బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం
బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సిద్ధిపేట జిల్లా |
ప్రదేశం: | బెజ్జంకి, బెజ్జంకి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | లక్ష్మీనరసింహాస్వామి |
ప్రధాన పండుగలు: | బ్రహ్మోత్సవాలు |
బెజ్జంకి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, బెజ్జంకి గ్రామంలోని దేవాలయం.[1] ఈ దేవాలయంపై గోపిక నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కాబడ్డాయి.[2]
చరిత్ర
[మార్చు]గ్రామంలోని 17ఎకరాల స్థలంలో 200 అడుగుల ఎత్తున్న నల్లని ఏకశిలపై లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెలసింది. 1053లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రైలోకమల్ల సోమేశ్యరుని శనిగరం శాశనంలో బెజవాంక గ్రామంలో భూమి శనిగరంలోని మధుపేశ్వరస్వామి మాన్యంగా ఇచ్చినట్టు ప్రస్తావించబడింది. కాకతీయుల కాలంలో కాటయ రుద్రుని మంత్రి ఇక్కడ ఒక శివాలయం కూడా కట్టించారు. ఒకనాటి కలలో తాను శివునితో పాటు అవతరించానని నరసింహాస్వామి చెప్పడంతో ఆ సమీపంలోని గుహలలో వెలసిన నరసింహస్వామికి గుడి కట్టించారని బెజ్జంకి స్థలపురాణం చెబుతున్నది.
బ్రహ్మోత్సవాలు
[మార్చు]చైత్ర శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు పన్నెండు రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు (ఆండాళ్ కళ్యాణం, రథోత్సవం) జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 25,000 మందికి పైగా భక్తులు ఇతర ప్రదేశాలనుండి కూడా విచ్చేస్తారు.[3] ఎడ్లబండి పోటీలు కూడా నిర్వహించబడుతాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ Velugu, V6 (2022-06-23). "తెలంగాణ జాతరలు : చెంచుల జాతర.. సలేశ్వరం". V6 Velugu. Archived from the original on 2022-06-24. Retrieved 2023-04-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు." NavaTelangana. 2023-03-29. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.
- ↑ Encyclopaedia of Tourism: Resources in India By Manohar Sajnani
- ↑ "తెలంగాణ జాతరలు, ఉత్సవాలు". EENADU PRATIBHA. 2022-06-12. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.