Coordinates: 16°12′00″N 80°32′00″E / 16.2°N 80.5333°E / 16.2; 80.5333

చేబ్రోలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 135: పంక్తి 135:
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తోట నాగమల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తోట నాగమల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==

09:06, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

చేబ్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,626
 - పురుషులు 5,392
 - స్త్రీలు 5,154
 - గృహాల సంఖ్య 2,551
పిన్ కోడ్ 522 212
ఎస్.టి.డి కోడ్ 08644
  ?చేబ్రోలు మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
View of చేబ్రోలు, India
View of చేబ్రోలు, India
గుంటూరు జిల్లా పటంలో చేబ్రోలు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో చేబ్రోలు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో చేబ్రోలు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′00″N 80°32′00″E / 16.2°N 80.5333°E / 16.2; 80.5333
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం చేబ్రోలు
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 11
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
68,810 (2001 నాటికి)
• 35580
• 33230
• 64.65
• 72.50
• 56.21


ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామము మరియు మండల కేంద్రం. PIN Code. 522 212., STD Code=08644.

చేబ్రోలు, గుంటూరు - చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. ఇది పొన్నూరు శాసనసభ నియోజక వర్గంలో భాగంగా ఉంది. భారతదేశంలోనే అరుదైన బ్రహ్మ ఆలయాల్లో ఒకటైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం చేబ్రోలులో ఉన్నది.

చరిత్ర

పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శాసనాలు మరియు పురాతన నాణేలు లభ్యమైనవి. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు మరియు కాకతీయ సామ్రాజ్యములలో ప్రాంతీయ దుర్గముగా ఉన్నది. చేబ్రోలుకు పూర్వము శంభోలు అనే పేరు ఉన్నది. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరుపుట్టింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమైనవి. యుద్ధమల్లుని విజయవాడ శాసనములో చేబ్రోలు యొక్క ప్రస్తావన ఉన్నది.[1] కాకతీయుల కాలములో చేబ్రోలు ప్రసిద్ధి చెందినది. కాకతీయుల సేనాని, నృత్యరత్నావళి రచించిన జయాప సేనాని చేబ్రోలు దుర్గాన్ని పాలించినాడు.

గ్రామనామ వివరణ

చేబ్రోలు అనే గ్రామనామం కొత్తరాతియుగం నాటి ప్రాక్తన చారిత్రిక దశకు చెందినది. ఆ బృహత్ శిలాయుగంలో రాగి, ఇనుము వంటి లోహాలు కనుగొని లోహపరిశ్రమ ప్రారంభించిన విషయాలను సూచించే గ్రామనామాల్లో చేబ్రోలు కూడా ఒకటి అని పరిశోధకులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రాగి లేక ఇత్తడి పాత్రను చెంబు అంటారు. భాషావేత్తలు ఈ కారణంగా చెం అనే పదం సంస్కృతంలోని తామ్రకు సమానం. ఈ నేపథ్యంలో చేబ్రోలు అన్న పేరు కొత్తరాతియుగంలో రాగి లేక ఇత్తడి పనివాళ్లను ఆధారం చేసుకుని ఏర్పడిందని భావిస్తున్నారు.[2]

గ్రామంలోని దేవాలయాలు

  1. భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో ఒకటి చేబ్రోలులో వుంది. ఇక్కడి బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 19వ శతాబ్ధి ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని ప్రతీతి. పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లు ప్రసిద్ధి. కాలాంతరమున కొన్ని కాలగర్భమున కలిసి పోయినవి.
  2. శ్రీ నాగేశ్వరస్వామి దేవాలయం;- ఈ ఆలయ గాలిగోపురం, విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జులై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8] & [9]
  3. చేబ్రోలు గొల్లపాలెంలో నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, 2014,మార్చ్-9న, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సుమారుగా 2 లక్షల రూపాయల నగదును ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా, 5 వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [6]
  4. చేబ్రోలు గ్రామంలో బ్రహ్మ దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, 2014,మే-18 నుండి 26 వరకు నిర్వహించెదరు. [7]
  5. శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
  6. శ్రీ ఆదికేశ్వస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నూతన గాలిగోపుర నిర్మాణానికీ, విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జులై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8] & [9]
  7. శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జులై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8] & [9]

గ్రామ పంచాయతీ

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తోట నాగమల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]


గ్రామ ప్రముఖులు

వి.వి.ఎల్. గా ప్రసిద్ధులైన శ్రీ వాసిలి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు (10-7-1930 నుండి 8-10-2013) ఈ గ్రామంలోనే జన్మించారు. వీరు పి.జి. చేసి పి.హెచ్.డి చేశారు. ప్రముఖ నాటక రవయిత, విమర్శకులని మెప్పించే కవి. ఎన్నో ప్రసిద్ధ పద్యకావ్యాలు, విమర్శనా రచనలు, కథలు, నవలఊ, నాటకాలు రచించి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ గొప్ప పదవులలో పని చేశారు. వీరు 1991 నుండి కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో ఆస్థాన కవిగా పని చేశారు. [5]

గ్రామ విశేషాలు

చేబ్రోలుకు సమీపము ఉన్న బకింగ్‌హాం కాలువ జల రవాణాకు మరియు నీటిపారుదలకు ఉపయోగ్యముగా ఉన్నది.

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 10546
  • పురుషులు 5392
  • మహిళలు 5154
  • నివాసగ్రుహాలు 2551
  • విస్తీర్ణం 2126 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • గుండవరం 3 కి.మీ
  • కోవెలమూడి 4 కి.మీ
  • వేటపాలెం 5 కి.మీ
  • నారాకోడూరు 5 కి.మీ
  • శ్రీరంగాపురం 5 కి.మీ

సమీప మండలాలు

  • పశ్చిమాన వట్టిచెరుకూరు మండలం
  • తూర్పున చుండూరు మండలం
  • దక్షణాన పొన్నూరు మండలం
  • ఉత్తరాన గుంటూరు మండలం

మండలంలోని గ్రామాలు

చేబ్రోలు లోని బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయం.
[3]

చిత్రమాలిక


మూలాలు

  1. Brāhmanism, Jainism, and Buddhism in Āndhra Dēśa By P. Arundhati పేజీ.72 [1]
  2. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:పేజీ.26
  3. http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&district=6&block=8&reportLevel=3

[4] ఈనాడు గుంటూరు రూరల్; ఆగష్టు-19, 2013. 11వ పేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,జనవరి-24. [6] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,మార్చ్-10, 2వ పేజీ. [7] ఈనాడు గుంటూరు/పొన్నూరు; 2014,మే-19; 2వ పేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జూన్-22; 1వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జులై-21; 2వ పేజీ.

బయటి లింకులు


"https://te.wikipedia.org/w/index.php?title=చేబ్రోలు&oldid=1272766" నుండి వెలికితీశారు