంగా అస్ట్రేలియా, అరేబియా, అవిగ్నాస్, ఫిలిక్స్, హంగేరి, ఈటలీ, కొలోగ్న్, మొరాలియా, లిగూరియా, మడగాస్కర్, ఫ్రాన్స్ మొదలైన దేశాలను సూచిస్తుంది.
- ఈ రాశి కీళ్ళ వాతం, వాతం, ఊపిరితిత్తుల వ్యాధి, నడుము నొప్పి, ఎముకలు చిట్లుట మొదలైన రోగములకు కారకత్వం వహిస్తుంది.