వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 64: పంక్తి 64:
అవన్ని వికిపీడియా సమావేశాలకోసం వాడుతున్నారని అర్ధం చేసుకుంటాను కాని ఒక '''స్టాండర్డ్''' ( మీడియా వికి టెంప్లేట్ ని మ్యాట్ఛ్ అయ్యేవిధంగా ) '''బ్యానర్ టెంప్లేట్''' ఉంటే మంచిడని నా ఆలోచన . అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉందటమే కాకుండా జనాలకి క్లిక్ చేయాలనిపిస్తదని నా ఆలోచన . --[[వాడుకరి:పవి|పవి]] ([[వాడుకరి చర్చ:పవి|చర్చ]]) 06:01, 15 జూలై 2013 (UTC)
అవన్ని వికిపీడియా సమావేశాలకోసం వాడుతున్నారని అర్ధం చేసుకుంటాను కాని ఒక '''స్టాండర్డ్''' ( మీడియా వికి టెంప్లేట్ ని మ్యాట్ఛ్ అయ్యేవిధంగా ) '''బ్యానర్ టెంప్లేట్''' ఉంటే మంచిడని నా ఆలోచన . అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉందటమే కాకుండా జనాలకి క్లిక్ చేయాలనిపిస్తదని నా ఆలోచన . --[[వాడుకరి:పవి|పవి]] ([[వాడుకరి చర్చ:పవి|చర్చ]]) 06:01, 15 జూలై 2013 (UTC)
:: పవి గారు మీ సద్విమర్శకు ధన్యవాదాలు. మీరు ప్రస్తుతించిన సమస్య తీరాలంటే రెండు మార్గాలు నాకు తోచాయి. ఒకటి ఇక నుండి బ్యానర్ల బాద్యత మీరు తీసుకుంటే మంచిది. రెండు లేదా మన వాళ్ళలో ఒక నలుగురికి దీనిని ఎలా చేయాలో నేర్పితే బాగుంటుంది. రెండవది చేస్తే మంచిదని నా నమ్మకం. మీరు రడీ అంటే వచ్చే ఆదివారం నాడు మీరు మన తెలుగు వికీ సమావేశంలో దీనిపై ఒక సెషన్ తీసుకోవచ్చు. ఏమంటారు? [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])10:04, 16 జూలై 2013 (UTC)
:: పవి గారు మీ సద్విమర్శకు ధన్యవాదాలు. మీరు ప్రస్తుతించిన సమస్య తీరాలంటే రెండు మార్గాలు నాకు తోచాయి. ఒకటి ఇక నుండి బ్యానర్ల బాద్యత మీరు తీసుకుంటే మంచిది. రెండు లేదా మన వాళ్ళలో ఒక నలుగురికి దీనిని ఎలా చేయాలో నేర్పితే బాగుంటుంది. రెండవది చేస్తే మంచిదని నా నమ్మకం. మీరు రడీ అంటే వచ్చే ఆదివారం నాడు మీరు మన తెలుగు వికీ సమావేశంలో దీనిపై ఒక సెషన్ తీసుకోవచ్చు. ఏమంటారు? [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])10:04, 16 జూలై 2013 (UTC)
::::సహాయం చేయటానికి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు , కాని నేనిప్పుడు భాగ్యనగరం లో నివసించట్లేదు కాబట్టి నలుగురిని కలిసి నేర్పలేను . కాని నేను ఒక సహాయపట్టి మొదలు పెట్టగలను . అది ఎక్కడ ఉందాలో కొంచం తెలుపగలరు . --[[వాడుకరి:పవి|పవి]] ([[వాడుకరి చర్చ:పవి|చర్చ]]) 11:07, 1 ఆగష్టు 2013 (UTC)


== వికీపీడియాలో మామూలు జనం ఏం చూస్తున్నారు? ==
== వికీపీడియాలో మామూలు జనం ఏం చూస్తున్నారు? ==

11:07, 1 ఆగస్టు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

<br=clear all>

ఎవరి మొలకల బాధ్యత వారికి

మొలకలను ప్రారంభించి, అవి ఇంకా ఎదగకపోతే, ఆయా సభ్యులకు వారు సృష్టించిన మొలకల జాబితాను విస్తరించేందుకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికిప్పుడే అన్నీ విస్తరించాలని కాదు. కనీసం ఆ దిశగా కృషి చేస్తారన్న ఆశతో. ముందుగా నేను మొదలుపెట్టిన వ్యాసాల్లో ఇంకా మొలకలు గానే ఉన్న వ్యాసాల జాబితా ఇక్కడ తయారుచేసుకున్నాను... వాటితో కుస్తీపడదామని. ఇంకా ఎవరైనా సభ్యులకు ఆసక్తి ఉంటే వారి వారి మొలకల జాబితాలు కూడా తయారు చేయగలను. --వైజాసత్య (చర్చ) 05:00, 3 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పద్దతి మంచిదే. ఇది నాకు అమోద యోగ్యమే . ముందుగా నాతో ప్రారంభించండి. నా వంతు కృషిచేస్తాను. --t.sujatha (చర్చ) 18:04, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుజాత గారూ, మొలకలను విస్తరించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ మొలకల జాబితా ఇక్కడ ఉంది చూడండి. మీరు సాధారణంగా ఎప్పుడూ పెద్ద వ్యాసాలే వ్రాస్తారు. అందుకే మీ మొలకల జాబితా అంత చిన్నదిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. --వైజాసత్య (చర్చ) 02:37, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరు తయారుచేశారనే విషయం ముఖ్యమైనదే కానీ ఏనెలకానెల మొలకల విస్తరణ మొదటివారం చేపట్టి అందరూ సమైక్యంగా వాటిని విస్తరించడం బాగుంటుంది. ఒక నెల (ఏప్రిల్) విజయవంతంగా కార్యక్రమాన్ని వైజాసత్యగారు నిర్వహించారు. ప్రతినెల కూడా అదేవిధంగా చేయడమే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 06:31, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చక్కని ఆలోచన. అలాగే రాజశేఖరగారు చెప్పిన విధంగా మే మాసంలో చేసిన విధంగా ప్రతినెల ఈ పని చేపడితే చాలా బాగుంటుందండి. మనం మేలో చేసిన ఏప్రిల్‌ నెలలో చేరిన మొలకల విస్తరణ పని చాలా ఉత్తేజకరంగా జరిగిందనిపించింది. అల్పమైనా, నా వంతు కృషి చేస్తాను. విష్ణు (చర్చ)00:16, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Need Help

I am unable to type in telugu in telugu wikipedia for the past eight days. I use int. explorer. Some body help me to find out the solution. అహ్మద్ నిసార్ (చర్చ) 17:40, 4 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కుడివైపున కల లిప్యంతరీకరణ పెట్టెను గమనించారా, దానిలో మార్ప్చుకుంటూ చూడండి. తెలుగు వస్తుంది. మామూలుగా తెలుగుకు కంట్రోల్ ఎం కొడుతుంటాం కదా అదీ చూడండి...విశ్వనాధ్ (చర్చ) 04:00, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
WP:TH చూడండి. --అర్జున (చర్చ) 05:18, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ సైట్ నేమ్ మార్పుకై అభ్యర్థనకు గానూ మీ మీ సమ్మతం తెలుపండి.

s:వికీసోర్స్:రచ్చబండ#వికీసోర్స్ సైట్ నేమ్ లో మార్పుకు అభ్యర్థన వద్ద మీ మీ సమ్మతి తెలుపగలరు. ప్రస్తుతం సైట్ నేమ్ ఆంగ్లంలో ఉంది. దానిని తెలుగుకి మార్చగోరి ఈ అభ్యర్థన. రహ్మానుద్దీన్ (చర్చ) 04:41, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సోర్స్ పేరు మార్పు

దీని పేరు తప్పక మార్చాలి. దీనికి నా సమ్మతి తెలుపుతున్నాను. మరి పేరు? ..... సిద్ధంగా వున్నదా? అది కూడ చెప్పితే బాగుండేది. కొందరు కొన్ని పేర్లను సూచించే వారు. పేరు గురించి అడగక పోయినా.......... నా దొక సూచన: వికీ సోర్స్ లో వుండే విషయం........ పెట్టబోయే పేరులో ప్రతిబింబించాలి. అందులో కాఫీ హక్కులు లేని గ్రంథాలు మాత్రమే వుంటాయను కుంటే...... ---వికీ పుస్తక భాండాగారం--- అని పెట్టి దానికి ..... చివర్లో ఒక తోక తగిలిస్తే........(కాపీ హక్కులు లేని పుస్తకాలు.... అనే అర్థం వచ్చేటట్లు)Bhaskaranaidu (చర్చ) 05:55, 6 జూలై 2013 (UTC).[ప్రత్యుత్తరం]

బెంగుళూరు తెవికీసమావేశం గురించి వికీ పై ప్రకటన ప్రతిపాదన

సమావేశ ప్రకటన బొమ్మ

బెంగుళూరు రెండవ సమావేశానికి ప్రచారం కల్పించడానికి వెబ్ బేనర్ నుఆరు రోజులు వీకీపీడియా పేజీలపై ప్రకటన ప్రతిపాదించబడినది. అభ్యంతరముంటే ఒక రోజు లోగా స్పందించండి. ప్రస్తుతం ప్రకటితమవుతున్న బ్యానర్ క్రింద గాని లేకపోతే ఏదో ఒకటి యాదృచ్ఛికంగా వచ్చేటట్లు ప్రకటన రూపుదిద్దబడుతుంది.--అర్జున (చర్చ) 15:34, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ధన్యవాదాలు. ప్రకటన చేర్చబడింది. అన్నిటిలో ప్రదర్శించటానికి నిర్వాహక హక్కులు కావాలి. నాకు వికీపీడియాలో మాత్రమే వున్నాయి. మీకు వీలైతే ప్రయత్నించవచ్చు.--అర్జున (చర్చ) 15:28, 8 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ ప్రతిపాదన

  • వెంకటరమణ గారి, నిర్వాహకత్వానికై వైజాసత్య గారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయగలరు.

బంగారాన్ని యెప్పుడు కనిపెట్టారు. దేవ్వుళ్ళ్ల కాలం లోనేనా కాదా

బంగారాన్ని యెప్పుడు కనిపెట్టారు. దేవ్వుళ్ళ్ల కాలం లోనేనా కాదా

  • మీ సందేహాలు వికీపీడియా వ్యాసాల వ్రాయటానికి లేక మార్పులకు సంబంధించినవై వుండాలి. వికీపీడియా గురించి మరింత తెలుసుకొనండి. మీ వాడుకరి చర్చా పేజీలో వున్న లింకులు చూడండి.--అర్జున (చర్చ) 16:05, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

జూన్ 2013 మొలకలు

జూన్ నెలలో సృష్టించబడిన మొలకల జాబితా ఇక్కడ ఉంది. 87 మొలకలున్నాయి. వీటి పనిపట్టడానికి తలా ఒక చెయ్యి వెయ్యాలని మనవి. ఒక్కొక్కరు పది విస్తరిస్తే చాలు. అన్నీ విస్తరించవలసి కాకపోవచ్చు. కొన్ని విలీనం చేయదగినవి కూడా ఉన్నాయి. --వైజాసత్య (చర్చ) 02:07, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిని | తెలుగు వికీ ఫేస్‌బుక్ పేజి లో కూడా పెట్టాను. ఎవరైనా కొత్తవారొస్తారేమో చూద్దాం. --విష్ణు (చర్చ)09:55, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నోటిసు / బానర్లు

ఈ మధ్య కనిపించే బానర్లు అసలు బాలేవు . మీడియా వికి మనకి చానా మంచి టెంప్లేటలిచ్చిండి వాటి వల్ల సైట్ కి ఒక ఆందం వచ్చిండి . కాని ఈ బ్యానర్లు చూస్తుంటే నాకు 19వ శతాబ్దం యాహూ యాడ్స్ గుర్తువస్తున్నాయి .

అవన్ని వికిపీడియా సమావేశాలకోసం వాడుతున్నారని అర్ధం చేసుకుంటాను కాని ఒక స్టాండర్డ్ ( మీడియా వికి టెంప్లేట్ ని మ్యాట్ఛ్ అయ్యేవిధంగా ) బ్యానర్ టెంప్లేట్ ఉంటే మంచిడని నా ఆలోచన . అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉందటమే కాకుండా జనాలకి క్లిక్ చేయాలనిపిస్తదని నా ఆలోచన . --పవి (చర్చ) 06:01, 15 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పవి గారు మీ సద్విమర్శకు ధన్యవాదాలు. మీరు ప్రస్తుతించిన సమస్య తీరాలంటే రెండు మార్గాలు నాకు తోచాయి. ఒకటి ఇక నుండి బ్యానర్ల బాద్యత మీరు తీసుకుంటే మంచిది. రెండు లేదా మన వాళ్ళలో ఒక నలుగురికి దీనిని ఎలా చేయాలో నేర్పితే బాగుంటుంది. రెండవది చేస్తే మంచిదని నా నమ్మకం. మీరు రడీ అంటే వచ్చే ఆదివారం నాడు మీరు మన తెలుగు వికీ సమావేశంలో దీనిపై ఒక సెషన్ తీసుకోవచ్చు. ఏమంటారు? విష్ణు (చర్చ)10:04, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సహాయం చేయటానికి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు , కాని నేనిప్పుడు భాగ్యనగరం లో నివసించట్లేదు కాబట్టి నలుగురిని కలిసి నేర్పలేను . కాని నేను ఒక సహాయపట్టి మొదలు పెట్టగలను . అది ఎక్కడ ఉందాలో కొంచం తెలుపగలరు . --పవి (చర్చ) 11:07, 1 ఆగష్టు 2013 (UTC)

వికీపీడియాలో మామూలు జనం ఏం చూస్తున్నారు?

మొన్న బెంగుళూరు వికీ సమావేశం సందర్భంగా అర్జున గారితో జరిగిన మాటల సందర్భంలో తెలుగు వికీపీడియాకి ఇన్ని విధాలుగా వ్యాసాలు రాస్తున్నాం, అలానే ఎన్నో మంచి మంచి విషయాలు చేర్చబడుతున్నాయి. కానీ సాధారణ ఆఖరి వాడుకరికి ఉన్న అవసరం ఏమిటి? ప్రస్తుతం తెలుగు వికీపీడియాకి జనం ఏం ఆశించి వస్తున్నారు అని ఒక చిన్న ప్రశ్న ఎదురయింది. http://stats.grok.se/te/top వద్ద అత్యధికంగా సందర్శించబడుతున్న పేజీలు కలవు. వీటిని ఒక ప్రాతిపదికగా తీసుకొని అత్యధికంగా చూడబడుతున్న పేజీలు ముందుగా మరింతగా అభివృద్ధి చేయవచ్చు. లేదా వర్తమాన సంఘటనలను ఎప్పటికప్పుడు తాజాపరిచేందుకు(ఉదా: ప్రముఖుల మరణం, అవార్డుల ప్రకటన, భారీ దుర్ఘటనలు, ఎన్నికల ఫలితాలు మొ॥) ఉన్న కొద్ది సభ్యులే దళంగా ఏర్పడి పని చేయడం. ఇంకా ఏమయినా ఆలోచనలుంటే పంచుకోగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:12, 17 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలను ఖరారుచేసుకోవడానికి వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము) లో అధిక వీక్షణలు గల వ్యాసాలు అన్న విభాగం కూడా చూడండి. --అర్జున (చర్చ) 13:24, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ నిర్వాహకత్వ ప్రతిపాదన

లోగో మెరుగునకు ఏకాభిప్రాయం

వి, యా అక్షరములు పెద్ద పరిమాణంలో కొనసాగాలా?

లోగో ప్రతిపాదన

వాడుకరి_చర్చ:Veeven#వికీపీడియా 2.0 ;చిహ్నంలో తప్పులు? అర్థాంతరంగా 2010 లో ఆగిపోయింది. ఆ తరువాత రహ్మనుద్దీన్ ప్రారంభించిన వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_18#తెవికీ లోగో మార్పుకు ప్రతిపాదన చర్చకూడా పెద్దగా స్పందనలు లేకుండా 2013 ఫిభ్రవరిలో ముగిసింది. ప్రస్తుతమున్న లోగోలో అక్షరాలకు లోహిత్ ఖతి (మొదటి అక్షరాన్ని పెద్దదిగా చేయకుండా) వాడితే బాగుంటుందని అప్పటి చర్చలో వీవెన్, కాసుబాబు, వైజాసత్య,రవిచంద్ర మరియు నేను అభిప్రాయపడ్డాము. చంద్రకాంతరావు గారు మొదటి అక్షరము చాలా అక్షరశైలులలో పెద్దసైజులో (వి) అనగా రెండవఅక్షరము (కీ)కు దగ్గరగా వుంటుందని అలా చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతము వి, యా అక్షరాలు పెద్దసైజులో కొనసాగటం బాగుండలేదు. అందుకని కు మీ స్పందన 27జూలై 2013 లోగాతెలియచేయండి.--అర్జున (చర్చ) 05:12, 20 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రస్తుతం ఉన్న వి, యా లు పెద్దగా ఉండటం వలన గ్లోబును కవర్ చేస్తూ ప్రేం మొత్తాన్ని సరిపెట్టుకుంటున్నవి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రక్కన ప్రస్తుతం ఉన్న లోగో పెట్టి చూడండి. నిండుతనం అనేది ఇప్పుడున్న దాన్లోనే ఉన్నదని నా అభిప్రాయం. ఖతి మార్చినా ఆ రెండు అక్షరాలను అలా పెద్దగా ఉంచితే గ్లోబు రెం.డు మూలలను సరిపెట్టుకుంటుంది.విశ్వనాధ్ (చర్చ) 06:25, 20 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • మొదటి అక్షరము పెద్దదిగా చూపెట్టటము, పత్రిక వ్యాసాల అలంకరణలో సర్వసాధారణం. ఇంగ్లీషు భాషలో పెద్ద, చిన్న బడులుండటం వలన ఇంగ్లీషు వికీలోగో అలా చేసివుండవచ్చు. మన తెలుగుకి అదిఅనవసరమనిపిస్తుంది. మన తెలుగు పత్రికల లోగోలు పరిశీలించినా శైలి మార్పులు కనబడతాయి కాని మొదటి అక్షరపరిమాణం పెద్దదిగా వుండదు. --అర్జున (చర్చ) 04:02, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • అక్షరాలు ఎలా ఉండాలనే విషయంపై నేను ఇపుడేమీ చెప్పను కాని, ఇదివరకు నేను చెప్పినట్లుగా అర్జునరావు గారు పైన వివరించినట్లు "వి అక్షరం చాలా అక్షరశైలులలో రెండవ అక్షరం (కీ)కి దగ్గరగా ఉంటుంద"ని నేను ఎప్పుడూ చెప్పలేను. వి అక్షరం ఇతర అక్షరాలకు గుడి ( ి) ఇచ్చిన ఎత్తులో ఉంటుందని మాత్రం చెప్పాను. చాలా ఫాంట్లలో అలా ఉంటుందనే విషయం తెలుసేననుకుంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:52, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఖతి మార్పు

  • నేను వాడే అలంకరణలో అసలు లోగో కనిపించదు కాబట్టి ఇది గమనించలేదు. పైన అర్జునరావుగారు అతికించిన దానికంటే ఇదివరకు రహ్మానుద్దీన్ గారు ప్రతిపాదించిన ఈ లోగో ఇంకా బాగుందనిపిస్తుంది. ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 02:21, 21 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లోగో ప్రతిపాదన 2

లోగోలో NTR,Ramaraja ఖతులు వాడుటకు వీలు కాదా..విశ్వనాధ్ (చర్చ) 12:25, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఇవి చూడండి

http://upload.wikimedia.org/wikipedia/te/3/31/Wikipedia-logo-v2-te-changed_font1.svg http://upload.wikimedia.org/wikipedia/te/c/c6/Wikipedia-logo-v2-te-changed_font2.svg

రహ్మానుద్దీన్ (చర్చ) 19:38, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • రామరాజ ఖతి బావున్నది. (లోగో ప్రతిపాదన 3) అది వాడి చూడండి
లోగో ప్రతిపాదన 3
లోగో కొరకు అనువైన మరిన్ని ఖతులు

...విశ్వనాధ్ (చర్చ) 07:44, 24 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఇది బాగానే అనిపిస్తుంది. వి అక్షరము సాధారణ గుడి అక్షరాల స్థాయిలో వున్నట్లుంది. స్వేచ్ఛానకలుహక్కుల ఖతులకి ప్రాధాన్యం కాబట్టి, ఇటువంటి రూపంగల స్వేచ్ఛాఖతి వుంటే అది వాడడం మంచిది. --అర్జున (చర్చ) 05:37, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది స్వేచ్చా ఖతులలో ఒకటి ntr ఖతిని పైన రహమనుద్దీన్ లింక్ రూపలో ఇచ్చారు. ఇది రామరాజ ఖతి, ఇంకా కృష్ణదేవరాయ, తిమ్మన రెగ్యులర్ లాంతివి ఉన్నాయి. ఇక్కడ అలాటి కొన్ని ఇస్తున్నా వాటిలో ఏది బావుంటుందో చూడండి...విశ్వనాధ్ (చర్చ) 06:37, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. వీటిలో రామరాజ నాకు నచ్చింది. ఇంకొన్ని స్పందనలకోసం ఎదురుచూసి ఆ తరువాత ఏకాభిప్రాయం ఖరారు చేయటానికి వోటు ప్రక్రియ చేయవచ్చు. అన్నట్లు మీ ప్రతిపాదనలో అచ్చుదోషాలు, నీలంరంగు గీత సవరించి లోగోని తాజాపరచండి--అర్జున (చర్చ) 06:48, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ చక్కని లోగో తయారు చేశారు, రామరాజ ఖతి చాలా బాగుంది. కాకపోతే చిన్న సమస్య, "చ్ఛా" లో ఛ వత్తు సరిగా కనిపించడం లేదు. ఇది అచ్చుతప్పా? లేకపోతే లైను క్రిందికి వెళ్ళిపోయిందా. అలా అయితే రెండవ లైను కాస్త చిన్నది చెయ్యండి --వైజాసత్య (చర్చ) 11:46, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Pywikipedia is migrating to git

Hello, Sorry for English but It's very important for bot operators so I hope someone translates this. Pywikipedia is migrating to Git so after July 26, SVN checkouts won't be updated If you're using Pywikipedia you have to switch to git, otherwise you will use out-dated framework and your bot might not work properly. There is a manual for doing that and a blog post explaining about this change in non-technical language. If you have question feel free to ask in mw:Manual talk:Pywikipediabot/Gerrit, mailing list, or in the IRC channel. Best Amir (via Global message delivery). 13:50, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పుస్తకాల డిజిటలైజేషన్

తెలుగు వికీపీడియా అభివృద్ధి ప్రణాలికలో భాగంగా పబ్లిక్ డొమైన్లో ఉన్న తెలుగు పుస్తకాలను డిజిలైజేషన్ చేయడానికి CIS ముందుకు వచ్చినట్లు మనందరికీ తెలుసు. అందుకోసం ముందుగా మనమందరం కలిసి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితాని తయారుచేసుకొంటే బాగుంటుందని భావించాను. దానికోసం ఒక పేజీని ప్రారంభించాను: వికీపీడియా:డిజిటల్ తెలుగు పుస్తకాలు ఇందులో మీకు అతిముఖ్యమైన పుస్తకాలను చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 12:06, 24 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయంలో CIS వారు ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? --వైజాసత్య (చర్చ) 11:47, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఒక 100 ముఖ్యమైన తెలుగు పుస్తకాల్ని గుర్తిస్తే; వారు అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకుంటారు. తర్వాత వాటిని మనం వికీసోర్సులో కొందరు వ్యక్తుల సహాయంతో లిప్యంతరీకరణ చేయడానికి ఆర్థిక ప్రణాళికను తయారుచేసి CIS వారికి పంపిస్తాము. వారు సహాయం చేస్తారని నా నమ్మకం.Rajasekhar1961 (చర్చ) 13:15, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమోవాకాలు. ఖచ్చితంగా దీనికి CISA2K గ్రాంటు నుండి కొంత బడ్జేట్ కేటాయిద్దాం. 100 అతి ముఖ్యమైన తెలుగు పుస్తకాలను గుర్తించడం ఒక పని. కాకపోతే పైలట్‌గా మొదలు ఒక 10 పుస్తకాలు చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఈ అనుభవాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం ఉచితమేమో. అలాగే దీనిని ఒక నిర్దారిత కాలంలో పూర్తి చేస్తే మంచిది. మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు. విష్ణు (చర్చ)04:41, 31 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొబైల్ లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షణ

ఎయిర్సెల్ మరియు ఎయిర్టెల్ వినియోగదారులు మొబైల లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షించవచ్చు. వివరాలకు ఎయిర్సెల్ ప్రకటన మరియు ఎయిర్టెల్ వెబ్ పేజీ చూడండి. తెలుగులో వివరాలకు నా తెలుగు బ్లాగుపోస్ట్ కూడ చూడవచ్చు.--అర్జున (చర్చ) 08:40, 26 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ వ్యాసరచన పోటీని ఆగష్టు 10 తేదీ వరకు పొడిగించాము. కాబట్టి దానిక్రింద మరొక బేనర్ మొబైల్ వికీపీడియా గురించి తయారుచేసి అందరికీ తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 13:29, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రకటనలు ఎక్కువచేయటం ఎక్కువకాలం వుంచటం అంత మంచిది కాదు. వ్యాసరచనపోటీ ప్రకటన తొలగించిన తరువాత ఈ ప్రకటన చేద్దాం. ఔత్సాహికులు దీనికి తగిన బేనర్ ని మరియు సంబంధిత వ్యాసాన్ని రూపొందించమని కోరిక--అర్జున (చర్చ) 06:45, 29 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పంచాయితీ ఎలక్షన్లు ఒక స్వర్ణావకాశం - తెవికీ పవర్ లోకానికి చాటటానికి.

2013 పంచాయితీ ఎలక్షన్లు ఈ నెలాఖరుకు అయిపోతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల, నిజంగా ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వారు ఎందరు గెలిచారో అనే విషయంలో పారదర్శక రిపోర్టు ఎక్కడా లేదు. తెవికీ ఉన్నట్టువంటి ఇన్ ప్రా వల్ల ఆ లోటు మనం చక్కగా తీర్చవచ్చు. మనం చెయ్యవలసిందల్లా పంచాయితీ ఎలక్షను ఫలితాలు ఆయా గ్రామ పుటల్లో ఉంచడమే. మనకు తెలిసిన గ్రామాలు, మనకు తెలిసిన వారి గ్రామాలు అన్నీ ఫోన్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలుసుకొని వేగంగా ఈ దత్తాంశం వ్రాద్దాము. ఆగస్టు తొలి వారం కల్లా మొత్తం అన్ని గ్రామాల వివరాలు వ్రాయగలిగితే ఆ తరువాత మూసలు బట్టి సమ్మరీలు తయారు చేసి చూడవచ్చు. సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు. అలానే మూస కూడా ఒకటి తయారు చెయ్యాలి. Chavakiran (చర్చ) 15:30, 27 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి ఆలోచన చావాకిరణ్ గారు. మనం ఎలాగూ గ్రామల వ్యాసాల్ని విస్తరించాలని ఆలోచిస్తున్నాము. మొత్తం అన్ని గ్రామ పంచాయితీల ఫలితాలు మనకు లభిస్తే వాటి వివరాలను ఒక మూసను తయారుచేసి; సంబంధించిన గ్రామాలలో చేర్చితే బాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:33, 28 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయమై తెలిసిన ఇద్దరు పాత్రికేయులతో మాట్లాడాను. పత్రికాపేక్షోపేక్షలకు అతీతంగా జరిగిన చర్చల్లో, మూడో విడత ఎన్నికలు జరిగాక ఎలెక్షన్ కమిషన్ వారి వెబ్ సైటులో ఈ సమాచారం రావచ్చు అనీ, అదే అన్నిటికన్నా అత్యంత నమ్మదగినదనీ తెలిసింది. అప్పటి వరకూ పైచెప్పిన విధంగా సమాచారం చేర్చటం మంచిది. రహ్మానుద్దీన్ (చర్చ)
  • పార్టీరహితంగా జరిగే పంచాయతి ఎన్నికలలో ఏ పార్టీ వారు ఎన్ని గెలిచారో తెలుసుకోవడం మనకు అసాధ్యమైన పనే. వివిధ పత్రికలలో వచ్చే సమాచారంలో విజయం సాధించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి తేడా లేదు కాని దాదాపు 20-30% అభ్యర్థుల విషయంలో వారికి మద్దతు ఇచ్చిన పార్టీలకు సంబంధించిన సమాచారంలో వైరుధ్యాలున్నాయి. వాటిని సరిచేయాలంటే మనకు ఎలాంటి అధికారిక సమాచారం లభించదు. రహ్మానుద్దీన్ గారు చెప్పినట్లు ఈసీ వెబ్‌సైట్లో పంచాయతీల వారీగా విజయం సాధించిన అభ్యర్థుల జాబితా పెట్టవచ్చు కాని పార్టీల వివరాలు మాత్రం ఉంచరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:43, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

VisualEditor and your Wikipedia

(Please translate this message)

Greetings,

The Wikimedia Foundation will soon turn on VisualEditor for all users, all the time on your Wikipedia. Right now your Wikipedia does not have any local documents on VisualEditor, and we hope that your community can change that. To find out about how you can help with translations visit the TranslationCentral for VisualEditor and read the easy instructions on bringing information to your Wikipedia. The User Guide and the FAQ are very important to have in your language.

We want to find out as much as we can from you about VisualEditor and how it helps your Wikipedia, and having local pages is a great way to start. We also encourage you to leave feedback on Mediawiki where the community can offer ideas, opinions, and point out bugs that may still exist in the software that need to be reported to Bugzilla. If you are able to speak for the concerns of others in English on MediaWiki or locally I encourage you to help your community to be represented in this process.

If you can help translate the user interface for VisualEditor to your language, you can help with that as well. Translatewiki has open tasks for translating VisualEditor. A direct link to translate the user interface is here. You can see how we are doing with those translations here. You need an account on Translatewiki to translate. This account is free and easy to create.

If we can help your community in any way with this process, please let me know and I will do my best to assist your Wikipedia with this |exciting development. You can contact me on my meta talk page or by email. You can also contact Patrick Earley for help with translations and documents on Mediawiki. We look forward to working with you to bring the VisualEditor experience to your Wikipedia! Keegan (WMF) (talk) 19:14, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)
కొత్త దృశ్యసరిచేయు ఉపకరణం వికీసాంకేతికాలు వాడవలసిన అవసరము తొలగించగలదు కావున ఈ ఉపకరణం యొక్క సందేశాలఅనువాదానికి ప్రాధాన్యత మరియు సమిష్టికృషి అవసరం. ఇది ఎలా పనిచేస్తుందోతెలుసుకోవటానికి ఆంగ్ల వికీలో ప్రయత్నించండి. క్లిష్టమైన సందేశాలకు అలా అవగాహన పెంచుకున్న తరువాత అనువాదం చేయడం మంచిది. 166 సందేశాలకు తెలుగు అనువాదాలు ట్రాన్స్ లేట్ వికీలో చేయండి.--అర్జున (చర్చ) 16:26, 31 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]